🙏4-11-2024 సోమవారము. శుభమస్తు🙏
🙏 🌹🌹🌹 గుడ్ మార్నింగ్ 🌹🌹🌹 🙏
ఆధ్యాత్మికము - భౌతికము వేరు వేరు కాదు.
మనిషి ఒకడే. కనపడే శరీరము భౌతికము - అంతరంగము ఆధ్యాత్మికము. రెండూ కలిసే వున్నాయి, కలిసే సాగుతాయి.
దైవ రూపాలు అనేకం ఉన్నట్టు కనపడుతున్నా - అది దైవ శక్తి.........
శక్తిగా ఒక్కటే అని తెలియటమే జ్ఞానము.
ఈ జ్ఞానాన్ని అనేక విధములుగా చెప్పే ప్రయత్నం చేసినవే మతాలు - అనేక దైవీ మార్గాలు - అనేక సాధనలు, బోధనలు....
మతాలు ఎన్నున్నా, మార్గాలు ఎన్నున్నా,దేమ్ముళ్లు, దేవతలు ఎందరున్నా జ్ఞాన బోధల లక్ష్యం మనిషి జీవిత ఆచరణ మంచి అని అర్ధమయితే - ఆ మంచిని ఆచరిస్తూ జీవిస్తే అది సరి అయిన దారి......
మతాలు, మార్గాలు, దైవాలు, సమస్త జ్ఞాన గ్రంధాల బోధలు - మనిషి కొరకే గాని.......
మనిషి వాటి కొరకు కాదు అని అర్ధం చేసుకొని - వాటి సారాన్ని తాను వంటబట్టించుకోని - ఆచరణలో మంచిగా మాత్రమే జీవించటం ఆధ్యాత్మికం..........
దీనికి ఆధారం శరీరం. దానికి ఆధారం మనసు. దానికి ఆధారం ప్రాణ శక్తి. ఈ మూడు కలిసిన ఏక ప్రయాణం జీవితం.
దీనిని ఆధ్యాత్మికము - భౌతికము అని విడతీయలేము.విడతీయకూడదు.......
ఇలా విడతీసేది చెడు, అజ్ఞానము మాత్రమే
ఎవరైనా ఏ స్థితిలోనైనా మంచిగా సాగుతుంటే అది ఆధ్యాత్మికమే..............
మంచిగా బ్రతకాలనుకోవటం జ్ఞానం - బ్రతికే ప్రయత్నం సాధన - చివరి వరకు ఏ పరిస్థితిలోనైనా మంచిగా బ్రతక గలగటం ఆధ్యాత్మికత.................................
ఆధ్యాత్మిక మార్గ ఫలం ఆత్మ జ్ఞానము అర్ధమవ్వటం - ఆ వైపు సాగాలనిపించటం - - సందేహ నివృత్తికి సృష్టి సహకరించటం.... అంతిమముగా అనంత ఆత్మ శక్తి ఎరుక....
అనేకత్వము, ఏకత్వముగా ------------ ఏకత్వములో, అనేకత్వము అనుభవమవ్వటమే ఉన్న సృష్టి సత్యం.......
🙏🌹🌹🌹 god bless you 🌹🌹🌹🙏
Source link - http://youtube.com/post/Ugkx_Hxgv5MGqkgEnWC_DUPQLKHz9g2kv87M?si=iJ8CLpmwAcaCGF03
No comments:
Post a Comment