*మహాదేవుని నిద్రాసమయం ఆషాఢమాసం*
*వినీలాకాశంలో నక్షత్ర మండలంలో రెండేసి చొప్పున విసనకఱ్ఱలా ఉండే ఆషాఢ నక్షత్రాన్ని పూర్వాషాఢ, ఉత్తరాషాఢగా గుర్తిస్తారు. పున్నమినాడు పూర్వాషాఢ నక్షత్రంతో చంద్రుని సంయోగం చేత ఏర్పడే మాసం ఆషాఢమాసం. దీన్నే మహాషాఢి అంటారు. గురుపూర్ణిమగా లోక ప్రసిద్ధి. సూర్యుని కర్కాటక సంక్రమణంతో దక్షిణాయనం ప్రారంభమయ్యేది కూడా ఈ నెలలోనే. వాయురాశి అయిన మిథునం నుంచి జలరాశి అయిన కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయంలో వాయువు చల్లబడుతుంది. తొలకరి వానలతో ప్రకృతి పరవశిస్తుంది. ఈ మాసంలోని విశేష తిథులను గురించి తెలుసుకుందాం.*
1. *ఆషాఢ శుద్ధ విదియ :*
*ఈ రోజు పుష్యమి నక్షత్రం. అందువల్ల శ్రీరామరథోత్సవం నిర్వహిస్తే మేలు. స్కాందపురాణం మాత్రం తిథిని బట్టి ఉత్సవాన్ని చేయాలని పేర్కొంది. నక్షత్రంతో ప్రమేయం లేదు. ఈ రథోత్సవంతో దైవకృప ప్రాప్తిస్తుంది.*
2. *శుద్ధపంచమి :*
*దీనినే స్కందపంచమిగా వ్యవహరిస్తారు. ఈరోజు ఉపవాసముండి స్కందుని పూజించాలి. షష్ఠితో కూడిన పంచమి ప్రశస్తమని భవిష్యోత్తర పురాణ వచనం. స్కంద పూజ వల్ల సత్సంతానం కలుగును.*
3. *శుద్ధ షష్ఠి :*
*కుమారషష్టి, పంచమితో పాటు ఈరోజున కూడా కుమారస్వామిని అర్చించడం వల్ల సకల సంపదలు అభివృద్ధి చెందుతాయని వరాహపురాణ వచనం.*
4. *శుద్ధ సప్తమి :*
*షష్ఠితో కూడిన సప్తమినాడు. సూర్యుని పూజించాలి. వైవస్వతుడైన సూర్యుని పూజించడం వల్ల అన్ని సత్కార్యాలు అనంతమైన పుణ్యఫలానిస్తాయి.*
5. *శుద్ధ అష్టమి :*
*ఈ అష్టమి రోజున సుగంధ ద్రవ్యాలతో స్నానం చేసి, దుర్గానామాలతో మహిషాసురమర్థినిని అర్పించాలి. దీనివల్ల శత్రుబాధ నివారణ జరిగి సమస్త సుఖాలు లభిస్తాయి.*
6. *శుద్ధ నవమి :*
*ఈ ఆషాఢ శుక్ల నవమీ దినాన శ్వేతవర్ణ శుభ్రవస్త్రాలను ధరించి, ఐరావత గజంపై ఉండే ఐంద్రీ అనే పేరుగల దుర్గా దేవిని ఉపవాసంతో ఆరాధించాలి. ఇలాచేస్తే ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుందని భవిష్యోత్తర పురాణం తెలియచేస్తోంది.*
7. *శుద్ధ దశమి :*
*చాక్షుష మనువు జన్మించినందువల్ల ఈ దశమి చాక్షుష మన్వాదిగా చెప్పబడింది. ఈ రోజున శాకవ్రతం చేసి శ్రీ మహాలక్ష్మిని అర్చిస్తే సర్వసంపదలు అభివృద్ధి చెందుతాయి.*
8. *శుద్ధ ఏకాదశి :*
*ఈ తిథిని శయన ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషువుపై పాల సముద్రంలో నిద్రకు ఉపక్రమించే ఈరోజు గోపద్మవ్రతం చేస్తే పుత్రపౌత్రాభివృద్ధి. ధనధాన్యవృద్ధి కలుగుతుంది.*
9. *శుద్ధ ద్వాదశి :*
*దీన్ని వాసుదేవద్వాదశి అంటారు. శయన ఏకాదశినాడు ఉపవాసముండి, శ్రీ మహావిష్ణువుని అర్చించాలి. దానధర్మాలు చేస్తే సమస్త శుభాలు కలుగుతాయి. చాతుర్మాస్యవ్రతాన్ని ఈ శుద్ధ ద్వాదశినాడే ప్రారంభించాలి. కర్కాటక సంక్రమణ మాసం ద్వాదశినాడు, పౌర్ణమిరోజు కూడా వ్రత ఆరంభం చేసుకోవచ్చు.*
10. *ఆషాఢ శుద్ధ చతుర్దశి :*
*ఈ చతుర్దశి నాడు వెండి, బంగారం, పట్టుదారం, రెల్లుగడ్డి, దర్భలలలో ఏదైనా ఉపయోగించి శివుణ్ణి పూజిస్తే శివలోకప్రాప్తి. ధనధాన్యవృద్ధి.*
11. *ఆషాఢ పూర్ణిమ :*
*ఇది పురాణ కర్త వ్యాసభగవానుని పూజించే రోజు. ఈ రోజు సంధ్యాకాలంలో కోకిలావ్రతం చేయాలి. అనుకూలమైన దాంపత్య జీవనం కోసం తెలగపిండితో కోకిల ప్రతిమను చేసి ఆరాధించమని 'కోకిలావ్రత' నిర్దేశం. అలాగే 'స్మృతి కౌస్తుభం' ప్రకారం ఆషాఢ పౌర్ణమినాడు శివశయన వ్రతాన్ని ఆచరిస్తారు. మాహేశ్వరాచార పరాయణులు దర్భలతో పడకను ఏర్పాటుచేసి దానిపైకి శివుణ్ణి ఆరోపన చేస్తారు. నేటి నుంచి నాలుగునెలలపాటు భక్తుల పాపాలను జటాజూటంలో బంధించి సదాశివుడు వ్యాఘ్రచర్మంపై శయనిస్తాడని శైవులు నమ్మకం. ఈరోజు గురు సేవనం, అన్నదానం చేస్తే అక్షయ ఫలం పొందగలరు. నాదోపాసకులు ఈ పూర్ణిమను నారధు గురుపూర్ణిమగా కీర్తిస్తారు.*
12. *కృష్ణ పక్ష విదియ :*
*ఇది చాతుర్మాస్య దీక్షకు శుభమైన రోజు. ఆధ్యాత్మిక చింతనాపరులు శాస్త్రానుసారం. చాతుర్మాస్య దీక్షను చేపడితే ముక్తి, మోక్షం లభిస్తాయి.*
*┈┉┅━❀꧁హరి ఓమ్꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🪷🕉️🪷🙏🕉️🙏🪷🕉️🪷
No comments:
Post a Comment