*🌹కర్మయోగం🌹*
*అధ్యాయం 3 - శ్లోకం 34*
*ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ ।*
*తయోర్న వశమాగచ్చేత్తౌ హ్యస్య పరిపన్థినౌ ।। 34 ।।*
*ఇంద్రియస్య — ఇంద్రియములకు;*
*ఇంద్రియస్య-అర్థే — ఇంద్రియ వస్తు/విషయముల యందు;*
*రాగ — మమకారం/ఆసక్తి;*
*ద్వేషౌ — ద్వేషము;*
*వ్యవస్థితౌ — ఉండును;*
*తయోః — వాటికి;*
*న — కూడదు;*
*వశమ్ — వశపడుట;*
*ఆగచ్చేత్ — లోనగుట;*
*తౌ — అవి;*
*హి — తప్పకుండా;*
*అస్య — వానికి;*
*పరిపన్థినౌ — శత్రువులు.*
*⚜️అనువాదము:-*
*BG 3, 34 ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ వస్తు/విషయములపై రాగ ద్వేషములు కలిగి ఉంటాయి, కానీ వాటికి వశము కాకూడదు, ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు.*
*⚜️వాఖ్యానం:-*
*శ్రీ కృష్ణుడు ఇంతకు క్రితం, మనస్సు-ఇంద్రియములు తమ సహజ గుణాలచే నడిపింపబడుతాయి అని చెప్పి ఉన్నా, ఇప్పుడు వాటిని మచ్చిక చేసుకొనే అవకాశాన్ని చూపిస్తున్నాడు. మనకు ఈ భౌతిక శరీరం ఉన్నంత కాలం, దాని నిర్వహణ కోసం, ఇంద్రియ విషయములను ఉపయోగించుకోవాలి. శ్రీ కృష్ణుడు మనలను, అవసరమైన వాటిని వినియోగించుకోవటం ఆపమని అనటంలేదు; వాటి మీద మమకారం, ద్వేషం నిర్మూలించటానికి ప్రయత్నించమంటున్నాడు. ఖచ్చితంగా, పూర్వ జన్మ సంస్కారములు, అన్ని ప్రాణులమీద తీవ్ర మైన ప్రభావాన్ని చూపుతాయి, కానీ ఈ భగవద్గీతలో చెప్పబడిన పద్ధతి పాటిస్తే, ఈ పరిస్థితిని సరిదిద్దటంలో విజయాన్ని పొందవచ్చు.*
*ఇంద్రియములు సహజంగానే తమ ఇంద్రియ వస్తు/విషయముల వైపు పరుగుతీస్తాయి, వాటి పరస్పర సహచర్యం సుఖ-దుఃఖ అనుభూతులను కలుగచేస్తుంది. ఉదాహరణకి, రుచి అనుభవించే నాలుక (రసాంకురములు) మధురమైన పదార్థములు తగిలినప్పుడు ఆనందాన్ని, చేదు పదార్థములు తగిలినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంది. మనస్సు పదేపదే ఈ వస్తు/విషయముల ద్వారా వచ్చే సుఖ, దుఃఖాలని స్మరిస్తూ ఉంటుంది. సుఖాలని కలుగ చేసే వాటి మీద చింతన మనస్సుకి వాటి మీద మమకారం, ఆసక్తి కలుగ చేస్తుంది; అదేవిధంగా దుఃఖ హేతువుల మీద చింతన ద్వేషాన్ని కలుగ చేస్తుంది. ఈ రాగ, ద్వేషముల రెంటిలో దేనికీ వశము కాకూడదు అని శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు.*
*మన ప్రాపంచిక విధులను నిర్వర్తించేటప్పుడు మనకు అన్ని రకాల అనుకూల, ప్రతికూల (ఇష్ట, అయిష్ట) పరిస్థితులు ఎదురవుతాయి. అనుకూల పరిస్థితుల కోసం ప్రాకులాడకుండా అదేవిధంగా ప్రతికూల పరిస్థితుల నుండి తప్పించుకోకుండా ఉండటానికి అభ్యాసం చేయాలి. మనోఇంద్రియముల ఇష్టా-అయిష్టములకు మనం బానిసలమైపోకుండా ఉంటే మన నిమ్న స్వభావాన్ని అధిగమించినట్టే. కర్తవ్య నిర్వహణ లో సుఖ, దుఃఖాల పట్ల ఉదాసీనతో, అనాసక్తతో, తటస్థంగా ఉన్నప్పుడు మనం ఉన్నతమైన స్వభావంతో పని చేయటానికి నిజంగా స్వేచ్ఛ పొందుతాము.*
⛳⚜️⛳ ⚜️⛳⚜️ ⛳⚜️⛳
No comments:
Post a Comment