Tuesday, October 29, 2024

 *ఆస్తి :*
 ( ఈ మంగళవారం స్పెషల్  స్టోరీ)                   

వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.. 
పెద్దయ్యారు. పెళ్ళిళ్ళు అయ్యాయి వాళ్లకు. ఒకరు గోవింద్, ఇంకొకరు శ్రీనాథ్.

ఇద్దరి పుట్టిన ఊరు బాసర. అక్కడే చదువు, సంస్కారం నేర్చుకున్నారు.
 
ప్రస్తుతం హైదరాబాద్ లో ఉద్యోగం ఇద్దరికీ.       గోవింద్ స్కూల్ టీచర్.
 శ్రీనాథ్ కి సెక్రటేరియట్ లో ఉద్యోగం. ‘ఏరా అంటే ఏరా’ అనే సాన్నిహిత్యం వాళ్ళది.

జీవితం మాత్రం శ్రీనాథ్ ని   కొంచెం డబ్బున్న వాడిగా మార్చింది. గోవింద్ పిల్లలకు చదువు చెప్పుకుంటూ టీచర్ గా ఉండి పోయాడు. అద్దె ఇల్లు, సిటీ బస్ ప్రయాణం మామూలు విషయం గోవింద్ కి. కానీ ఎప్పుడూ తన స్థితి కి బాధ పడలేదు.

పెళ్లయిన తరువాత చాలా మార్పులు వచ్చాయి వాళ్ళ జీవితాల్లో.

గోవింద్ భార్య  సరళ    పేదింటి అమ్మాయి.   గోవింద్ మేనమామ కూతురే. అందలం ఎక్కాలని ఆశ సరళ కు.  కానీ తీరేదెలా ?

ఎప్పుడయినా సరళ హంగులు, ఆర్భాటాలు కావాలని అడిగితే నవ్వి ఊరుకునే వాడు గోవింద్. మన దేశం లో నూటికి 40 మందికి ప్రతి రోజూ తిండి లేదు. వాళ్ళతో పోలిస్తే మనం నయమే కదా అంటాడు. 

ఆడవాళ్లు  తమ పక్కన వాళ్ళతో పోల్చుకుని తమ జీవితాలలో లేనివి ఏమిటో ఇట్టే తెలుసుకుంటారు. వాళ్లకు ఉన్న గొప్ప విషయాలను  మాత్రం అంతగా పట్టించు కోరు.. ఇక్కడ కూడా అదే జరిగింది..  సొంత ఇల్లు, సొంత కారు లేవని బాధ సరళకు.!

శ్రీనాథ్ భార్య లక్ష్మి..  మంచి కుటుంబం నుండి వచ్చింది. దాన ధర్మాలు చేయటం అలవాటు. దైవ భక్తి మెండుగా ఉంది. ఉన్న సంపదను చూసి మిడిసి పాటు లేదు లక్ష్మికి.     లక్ష్మి, సరళ కూడా స్నేహితులయ్యారు. 
ఇళ్లకు రాక పోకలు కూడా బాగానే ఉన్నాయి.  లక్ష్మికి    సరళ అమాయకత్వం బాగా నచ్చుతుంది. పిచ్చి పిల్ల.. సంపదలు ఉన్నా, సఖ్యం మరియు సౌఖ్యం ఉండాలి జీవితం లో ..అదే చెప్పింది చాలా సార్లు.. నువ్వెన్నయినా చెప్పు లక్ష్మీ... డబ్బులున్న దారే వేరు. చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేని జీవితాలు ఎందుకు ? ఎవరికి ఉపయోగ పడినట్లు..?? 


రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి.. నలుగురూ పెద్దవాళ్ళయ్యారు...

అది ఆగస్ట్ నెల.. ఆ నెలలో శ్రీనాథ్  రిటైర్ అవుతున్నాడు. మరుసటి నెల సెప్టెంబర్ లో గోవింద్ రిటైర్మెంట్ .

ఆగస్ట్ 31 వ తారీకు రానే వచ్చింది. శ్రీనాథ్, లక్ష్మి ఇంటికి వచ్చి మరీ పిలిచారు.  రిటైర్మెంట్ ఫంక్షన్ కి రావాలని... పిలవక పోయినా గోవింద్ వెళ్ళేవాడే.. ఇప్పుడు సరళ కూడా వెంట వెళ్ళింది... శ్రీనాథ్ యూడీసీ గా రిటైర్ అయ్యాడు. ఫంక్షన్ బాగా జరిగింది. సెక్రటేరియట్ లో వాళ్ళ డిపార్ట్మెంట్ లో.. చాలా మంది శ్రీనాథ్ ని మెచ్చుకున్నారు..    మంచి వాడు.. పని లో చురుకుదనం చూపించే వాడని.. అతను రిటైర్ అవటం డిపార్ట్మెంట్ కి తీరని లోటుగా గుర్తు చేసుకున్నారు..

స్నేహితుడి తరపున గోవింద్ మాట్లాడాడు... మరో జన్మంటూ ఉంటే శ్రీనాథ్ కి మళ్ళీ స్నేహితుడుగా పుట్టాలని..స్నేహానికి ప్రాణం ఇచ్చే శ్రీనాథ్ తనకు తన కుటుంబం లో మనిషని చెప్పాడు.. అందరూ ఆనందించారు...

ఆ రాత్రి దగ్గర్లో ఉన్న కామత్ హోటల్ లో భోజనం చేశారు శ్రీనాథ్, గోవింద్ కుటుంబాలు... చాలా రోజుల తరువాత సరళ బయట భోజనం చేసింది.. ఆమెకు నిజంగా అసూయగా ఉంది.. శ్రీనాధ్ ది మంచి ఉద్యోగం.. రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా చేసారు..అందరూ పొగిడారు ఆయనను..

వచ్చే నెల లో   తన భర్త గోవింద్ రిటైర్మెంట్ వుంది.. మామూలు స్కూలు టీచర్ గా    చేరి ఇప్పుడు      ఒక స్కూల్ హెడ్మాస్టర్ గా రిటైర్ అవుతున్నాడు.. అప్పుడు ఫంక్షన్ యెలా జరుగుతుందో ఏమో ?? శ్రీనాథ్ రిటైర్మెంట్ ఫంక్షన్ లా ఆర్భాటంగా ఎలాగూ జరగదు. కనీసం లో కనీసం తల దించు కోకుండా జరిగితే చాలు... అలా చాలా మంది దేవుళ్ళకు మొక్కింది..

రిటైర్మెంట్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ సరళ లో ఆందోళన పెరిగి పోతూ వచ్చింది... ఇద్దరూ వెళ్లి శ్రీనాథ్ ని, లక్ష్మి నీ పిలిచారు ఫంక్షన్ కి. మనసులో మాత్రం, న్యూనతా భావం నిండి ఉండటం వలన ,  సరళ వాళ్లు రాక పోతే బాగుండునని చాలా సార్లు అనుకుంది..    గోవింద్ మాత్రం మామూలుగానే  ఉన్నాడు.. మామూలు రోజుల్లాగే రిటైర్మెంట్ రోజు వచ్చింది..

ఆ రోజు మామూలు గా స్కూల్ కి వెళ్లి కొన్ని క్లాసులు కూడా తీసుకున్నాడు పిల్లలకు.... అదే తన ఆఖరి క్లాసు కావటం తో రుద్ధమైంది ఆయన గొంతు..  కష్టం మీద క్లాసు కానిచ్చి స్టాఫ్ రూమ్ కి వచ్చాడు గోవింద్..

సాయంత్రం నాలుగు గంటలయ్యింది..  ఆ పాటికే సరళ ను , పిల్లలను తీసుకుని శ్రీనాథ్ వాళ్లు కూడా స్కూల్ కి వచ్చారు.

శ్రీనాథ్ కి చాలా సంతోషంగా ఉంది..గోవింద్ రిటైర్ అవుతున్నాడు.. వాడూ ,తను కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపాలి..ప్లాన్ వేసుకున్నాడు.

సరళ కు బెంగగా ఉంది..ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంది తనకు.. ఫంక్షన్ త్వరగా అయిపోతే బాగుండును..అనుకుంది.

తలవొంపులుగా ఫంక్షన్ జరుగుతుంది ..తను తట్టుకోలేదు...మామూలు స్కూల్ టీచర్ రిటైర్ అయితే కొన్ని వేలమంది, లక్షల మంది టీచర్లు ఉన్నారు భర్తీ చేయటానికి... టీచర్  రిటైర్మెంట్ అంత గొప్ప విషయం కాదు.. తొందరగా ముగించి ఇంటికి చేరుకోవాలని ఆరాటం సరళకు.. పిల్లలు కూడా వచ్చారు..తండ్రి రిటైర్మెంట్ చూడడానికి...

సరళ వాళ్ళను స్టాఫ్ రూం లో కూర్చో బెట్టారు..మిగతా టీచర్లు..

అప్పటి వరకూ పెద్దగా జనం లేరు . విద్యార్థులు , టీచర్లు అందరూ కలిసి ఒక వంద మంది ఉంటారు.. వాళ్ళు రోజూ స్కూల్లో ఉండే వాళ్లే కదా.. సరళ కు పెద్దగా సంతోషం కలగ లేదు ... ఇంకో పది నిముషాలకు ఫంక్షన్ మొదలవుతుందనగా ...ఎక్కడినుండి వచ్చారో..దాదాపు ఇంకో వంద మంది పైనే జనం వచ్చారు..వాళ్లు పిల్లల బంధువులని తెలిసింది... 

ఫంక్షన్ ఆరుబయట చెయ్యాలని నిర్ణయం చేశారు...అందరూ కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు..చాలా మంది నుంచునే ఉన్నారు...ఫంక్షన్ అయ్యేంత వరకూ..

ఎక్కడి నుండో పల్లకీ ని తీసుకు వచ్చారు... మాస్టారు గోవింద్ ను పిల్లలు పల్లకీ లో కూర్చుండ బెట్టారు.. కొంత మంది టీచర్లు, పిల్లల బంధువులు పల్లకీ మోయటానికి సిద్ధ పడ్డారు... సరళ కు అంతా కల గా ఉంది... పల్లకీ లో  గోవింద్ ని కూర్చో బెట్టి లేప బోతుండగా ఎవరో అరిచారు..
మాస్టారి గారి ధర్మ పత్ని ని కూడా పల్లకీ లో కూర్చో బెట్టాలని.. అందరి బలవంతం మీద పల్లకీ లో కూర్చుంది సరళ.. గోవింద్ తో...పెళ్లి రోజు తరువాత మళ్లీ ఇన్నాళ్ళకు...పల్లకీలో ఎక్కడం.. సరళ కు సంతోషం తో కళ్ల వెంట నీళ్ళు వచ్చాయి..

పల్లకీ లేచింది..చిట్టి చేతులతో పిల్లలు కూడా పల్లకీ మోస్తున్న వాళ్ళకు సాయపడుతున్నారు.. ఆ దృశ్యం మనోహరం గా ఉంది.. కాలం కొన్ని క్షణాలు అలా ఆగిపోతే బాగుండునని అనిపించింది సరళ కు.. గోవింద్ కి భాధ గానూ, సంతోషం గానూ ఉంది..పిల్లలూ జాగ్రత్త .. మీరు ఇబ్బంది పడకండి అంటూ వాళ్ళను వారిస్తున్నాడు..అయినా వాళ్లు వినటం లేదు ...

ఇంతలో పల్లకీ ని దింపారు.. ఎందుకో అర్థం కాలేదు సరళ కు, గోవింద్ కు... 

కారు దిగి నెమ్మదిగా వచ్చి నమస్కారం చేశాడు గోవింద్ కి ఆ వచ్చినాయన... గోవింద్ కాళ్ళకు దండం పెట్టాడు.. ఆ వచ్చినాయన జిల్లా ఎస్పీ గారు.. వెంట పది మంది పోలీసులు..  ఈ లోపల ఇంకో కారు వచ్చి ఆగింది.. వచ్చింది జిల్లా 
జడ్జ్ గారు..ఆయన కూడా తన వాళ్ళతో వచ్చారు.. 

జిల్లా ఎస్పీ, జడ్జ్ గారు, 
మిగతా వాళ్లు పల్లకీ మోస్తుండగా నిర్ణీత స్థలానికి చేరారు..

నీళ్ళు, కాళ్ళు  కడిగే ఇత్తడి పళ్ళెం వచ్చాయి...ఎక్కడి నుండో... ఎస్పీ, జడ్జ్ గార్లు గోవింద్ మాస్టారి కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నారు... కొంత మంది ఆడవాళ్ళు హారతి ఇచ్చారు గోవింద్ కి, సరళ కు.. ఆ రోజు పూల వాన కురిపించారు అందరూ  వారిద్దరి మీద..

పిల్లలు మాస్టారు గోవింద్ గారి గురించి మాట్లాడుతూ ఏడ్చేసారు.
ఇంచుమించు టీచర్ల పరిస్థితి కూడా అంతే..అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.. జిల్లా ఎస్పీ,జడ్జ్ కూడా మాట్లాడారు. తమ జీవితం లో తాము సాధించిన విజయాలు అన్నీ గోవింద్ మాస్టారి వలనే అని గర్వంగా చెప్పారు.. ఆయన పక్కన కూర్చోవటం కూడా వాళ్లకు మనస్కరించక నుంచునే ఉన్నారు..చాలా సేపు... 

అప్పటి వాతావరణం చెప్పటం కష్టం.. శ్రీనాథ్ సంతోషం చెప్పనలవి కాదు..తన స్నేహితుడికి జరుగుతున్న గొప్ప గౌరవం..అది.. వాడికి జరిగినా తనకూ జరిగినట్లే... 

శ్రీనాథ్ మాట్లాడుతూ చెప్పాడు..ఇక్కడున్న ఇన్ని వందల మంది లో  తనొక్కడే గోవింద్ ని ఆప్యాయంగా ఒరేయ్  అని పిలువ గల అర్హత  కలవాడవటం  సంతోషంగా ఉందని అన్నాడు..

చివరగా గోవింద్ మాట్లాడాడు..
పిల్లలందరికీ నా ఆశీస్సులు... ఒకప్పటి నా విద్యార్థులు ఈ నాడు జిల్లా కు జడ్జ్ గానూ, ఎస్పీ గానూ ఉండటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ..ఇలా పిల్లల్ని మంచి ఉన్నత స్థితి లో చూడటం తనకు గర్వ కారణం అనీ, ఈ పిల్లలే తన ఆస్తి ,ఐశ్వర్యం , వీళ్ళే నా సర్వస్వం అంటూ ...మాట్లాడలేక పోయాడు.
 
నాకు ఇంత గొప్ప వరం ఇచ్చిన భగవంతుడిని కోరేదొకటే అన్నాడు.. నా పిల్లలందరికీ మంచి భవిష్యత్తును, దీర్ఘాయువును ఇమ్మని కోరాడు..

పిల్లలను పట్టుకోవడం ఎవరి తరం కాలేదు..అంతలా అభిమానించారు  గోవింద్ మాస్టారును.. 

ఫంక్షన్ ముగిశాక  అందరూ కలిసి వచ్చి గోవింద్ ని ఇంటి వరకూ దిగ బెట్టారు....వెళ్ళలేక వెళ్ళారు పిల్లలందరూ...

ఆ రోజు రాత్రి  శ్రీనాథ్ , లక్ష్మి వారి పిల్లలూ గోవింద్ ఇంట్లోనే ఉండి పోయారు...

