Sunday, November 10, 2024

 🌹 *స్త్రీలు స్తోత్రాలు చదువుకోవచ్చా?*🌹

🌿స్త్రీలు స్తోత్రాదులు  చదువుకోవాలి...మంత్రోపదేశం పొందిన వారు జపాలు చేసుకోవాలి, అయితే స్త్రీలు శివ సహస్రనామం, లలితా సహస్రనామం, లలితా సప్తశతి వంటివి, గీత వంటివి చదువుకోవచ్చు. 

🌸లేదా నామస్మరణను చేసుకోవచ్చు, అంటే బీజాక్షరాలు మంత్రాక్షరాలు లేకుండా కేవలం నామసాధన చేయవచ్చు...

🌿లేదా పురాణ గ్రంథాలు చదువుకోవచ్చు...
గర్భిణీలు, రజస్వలలు ఏమీ చేయకుండా క్రీయాశూన్యంగా పడుకోవాలి...

🌷గ్రహణం సమయంలో ఇంట్లో దీపం వెలిగించాలా? అక్కర్లేదా?🌷

🌸గ్రహణ సమయానికి ముందు, తరువాత జ్యోతి ప్రజ్వలనాలు చేయవచ్చు. కార్తీక మాసం వస్తోంది కనుక స్పర్శా కాలానికి పూర్వమే దీపప్రజ్వలన చేయాలి. మోక్షం తరువాత మరలా జ్యోతి ప్రజ్వలనం చేయవచ్చు.

🌷రాత్రి లేదా పగలు భోజనం కాక పళ్లు ఫలహారం పనికొస్తుందా?🌷

🌿నేడు సూర్యగ్రహణం గ్రస్తాస్తమయం అవుతుంది, అంటే గ్రహణం ఉండగానే సూర్యాస్తమయం అవుతుంది కనుక మరునాడు సూర్యుడిని చూసేంత వరకూ అశౌచం ఉంటుంది. 

🌸అంటే మరునాడు సూర్యోదయం తరువాతనే మడినీళ్ళు పట్టుకొని వండుకొని తినాలి. 
అప్పటి వరకూ ఏమీ తిన కూడదూ త్రాగరాదు.

🌿అయితే ఈ నియమాలు అందరికీ వర్తించవు...ముఖ్యంగా పిల్లలకు బాలబాలికలకూ, గర్భవతులకు, దీర్ఘకాలప్రాణాంతక వ్యాథులు ఉన్నవారికి, బిపిలు షుగర్లు వంటి ఉన్నవారికి, వృద్ధులకూ, బాలింతలకు మినహాయింపులు ఉన్నాయి.

🌸వీరు పాటించాల్సిన అవసరం లేదు, అయితే గర్భవతులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, పాలుతాగే పిల్లలలకు మినహాయింపు ఉంది, తల్లిపాలకు దోషం లేదు...

🌿ఇక ఆకలికి ఆగలేని వారు దుంపలు, సగ్గుబియ్యంతో చేసినవి, అటుకులతో చేసిన పదార్థాలు పళ్ళు పాలు వంటివి తీసుకొని తీరాలి...

🌸గృహస్థులకు శుష్కోపవాసాలు చెప్పలేదు, కనుక ఫలహారాలు సేవించవచ్చు...

🌷దానాలు గ్రహణం సమయంలోనా లేక విడిచిన తరువాతా?🌷

🌿ఈ ప్రశ్నకు సమాధానం శాస్త్రంలో ఉన్నదాని కన్నా ఆచరణలో ఉన్నదానికే ప్రాధాన్యత ఇవ్వాలి!!...

🌸గ్రహణ సమయంలో ప్రతీ బ్రాహ్మణుడూ గాయత్రినో లేదో ఏదో ఒక సావిత్రినో ఆశ్రయించి జపం చేసుకుంటూ ఉంటారు, అటువంటి వారికే దానం చేయడం ఉత్తమం, కనుక వారు దొరకరు...ఇష్టదైవం ప్రీత్యర్థం అనా లేక సూర్య ప్రీత్యర్థం అనా జపసంకల్పం చేయాలి?

🌿కేతగ్రస్త సూర్యగ్రహణదినే గ్రస్తాస్తమయ గ్రహణ కాలే అని సంకల్పాలు చెప్పుకొనాలి,
కొంత మంది సూర్యోపారగ అని కూడా చెబుతారు... హిరణ్యశ్రాద్ధాదులు నిర్వహిస్తారు...
                                                                          🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏.          

No comments:

Post a Comment