. *పుట్టిన మనం*
*ఎటులో బతకాల్సిందే*
***********************
లోకంలో ! ఈ లోకంలో !
ఎందరొ ఎన్నో రకాల మనుషులు !
ఎన్నో రకాల గుణాల మనుషులు !
ఎవరితొ ఎపుడూ ఎటులుండాలో !
ఎలా ఉంటె ఏమయ్యేనో !
మంచే జరుగునొ ! చెడే జరుగునో !
మేలు సంభవమొ ! కీడు సంభవమొ !
హాయిగ ఉందుమొ !
బాధలతో క్రుంగుతు ఉందుమొ !
ఏమి జరుగునో ! ఎలా జరుగునో !
ఎవరే రీతిగ ప్రవర్తింతురో !
ఎవరే రీతిగ చేరువౌదురో !
ఎవరే రీతిగ దూరమౌదురో !
ఎవరే రీతిగ మేలు చేయుదురో !
ఎవరే రీతిగ కీడు చేయుదురో !
ఎవరి ప్రవర్తన ఎలాంటిదో
తెలిసే దెపుడో ! ఎటులనో !
వారితొ మసలే దెటులో !
తెలిసేదెపుడో ! ఎటులనో !
పొట్ట కూటికీ పనులు చేయాలి !
ఏదో ఏవో ఎటులనో !
సంబంధం బంధం తద్వారా అనుబంధం.
కుదుర్చు కొనుచూ కొనసాగాగాలి.
అది ఏదో ! ఎవరితో ! ఎటులనో !
ఒకరికొకరమూ ఆప్యాయతతో
ఆత్మీయతతో ఆనురాగంతో
స్నేహంతోనో ద్రోహంతోనో
ఇష్టంగానో కష్టంగానో
నగవులతోనో తగవులతోనో
ముద్దూముచ్చట పగ సెగతోనో
నెట్టుకు పోవాలి ముందుకూ !
మున్ముందుకూ !
ఇదే జీవితం !
ఆంతా ఇది విధి ప్రభావితం !
విధి ప్రభావితం !
************************
రచన :----రుద్ర మాణిక్యం (కవి రత్న)
రిటైర్డ్ టీచర్. జగిత్యాల (జిల్లా)
***********************************
No comments:
Post a Comment