భోజనాలు అయిన తరువాత గోవింద్ పాతికేళ్ల  కొడుకు సుబ్రహ్మణ్యం,  తల్లితో అన్నాడు... నాన్న గారికి ఇంత ఆస్తి ఉందని నాకు ఇంత వరకూ తెలియదమ్మా ....

నాకూ ఇంత వరకూ తెలియదురా  అన్నది సరళ ఎంతో సంతోషంగా.. .

శ్రీనాథ్ కల్పించుకుని అన్నాడు..
వీడు కుబేరుడికి ఏం తీసిపోడు.. మనః స్ఫూర్తిగా చెపుతున్నాను.. 

సరళ గోవింద్ వంక చూసింది.. గోవింద్ ...మనకు ఈ సంపద చాలు సరళా  ఈ జన్మకు ...  అన్నాడు..

ఆకాశం లో ఒక మెరుపు మెరిసింది.. గురువులు పూజ్య నీయులు .. వారు ప్రోగు చేసుకున్న  ఆస్తి పిల్లల అభిమానమే... అన్నట్లుగా... ✍️
                …కోసూరి లక్ష్మణరావు

****పరిస్తితులకు అనుగుణంగా* *మారడం!*

 *పరిస్తితులకు అనుగుణంగా*    
         *మారడం!* 
                 

*ఏదైనా గ్రామంలోకి వెళ్లి ఒక రైతుని ‘మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిట’ని అడగండి.* 

*వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదు అంటారు.*

*పట్టణంలోకి వెళ్లి ఒక హోటల్ యజమానిని అడగండి. కుక్స్, వెయిటర్స్, ఫ్రంట్ ఆఫీస్ పనులు చేయడానికి సరైన వ్యక్తులు దొరకడం లేదు అంటారు.* 

*”అసలు ఈశాన్య భారతదేశం వారు ఉండబట్టి సరిపోయింది. లేకపొతే పెద్ద క్రైసిస్ వచ్చివుండేది!" అని ఒక హోటల్ యజమాని అంటున్నాడు.*

*భవన నిర్మాణ దారుణ్ని అడగండి ‘ప్లంబర్లు, ఫిట్టర్లు మొదలైన వారు దొరకడం లేదు!’ అంటారు.*

*మారిషస్ వాళ్ళకు అక్కడ ‘పురోహితుడు, కుక్ కావాలి, దొరకడం లేదు సాయం చెయ్యండి!’ అని వారు అడుగుతున్నారు. ఒక పక్క దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వుంది అంటున్నారు.*
*మరోపక్క అన్ని రంగాల్లో సరైన నైపుణ్యం ఉన్న వ్యక్తులు దొరకడంలేదు అని ఆయా రంగాల్లో నిపుణులు చెబుతున్నారు. ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?*

*హోటల్స్ లో దోశ మాస్టర్ కు ఇరవై ముప్పై వేలు ప్రారంభ జీతం వుంది.*

*అదే ఇంజనీర్ లు పది వేల జీతానికి కూడా క్యూలో నిల్చుంటున్నారు. సమస్య ఎక్కడ వుంది అంటే అందరికి వైట్ కాలర్ జాబ్ లే కావాలి. జీతం ఎక్కువ వస్తుంది అని కాదు.*

*చాలా సెమి స్కిల్ల్డ్ జాబ్స్ కు రెండు మూడు రెట్లు ఎక్కువ జీతం వస్తుంది.*

*ఈరోజు ప్రభుత్వ టీచర్ ప్రారంభ జీతం దాదాపు 50 వేలు. అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్ { సర్జన్} జీతం నలభై వేలు. మన వారు ఒక్కో జాబ్ కు ఒక్కో సోషల్ స్టేటస్ అంటగట్టేసారు. ఇంజనీర్ డాక్టర్ అంటే గొప్ప అని టీచర్ అంటే ఏదో పనికి రాని జాబ్ అని.*

*ప్లంబర్, ఫిట్టర్ లాంటి పనులు చేస్తున్నాను అంటే పెళ్లికి అమ్మాయి కూడా దొరకని పరిస్థితి.*

*అంతెందుకు పురోహిత్యం చేసే వారికి విదేశాల్లో చాల డిమాండ్ వుంది. అయినా పురోహిత్యపు పెళ్లికొడుకు అంటే పెళ్ళికి అమ్మాయిలు ముందుకు రాని స్థితి.*

*కంప్యూటర్ ఇంజనీర్ అని చెప్పుకొంటూ ఆరు నెలలుగా జీతాలు ఇవ్వక పోయినా కేవలం *ప్రెస్టేజ్ కోసం పని చేసేవారు వున్నారు.* 

*అదే…. హోటల్ లో కుక్ గా వెయిటర్ గా చెయ్యమంటే నామోషీ. తలతీసినట్టు ఫీల్ అవుతారు.*

*ఇదే మనవారు అమెరికాకు వెళితే అక్కడ హోటల్ లో పనిచెయ్యడానికి సిద్ధపడుతారు...*
*అంటే ఇక్కడ మారాల్సింది సామజిక దృక్పధం.*

*దొంగతనం, అడుక్కోవడం తప్ప ఏ పని చేసినా తప్పులేదు. *అన్ని పనులు గొప్పవే.* 

 *మీ మనసుకు నచ్చిన ఫీల్డ్ ఎంచుకోండి.* 

*అతిచిన్న ఉద్యోగమైనా పరవాలేదు. *చేతినిండా పని ఉండాలి, ఎంతో కొంత ఆదాయం ఉండాలి.*

 *చేస్తున్న పనిపై మనసు లగ్నం చెయ్యాలి. అంచెలంచెలుగా ఎదగాలి.*

*పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలి. పాన్ డబ్బా పెట్టుకొన్నా పరవా లేదు. కర్రీ షాప్ పెట్టుకొన్నా పరవా లేదు... "మీరే రాజు... మీరే మంత్రి..."  డిప్రెషన్ శుద్ధ అనవసరం.*

 *ఆత్మ విశ్వాసం, కృషి, పట్టుదల, మారిన పరిస్థితులకు అనుగుణంగా మారడం ... కావలసింది ఇది.!!!_*          
 *హృదయమనే దేవాలయం వద్ద కాపలా కాసే వానివలె అప్రమత్తతతో ఉండాలి.*

*ఆదర్శానికి కట్టుబడి ఉండాలంటే మొక్కవోని, ధైర్యం, ఎదురులేని శక్తి, అచంచల విశ్వాసం, నిస్వార్థపరత కలగలసి ఉండాలి.*

*ఎటువంటి ప్రతిఘటనలు ఎదురైనా భయపడకూడదు. పరాజయం పాలైనా క్రుంగకూడదు. చీకటి ఎదురైనా విశ్వాసం సడలకూడదు.*

*మనం ఎంచుకున్న ఆదర్శం పట్ల గల ప్రేమ మనలను మనం మరిచిపోయే స్థితికి తీసుకువెళితే అప్పుడు ఇక జయాపజాయాలు, లాభనష్టాలు ఏవీ మనలను బాధించలేవు.*
అలాగే,

జీవితం కూడా ఈ తాళంచెవి లాగే ఉంటుంది! 

ఎవరైతే అకుంఠిత దీక్షతో ప్రయత్నం చేస్తారో వారే విజేతలు! 

లేదంటే జీవిత సమరంలో ఇరుక్కుపోయి గిలగిలలాడుతూ జడపదార్ధలలాగా మిగిలిపోతారు!    

****ఆప్తవాక్యాలు

 🍁  *ఆప్తవాక్యాలు*  

4):మధుమతీం వాచముదీయమ్ 

మధురమైన మాటలను పలకాలి(అథర్వణవేదం)

వాక్కు మన హృదయాన్ని, సంస్కారాన్నీ ప్రతిఫలింపజేసేది. అది 'మధురంగా’
ఉండాలని వేదం చెప్తోంది.

అంటే తీయగా మాట్లాడితే చాలు అని అర్థం చెప్పుకోవడం సరిపోదు. మనస్సులో
చెడు తలపుల్ని దాచుకొని, పలుకులు మాత్రం కమ్మగా ఉంటే అది 'మధుర' వాక్కు
కాదు.

మనస్సులోని మధుర భావాలను(సత్ భావాలను) మాటలో ప్రతిఫలింపజేయడమే ‘మధురంగా మాట్లాడడం'. సత్యం, ప్రియం, హితం - ఇవే మాధుర్యాలు. ఈ మాధుర్యాలు మన మాటల్లో ధ్వనించాలి. అని వేదమాత
శాసిస్తోంది.

మాటతో ప్రపంచంలో అన్ని కార్యాలూ సాధించవచ్చు. 'సర్వస్య కారణమ్' -
అన్నారు పెద్దలు. అలాంటి మాటను ఎలా సంస్కరించుకోవాలో భారతీయ సనాతన
వాఙ్మయం అనేక చోట్ల బోధిస్తోంది.
ఉద్విగ్నత లేకుండా, సత్యంగా, ప్రియంగా, హితంగా మాట్లాడడం 'వాచిక తపస్సు’
అవుతుందని - భగవద్గీత వచనం. పలుకులో ఆప్యాయత, శుభాకాంక్ష లేకుండా
ఎదుటివారిని గాయపరిచేటట్లు మాట్లాడడం కొందరి నైజం. వారి పలకరింపులే
పెళుసుగా, పుల్ల విరిచినట్లుంటాయి. ఎదుటివారి మనస్సుకి ఆహ్లాదం కలిగించేలా
పలకరించడం కూడా మాటలో మాధుర్యం పలికించడమే. కసురుకోవడాలు. తిట్టడాలు,
అవాచ్యాలు వాక్కులో దొర్లితే - అది మన మనస్సు నైజాన్ని చెప్పడమే కాకుండా.
మన వ్యక్తిత్వాన్నే భయంకరం చేస్తుంది.

స్మితభాషి, ప్రియభాషి, పూర్వభాషి - అని మహాపురుషుల వాక్ లక్షణాన్ని వర్ణించాయి
ఇతిహాసాలు. చిరునవ్వుతో ప్రియంగా మాట్లాడడం, ఎవరైనా కలిస్తే 'ముందు వాళ్ళు పలకరిస్తే, ఆ తరువాత మేము పలకరిస్తాం' - అనే అహంకృతి లేకుండా, ముందుగా తానే మాట కలుపుకొనే స్నేహ శీలతని 'పూర్వభాషి' అంటారు. ఈ లక్షణాలు గల వాక్కునే 'మధురవాక్కు' అని చెప్పాలి.

భగవంతుని గుణ వైభవ మహిమలని పేర్కొనడం, ఉత్తమవిషయాల గురించి
మాట్లాడడం కూడా 'మధుమయ వాక్కు'కి లక్షణం.

తనవున విరిగిన యలుగలు
ననువున బుచ్చంగవచ్చు, నతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా - అని మహాభారతం నీతి.

“యుద్ధంలో శరీరానికి తగిలే బాణాలు విరిగి శరీరంలో ఉండిపోతే, యుక్తితో వాటిని తొలగించవచ్చు. కానీ, మనస్సులో నాటుకున్న నిష్టూరపు మాటలు తొలగడం
అసాధ్యం" - అని భావం.

కొందరికి నోరు తెరిస్తే అశుభాలే పలుకుతాయి. ఏ పనైనా చేయబోతే "అదేమీ
జరిగేనా, పెట్టేనా" అనో, “ఇది మంచి ఫలితం ఇస్తుందో, లేదో” అనో నిరుత్సాహపరచడం వంటివి కూడా మాటలోని చేదుదనాలే. శుభాన్ని ఆశించమని, శుభాన్ని పలుకమనీ మన శాస్త్రాలు ఘోషిస్తాయి.

 'భద్రం కర్ణేభిః శ్రుణుయామః' -

‘మంచినీ, క్షేమాన్నీ విందాం', 'మంచినే చూద్దాం' - అని ఆశించే సంస్కృతి మనది.
ఆశావాదం, ప్రోత్సాహం, సానుకూలధోరణి (పాజిటివ్ యాటిట్యూడ్) అనేది మన
మాటలో ధ్వనించాలి.

ఎదుటివారి వెన్ను తట్టేలా ఉండే మాట 'మధుమయ వాక్కు' అవుతుంది. వెన్ను
విరిచేలా ఆడే నిరుత్సాహ వచనాలు శల్యసారథ్యాలై విషవాక్కులౌతాయి.

మాట ఇచ్చే ధైర్యం, ఓదార్పు, స్ఫూర్తి అనన్య సామాన్యం.

స్థూలంగానే కాక, సూక్ష్మ జగత్తులో కూడా మధుమయ వాక్కులు దేవతలకూ
ప్రీతి కలిగిస్తాయి. కాబట్టి మంచి మాట్లాడమనీ, దేవతలే ఆ వాక్కులు వింటారని -
'తథాస్తు' అంటారనీ, మన దేశాచారాలు బాల్యం నుండి 'మంచిగా ఆలోచించడం',
'మంచిగా మాట్లాడడం' అనే సంస్కారాలని వివిధ విధాలుగా అభ్యాసం చేయించాయి.   
 Vedantha panchadasi:
అవిద్యావృతకూటస్థే దేసద్వయయుతా చితిః ౹
శుక్తౌ రూప్యవదధస్తా విక్షేపాధ్యాస ఏవ హి ౹౹33౹౹

33.  అవిద్య యొక్క ఆవరణ శక్తిచే ఆవరింపబడిన కూటస్థ చైతన్యముపై సూక్ష్మ స్థూల శరీరములు విక్షేపశక్తి వలన కల్పింపబడుచున్నవి.

ఇదే విక్షేపాధ్యాస.ముత్యపు చిప్పపై రజితము ఆరోపింపబడినట్లే కూటస్థ చైతన్యముపై శరీరత్రయము అధ్యస్తమగుచున్నది.

అధ్యాసకు,అనగా ఒక వస్తువు మరొక వస్తువుగా భ్రమపడుటకు,
అద్వైత వేదాంతమున "అవిద్య" కారణముగా చెప్పబడినది.

 అవిద్యకు గల ఆవరణశక్తి మొదట వస్తుస్వరూపమును కప్పిపుచ్చును.దానికి బదులుగా మరొక వస్తువు యొక్క అభాసను విక్షేపశక్తి సృష్టించును.

ఆవరణశక్తి ముత్యపుచిప్ప నిజస్వరూపమును కప్పిపుచ్చగా, విక్షేపశక్తి దానిస్థానమున రజతాభాసను కల్పింపగా,మనకు ముత్యపు చిప్పకు బదులు రజితము కన్నించుచున్నది.

అహం ప్రవృత్తి తొలగిపోగా ద్వైతము నశింపగా బేదభావము చిత్తములో రహితము కాగా, అజడమగు ఏస్థితికలదో అదియే స్వరూపస్థితి అని చెప్పబడును.

హేయమగు దృశ్యమును త్యజించువాడును,గ్రహింపదగిన ఆత్మవస్తువును గ్రహించువాడును, దృక్ స్వరూపమును చూచువాడును,దృక్కు కంటె అన్యమును చూడని వాడును తెలియదగిన పరతత్త్వమందు జాగరూకుడై జీవించువాడు  చిల్లగింజచే జలము నిర్మలమగునట్లు విజ్ఞానవశమున అవిద్య తొలగినవాడునునగు మహానీయునకు స్వస్వభావము(ఆత్మస్థితి)
ప్రసన్నమగును.

