*స్నేహం చాటు సందడి...* 😄😄
సంవత్సరానికి ఒకసారి
స్నేహితుడా
అన్నావంటే
పాత చెప్పుతో కొడుతా పాపిష్టుడా...
ఏడాదికోసారి
మిత్రుడా
అన్నావంటే
మెట్టుతో కొడుతా మెంటలోడా...
పన్నెండు నెలలకోసారి
ప్రాణ సుఖుడా
అన్నావంటే
పళ్ళురాలగొడుతా
పనికిమాలినోడా...
365 రోజులకొకసారి
స్వార్థం కోసం స్వలాభాలకై
చెలికాడ అన్నావంటే
చెంప చెళ్ళుమనిపిస్తాడా
చెత్తనాయాలా....
అవసరాలకు మాత్రమే
అంటకాగి
దోచుకోవడానికి దోస్త్
అన్నావంటే
నీ దోలా తీరుస్తా దరిద్రుడా....
*స్నేహమంటే చిరకాలపు చెట్టు*
*మిత్రుడంటే మనసెరిగిన లోగుట్టు*
*సఖుడంటే జీవనకాల ఆసరాపట్టు*
*చెలికాడంటే చింతలు తీర్చు చిరునవ్వులవనం*
*దోస్త్ అంటే హృదయ సందడికి ధైర్యపు బలం*
*నిజమైన నేస్తాల బంధం నిత్య భావసముద్రం...*
పరిచయమై
ప్రశాంతతను పరిణతిని
ప్రసాదించే మనసెరిగిన మిత్రుడు
తోడు నిలిచిన కృష్టపరమాత్ముడే...
ఆ తోడు పొందిన ప్రతివాడు అర్జునుడే...
ఆ స్నేహం గీత సార అమృతఫలం...
*అభిరామ్ 9704153642*
No comments:
Post a Comment