*_పరిస్థితులు బాగోలేనప్పుడు ప్రతి ఒక్కరూ ఆ పరిస్థితికి తగ్గట్టే మారిపోవాలి. వరద వచ్చినప్పుడు చేపలు చీమలను తిని బతుకుతాయి. అదే వరద తగ్గినప్పుడు ఆ చీమలే చేపలను తింటాయి._*
*_అక్కడున్న సమయం మాత్రమే ముఖ్యం... మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ వెళ్లడమే జీవితం._*
*_మనం సమస్యలో ఉన్నప్పుడు అదే ముగింపు అనుకోకండి. అది జీవితంలో ఒక మలుపు మాత్రమే అని అర్థం చేసుకోండి._*
*_కాబట్టి మనం ఎదగాలనుకుంటే ప్రపంచం ఏదో ఒక రకంగా అవకాశాన్ని అందిస్తూనే ఉంటుంది మనకు కావాల్సినదల్లా మనలో ఎదగాలన్న ఆశ పుట్టడమే. ముందు ఆ కోరికకు ఆకాంక్షకు ఆద్యం పోయండి అవే... అవే... ఎదురొస్తాయి._*
*_మనం అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటాము. సమస్య రాగానే, ఓడిపోయామని కృంగిపోకూడదు. భగవంతుడు సమయం ఇస్తాడు. నిన్ను నిలబెట్టడానికి అనేక మార్గాలు చూపిస్తాడు._*
*_వాటిని మనం అందిపుచ్చుకోవాలి. లేచి నిలబడి ప్రయత్నం చేయాలి. అవకాశాలను సద్వినియోగం చేసుకోలేనప్పుడు అంటే, మనం లేవలేక పోయినప్పుడు మాత్రమే ఓటమిని అంగీకరించాలి పర్వాలేదు ఇంకో పోటీ, ఇంకో మార్గం ఉండనే ఉంటుంది._*
*_స్వామి వివేకానంద అన్నారు 'కెరటం నా ఆదర్శం పడినందుకు కాదు పడి లేచినందుకు.! అని కానీ,_*
*_పడిన కెరటం, లేచిన కెరటం ఒకటి కాదని వారికి తెలియదు. విరిగి పడిన కెరటం ఛిద్రమై, పతనమై మామూలు నీటిలో కలిసి పోతుంది, అస్థిత్వాన్ని కోల్పోతుంది. మళ్ళీ కొత్త కెరటం పుట్టాలంటే ఆ ప్రక్రియకు ఎంతో కృషి అవసరం._*
*_కొత్త జలరాశి సరికొత్త గాలిని నింపుకుని, దిశను ఎన్నుకుని, మెల్లగా ప్రారంభించి రానూరానూ వేగాన్ని పుంజుకుని, తీరాన్ని చేరుకుంటుంది. అది కొత్త కెరటం. దాని శక్తి అనంతం._*
*_మనిషి కూడా అంతే.!మనిషి ప్రతీ పతనం నుండి తేరుకుని, కాస్త ప్రశాంతంగా ఆలోచించి, శక్తిని పుంజుకొని కొత్త కెరటంలా, నూతన శక్తితో తనను తాను ఆవిష్కరించుకోవాలి అప్పుడే కదా మనం దేనినైనా సాధించగలం.☝️_*
*_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🦋🦋🦋 🌹🙇♂️🌹 🦋🦋🦋
No comments:
Post a Comment