జగద్వికారమైనవి, ఆత్మయందు వివిధ భంగిమలతో దృశ్యజగత్తుగా కనిపించుచున్నది. 
అవిద్య యొక్క ఆవరణ శక్తిచే, ఏ బ్రహ్మము సత్యమైయున్నదో దానియందు విక్షేపధ్యాస వలన సూక్ష్మ స్థూల శరీరములు ఆరోపింపబడుచున్నవి.

లోకముల జ్ఞానము అనాది అయిన అవిద్య(అజ్ఞానము) అయినను, అది తత్త్వవిచారణసహాయముతో అదృశ్యమగును.

శుద్ధచైతన్యమే నా స్వరూపం. శారీరక బాధలు, మానసికాందోళనలు,బుద్ధిలోని అశాంతి నా చేతనే తెలియబడుతున్నాయి.వాటిని నేను తెలుసుకుంటున్నాను.నా స్వభావం సత్ చిత్ ఆనందం.
ఈ జ్ఞానాన్ని దృఢంగా నమ్మాలి.

ఆభరణములలోని బంగారాన్ని మాత్రమే చూడవలెను. తరంగములలో సముద్రమును మాత్రము చూడుము. అదేవిధముగా కేవలబ్రహ్మమును మాత్రమే దర్శించవలెను.

ఆత్మజ్యోతి యొక్క ప్రకాశమే సర్వాన్ని మనకు తెలిసేలా చేస్తోంది.దీని ప్రకాశంలో రాత్రిలోని చీకటికూడా తెలియబడుతొంది.
ఇది అగ్ని -దీపశిఖ మొదలయిన వాటి వంటి కాంతి కాదు.  

****కుండలిని సిద్ధ మహా యోగము🌹: నా ఆజ్ఞా చక్ర అనుభవాలు, అనుభూతులు

 🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
నా ఆజ్ఞా చక్ర అనుభవాలు, అనుభూతులు


మూలం : కపాల మోక్షం అనే మోక్ష సాధనా గ్రంథం


అనుభవం , అనుభూతి : శ్రీ పవనానంద సరస్వతి



...ఈ చక్రానుభవాలు, ఈ దైవికవస్తువులు అనేవి మీకు మీ చక్ర సాధనను బట్టి వస్తాయి. చక్ర ఆరాధన అనగా... నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్రానుభవాలు మాత్రమే కలుగుతాయి, అదే మీది విగ్రహారాధన అయితే ఈ చక్రానుభవాలతోపాటుగా ఈ చక్ర దైవికవస్తువులు వస్తాయి. లేదా ఈ వస్తువులున్న క్షేత్ర దర్శనాలైన కలుగుతాయని గ్రహించండి. కాని తప్పని సరిగా ఈ చక్రానుభవముతోపాటుగా, ఈ చక్రదైవిక వస్తువు ఏదో ఒకటి తప్పని సరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది. ఈ చక్రానుభవాలు అలాగే ఈ చక్ర దైవికవస్తువులు అనేవి మీ గతజన్మ సాధన బట్టి ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదనలకి సంబంధించి ఆయా సాధన స్ధితిని బట్టి వస్తాయని సాధకులు గ్రహించగలరు.


డిసెంబరు 6: ఈ రోజు నుండి ఆజ్ఞా చక్ర ధ్యానం చేయటం ఆరంభించాను.నా దృష్టి అంతా భృకుటి స్థానం మధ్యలో వుంచి ధ్యానం చేయమని నా గురుదేవుడు చెప్పినారు.
 
డిసెంబర్ 12: అనుకున్నంతగా నేను ధ్యానం చేయటం లేదని,  సరియైన ఏకాగ్రత కోసం నా నాసికాగ్రము మీద దృష్టి ధ్యానము చెయ్యమని మా గురుదేవులు చెప్పారు.

 
డిసెంబర్ 18: ఆయనేమో నాసికాగ్రం మీద ధ్యానము చేయమంటే నేను నాసికా రంధ్రాలు ఉన్నచోట దృష్టి పెడుతున్నాను అని అది తప్పు అని నాసికాగ్రం అంటే ముక్కు మొదలు అయిన భృకుటి స్థానం అని మా గురువులు చెప్పేదాకా నాకు తెలియ రాలేదు.

డిసెంబర్ 25: ఈ రోజు ఉన్నట్టుండి నాకు విపరీతమైన కామోద్రేకం కలిగినది. కారణం తెలియరాలేదు. ఈ రోజంతా ప్రతి చిన్న విషయానికి నా మర్మాంగం ఉద్రేకము చెంది ఇబ్బంది పెడుతూనే ఉన్నది.

డిసెంబరు 27: మూలాధార చక్రములో ఎలా అయితే అధిక కామోద్రేకాలు కల్గినాయో అలాంటివి కలుగుతున్నాయని నాకు అనిపిస్తుంది.నా సాధన ముందుకి వెళుతుందా క్రిందకి వెళుతుందా ఎవరికి ఎరుక ! 

జనవరి 18: ఈరోజు నాకు ధ్యానంలో పాములు కాపలా కాస్తున్న గుప్తనిధులు కనిపించాయి. అవి నిజమేనా. ఏమో ఎవరికి తెలియాలి....!

జనవరి 20: ఈ రోజు నాకు ధ్యానంలో గుప్తనిధుల కాపలా కాస్తున్న తాంత్రిక దేవతలు కనిపిస్తున్నారు. కారణం తెలియదు....!

జనవరి 22: ఈ రోజు నాకు మణులను మణికాంతులను ఇస్తున్నఒక పెద్ద భోషాణము లీలగా విచిత్రంగా ధ్యానమునందు కనిపించినది. ఇది నిజమేనా?

జనవరి 25: నాకు కలిగే అనుభవాలు గూర్చి గురుదేవుడిని అడిగినప్పుడు... “నాయనా! ఇవి అన్నియు కూడా ఆజ్ఞా చక్ర జాగృతి అనుభవాలే. అలాగే వీటి మాయలో అనగా కామమాయ, ఐశ్వర్యమాయ, గుప్త నిధులు మాయలో నీ మనస్సు పడుతుందా లేదా అని ప్రకృతి నీకు యోగ పరీక్షలు పెడుతుందని గ్రహించు. అలాగే ఈ చక్రమునకు అనుసంధానంగా మూలాధార చక్రం ఉంటుందని గ్రహించు. అందులో మానవ సంబంధాలు ఉన్న నగ్న స్త్రీలు కామమాయ పెడితే ఈ చక్రము నందు నగ్న దేవతా స్త్రీలు అనగా రంభ, మేనక, ఊర్వశి, లజ్జా గౌరి ...ఇలాంటి వారు కామ మాయ పరీక్షలు పెడతారని గ్రహించు. వీరిని చూస్తూ కలలో కూడా నీవు వీర్యస్కలనం కాకుండా చూసుకోవాలి. లేదంటే నీ కుండలినీ శక్తి మణిపూరక చక్రము దగ్గరికి వెళ్లి పోతుందని గ్రహించు.  

మార్చి 16: ఈ రోజు రాత్రి మేడ మీదకి వెళ్ళి పడుకోగానే, ఉగ్ర స్వరూపముగా నా గుండెల మీద త్రిశూలముతో పొడుస్తున్న ఒక దివ్య దేవతా స్వరూపము కనపడినది. 

మార్చి 22: ఈ రోజు ఎందుకో దుర్గా యంత్రమును పూజ చేస్తుంటే నా భృకుటి స్థానము నుండి వేడి వేడి ఆవిర్లు బయటికి వస్తున్నట్లుగా విపరీతంగా అనిపించసాగింది.

ఏప్రిల్ 10: ఈరోజు విచిత్రంగా నా శరీరము నుండి వేడి వేడి ఆవిర్లు తో నా శరీరము ఉడికిపోయింది. యంత్ర శక్తిని నా శరీరము తట్టుకోలేకపోతుందా ! ఏమో....!

ఏప్రిల్ 15: ఈరోజు జ్వరం తగ్గించే టాబ్లెట్లు పది వేసుకున్న కూడా నాకున్న వేడి ఆవిర్లు తగ్గటం లేదు. పైగా నోటిలో తెల్లని పొక్కులు కూడా వస్తున్నాయి. మాట స్పష్టంగా రావడం లేదు. గొంతు నొప్పిగా ఉంది. విపరీతమైన తలపోటుగా ఉంది.

ఏప్రిల్ 20: ఈరోజు నాకున్న శరీర ఈతి బాధలు గురించి మా గురుదేవులకి చెప్పేసరికి “నాయనా! ఈ శరీర నొప్పులు ప్రారంభమైతే నీకు ఆజ్ఞా చక్ర శుద్ధి ఆరంభమైనట్టే. గత జన్మలో నీవు చేసిన పాప కర్మల వలన ఈ బాధలు కలుగుతున్నాయి.

 వీటి నివారణ కోసం శరీరానికి విభూది లేదా గంధము బాగా పట్టించాలి. మల్లెపూలు వాడాలి లేదా సుగంధ పువ్వుల మాల వేసుకోవాలి. పంచలోహ నిర్మిత కడియము వేసుకోవాలి. స్వచ్ఛమైన స్పటిక మాలలు ధరించాలి. అప్పుడే ఈ ప్రకృతిలోని పంచభూత శక్తులు నీ మీద ప్రభావం చూపటం తగ్గిస్తాయి. వీటి ఆధీనము కోసము వీటి ప్రభావము నీ మీద ఉండకుండా ఉండటానికి నీవు నాలుగు ఉప చక్రాలు అయిన గుణ, కర్మ, కాల, బ్రహ్మ చక్రాల సాధనలను తాంత్రిక విధానంలో చేయాల్సి ఉంటుంది. దీనికి తాంత్రిక స్త్రీ మూర్తిని ఒక గురువుగా ప్రకృతి ఏర్పాటు చేస్తుంది. ఈమెకి నీవు యోని పూజ చేసి ఆమె కామమాయ దాటితే ఉప చక్రాలు ఆధీనమై ఈ ప్రకృతి మాత సాక్షాత్కారమవుతుంది.ఆపై ఒక సద్గురువు దర్శనము పొందాల్సి ఉంటుంది. ఇది ఎందుకు ఏమిటి అనేది ఆ స్త్రీ  వచ్చినప్పుడు నీకు చెబుతాను.

అప్పటిదాకా విభూది పూసుకో” అని చెప్పినారు.

 ఏప్రిల్ 28:ఈ రోజు నాకు ధ్యానమునందు ఉండగా నోటి నుండి పులి గాండ్రింపు శబ్దం రావడం గమనించాను. విచిత్రంగా అనిపించింది...!


మే 2: ఈ రోజు కూడా నా నోటి నుండి జంతువుల అరుపులు వచ్చినాయి. ఎందుకో...!

మే 10: ఈ రోజు కూడా నా నోటి నుండి రకరకాల జంతువుల అరుపులు వచ్చినాయి. ఈ శబ్దాలకి నాకు ధ్యానము భంగం అవుతోంది.ఈ మధ్య తరచుగా నా నోటి నుండి జంతువుల అరుపులు వస్తున్నాయి. కారణము తెలియరాలేదు....

మే 18: ఈ జంతువుల అరుపులుకి నా చుట్టూ ఉన్న వాళ్ళు భయపడుతున్నారు. అచ్చముగా వాటిలాగానే నేను అరుస్తున్నానని నాకు చెబుతుంటే నాకు సిగ్గు, భయం కలుగుతున్నాయి.

మే 20: ఈ రోజు మా గురుదేవుని కలిసి నా నోటి నుండి వచ్చే జంతువుల అరుపులు గూర్చి అడగగా...

 “అవియు నా గత జన్మ సంస్కారాలని ఆయా జన్మలు అంతరించి పోయేటప్పుడు ఇలాంటి శబ్దాలు రూపంలో వస్తాయని వాటి గూర్చి కంగారు పడవద్దు” అని చెప్పినారు.

మే 25: జంతువుల అరుపులు ఆగటంలేదు. నా ధ్యానము ఆగటంలేదు. విచిత్రంగా ఉంది.   
  “ఆత్రేయగీత”

మూడవ భాగం

"జ్ఞాన మంజరి” (వేదవిజ్ఞాన వీచికలు)

3వ భాగము.

పరిశోధన - శ్రీ శాస్త్రి ఆత్రేయ 

సనాతనధర్మం ప్రకారం కర్మ సృష్టిధర్మం. ప్రకృతిగుణాల వలన కర్మలు నిర్వహించబడతాయి. కర్మలకు దోషం వున్నప్పటికీ జీవులు కర్మబద్దులు. కర్మ మానడం కంటే కర్మ చేయడం మేలు. కర్మ చేయకపోతే జీవయాత్ర జరగదు. జీవులు కర్మచేయకుండా ఒక్క క్షణమైనా వుండలేరు.

 అయితే కర్మలవలన ఫలం తప్పదు కాబట్టి సత్కర్మలు చెయ్యాలి. ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మఫలాన్ని దైవానికి అర్పించడం ద్వారా జీవుడు క్రమేణా జన్మరాహిత్యాన్ని పొందగలడని తీర్మానం చేసింది సనాతనధర్మం.

అజ్ఞానులు కర్మలో ములిగీ ఎలా పని చేస్తారో, జ్ఞానులు కూడా లోకశ్రేయస్సు కోరుతూ అలాగే కర్మలు చెయ్యాలి. 

కర్మలలో మునిగిపోయిన వారిని ఆక్షేపించకుండా,

వారు సత్కర్మలు ఆచరించేలా జ్ఞానులు ప్రోత్సహించాలి. అహంకారం వలన తానే అన్నింటికీ కర్తనని అనుకుంటాడు అజ్ఞాని. కానీ గుణకర్మల యొక్క తత్వం తెలిసిన జ్ఞాని ఆ చట్రంలో చిక్కుకోడు.

 కర్మఫలితాన్ని కోరుకునే వాళ్ళు దేవతలను ధూపదీపనైవేద్యాలతో ఆరాధిస్తారు. ఆరాధనలో తమ కోరికలను నెరవేర్చమని వేడుకుంటారు. కొన్ని కోరికలు తీరిన తరువాత ఆరాధనలో కొంత ఆడంబరం పెంచుతాడు. పదిమందికి తన ఆడంబరత చూపెట్టే ప్రయత్నం చేస్తాడు. దేవుడు నావాడే అని భావిస్తాడు. కొన్ని జరగకపోతే దేవుడ్ని నిందించడం ప్రారంభిస్తాడు. మెల్లిగా అహం చోటు చేసుకుంటుంది. మెల్లగా నమ్ముకున్న దైవాన్ని మారుస్తాడు. వేరే దైవాన్ని ఆశ్రయిస్తాడు. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే!!

అంటే తాము చేస్తున్న కర్మలవలన మనుజుల గుణము బయటపడుతోంది! వ్యక్తిలో దాగివున్న సత్వ, రజో, తమో గుణములు కర్మలరూపంలో తేటతెల్లమవుతున్నాయి.

ఎంత కపటమును ప్రదర్శించినా అవి ఒకానొకప్పుడు బయటపడక తప్పదు.

కర్మలు శాశ్వతము కావు, ఎందుచేతనంటే కాలానుగుణంగా కర్మలు మారుతూవుంటాయి. కాబట్టీ వాటి ఫలితాలు కూడా తాత్కాలికములే. అంటే మనుజులు కర్మలు చేయడంగానీ, చేయకపోవడంగాని ముఖ్యంకాదని, తమ మనస్సునందు మాలిన్యము తొలగించడమే ప్రధానమని తెలుస్తుంది. ఆ మాలిన్యాన్ని మనసా, వాచా తొలగించకుండా, చేసే ఏ కర్మ అయినా నిరుపయోగమే! 

