సర్వేశ్వరుని పొందే భాగ్యం ఒక్క మానవునికి తప్ప వేరే ఇతర ఏ ప్రాణికీ లేదు.
ఇతర ప్రాణులకు ఇది చాలా అరుదైన విషయం.
కానీ మానవుడు ఈ సత్యమును తెలుసుకోలేక నిరంతరము ప్రాపంచిక విషయాల పట్ల మోహితుడై పరమాత్మను నిర్లక్ష్యం చేస్తున్నాడు.
తన పురోగతిని తానే నాశనం చేసుకుంటున్నాడు.
అంతా తాను చేసి నిందలు భగవంతునిపై వేస్తున్నాడు.
ఇది ఎంతటి మూర్ఖత్వం?
మానవ జన్మ ఉత్తమమైనది, దుర్లభమైనదని, పరమాత్మ ప్రాప్తి కొఱకే జన్మ రావడం జరిగినదని తప్ప సంసార సుఖాలు, విషయాలలో చిక్కుకోవడానికి కాదని తెలుసుకొని పరమాత్మ ప్రాప్తి కొఱకు సాధన చేయాలి.
అప్పుడే మానవ జన్మకు సార్థకత చేకూరుతుంది!అలాగే,
"సృష్టిలో దైవము తప్ప ఏదీ శాశ్వతము కాదు..
సృష్టిలో అన్నింటికన్నా విలువైనది కాలము..
అట్టి కాలము కూడా శాశ్వతం కానపుడు, ఇంకా విలువలేనివి
ఏ విధముగా శాశ్వతము అవుతాయి?
ఈనాడు మీకు జీవనము భారముగా ఉన్నదంటే కారణము కుటుంబ సమస్యలు కానే కాదు!
కేవలము మీరు శాశ్వతములు అనుకున్నటువంటి అశాశ్వతములు వలనే మీకు దుఃఖములు, కష్టములు!
రోగికి టానిక్కులు బలాన్ని ఇస్తాయని జీవితమంతా టానిక్కులే తీసుకుంటారా?
లేదు కదా!!
శరీరమునకు మంచి ఆహారము వలనే ఆరోగ్యము.
అది శరీరము పుష్టికి శాశ్వతము.
అలానే వస్తు విషయాలు, బందు మిత్రులు మొదలగు అందరూ అశాశ్వతము..
అశాశ్వతములు వలన కలిగే ఆనందం అత్యల్పమే అగును.
కానీ భగవంతుడు శాశ్వతుడు. కనుక ఆయన వలన కలిగే ఆనందము శాశ్వతము.
ఇట్టి శాశ్వత ఆనందమును పొందాలంటే దైవమును విడువక పట్టుకోవాలి. విషయాల పట్ల వాంఛలను వదులుకోవాలి.
No comments:
Post a Comment