Saturday, October 26, 2024

 మూలం : కపాల మోక్షం అనే మోక్ష సాధనా గ్రంథం





నేను అంటే ఎవరు? 

నేను అనేది ఏమిటి?

 నన్ను సృష్టించింది ఎవరు? 

నేను ఎవరి చేత సృష్టించబడినదో ఎవరైనా చెప్పగలరా?

 నేను కానీ నేను ఎవరు?

 నేను కి  నేను కానీ నేను కి గల సంబంధం ఏమిటి?

కర్మ ప్రదాత అంటే ఏమిటి? 

విధి వ్రాత అంటే ఏమిటి?

 వీటిని రక్షించేది ఎవరు?

 వీటిని పాటించేది ఎవరు?

ఇలాంటి సాధన, ధర్మసందేహాలు నా మనస్సులో ఎన్నో ఉన్నాయి.

 సాధన అంటే ఏమిటి?

 ఎందుకు చేయాలి? 

ఎలా చేయాలి ?

మోక్షం అంటే ఏమిటి?

 యోగ మంటే ఏమిటి?

ఈ జీవుడు ఎందుకు పుడుతున్నాడు?

 ఎందుకు జీవిస్తున్నాడు?

 ఎందుకు మరణిస్తున్నాడు?

 విధాత అంటే ఎవరు?

ఇలాంటి సమస్యలను నా మనస్సులో ఎన్నో సంవత్సరాల నుండి  వేధిస్తున్నాయి! 

దేవుడు అంటే ఎవరు? అసలు దేవుడు ఉన్నాడా?

ఉంటే కొంతమంది ఉన్నారని… మరికొంతమంది లేరని ఎందుకు వాదిస్తున్నారు?

 అసలు దైవ సంప్రదాయాలు ఎందుకు ఏర్పడినాయి?

 గురువంటేఎవరు ?

 సాధనలో గురు పాత్ర ఎంత? 

గురువే దైవమా ?

 దైవమే గురువా ?

 యోగసిద్ధులు ఉన్నాయా ?

 అష్ట సిద్ధులు అంటే ఏమిటి?

ఇలాంటి సాధనా సందేహాలు ఎన్నో...ఎన్నెన్నో...ఎవరు జవాబు చెబుతారు? అలా చెప్పే జవాబు సాధకుడికి ఎంతవరకు సంతృప్తినిస్తుంది?

అసలు నేను ఏ చక్ర తత్వంలో ఉన్నానో తెలియదు. అసలు ఉన్నానో లేదో తెలియదు. ఒకపక్క ఎలాంటి యోగసిద్ధులు రావడం లేదు . కానీ సాధన ఆగటంలేదు? మాయా మర్మాలు తెలియటం లేదు ? మాయలో నేను ఉన్నానో లేదో నాకు తెలియటం లేదు? సాధన లో నేను ఉన్నానో లేదో నాకు తెలియటం లేదు?

 కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యానమార్గాలలో ఏ మార్గం లో ఉన్నానో నాకు తెలియటం లేదు ? ఇలా నాకు సాధనలో ఉన్నప్పుడు అనేక అనేక ధర్మ సందేహాలు, అనుమానాలు,అవమానాలు జరిగినాయి!

 ఇవి ఎందుకు ఎలా జరిగినాయో! అప్పుడు నాకు తెలియలేదు ! ఇలా నాకు సాధనలో శబ్ద పాండిత్యంలో అలాగే అనుభవ పాండిత్యంలో నాకు వచ్చిన ప్రశ్నలకు నాకు నేనే సమాధానాలు వెతుకులాట చేసుకోవలసి వచ్చింది! నాకు నేనే పరిప్రశ్న అయ్యి నాకు నేనే పరిపూర్ణ జ్ఞానిగా మారవలసి వచ్చింది !

నాలాంటి మోక్షగామికి ఎదురైన ఆటుపోట్లు, ధర్మసందేహాలు,సాధన సందేహాలు, సాధన అనుభవాలు, ఆధ్యాత్మిక అనుభవాలు, దైవ అనుభవాలు, ఆధ్యాత్మిక యాత్ర అనుభవాలు, దైవిక వస్తువులు అనుభవాలు, సాధన స్థితిగతులు అన్నిటినీ ఒక వరుస క్రమంలో పూసగుచ్చినట్లుగా అమర్చి ఒక రుద్రాక్షమాలను తయారుచేయాలని సంకల్పం వచ్చినది!

ఈ గ్రంధ రచన వలన నాలాంటి వారికి ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాను !

మూలాధార గణపతి నుండి మూల కపాలము ద్వారా మూల కపాలం వరకు సాగిన నా  సాధనా ప్రస్తావన మీరే చదవండి ! మీరు మీ సాధనలో ఎక్కడ ఉన్నారు? ఏ మాయ లో ఉన్నారు? దానిని ఎలా దాటాలో? తెలుసుకుని ముందుకు సాగండి! ఈ నా సాధన అనుభవాలు ఆసేతు హిమాచలం 591 మహాయోగులు అనుభవాలతో477 మహాయోగులు అనుభవాలతో అనగా 80 శాతం సరిపోయినాయి. మిగిలిన 20 శాతం వారికి నాకు అనుభవాలలో తేడాలు కనిపించాయి! కానీ అనుభవాలు వేరు కావచ్చు. కానీ అందరికీ అనుభూతి ఒకటే అవుతుంది కదా!

శివుడిని పూజించిన ఈ జీవుడు కాస్త శివుడు  ఎలా అయినాడు… శవం కాస్త శివం ఎలా అయినదో…. కోరికలే మాయలని తెలుసుకుని కోరిక లేని సమాజం చూడాలని కోరిక …. లేదా ఇష్ట కోరిక కోసం….తీరని కోరిక కోసం లేదా తీర్చే కోరిక కోసం… లేదా ఇతరుల కోరిక కోసం… శివుడు కాస్త జీవుడుగా ఎలా అయినాడు! మోక్షగామి కాస్త కామిగాను….కామి కాస్త మోక్షగామి గాను ఎలా ఎందుకు మారాడో తెలుసుకోండి! అనుభవాలు తెలుసుకోండి! అనుభూతి పొందండి!


మీ జ్ఞాన భిక్షువు

---పవనానంద.సరస్వతి.             

No comments:

Post a Comment