అజ్ఞాని, నేను చేస్తున్నానని భావించి (కర్తృత్యము), ఫలితముల యందు ఆసక్తితో కర్మలను చేసి, వాటి ఫలితాన్ని అనుభవించుటకు ఈ జన్మ చాలకపోతే ఇంకొన్ని జన్మలు ఎత్తవలసి వుంటుంది. దానినే ప్రారబ్ధకర్మ అంటారు. జ్ఞానులు ఆత్మస్థితిలో వుండి ఏ ఫలితములను ఆశించకుండా, దైవబుద్ధితో కర్మలు చేస్తాడు. అది యజ్ఞంగా, యోగంగా మారి బంధమును కలిగించదు. సాధనతో ఆత్మజ్ఞానము పొంది బంధంనుండి విముక్తి పొందుతాడు.

అంటే అనాసక్తితో, ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి కోరికలేక, అహమనే భావాన్ని త్యజించి చేసే ఏ కర్మ అయినా “కర్మయోగము”గా మారిపోతుంది. కర్మయోగము వలన బంధము కలుగదు.

 జ్ఞానము పరిపక్వతజెంది సమాధి స్థితి కలిగినప్పుడు కర్మలతో పనిలేదు. కొందరు లోకకల్యాణం కొరకు కర్మలు చేస్తారు, కొందరు చేయరు. వారు కర్మని అకర్మగా, అకర్మని కర్మగా భావిస్తారు. అంటే వారు చేసే కర్మలు అసంగముగా చేస్తారు కావునా కర్మబంధము వుండదు.

మానవులు పరమాత్మను చేరుటకు కర్మ-జ్ఞానములు తప్పక అవసరము. ఇక్కడ “కర్మ అంటే నిష్కామకర్మ” అనే భావించాలి. దానివలనే జ్ఞానము ఉదయిస్తుంది.    
 శ్రీమద్భాగవతం - 96 వ భాగం

కుచేలోపాఖ్యానం :

శ్రీకృష్ణ పరమాత్మ ఒకనాడు రుక్మిణీదేవి మందిరంలో కూర్చుని ఉన్నాడు. ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడితో చదువుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కుచేలుడు. కానీ సంప్రదాయంలో కుచేలుని గురించి ఒక తప్పు కథ ప్రచారంలో ఉంది. అది ఎలా వచ్చిందో తెలియదు. కృష్ణుడికి తెలియకుండా ఒకరోజున అరణ్యంలో కుచేలుడు అటుకులు తిన్నాడని, అందుకే అంత దరిద్రం అనుభవించాడని, ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు ఐశ్వరం ఇచ్చాడని అంటారు. కానీ భాగవతంలో కుచేలుని గురించి అలా చెప్పలేదు. కుచేలుని గురించి వ్యాసులవారు, పోతనగారు చాలా గొప్పగా మాట్లాడారు. వేదవ్యాస కుమారుడయిన శుకుడు అభిమన్యుని కుమారుడయిన పరీక్షిత్తును చూసి ‘ఓరాజా! ఆ కుచేలుడు ఎటువంటి వాడో నీకు చెపుతాను విను’ అని కుచేలుని గురించి చెప్తున్నాడు. 

కుచేలుడు అపారమయిన మానాభిమానములు కలిగిన వాడు. యాచన చేయడానికి సిగ్గు విడిచిపెట్టాలి. కానీ కుచేలుడు అలా సిగ్గు విడిచి పెట్టిన వాడు కాదు. మానాభిమానములు ఉన్నవాడు. గొప్ప బ్రాహ్మణ తేజస్సు ఉన్న వాడు. విజ్ఞాని. ఆయన అనుబంధములకు అతీతంగా ఉంటూ నిరంతరమూ బ్రహ్మమునందు రమించే మనస్సు ఉన్నవాడు. లోకమునందు ఈశ్వరుని దర్శనము చేయగలిగిన సమర్థుడు. మహానుభావుడికి ధర్మం అంటే మహాయిష్టం. విశేషించి ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని. తనకు ఏమీలేకపోయినా దరిద్రంలో అన్నీ ఉన్నాయని తృప్తిగా ఉన్నవాడు. ఈశ్వరుడు తనకు ఫలానిది ఇవ్వలేదు అని అనడం తెలియనివాడు. అంతటి మహాభక్తుడు. గోవింద సఖుడు. అటువంటి కుచేలుడు అంత దరిద్రం అనుభవిస్తున్నా ఎన్నడూ కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్లి చెయ్యి చాపి ‘కృష్ణా, నాకు సహాయం చేస్తావా’ అని అడగలేదు. కుచేలుని భార్య అనురక్త. కుచేలుడు ఎలా ప్రవర్తిస్తాడో తానుకూడా అలా ప్రవర్తించే సహధర్మచారిణి. గొప్ప భాగవత ధర్మమూ తెలిసి ఉన్న తల్లి. ఆవిడ ఒకరోజున భర్తతో అంది ‘మహానుభావా, ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు. నేను ఓర్చుకుంటాను. పిల్లలు ఆకులతో చేసిన డొప్పలు చేత పట్టుకుని పదిమాట్లు ఆకలేస్తోంది అమ్మా అని అంటే అన్నం పెట్టలేక పోయానే అని అమ్మ బాధ పడుతుందేమోనని ఆకలితో నావంక చూస్తూ నాలుకతో పెదవులు తడుపుకున్తున్నారు. నీకు ఐశ్వర్యం భ్రాంతి లేదు. కానీ బిడ్డలను పోషించాలి కదా. కాబట్టి మీరు పాటిస్తానంటే ఒక సలహా చెప్తాను. మీ సఖుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా. మీరు ఒకసారి ఆయన వద్దకు వెళ్లి ఒక్కమాట చెప్పినట్లయితే అందరినీ ఆదుకోగలిగిన మహానుభావుడు ఆ వాసుదేవుడు మనలను ఆదుకుంటాడు. ఆయనను భక్తితో ఏమి అడిగినా యిస్తాడు. ఎందుకు వచ్చిన దరిద్రం మనకి. పిల్లల కోసమయినా ఆయన దగ్గరకు ఒక్కసారి వెళ్ళవలసింది’ అని చెప్పింది. 

భార్య అలా చెప్పేసరికి ఆయన అన్నాడు ‘పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పుడు స్నేహితుని దగ్గరకు వెళ్ళేటప్పుడు, రోగుల దగ్గరకు వెళ్ళేటప్పుడు వృద్ధుల దగ్గరకు వెళ్ళేటప్పుడు గురువుల దగ్గరకు వెళ్ళేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళలేము కదా! స్నేహితుడికి ఏదయినా కానుక పట్టుకెళ్ళాలి కదా! ఆయనకు పట్టుకు వెళ్ళడానికి మనింట్లో ఏమి కానుక ఉంది?” అని అడిగాడు. అపుడు ఆవిడ “మనకి ఉన్నదే మనం యిద్దాము. మన యింట్లో గుప్పెడు అటుకులు ఉన్నాయి. అవి మూట కట్టి యిస్తాను తీసుకువెళ్ళండి’ అన్నది. కుచేలుడి జీవితకాలంలో ఆయనను ఆ ఊళ్ళో చిరుగులేని పంచెను కట్టుకోవడం చూసిన వాడు లేదు. అందుకని ఆయనకు కుచేలుడు అని పేరుపెట్టి పరిహాసం ఆడేవారు. చేలము అనగా వస్త్రము. కుచేలము అనగా చిరిగిపోయిన బట్ట. చిరగని బట్ట కట్టడం కుచేలునికి తెలియదు. కుచేలుని బార్య అటుకులను చిరిగిపోయిన ఉత్తరీయంలో పోసి జాగ్రత్తగా ముడి వేసి కుచేలునికి ఇచ్చింది. దానిని తీసుకుని కుచేలుడు కృష్ణుని వద్దకు బయలుదేరాడు. కుచేలుడు చిరిగిపోయిన బట్టలతో చెమట కంపుతో, రథములనుండి వస్తున్న ధూళి అంతా వంటిమీద పడిపోయి దుర్వాసన వచ్చే స్థితిలో ఆయన నడిచి నడిచి, చివరకు ద్వారకా నగరం చేరుకున్నాడు. ఏమి తిన్నాడో, ఏమి తినలేదో ఈశ్వరునికి ఎరుక. ద్వారకా పట్టణ సౌందర్యం చూసి ఆశ్చర్యపోయాడు. తన సఖుడయిన గోవిందుడు ఎక్కడ ఉన్నాడోనని వాకబు చేసి కృష్ణ భగవానుడు ఉన్న యింటిని తెలుసుకున్నాడు. యింటిముందర పెద్ద పెద్ద శూలములు పట్టుకొని భటులు కాపలా కాస్తున్నారు. తన స్థితిని చూసి లోపలికి రానిస్తారో రానివ్వరో, కృష్ణ పరమాత్మ తనని గుర్తు పడతాడో పట్టాడో అనుకున్నాడు. రాజభటులకు ఏదైనా కానుక యిచ్చి లోపలికి వెళదాము అంటే తన దగ్గర కృష్ణునికి యివ్వడానికి తెచ్చిన అటుకులు తప్ప వేరొకటి లేదు. కాబట్టి యిపుడు వాసుదేవుడిని చేరడానికి తనకు వాసుదేవుడే ఆధారం అని అనుకుని సౌధం దగ్గరికి వెళ్లి తెరతీసి భటులను చూశాడు. భటులు ‘ఎవరు కావాలి అని అడిగారు. నేను కృష్ణ పరమాత్మ స్నేహితుడిని అని చెప్పాడు. అపుడు వాళ్ళు ఆయనను ఎగాదిగా చూశారు. పాపం ఆయన చాలా దయనీయమయిన స్థితిలో కనపడ్డాడు. కానీ ద్వారకానగరంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ వున్న ద్వారపాలకులకు తెలుసు. అందుకని వారు వెళ్లి కృష్ణ పరమాత్మతో ‘అయ్యా మీకోరకని చాలా పేద బ్రా

హ్మణుడు మీ స్నేహితుడనని చెప్పి మిమ్మల్ని కలుసుకునేందుకు ద్వారం దగ్గర నిరీక్షిస్తున్నాడు’ అని చెప్పారు. అప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవి మందిరంలో అమ్మవారితో హాస్యోక్తులాడుతూ ఉన్నాడు. తెర తీసేసరికి దూరంగా రాజద్వారం దగ్గర నిలబడి ఉన్న కుచేలుడు కనిపించాడు. కుచేలుని అంతదూరంలో చూసి ‘కుచేలా ఎప్పుడు వచ్చావు?’ అని పలకరిస్తూ ఒక్కసారి మంచం మీద నుంచి క్రిందకు దూకి పరుగెత్తుకుంటూ వెళ్లి కుచేలుడిని గట్టిగా కౌగలించుకున్నాడు. కుచేలా ఎన్నాళ్ళకు చూశానయ్యా నిన్ను లోపలికి రావలసింది’ అని కుచేలుని చేయి పట్టుకుని గబగబా లోపలికి తిన్నగా తన శయన మందిరంలోకి తీసుకువచ్చాడు. అక్కడ ఒక పాన్పు ఉంది. రుక్మిణీ దేవి, తానూ తప్ప అన్యులు ఆ పాన్పును ముట్టరు. అటువంటి హంస తూలికా తల్పం మీద కుచేలుని కూర్చోబెట్టాడు. రుక్మిణీదేవిని పిలిచి బంగారు చెంబుతో నీళ్ళు తెప్పించి ఆయన కాళ్ళకింద పళ్ళెం వుంచి ఆదిలక్ష్మియైన రుక్మిణీదేవి నీళ్ళు పోస్తుండగా కృష్ణ పరమాత్మ కుచేలుని కాళ్ళు కడిగాడు. ఏ తల్లి కనుచివరి చూపు తగిలితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో ఆ లక్ష్మీదేవి నీళ్ళు పోస్తుండగా, సమస్త బ్రహ్మాండములకు ఆధారభూతమయిన కృష్ణ పరమాత్మ కాళ్ళు కడుగుతున్నాడు. శిరస్సు వంచి ఆ నీళ్ళు తన శిరస్సు మీద కిరీటం మీద చల్లుకున్నాడు. రుక్మిణీదేవి తలమీద చల్లాడు. అక్కడ ఉన్న వాళ్ళందరి మీద చల్లాడు. 

ఆయన ఎంతో దూరం నుంచి నడిచి వచ్చి అలసిపోయాడని ఆయన ఒంటినిండా గంధం రాశాడు. ఒక విసనకర్ర పట్టుకొని విసురుతున్నాడు. కృష్ణ పరమాత్మ చేసిన హడావుడికి రుక్మిణీ దేవి తెల్లబోయింది. ఆమె కూడా తామరపువ్వులతో చేసిన విసనకర్రను తెచ్చి కుచేలునికి విసురుతున్నది. ఆ గాలి ఒంటికి తగిలి ఆయన సేదతీరాడు. మంచి ధూపమును ఆయనకు చూపించాడు. మణులతో కూడిన దీపములతో ఆయనకు నీరాజనం యిచ్చాడు. తరువాత ఎంతో సంతోషంగా కుచేలునికి దగ్గరగా కూర్చున్నాడు. పరమ ఆప్యాయంగా కుచేలుని చేతులు తన చేతులలో పెట్టుకుని స్నేహితుని వంక చూసి యోగక్షేమములు అడిగాడు. కృష్ణ పరమాత్మ అలా ప్రవర్తించడం ఇంతకు పూర్వం ఎవరూ చూడలేదు. 

ఏమి తపంబు సేసెనొకొ! యీ ధరణీదివిజోత్తముండు తొల్
బామున! యోగివిస్ఫుర దుపాస్యకుఁడై తనరారు నీ జగ
త్స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసియించి యున్నవాఁ
డీ మహనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్?

ఏమి ఆశ్చర్యము! ఇంతకు పూర్వం నారదుడు వచ్చినప్పుడు చూశాము, ఎందఱో మహర్షులు వచ్చినప్పుడు చూశాము. అందరినీ దర్బారు హాలులో కూర్చోబెట్టి మాట్లాడేవాడు. అంతేకానీ ఈ బ్రాహ్మణుడు చూస్తే దరిద్రుడిలా ఉన్నాడు. ఏమి తపస్సు చేశాడో! మహా యోగులైన వారు తపస్సు చేస్తే తప్ప దొరకని పరమాత్మ ఈవేళ ఈ బ్రాహ్మణునకు ఎంత సేవ చేశాడు. ఆ తల్పం మీద రుక్మిణీ కృష్ణులు తప్ప అన్యులు కూర్చోవడం మనం యింతవరకు చూడలేదు. ఈ బ్రాహ్మణుడు దానిమీద కూర్చోవడమా! అసలు ఈయన ఎవరు? అని వాళ్ళు ఆశ్చర్య పోతున్నారు. 

