Wednesday, November 20, 2024

 🕉️ *పూజ్యశ్రీ అహల్యా భాయి ప్రతిష్టించిన నర్మదా బాణ లింగమే కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగమా?!* 🙏

               ఇప్పుడు మనందరం *కాశీవిశ్వనాథుని* దర్శిస్తున్నామంటే ఆ *తల్లి(అహల్యా భాయి)* చేతి చలువ. దుర్మార్గుల దాడులలో అసలు విశ్వనాథుడు లేడు. *ఆ లింగం అంతర్ధానమైపోయింది!!*

🪷'ఆలయాలు ధ్వంసం చెయ్యబడ్డాయి. మొట్టమొదట కులీకుతుబ్ చేసిన దుర్మార్గాలలో విశ్వనాథమందిరం నిర్మూలనమై పోయింది. తరువాత అక్బర్ కాలంలో తోడరమల్ పూనుకుని కట్టించిన ఏ మందిరం ఉందో ఆ విశ్వనాథ మందిరం ఔరంగజేబు కాలంలో పూర్ణంగా తుత్తునియలై పోయింది. *ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఈ తల్లి ఆ సమీపంలోనే మళ్ళీ అద్భుతమైన శివలింగాన్ని ప్రతిష్ఠించింది.* దాని వెనక చాలా కథ ఉంది. 

🪷 *విశ్వనాథుడే స్వప్నంలో కనబడి ఆ తల్లిని ప్రేరేపించాడు. అప్పుడు అక్కడ ఆవిడ నర్మద బాణలింగాన్ని ప్రతిష్ఠించింది. మనం నమస్కరిస్తున్న ప్రస్తుత విశ్వనాథ జ్యోతిర్లింగం నర్మదేశ్వరుడు. నర్మద బాణలింగం. నర్మద బాణలింగం స్వయంభూ స్వరూపం. స్వయంభూ అయిన జ్యోతిర్లింగస్థానంలో ఆ తల్లి తిరిగి ప్రతిష్ఠ చేసింది. ఇప్పుడు ఆ తల్లి ప్రతిష్ఠ ఆ చేసిన విశ్వనాథునే దర్శనం చేసుకుంటున్నాం.*

దాని చుట్టూనే ఇటీవల ఒక మహా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేశారు. *అంటే విశ్వనాథుడు ఆ తల్లి చేతితో ప్రతిష్ఠింపబడి ప్రపంచమంతటి చేతా పూజింపబడుతున్నాడు.*

*యుగయుగాల నుంచి ఉన్న అనాది శాశ్వత జ్యోతిర్లింగమైన విశ్వనాథుడు ఈ తల్లి ప్రతిష్ఠించిన లింగంలో ప్రవేశించాడు. అది ఈ క్షేత్రం గొప్పతనం. అలాంటి భవ్యమైన విశ్వనాథునికి, అహల్యాబాయికి నమస్కరించుకుందాం.* ఇప్పటికీ ఆ ప్రాంగణంలో *అహల్యా బాయి విగ్రహం* చూడవచ్చు. దీనిని చేసిన నాయకులకు ఒక నమస్కారం చేసుకోవాలి.

                                     -: శ్రీ సామవేదం షణ్ముఖశర్మ,
                               సేకరణ:- నమామి నర్మదే!,P:155

No comments:

Post a Comment