అపుడు కృష్ణ పరమాత్మ కుచేలునితో ఓ బ్రాహ్మణోత్తమా! నీవు వివాహం చేసుకున్న స్త్రీ చాలాకాలం వేదం నమ్ముకును వేదపాఠం చెప్పుకున్న బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించిన పిల్ల అని నేను విన్నాను. అట్టి కుటుంబంలో పుట్టిన పిల్ల భర్తను అనుసరించి సుశీలయై ఉంటుంది. నిన్ను చూస్తుంటే నీ మనస్సు భార్యయందు బిడ్డలయందు భ్రాంతి లేకుండా కేవలం సంసారంలో ఉండాలి కాబట్టి మాత్రమే ఉండి విహిత కర్మాచరణముగా భార్యాబిడ్డలను చూడాలి కాబట్టి చూస్తూ సంతతము బ్రహ్మమునందు రమిస్తున్న వాడిలా నాకు కనపడుతున్నావు. అవునా?” అని అడిగాడు. పిమ్మట ఇద్దరూ కలిసి భోజనం చేశారు. భోజనానంతరం మరల ఇద్దరూ వచ్చి కూర్చున్న పిమ్మట కృష్ణుడు కర్పూర తాంబూలమును తానే స్వయంగా చేసి తెచ్చి వేసుకోమని కుచేలునికి ఇచ్చాడు. ఆరోజున కృష్ణుడు పూర్తిగా కుచేలునితోనే గడిపాడు. కృష్ణ పరమాత్మ తాను కుచేలునితో గడిపిన చిన్ననాటి ముచ్చట్లను తలుచుకున్నాడు. కృష్ణ పరమాత్మ చూపిస్తున్న ఈ ప్రేమను కుచేలుడు జీర్ణం చేసుకోలేక పోతున్నాడు. కుచేలా ఎవరి దగ్గరికయినా వెడితే ఏమయినా పట్టుకు వెళ్ళాలని మన గురువుగారు సాందీపని అంటూ ఉండేవారు కదా! మరి నువ్వు నాకు ఏమిటి తెచ్చావు?” అని గబగబా కుచేలుడిని తడిమేస్తున్నాడు. కుచేలుడు సిగ్గు పడిపోయాడు. ఆయన లక్ష్మీనాథుడు. గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయనకు తాను ఏమి యిస్తాడు? చిరిగిపోయిన ఉత్తరీయం మూట కట్టి ఉన్న అటుకులను చూశాడు. కుచేలా, చాలా ఐశ్వర్య వంతుడనని నాకు చాలామంది కానుకలు పట్టుకువచ్చి ఇస్తుంటారు. అవి వాళ్ళందరూ నాయందు ప్రీతితో నేనే తినాలని తెచ్చినవి కావు. తమకు ఉన్నాయని ఆడంబరమునకు తెచ్చి యిచ్చిన వాళ్ళు ఉన్నారు వాటిని నేను ముట్టుకోను. ఒక ఆకు కాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, కొబ్బరి నీళ్ళను గాని ఎవరయినా భక్తితో తెచ్చి యిస్తే వాటిని నేను పుచ్చుకుంటాను. భక్తితో తెచ్చిన వాటికి పెద్ద పీత వేస్తాను. ఆడంబరమునకు తెచ్చిన వాటిని పక్కన పెట్టేస్తాను. అని కుచేలుని వద్ద ఉన్న అతుకుల మూటను తీసుకొని విప్పి పిడికెడు అటుకులు తీసుకుని నోట్లో పోసుకున్నాడు. అలా పోసుకునే సరికి 14 భువనభాండములలో వున్న సమస్త జీవరాసుల కడుపునిండి బ్రే

వుమని త్రేన్చాయి. కృష్ణుడికి యింకా ప్రీతి ఆగక మరియొక పిడికెడు తీసి పోసుకుంటున్నాడు. దీనిని రుక్మిణీదేవి చూసింది. వెంటనే వచ్చి కృష్ణ పరమాత్మ చేయి పట్టుకుని, కృష్ణా, మీరు తిన్నది చాలు. యిహలోకమందు పదితరములు తినడానికి కావలసిన ఐశ్వర్యము భక్తి జ్ఞానము మోక్షము అన్నీ కుచేలునికి ఇచ్చేశారు. ఇంకొక పిడికెడు నోట్లో పోసుకుంటే నన్ను మిమ్ములను కూడా కుచేలునికి దాసులుగా ఇచ్చేస్తారు. ఇంకచాలు’ అంది. ఆ తల్లికి అన్నీ తెలుసు. 

పరమాత్మ కుచేలుడు యిచ్చిన అటుకులను ఎందుకు స్వీకరించాడు? గత జన్మలో కుచేలుడు ఎంతో భక్తితో భగవంతునికి ఎన్నో సేవలు చేశాడు. ఎన్ని సేవలు చేసినా ఎన్నడూ కూడా తన మనస్సులో ఈ కోరిక నాకు తీరితే బాగుండును అన్న కోరిక మాత్రం ఆయనకు లేదు. ఈశ్వరుని సేవ చేయడమే తన జీవితమునకు ధన్యము అని చేశాడు. దానివలన బ్రహ్మజ్ఞాని అయ్యాడు తప్ప ఆయనకు మనస్సులో మాత్రం కోరిక లేదు. తాను యింత దరిద్రంలో ఉన్నా ఈశ్వరుని సేవించి ఐశ్వర్యం పొందాలని భ్రాంతి కుచేలునికి లేదు. కానీ ఆయన భార్య ఐశ్వర్యం కావాలని అడిగింది. స్వామి మహాభక్తుల కోరిక తీర్చకుండా ఉండలేడు. 

కుచేలుడు తెల్లవారు ఝామున లేని మరల తనకి వున్న మాసిపోయిన దుస్తులనే ధరించి ‘కృష్ణా, నేను వెళ్ళివస్తాను’ అని చెప్తే కృష్ణ పరమాత్మ గడపదాటి బయటకు వచ్చి కుచేలునికి వీడ్కోలు చెప్పాడు. కుచేలుడు తన యింటి దారిపట్టి నడిచి వెళ్ళిపోతూ ఏమి నా భాగ్యం. ఏ పరమాత్మ దర్శనం కొన్ని కోట్లమంది అడుగుతారో అటువంటి వానితో కలిసి నేను కూర్చున్నానా. నేను తెచ్చిన అటుకులు తిన్నాడా. నా సఖుడిది ఏమి సౌజన్యం. నాకు ఇంతకన్నా జీవితంలో ఏమి భాగ్యం కావాలి అని అనుకున్నాడు. అప్పుడు తన భార్య కృష్ణ పరమాత్మను సంపద అడగమని పంపించిందని గుర్తుకు వచ్చింది. కానీ కృష్ణుడు తన బట్టలను చూసి అయినా తాను మిక్కిలి బీదవానిగా ఉన్నాడని గ్రహించి సంపదను ఇవ్వవచ్చు కానీ అలా యివ్వలేదు’ అని అనుకున్నాడు. ఇంత దరిద్రంలో ఉన్నాను కాబట్టి ఆ కృష్ణుడు నాకెప్పుడూ గుర్తు ఉంటున్నాడు. ఒకవేళ ఐశ్వర్యం ఇచ్చేస్తే ఆయనను నేను మరిచిపోయి పాడయిపోతానేమోనని దరిద్రమునే ఉంచి ఆయన నా మనస్సులో ఉండి పోయేటట్లు నాకు వరమును యిచ్చాడు. అని అనుకున్నాడు. తన ఇల్లు ఉన్నచోటికి వెళ్ళి చూశాడు. అక్కడ సూర్యుడు చంద్రుడు ఏకకాలమునందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాంటి సౌధం ఒకటి కనపడింది. ఆ సౌధమునకు చుట్టుప్రక్కల పెద్ద ఉద్యానవనములు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎంతోమంది పరిచారికలు అటుఇటూ తిరుగుతున్నారు. ఎక్కడ చూసిన రత్నరాశులు ప్రోగుపడి ఉన్నాయి. ఇటువంటి ఇల్లు ఎ మహాపురుషునిదో తన పూరి యింటి స్థానంలో అత పెద్ద సౌధం ఎక్కడి నుంచి వచ్చినదా అనుకుని ఆశ్చర్యపోతూ అక్కడ ద్వారం దగ్గర నిలబడ్డాడు. 

ఈయనను చూడగానే పరిచారికలు గబగబా బయటకు వచ్చి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి ఆయనను మేళతాళములతో లోపలికి తీసుకువెళ్ళారు. అది తన యిల్లేనని తెలుసుకున్నాడు. తన భార్య పట్టు వస్త్రములను కట్టుకుని అనేకమైన బంగారు ఆభరణములను ధరించి ఎదురువచ్చి భర్త కాళ్ళకు నమస్కరించి వారి పూరి గుడిసె స్వామి కృప వలన యిలా అయిపొయింది అని చెప్పింది. కృష్ణ పరమాత్మ అంత ఐశ్వర్యమును యిచ్చాడని చెప్తే పొంగిపోయి వాళ్ళు యింట్లో ఐశ్వర్యమును అనుభవించినా మనస్సులు మాత్రం ఎప్పుడూ కృష్ణుడి దగ్గరే పెట్టుకుని హాయిగా గోవింద నామము చెప్పుకుంటూ పరవశించి పోతూ యిహము నందు సమస్త ఐశ్వర్యమును అనుభవించి, అంత్యమునందు జ్ఞానము చేత మోక్షసిద్ధిని కుచేలుని భార్య బిడ్డలు పొందారు. 
ఇంట పరమపవిత్రమయిన కుచేలోపాఖ్యానమును ఎవరు వింటున్నారో వారికి గొప్ప ఫలితం చెప్పబడింది. ఎవరు దరిద్రుడయిన కుచేలుని సంపత్తి కలవానిగా కృష్ణ పరమాత్మ చేసినట్టి ఈ ఆఖ్యానమును వింటున్నారో వాళ్ళందరికీ కూడా కృష్ణ పరమాత్మ పాదములయందు భక్తికలిగి, వారందరికీ కూడా కీర్తి యశస్సు నిలబడి అంత్యమునందు మోక్షమును పొందుతారు” అని ఈ ఆఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పబడింది.    
 *నిజమైన గురువు అంటే ఎవరు?*     
              
 *అనుకరించదగిన జీవనశైలి* 

```
నేను నా పోస్ట్‌ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ఉపాధ్యాయునిగా పనిచేయడానికి బెంగాల్‌ లోని ‘ఆస్‌ గ్రామ్’‌ కు తిరిగి వెళ్లాను. 
పెద్ద పట్టణాల్లోని పాఠశాలలలో ఎక్కువ జీతంతో అవకాశాలు ఉన్నా, నాకు మాత్రం, మా గ్రామంలోని పాఠశాల ఇచ్చే 169 రూపాయలు చాలా విలువైనవి. మా గ్రామంలోని విద్యార్థులకు ఒక మంచి ఉపాధ్యాయుని అవసరం చాలా ఉంది. అందుకే వారికి బోధించాలని నేను చాలా ఆసక్తిగా ఉన్నాను.

మా స్కూల్లో నేను 39 ఏళ్లు పాఠాలు చెప్పి 60 ఏళ్లకు రిటైరయ్యాను.. కానీ నా మనసు చాలా వ్యాకులతతో ఉంది, రిటైరవ్వడం ఇష్టం లేక, ‘ఇప్పుడేం చేయాలి?’ అని నన్ను నేను ప్రశ్నించుకునేవాడిని. 
కొన్ని రోజుల తర్వాత నా ప్రశ్నకు సమాధానం దొరికింది..

ఒకరోజు ఉదయం, 6:30 గంటల ప్రాంతంలో, ముగ్గురు యువతులు మా ఇంటికి వచ్చారు. పదవీ విరమణ చేసిన ఒక ఉపాధ్యాయుడిని చూడటానికి వారు 23 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ వచ్చారని వారు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను! వారు ఏదో నేర్చుకోవాలనే తపనతో ఉన్న గిరిజన యువతులు. ముకుళిత హస్తాలతో, "మాస్టర్ గారూ, మీరు మాకు చదువు నేర్పిస్తారా?" అని అడిగిన వెంటనే నేను అంగీకరించి, "నేను మీకు నేర్పించగలను, కానీ మీరు సంవత్సరం మొత్తం నా పాఠశాల ఫీజు చెల్లించాలి - చెల్లించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?" అనడిగాను.
దానికి వాళ్ళు, “అలాగే మాస్టార్ గారు, డబ్బు ఎలాగోలా సర్దుబాటు చేస్తాం” అన్నారు.

అప్పుడు నేను, “సరే, నా ఫీజు సంవత్సరానికి 1 రూపాయి” అన్నాను. వారు చాలా సంతోషించారు, వారు నన్ను కౌగిలించుకొని, “మేము మీకు 
1 రూపాయి, 4 చాక్లెట్లు కూడా చెల్లిస్తాం", అన్నారు.

నేను ఉప్పొంగిపోయాను... జీవించడానికి నాకు కొత్త కారణం దొరికినట్లు అనిపించింది! వారు వెళ్లిపోయిన తర్వాత, బట్టలు మార్చుకుని నేరుగా నా పాఠశాలకు  వెళ్లి ఆ గిరిజన బాలికలకు బోధించడానికి నాకు ఒక తరగతి గదిని ఇవ్వమని ప్రిన్సిపాల్‌ ని అభ్యర్థించాను. కానీ ప్రిన్సిపాల్ నాకు సహాయం చేయడానికి నిరాకరించారు. 
అయితే, నేను ఇప్పుడు ఆగడానికి తయారుగా లేను. 39 ఏళ్ల బోధన తర్వాత కూడా, ఇంకా బోధించడానికి నాకు చాలా శక్తి మిగిలిఉంది. కాబట్టి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, నేను నా ఇంటి వరండాను శుభ్రం చేసి, అక్కడే బోధన ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను.

అది 2004లో జరిగింది ... 
నా పాఠశాల ఆ ముగ్గురు బాలికలతో ప్రారంభమైంది. నేడు సంవత్సరానికి 350 మంది విద్యార్థులు ఉంటున్నారు, వారిలో ఎక్కువ మంది గిరిజన యువతులే. నా విద్యార్థుల అభ్యర్థన మేరకు, నా ఫీజుకు ఇంకో రూపాయి కలిపాను.

నా ఉదయం ఇప్పటికీ 6 గంటలకు గ్రామం చుట్టూ నడవడం ద్వారా ప్రారంభమవుతుంది, ఆపై నా వద్దకు వచ్చే  విద్యార్థులకు తలుపులు తెరుస్తాను - కొంతమంది అమ్మాయిలు 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడచి వస్తారు. ఆ గిరిజన బాలికల నుండి నేను నేర్చుకోవలసింది చాలా ఉందని నేను ఎప్పుడూ భావిస్తాను.

గడిచిన సంవత్సరాలలో, నా విద్యార్థులు ప్రొఫెసర్లు, విభాగాల అధిపతులు, IT నిపుణులు అయ్యారు– వారు ఎల్లప్పుడూ నాకు ఫోన్ చేసి, వారి విజయానికి సంబంధించిన శుభవార్తలను అందిస్తారు. ఎప్పటిలాగే, నాకు కొన్ని చాక్లెట్లు తీసుకురమ్మని నేను వారిని అడుగుతాను. నాకు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు, నా ఫోన్ మోగడం ఆగలేదు; గ్రామం మొత్తం ఆ ఆనందాన్ని నాతో జరుపుకుంది - చాలా సంతోషకరమైన రోజు అయినా కానీ నేను నా విద్యార్థులను ఆ రోజు కూడా చదువు మానడానికి అనుమతించలేదు.

నా పాఠశాల తలుపులు అందరికీ తెరిచి ఉంటాయి. నా పాఠశాలను సందర్శించడానికి ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. మాగ్రామం చాలా అందంగా ఉంటుంది, నా విద్యార్థులందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది – మనమందరం వారి నుండి చాలా నేర్చుకోగలమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

ఇది నా కథ- 
నేను బెంగాల్‌కు చెందిన ఒక సాధారణ ఉపాధ్యాయుడిని. నేను టీ, సాయంత్రపు కునుకులను ఆస్వాదిస్తాను. నా జీవితంలోని ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. నన్ను అందరూ, "మాస్టార్ మోషాయ్' అని పిలుస్తారు.  నా చివరి శ్వాస వరకు నేను బోధించాలనుకుంటున్నాను. నేను అందుకోసమే ఈ లోకానికి పంపబడ్డాను.


ప్రతిబింబం:

ఇది ఒక ఆదర్శ వ్యక్తిత్వం కలిగిన, నిస్వార్థ గురువైన శ్రీ సుజిత్ చటోపాధ్యాయ కథ. 
77 ఏళ్ల ఈ గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు 'మాస్టర్ మోషాయ్' గా ప్రసిద్ధి చెందారు, ముఖ్యంగా గిరిజన విద్యార్థులలో విద్యను వ్యాప్తి చేయడానికి దశాబ్దాలుగా, అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. 2021 నవంబర్లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ఆదర్శ పౌరులను తయారు చేయడంలో తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన అసాధారణమైన సమగ్రత, సహానుభూతి దేశం యొక్క హృదయపూర్వక వందనానికి అర్హత సాధించింది. దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందటానికి అర్హతపొందే విధంగా కృషి చేసిన ఆయన భారతదేశపు అజ్ఞాత వీరులలో ఒకరు.
ఎలాంటి స్వార్థం, ఆశలు లేకుండా తమ జీవితాన్ని ఇతరులకు అంకితం చేసి, సమాజానికి సేవ చేసిన మహోన్నత వీరులు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. ఈ ప్రపంచాన్ని మరింత దయతో, సుందరంగా తీర్చిదిద్దేందుకు ఆయనలాంటి వ్యక్తులు నేడు అవసరం. మనం
చేయవలసిందల్లా వారిని గుర్తించడమే! అంతేకాదు హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా వెతికితే, మన కళ్లెదురుగానే వాళ్ళు కనిపిస్తారు.```

          ♾️♾️ ♾️ ♾️♾️

 *నిజమైన గురువు తన శిష్యుడిని ఎప్పుడూ ఏమీ అడగడు. నిజానికి, గురువులు మానవాళికి సేవ చేయడం కోసమే ఉన్నారు. వారు తీసుకోవడానికి కాదు, ఇవ్వడానికి మాత్రమే ఉంటారు.* 
 *-దాజీ*.          

****మన పిల్లలు- జాగ్రత్త!* 🌹🌹🌹 *మీ_ఇంట్లో_ఆడపిల్లలున్నారా_* *అయితే ...* *అందరూ ఎలా జాగ్రతగా ఉండాలో తెలుసుకోండి!*

*మన పిల్లలు- జాగ్రత్త!*
               🌹🌹🌹
*మీ_ఇంట్లో_ఆడపిల్లలున్నారా_*
*అయితే ...* 
*అందరూ ఎలా జాగ్రతగా ఉండాలో తెలుసుకోండి!*

*1). మన కుటుంబ సభ్యులు కానివారి నుంచి పిల్లలని దూరంగా పెట్టండి.*

*2). పిల్లలని ఒంటరిగా ఆడుకోమనడం, పక్క ఇళ్ళకు పంపడం అంత మంచిది కాదు.*

*3). మనతో ఎంతో చనువుగా ఉన్న బయట వాళ్ళు కూడా పిల్లలకి ప్రమాదకారులే కావచ్చు..*

*4). ఇతరులు మన పిల్లలని ఎత్తుకుని ముద్దులిడుతున్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.*

*5). చాక్లెట్ కొనిపెడతా షాపుకు తీసుకెళతా అంటూ మీ దగ్గర నుండి పిల్లలని తీసుకున్న వ్యక్తుల కోరికను సున్నితంగా తిరస్కరించండి....*

*పరిచయం ఉన్న వ్వక్తులకు పిల్లలని అప్పగించి బయటకు తీసుకెళ్ళమని మీరే పురమాయించకండి.*

*6). అత్యవసర పరిస్థితుల్లో పిల్లలని వేరే ఇంట్లో వదలిగానీ.. లేదా    మీ ఇంట్లోనే వదలి వెళ్ళలసి వస్తే    ఆ ప్రయత్నం మానుకొండి.*

*7). పిల్లలు ఆడుకొనే చోటగాని, స్కూలుకు వెళ్ళే దారిలోగాని, స్కూల్లో జరిగే విషయాల్లో గాని ఆరా తీస్తూ ఉండండి.*

*8). కొంచెం ఎదిగిన పిల్లలకి దేహంలో ఎక్కడ ముట్టుకుంటే తప్పో.. అసభ్య  ప్రవర్తన ఏవిధంగా గుర్తించాలో వివరించండి.*

*8). అలాంటి వ్వక్తుల నుంచి ఎలా తప్పించుకోవాలో, ధైర్యంగా ఎలా నిలబడాలో, స్వయం రక్షణ ఎలా చేసుకోవాలో వివరించాలి.*

*9). ఇంటి టెలిఫోన్ నెంబర్, పోలీస్ స్టేషన్ నెంబర్.. పిల్లల వద్ద ఉంచి..అత్యవసర సమయాల్లో ఇతరుల సహాయంతో ఫోన్ చేసేలా పిల్లలకు నేర్పండి.*

*10). ఇంటికి దూరపు చుట్టాలు వచ్చినప్పుడు మీ పిల్లలని మీ బెడ్ రూంలోనే పడుకోబెట్టుకోవడం ఉత్తమమైన పని.*

*11). పిల్లలు బయట ఆడుకుంటున్నారు కదా అని గంటలు గంటలు పనిలో తలమునకలై, పట్టించుకోకుండా ఉండడం అంత మంచిది కాదు.*

*12). పిల్లలు ఏదైనా చెప్పడానికి సంకోచిస్తున్న, లేదా మూడీగా ఉన్నా, భయం భయంగా చూస్తున్న, వాళ్ళల్లో వాళ్ళే మధనపడుతున్నా.. ఏదో జరిగింది అని గ్రహించి ప్రేమగా ఆరా తియ్యండి.*

*13). లైంగిక విషయాలలో ఎవరిమీద అయినా పిల్లలు ఫిర్యాదు చేసినప్పుడు తేలిగ్గా తీసుకోవద్దు.*

*14). 12 ఏళ్ల బాలుర నుంచి వృద్దులు వరకూ పిల్లలకు లైంగిక శత్రువులేనన్న విషయం గుర్తుపెట్టుకోండి.*

*15). మీ పిల్లలతో ప్రేమగా ఉండండి.*

*మార్షల్ ఆర్ట్స్ లో    కొన్ని టెక్నిక్స్ వున్నాయి. వాటిని నేర్పించoడి.*

*స్కూల్ లో, tution లో  ఇతరుల బిహేవియర్ ఎలా ఉందొ రోజు కనుక్కోండి.*

*ప్రతీ మనిషి దగ్గిర ఒక పది అడుగుల distance maintain చేయమని instructions ఇవ్వండి.*  

*ఏదైనా డేంజర్ ఉంది అని అనిపిస్తే.... first గట్టిగా అరిచి గోల చేయమని చెప్పండి.  Next అందుబాటులో వున్న రాయి కర్ర ఇసుక use చేసి తప్పించుకోవడం లో training ఇవ్వండి.  పారిపోవడానికి దారులు చూసుకోవడం నేర్పించండి.*

*అన్నిటికి మించి ఏ విషయం అయినా ఇంట్లో చెప్తే తిడతారు అన్న భయాన్ని పోగొట్టండి. Free గా వాళ్ళ feelings ని  భయాలను express చేసే చనువు ఇవ్వండి.*

*అన్న తమ్ముళ్లు ఉంటే..... సోదరికి supportive గా ఉండటం నేర్పించండి.* 

*మన ఇంటి మహాలక్ష్మి ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకోవలసిన బాధ్యత మనదే.*.          
 *ప్రతి యుగంలో …*
           *మానవ జీవిత కాలం:-*
                

*మానవుని జీవిత కాలం క్షీణిస్తోంది. యుగ ధర్మాల కారణంగా, సమయం గడిచినప్పుడు మానవుని జీవితం క్షీణిస్తుంది.*


*(1).  సత్యయుగం లో: -*

*దైవ సంవత్సరాలు:-*
              4800 సంవత్సరాలు
*మానవ సంవత్సరాలు:-*
              17,28,000 సంవత్సరాలు

నాలుగు యుగాల చక్రంలో సత్యయుగం మొదటి యుగం.

సత్యయుగం ప్రారంభంలో మానవుని జీవిత కాలం 1,00,000 సంవత్సరాలు.
సత్యయుగం ముగింపులో మానవుని జీవిత కాలం 10,000 సంవత్సరాలు అయ్యింది.


*(2). త్రేతాయుగం లో:-*

దైవ సంవత్సరాలు:- 
               3600 సంవత్సరాలు
మానవ సంవత్సరాలు:- 
             12,96,000 సంవత్సరాలు

త్రేతాయుగం నాలుగు యుగాల చక్రంలో రెండవ యుగం.

త్రేతాయుగం ప్రారంభంలో మానవుని జీవితకాలం 10,000 సంవత్సరాలు.
త్రేతాయుగం ముగింపులో మనిషి జీవితకాలం 1000 సంవత్సరాలు.


*(3). ద్వాపర యుగం లో:-*

దైవ సంవత్సరాలు:- 
                2400 సంవత్సరాలు
మానవ సంవత్సరాలు:- 
             8,64,000 సంవత్సరాలు

ద్వాపర యుగం నాలుగు యుగాల చక్రంలో మూడవ యుగం.

ద్వాపర యుగం ప్రారంభమైనప్పుడు మనిషి జీవితకాలం 1000 సంవత్సరాలు.

ద్వాపర యుగం ముగింపులో మానవుని జీవిత కాలం 100 సంవత్సరాలు అయింది.

*పితామహ భీష్ముడు 191 సంవత్సరాలు జీవించాడు.
*గురు ద్రోణాచార్య 175 సంవత్సరాలు జీవించారు.
*ధృతరాష్ట్రుడు మరియు 
*విదురుడు 161 సంవత్సరాలు జీవించారు.
*తల్లి కుంతి 156 సంవత్సరాలు జీవించింది.
*యుధిష్ఠిరుడు 127 సంవత్సరాలు జీవించాడు.
*భీముడు మరియు శ్రీ బలరాముడు 126 సంవత్సరాలు జీవించారు.
*అర్జునుడు మరియు శ్రీ కృష్ణుడు 125 సంవత్సరాలు జీవించారు.
*సహదేవుడు మరియు నకులుడు 124 సంవత్సరాలు జీవించారు.
*పరీక్షిత 96 సంవత్సరాలు జీవించింది.


*(4). కలియుగం లో:-*
దైవ సంవత్సరాలు:- 
                1200 సంవత్సరాలు
మానవ సంవత్సరాలు:- 
               4,32,000 సంవత్సరాలు

కలియుగం నాలుగు యుగాల చక్రంలో నాల్గవ యుగం.

కలియుగం ప్రారంభంలో మానవుడి జీవితకాలం 100 సంవత్సరాలు.

*గౌతమ బుద్ధుడు 80 సంవత్సరాలు జీవించాడు.
*మహావీర్ స్వామి 72 సంవత్సరాలు జీవించారు.
*మహాపద్మ నంద 88 సంవత్సరాలు జీవించాడు.
*చాణక్య 96 సంవత్సరాలు జీవించాడు.
*అశోకుడు 76 సంవత్సరాలు జీవించాడు.
*కలియుగం చివరిలో మానవుడి జీవిత కాలం 20 ఏళ్లు అవుతుంది.

వర్తమానంలో మనం AD 2024లో కలియుగం 5125 వ సంవత్సరంలో ఉన్నాము.

కలియుగం BCE 3102 ఫిబ్రవరి 17 అర్ధరాత్రి ప్రారంభమైంది.

కలియుగం క్రీ.శ. 4,28,898 లో ముగుస్తుంది.

****"శ్రద్ధవాన్ లభతే జ్ఞానం" - శ్రద్ధ వలననే జ్ఞానం వస్తుంది.

 *"శ్రద్ధవాన్ లభతే జ్ఞానం" - శ్రద్ధ వలననే జ్ఞానం వస్తుంది. మనం ఏ పని చేసినా అందులో శ్రద్ధ లేనిదే విజయవంతం కాదు. ముఖ్యముగా ఆధ్యాత్మికత విషయములో కచ్చితంగా శ్రద్ధ ఉండి తీరాల్సిందే!*
```
చాలామంది అంటుంటారు. దేవుని ధ్యానమో,స్మరణో,జపమో చేద్దామంటే ఆసక్తి ఉండడం లేదు, సమయం కుదరడం లేదు అని.   అయితే మూడు గంటల పాటు సినిమా హాలులో కదలకుండా కూర్చుని జేబులో పర్సు కొట్టేసినా కూడా తెలియనంతగా లీనమైపోతుంటారు. కానీ దేవుని ముందు ఒక మూడు నిమిషాలు  శ్రద్ధతో కూర్చోవడానికి  మాత్రం పలు రకాల సాకులు చెబుతుంటారు. ఎప్పుడో పది సంవత్సరాల క్రితం చూసిన సినిమా పాట తప్పులేకుండా గుక్క తిప్పుకోకుండా పాడేస్తారు కానీ గంట క్రితం నేర్చిన భగవత్ కీర్తన మాత్రం గుర్తుకు రాదు!

ఇవే కాదు ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు జరిగిన నానా సరుకంతా బుర్రలో దాచుకుంటారు. కానీ దైవం విషయం దగ్గరకి వచ్చేసరికి బుర్ర ఖాళీ..! దీనికి కారణం ఆ బయట విషయాల మీద ఉండే శ్రద్ధ భగవంతుని మీద లేకపోవడమే!!

స్థిరమైన మనస్సుతో, శ్రద్ధ, ఏకాగ్రతతో దైవమును స్మరించి చూడండి...    ఎట్టి ఫలితములు పొందుతారో ఆశ్చర్య పోతారు. 

ఏక మనస్కులై ఆ ఆత్మారాముని స్మరించి చూడండి.       అలాగే...
నరుణ్ణి, నారాయణునిగా చేసేది దైవీసంపద. 
నరుణ్ణి వానరుడిగా చేసేది ఆసురీసంపద. 
మనిషిలో దైవంశా ఉన్నది, రాక్షసాంశా ఉన్నది. ‘తన కర్మలతో తాను దేవుడూ కావచ్చు. రాక్షసుడూ కావచ్చు.’

"యధేచ్చసి తథాకుఱు" - నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో - అంటూ భగవంతుడు మనకు కర్మ స్వాతంత్ర్యాన్ని ప్రసాదించాడు. 

‘నా కర్మ! నా గ్రహచారం!’ అంటూ ఏడుస్తూ కూర్చోవాల్సిన పని లేదు. 

'క్లైబ్యం మాస్మ గమః' - పిరికి పందవు  కావద్దు! - అని హెచ్చరిక. మరి ఏం చేయాలి? 

'ఉద్ధరేదాత్మనాత్మానం' - నిన్ను నీవు ఉద్ధరించుకో! పురుషార్ధం చెయ్యి- అని ప్రోత్సహిస్తున్నాడు.
తన వెంట వచ్చే సంపద (పుణ్యం, పాపం, జ్ఞానం) గురించి ఆలోచించడు మానవుడు. విడిచి పెట్టిపోయే సంపదల(డబ్బు,ఇల్లు,పొలం,స్థలం, నగలు..) కోసం జీవితం చివరి రక్తపు బొట్టు వరకు - చివరి శ్వాసవరకు తపించి పోతూనే ఉంటాడు. 

అన్నీ ఉన్నప్పుడు అహంకారం. అంతా ఉడిగిపోయిన తరువాత శ్రద్ధ. శ్వాసలున్నంత వరకు ఎవరన్నా లెక్కలేదు. శ్వాస ఎగిరిపోయే సమయంలో డాక్టర్ల కాళ్ళ మీద పడతాం. 

వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర మందు ఉంటుందే గాని ఆయుష్షు ఉండదు గదా! రోగానికి మందు ఉంటుంది గాని రోగికి మందు ఉండదు. 

కనుక ‘ఓ మానవుడా! నీ గడియ గడియా అయిపోతున్నద’ని గడియారం టకటకా గంటలు కొట్టి హెచ్చరికలు చేసున్నది. 

ఖబడ్దార్ మేలుకో! మేలుకొని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో! నీలో జరిగే ఈ ఆసురీసంపదకు దైవీసంపదకు మధ్య పోరాటాన్ని గమనించు. నీ బలం దైవీసంపదకు ఇవ్వు. అసురీసంపదను పారద్రోలు. అప్పుడే నీ లక్ష్యం నెరవేరుతుంది.     
 *ఆప్త వాక్యాలు*

3) తన్మే మనః శివసంకల్పమస్తు

నా మనస్సు శివ (శుభ) సంకల్పములతో నుండుగాక (యజుర్వేదం)

దేనికైనా మనస్సే కారణం. ఇంద్రియాల చైతన్యమంతా మనోమూలకం.

 మనస్సు చేసే సంకల్పాలే మన జీవితాన్ని నిర్మిస్తాయి. మన ఏవ మనుష్యాణాం కారణం
బంధమోక్షయోః - బంధానికి, మోక్షానికీ, సుఖానికి, దుఃఖానికీ మనస్సే కారణం.

కాబట్టి సంకల్పం శుద్ధంగా ఉండాలి. సంకల్పశుద్ధి ఉంటే కార్యం సక్రమంగా నడుస్తుంది. ఫలితం చక్కనిది లభిస్తుంది. ఆ సంకల్ప శుద్ధినిచ్చే వేదమంత్రం ఇది.

శుక్ల యజుర్వేదంలో ఈ 'శివసంకల్పం' ఒక సూక్తంగా అనేక మంత్రాలతో అనుసంధానించబడి ఉంది. 

పైగా 'శివ' అనేది శాశ్వత శుభాన్ని తెలియజేసేది. ఈ 'శివ' శబ్దం గొప్ప దివ్యార్థాలతో కూడినది. దీనికి శ్రేయస్సు, మంగళం, మోక్షం -
అనే మూడు అర్థాలూ ఉన్నాయి.

స్వార్థపూరితమైన అర్థసంపాదన 'శివం' కాదు. తాత్కాలిక సుఖమూ 'శివం' కాదు.పరిణామంలో కూడా శుభంగా ఉండేదే 'శివం'. అటువంటి 'శివం' మన సంకల్పమైతే
అంతా సత్యమూ... సుందరమే.

ఇంకో విశేషం - 'శివం' శబ్దం పరమేశ్వరుని తెలియజేసే నామం. శాశ్వత మంగళ స్వరూపుడు - శివుడు. ఈ జగత్తంతటికీ ఆయన సంకల్పమే ప్రధాన ప్రేరణ. కాబట్టి మన సంకల్పం మహాదేవుని సంకల్పానికి అనుగుణమైనది కావాలని కూడా ఈ మంత్రానికి అర్థాన్ని భావించవచ్చు.


మన సంకల్పం ఈశ్వరసంకల్పం కావాలి అంటే ఈశ్వర సంకల్పంతో అనుసంధానమవ్వాలి. అప్పుడు శాశ్వతమై, అనివార్యమైన భగవత్ సంకల్పానికి మనసంకల్పం విరుద్ధంగా ఉండదు. తద్వారా అనుకొన్నదొకటి, అయ్యేదొకటీ జరగదు. అంతేకాక - 'శివ' స్ఫురణ వల్ల మన సంకల్పం శక్తిమంతమైన కార్యరూపం ధరించి, సాఫల్యాన్నిస్తుంది. ఇన్ని మహార్థాలు, ఇంకా ఎన్నో దివ్య భావాలు ఈ వేదవాక్యంలో దాగి ఉన్నాయి.          
 Vedantha panchadasi:
తచ్చేద్విరోధి కేనేయమావృతిర్ హ్యనుభూయతామ్ ౹
వివేకస్తు విరోధ్యస్యాస్తత్త్వజ్ఞానిని దృశ్యతామ్ ౹౹32౹౹

32.  కూటస్థ చైతన్యమునకే అవిద్యతో విరోధమైనచో అవిద్య ఉన్నదనే అనుభవం ఎవరికి కలుగుచున్నది?
(అవిద్యను గూర్చిన ప్రతీతియే లేక పోవునని భావము)
కాని వివేకము అవిద్యకు విరోధి. తత్త్వజ్ఞానుల యందు అవిద్య లేకుండుటను చూడుము.

వ్యాఖ్య:    వివేకమనగా ఉపనిషద్విచారణ జన్యమైన జ్ఞానము.ఈ జ్ఞానము అవిద్యను తొలగించును.దానితో అవిద్యాకార్యములైన 
స్థూల సూక్ష్మ కారణ శరీరముల బోధ కూడా తొలగి కూటస్థ చైతన్యపు నిరంతరాయమైన బోధ కలుగును.ఇట్టి బోధ కలిగినవారే తత్త్వజ్ఞానులు.

మాయను ఉపాధిగ స్వీకరించిన బ్రహ్మము ఈశ్వరుడనీ అవిద్యను ఉపాధిగ స్వీకరించిన బ్రహ్మము జీవుడని చెప్పబడినది.
ఈ అవిద్యయే కారణ శరీరము. అవిద్యకు గల ఆవరణ శక్తి వలన కూటస్థ చైతన్యమును గూర్చిన బోధ ఆవరింపబడుచున్నది.

విక్షేప శక్తి వలన అవిద్యా కల్పితములైన సూక్ష్మ స్థూల శరీరములు భాసించుచున్నవి. సూక్ష్మశరీరమున,అనగా అంతఃకరణమున,ప్రతిఫలించిన కూటస్థ చైతన్యము చిదాభాసుడు అనబడుచున్నాడుఇదే"జీవుడు"అని వ్యవహారము.ఈ విక్షేపశక్తియే అన్యోన్యాధ్యాస,అధ్యాస,
అధ్యారోపము అనీ తెలియబడుచున్నది.

ఉపనిషదుపదేశములను చక్కగా వివేచించి విచారించి అనుభవమునకు తెచ్చుకొను ప్రయత్నము చేసినచో వివేకము కలిగి అవిద్య తొలగి ప్రత్యక్ చైతన్యబోధ అనుభవగతమగును.

కేవలము ఉపనిషద్ గ్రంథములను 
మాత్రము అధ్యయనము చేసినచో
కలుగునది పరోక్ష జ్ఞానము.అది సాపేక్షము(relative).దీని వలన మనకు అజ్ఞానము,అవిద్య కలదు అని మాత్రము బోధపడును. అవిద్యకు ఈ జ్ఞానము విరోధి కాదు.కనుకనే సాధారణ పండితులు విద్వాంసులయందు అపారమైన తాత్త్విక పాండిత్యమున కూటస్థచైతన్య బోధరాహిత్యమును ఏకకాలమున చూచుచున్నాము.

ఉపనిషత్తులు ఉపదేశించిన మార్గమును అవలంబించి అభ్యసించిన వారియందు కూటస్థ చైతన్యపు దివ్య ప్రకాశమును అవిద్యా రాహిత్యమును మనము చూడగలుగుదుము.వారియందు కేవల పండితప్రకాండులు సూర్యుని ముందు దివిటీల వలె వెలవెల బోవుదురు గదా!
ఇట్టి తత్త్వదర్శులకు కలిగిన జ్ఞానము అపరోక్ష జ్ఞానమను బడుచున్నది.ఇది చైతన్యినుభవజన్యమైన జ్ఞానము.

కనుక బోధ స్వరూపమైన కూటస్థచైతన్యము అజ్ఞానము,అవిద్యతో ఏకకాలమున ఉండుట అసంభవమేమీ కాదు.కాగా అవసరము కూడా.

అవిద్య ఉన్నదని తెలిసిననే దానిని తొలగించే ప్రయత్నము జరుగును.
అవిద్యను గూర్చిన జ్ఞానము కూడా లేని మనుష్యులు ఇతర జంతువుల వలెనే పుట్టుచు చచ్చుచు సంసార చక్రమున తిరుగుచుందురు.
 కుండలిని సిద్ధ మహా యోగ పథంలో.....



చక్ర వ్యవస్థలోకి కుండలినీ శక్తి ప్రవేశిస్తే, ఆ మహాశక్తి ఆయా చక్రాలను ప్రేరేపిస్తుంది.....


📚🖊️ భట్టాచార్య




...శక్తిపాతం ద్వారా లేదా మరి ఏ ఇతర పద్ధతుల ద్వారా గాని... కుండలినీ శక్తి చైతన్యం చెందిన తరువాత , సాధకుడు, ప్రాణశక్తికి అనుసంధానం చేయబడతాడు. ఒకసారి కుండలినీ శక్తి, సాధకునిలో చైతన్యవంతం అయిందంటే, కుండలినీ శక్తి సాధకునికి
 అప్పటినుండి  గురువు. కుండలినీ సిద్ధ శక్తి సాధకునిలో జాగరణ చెందిన తరువాత, నీ జీవితంలో అనేకమైన విషయాలు జరుగుతాయి. ఆయా సమయాల్లో  గమనిక, సాక్షీ భూతంగా ఉండాలి. సతత ధ్యానాభ్యాసాలు చెయ్యండి. నీ చుట్టూ విషయాలు రక రకాలుగా జరుగుతాయి. జరగనీయండి.....

....సాధకుని ఆధ్యాత్మిక పురోగతికి కావలసిన, ప్రాణాయామ - ఆసన లేదా రాజ యోగాభ్యాసాలు ....అసంకల్పితంగా, ఆ కుండలీనీ మహా మాయయే ఇస్తుంది.  అనేకానేక క్రియలను కూడా ఆ శక్తి ఇస్తుంది. సాధకుడు ఈ క్రియలను కూడా సాక్షీ మాత్రంగా చూడాలి.

...కుండలినీ సిద్ధ మహా యోగ పథంలో, జనించిన ఈ మహా  శక్తి...వెనుబాము చుట్టూ తిరుగుతుంది. అదంతా సాధకుడు అనుభవించవచ్చు.  ఈ శక్తి, మెదడు లోని, వెనుబాము నందలి, సమస్త నాడులలో గల మల దోషాలను నిర్మూలించి, సమస్త నాడులనూ శుద్ధి చేస్తుంది. శుద్ధి చేయబడిన నాడుల గుండా వైశ్విక శక్తి ( Cosmic Energy )...నిరాటంకంగా ప్రవహిస్తుంది.

...సుషుమ్నా నాడిలో అనేక సూక్ష్మ కవాటాలున్నాయి. కుండలినీ శక్తి తరువాతి చక్రానికి పయనించడానికి, ఆయా కవాటాలపై వత్తిడి ఇస్తుంది. ఒకవేళ కుండలినీ శక్తి తరువాత చక్రానికి వెళ్ళలేకపోతే, ఆ తత్సంబంధ చక్రానికి సంబంధించిన గుణాలు ప్రదర్శిస్తుంది.

...ప్రతి చక్రానికి, తత్సంబంధ శరీర భాగాలున్నాయి. చక్రం సూక్ష్మమైతే - శరీర భాగం (వినాళ గ్రంథి ) స్థూలం అవుతుంది. ఉదాహరణకు...మూలాధార చక్రం - విసర్జక వ్యవస్థ, స్వాధిష్ఠాన చక్రం - సంతానోత్పత్తి. ఆయా చక్రాలలో - ఆ చక్ర వ్యవస్థలో కుండలినీ శక్తి వ్యాపిస్తే, ఆ వ్యవస్థ అంతటికీ ప్రేరణను ఇస్తుంది. ఆయా చక్రాలలో కుండలినీ శక్తి ప్రవేశిస్తే, తత్సంబంధ అనుభవాలు, అనుభూతులు వస్తాయి. ఈ అనుభవాలు కర్మల బట్టి కూడా ఉంటాయి. అయితే ఈ అనుభూతులన్నీ ఆనందకరం.      
 *ఆత్రేయగీత*

మూడవ భాగం

"జ్ఞాన మంజరి" (వేదవిజ్ఞాన వీచికలు)

2వ భాగము.

పరిశోధన - శ్రీ శాస్త్రి ఆత్రేయ

అనేక జన్మలనుండి వెంటాడుతున్న పాపములను పరిహారంచేసుకొనే మార్గాన్ని కర్మయోగము ద్వారా మనకు బోధించేయి వేదములు. జ్ఞానయోగము ద్వారా ఆత్మజ్ఞానమును మానవాళికి పరిచయం చేసాయి ఉపనిషత్తులు.

పరబ్రహ్మమే శుద్ధచైతన్య పదార్థమని దానినుండే ఈ విశ్వమంతా ఆవిర్భవించిందన్న విజ్ఞానాన్ని మానవాళికి అందించేయి వేదములు. ఈ శుద్ధచైతన్య పదార్థము శాశ్వతమైనదని, సనాతనమైనదని, నిత్యసత్యమైనదని, కాలానికి అతీతమైనది నిర్ధారించి మనకు జ్ఞానబోధ చేసాయి వేదాంతములు.

ఈ ప్రపంచాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే ముందుగా, పరావిద్య మరియు అపరావిద్య అనే రెండు విద్యలను అవగతం చేసుకోవాలని బ్రహ్మవిదులు పేర్కొన్నారు.

అపరావిద్యలో వేదాల్లోని మొదటి రెండు భాగాలైన సంహిత, బ్రాహ్మణాలు, వేదాంగములైన శిక్షా, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, చందస్సు, జ్యోతిషం వస్తాయి. వీటి సంవిధానమును బట్టీ అనేకానేక కర్మల ఆచరణ జరుగుతుంది. ఇవి వివిధ దేవతలను స్తుతించు ఋక్కులను (ఋగ్వేదము), యజ్ఞయాగాది కర్మలను (యజుర్వేదము), ఋగ్వేదంలోని ఋక్కులను సుస్వరంతో గానం చేయడం (సామవేదము), యజ్ఞ పద్ధతులు, ఆయురారోగ్య పద్ధతులు, అస్త్రశస్త్ర విషయములు (అధర్వవేదము) పేర్కొంటాయి. ఇవన్నీ అపరావిద్యను భోదిస్తాయి.

శాశ్వతమూ, అమరమూ అయిన తత్వాన్ని అందించేదే పరావిద్య. ఇది సనాతనమైన ఆత్మను గురించి తెలియజేస్తుంది. వేదాంతములైన (వేదముల చివరి భాగములు) అన్ని ఉపనిషత్తులు పరావిద్యను బోధిస్తాయి. దీనినే “ఉపనిషద్విద్య” అని కూడా అంటారు. ఈ ఉపనిషత్తుల సారాంశాన్ని జిజ్ఞాసువులు, ముముక్షులు సులభంగా గ్రహించడానికి కేవలం నాలుగు మహావాక్యములుగా రూపకల్పనజేసి మనకు అందించాయి.

ఆ మహావాక్యాలు :

ప్రజ్ఞానం బ్రహ్మ (Supreme Knowledge is Brahma)

ఆహం బ్రహ్మాస్మి (I am Brahma)

తత్ త్వం అసి (That thou art)

అయం ఆత్మా బ్రహ్మ (This Atman is Brahma)

ప్రజ్ఞానం బ్రహ్మ:

ఋగ్వేద మహావాక్యముగా 'ప్రజ్ఞానం బ్రహ్మ'.

అతి ప్రాచీనమైన ఋగ్వేదములో సృష్టిమూలమును తెలియజేస్తూ ఈ బ్రహ్మాండము పరబ్రహ్మము నుండి జనించినదని, ఈ చరాచర సృష్టికి శుద్ధ చైతన్యము బ్రహ్మమేనని తీర్మానించింది. బ్రహ్మమే సర్వజ్ఞతను కలిగియున్నది. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులను నడిపించే చైతన్యము బ్రహ్మము. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు తన పరిధిలోని గ్రహములను తన చుట్టూ భ్రమింపచేసుకొనే శక్తియే ఈ శుద్ధ చైతన్యము. ఆద్యంతములు కానరాని ఈ అనంత సూర్యమండలములను వ్యక్తావ్యక్తమైన ఈ ఆకాశములో పయనింపచేసే శక్తి కూడా ఈ బ్రహ్మయొక్కశుద్ధ చైతన్యమేనని వివరించినది. సృష్టికి ముందు, ఆ తరువాత కూడా వుండేది ఆత్మ ఒక్కటేనని తెలియజేసింది.

అహంబ్రహ్మాస్మి :

యజుర్వేద మహావాక్యముగా 'అహంబ్రహ్మస్మి'.

అనగా నేనే పరబ్రహ్మమని జీవుడు భావించడం. అనేక జన్మలలో జీవుడు పరిభ్రమిస్తున్నాడు. కాని అన్ని జన్మలలోను స్వరూపము ఆత్మగా వెలుగొందుతున్నది. తనకు లభించిన దేహమనే ఉపాధిలో జ్ఞానమును చేకూర్చుకొని 'నేనే ఆత్మస్వరూపుడను' అనే సత్యాన్ని దర్శించి ముక్తిని పొందుతాడని ఈ యజుర్వేద మహావాక్యము విశదపరచింది. ఉత్కృష్టమైన మానవ జన్మలో ఆత్మశోధన ధర్మాచరణతోనే సాధించగలమని తెలియజేసింది. ధర్మబద్ధమైన కోరికలతో జీవించి తాను తరించి సమస్త ప్రకృతిని తరింపజేయాలని నొక్కి చెప్పింది.

'తత్వమసి'

సామవేద మహావాక్యముగా 'తత్వమసి'.

చరాచరమంతా వ్యాపించియున్న శుద్ధచైతన్యము ఎక్కడో లేదు, నీలోనే వుండి, నీవైయున్నదని నిర్వచించడం చాలా ఆశ్చార్యాన్ని, తృప్తిని కలిగిస్తుంది. శంకర భగవత్పాదులు చాటి చెప్పిన అద్వైతము, ఈ మహావాక్యమునుండే ఆవిర్భవించినదని నిరూపణ చేయడం మనకు తెలిసినదే. 'ఏక మేవ అద్వితీయం', ఉన్నది ఒక్కటే! అదే పరబ్రహ్మము. అది నీలోన, అంతటా వ్యాపించి ఉన్నదనే ఒక గొప్ప సత్యాన్ని అద్వైతము ఆవిష్కరించిది. ఆత్మ, పరమాణు ప్రమాణమైనది. అటువంటి పరమాణువునుండే ఈ బ్రహ్మాండము ఆవిర్భవించింది. కావున ఈ బ్రహ్మాండములో భాగమైన నీవే “ఆత్మవు” అని వర్ణించింది.

అయమాత్మాబ్రహ్మ : నాల్గవ వేదమైన అథర్వణ మహావాక్యముగా 'అయమాత్మాబ్రహ్మ'. ఈ వాక్యము కూడా ఆత్మయే బ్రహ్మమని తెలియజేస్తోంది. జీవాత్మ పరమాత్మలు ఒక్కటేనని విచారించింది. ఈ వేదములోనే ప్రణవ సంకేతమైన ఓంకార శబ్దమును మానవాళికి అందించినది. లౌకిక వస్తు సమదాయములన్నీ వివిధ నామములతో సూచించబడినట్లే అనంత విశ్వమును ఓంకారమనే శబ్ద సంకేతముతో సూచించినది. గ్రహముల భ్రమణ శబ్దము ఓంకారమేనని ఇటీవల విజ్ఞాన  ప్రయోగాలు ధ్రువపరిచాయి.    
 *"త్రికరణశుధ్ధి లోపం కూడా ఒక పాపమే!!..."*



ఒకానొక సమయంలో ఆది శంకరుడు దిగ్విజయ యాత్ర సలిపి, పుణ్య క్షేత్ర మైన కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు.
    అక్కడ కాశీ విశ్వనాథుని ప్రార్ధించాడు. 
    ఏమని? - "  ఈశ్వరా, నాపాపములను పరిహారం కావించుకునే నిమిత్తమై, నేను ఇక్కడకు వచ్చాను. " అన్నాడు. " 
    ఆదిశంకరులు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులుకదా! ఏమి పాపం చేశాడు? ఈయన 

    ఆధ్యాత్మిక మార్గంలో  జీవితాన్ని సార్థకం చేసుకున్నారు కదా! ఈయన పాపం చేయటమేమిటని? " శిష్యులు అనుకున్నారు. 

    "నేను మూడు పాపములు చేశాను.!శంకరా ,అవి పరిహారము గావించుకొనుటకు వచ్చాను. " అన్నాడు. 

*మొదటి పాపము-*
     భగవంతుడు మనస్సు కు వాక్కుకు అతీతమైన వాడని  తెలుసుకుని, ఆచరణలో   పెట్టలేక  పోయాను... నిన్ను వర్ణింప డానికి ప్రయత్నిస్తున్నాను. 
తలచి నది, చెప్పి నది వేరు వేరు గా ఉండటం చేత అది పాపమే, ...! అన్నాడు. 

    *మరి రెండవ పాపం -*
" ఈశా వాస్య మిదం సర్వం, " వాసుదేవ స్సర్వమిదం" అని చెబుతున్నాను, విశ్వసించాను, కానీ, నిన్ను దర్శించడానికి కాశీ వచ్చాను. 

    నేను చెప్పే దొకటి, తలచేదొకటి, చేసేది వేరొకటి, ఇది కూడా పాపమే కదా".... ! 

    *ఇంక మూడవ పాపమే మిటి?* 
" నీయందు, నాయందు ఉన్నది ఒకే ఆత్మ. 
ఏకాత్మ సర్వభూతాంతరాత్మ ". దీనిపై నాకు విశ్వాస ముంది. 
నీవు, నేను ఒకటే అని  విశ్వసించి ఉపన్యాసాలు చేశాను. 
కానీ నిన్ను భిన్నంగా చూస్తున్నాను, ఇది మూడవ పాపం. 

     ఈ మూడు పాపాలను పరిహారం చేసి నాకు అద్వైత త త్వాన్ని ప్రసాదించు, అని కోరాడు. 
    చూశారా...! పాపమంటే కేవలం పరులను నిందించడం, పరులను దూషించడం, మాత్రమే కాదు. 

    తలచి నది ఒక్కటి, చెప్పడం మరొకటి, చేయడం వేరొకటి -- ఇదే పాపము. 
    మానవుని ఉన్నత స్థాయికి తీసుకుపోయేదీ, అధో స్థాయికి  నెట్టునదీ కూడా మనస్సే. కనుక మనస్సు ను స్వాధీనము చేసుకోవాలి. 
      _Be a master mind_

              *_☀️శుభమస్తు☀️_*
 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏సేకరణ భక్తీడిభేట్ BD బూరుగు దశరదకుమార్

****శరీరం ఒక అద్దె కొంప*

 *శరీరం ఒక అద్దె కొంప*

*_అద్దె ఇంట్లో ఉన్నవాడు, ఆ ఇంట్లో ఉన్నంతకాలం 'మా ఇల్లు' అనే అంటాడు._*

*_తన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఇంటి యజమానితో కూడా అదే అంటాడు 'ఏమండీ! రేపు మా ఇంటికి రండి...'అని._*

*_'మా ఇల్లు' అన్నాడని అతనితో యజమాని గొడవపడడు.యెందుకంటే వ్యవహారం కోసమే అలా అంటారని ఇరువురికీ తెలుసు._*

*_అలాగే ఈ తనువు తనకు అద్దె ఇల్లు లాంటిది. వ్యవహార నిమిత్తం నాశరీరం, నా సంసారం, నా ప్రపంచం, నా దైవం అంటాడు._*

*_కానీ,యజమాని భగవంతుడు._*

*_యజమాని భగవంతుడు అనేది జ్ఞప్తి కలిగి ఉన్నవాడు - జ్ఞాని. మరచి ఉన్నవాడు - అజ్ఞాని._*

*_అద్దె ఇల్లు పెచ్చులూడితే అద్దెకున్నవాడు ఏమీ చింతించడు.ఆ ఇల్లు ఖాళీ చేసి మరొక ఇల్లు చూసుకుంటాడు._*

*_ఇక ఈ శరీరం నిలబడని వ్యాధి వచ్చింది...వదిలేసి మరొక ఉపాధిని వెతుక్కుంటాడు.అదే పునర్జన్మ._*

*_ఇల్లు మారితే యజమాని మారుతాడు.కానీ శరీరం మారితే యజమాని (భగవంతుడు)మారడు._*

*_సకలసృష్టికీ యజమాని ఆయనే.సృష్టి యావత్తు భగవంతునికి ఓ సంకల్పం అంతే._*

*_ఆయన ఒకేసారి మొత్తాన్ని ఖాళీ(లయం) చేసేస్తాడు.అనగా సంకల్పరాహిత్యంగా ఉంటాడు.నీవు నిద్రలో ఉన్నట్టు._*

*_దేవుని సంకల్పరాహిత్యమే జీవునికి జన్మరాహిత్యము._*

*_కాబట్టి బంధమైనా, మోక్షమైనా భగవంతుని సంకల్పమే._*

*_అందుకే అన్నమయ్య ఓ సంకీర్తనలో ఇలా అన్నారు "మదిలో చింతలు, మైలలు మణుగులు, వదలవు నీవవి వద్దనక."_*

*_భగవంతుడు "వద్దు" అనుకుంటే ఉండవు.అంతేగానీ మనం వద్దు అనుకుంటే పోవు._*

*_నా సంకల్పం కూడా భగవంతుని సంకల్పంలో అంతర్భాగమే కదా అంటావేమో!_*

*_ఇక బాధేముంది..?_*

*_నీ శరీరం భగవంతుని శరీరంలో(సృష్టిలో) అంతర్భాగం. నీ మనస్సు భగవంతుని మనస్సులో(మాయలో) అంతర్భాగం._*

*_జీవుని బంధమోక్షములు దేవుని లీలావిలాసములు._*

*_శరీరం ఉంటే ఉండనీ... ఊడితే ఊడనీ..._*
*_బంధం ఉంటే ఉండనీ, మోక్షం వస్తే రానీ..._*

*_ఏదైనా సరే ఉంటే ఏమి..? లేకుంటే ఏమి..?అని ఉండటం జ్ఞానిలక్షణం.._*

*_అచలరూపుడైన పరమేశ్వరుని సంకల్పపరంపరయే ఈ బ్రహ్మాండగోళములుగా మహా సృష్టి ఏర్పడింది..._*

*_జగత్తు యావత్తు శివుని సంకల్పరూపమే.శివుడు  మెలకువతో  కనే కలే ఈ ప్రపంచం._*

*_ఆపదలోకి త్రోయడం,ఆపద నుంచి రక్షించడం...ఆ క్రీడలో భాగమే._*

*_అజ్ఞానానికి గురి చేయడం...దానిని తొలగించడానికి జ్ఞానప్రబోధం చేయడం...ఆ క్రీడలో భాగమే._*

*_మంచి-చెడులనే తక్కెడలను అటు ఇటూ సమాంతరంగా లేనట్లు...మళ్లీ ఉన్నట్లు... సరిచూసుకుంటూ ఉండడం ఆ క్రీడలో భాగమే._*

*_ప్రతిజీవి కర్మఫలాన్ని ప్రతిజీవికీ సరాసరిన పంచుతూ ఉండడం ఆ క్రీడలో భాగమే._*

*_అవతరించడం...అనుగ్రహించడం....ఆగ్రహించడం...అంతం చేయడం...ఆ క్రీడలో భాగమే._*

*_ఆ క్రీడలో "ఎందుకు" అనే ప్రశ్నకు తావులేదు.యెందుకంటే అది క్రీడ కాబట్టి..._*

*_క్రీడలో గెలుపు ఓటములు రెండూ వినోదమే కాబట్టి._*
*_ఆ క్రీడలో భాగంగానే... సకల నామరూపాలూ తానే..._*

*_దేవ-జీవ భేదం తొలగిపోవడమే దైవోపాసన యొక్క అంతిమ ప్రయోజనం._*

*_అనేకత్వాన్ని విడిచి ఏకత్వం వైపుకు చేరడమే ఈ ఆధ్యాత్మికతకు  అంతిమ ప్రయోజనం._*

*_ఈశ్వరుడు వేఱు, నేను వేఱు అనే భావముతో కూడిన ఈశ్వరభావన కంటే  'అతడే నేను' అన్న అభిన్నభావనయే పావనమైనది అన్న రమణుల మాటే పరమ ప్రమాణం._*

*_రంగులరాట్నానికి మధ్యభాగములో అన్ని గుర్రాల పరుగులకు ఆధారమై, అచలమై ఉన్న స్తంభం వంటివాడు పరమేశ్వరుడు._*

*_జీవుడు నాణేనికి బొమ్మ బొరుసు వలె చల-అచల ప్రవృత్తులను కలిగి ఉంటాడు. అందువల్లనే జీవుడు బంధ-మోక్షముల మధ్య ఊగిసలాడుతుంటాడు._*

*_జీవుడికి శాశ్వతమైన బంధమూ లేదు, శాశ్వతమైన మోక్షమూ లేదు.ఈ లీల అనంతం. "ఎందుకు..? " అన్న ప్రశ్న అనవసరం._*

*_సముద్రంలో కలిసేవరకు నదికి ఒడిదుడుకులతో కూడిన ప్రవాహం ఉన్నట్టు దేవునిలో కలిసేవరకు జీవునికి సుఖదుఃఖరూపంతో కూడిన సంసారం ఉంటుంది._*

*_అహంమూలాన్ని కనుగొనడమే గొప్ప తపస్సు అంటారు అరుణాచల రమణభగవానులు..._*

*_ఒకటి వెలుపలి సౌందర్యం...మరొకటి లోపలి సౌందర్యం..._*

*_రమణులు అన్నట్లు "ఒకటే" మూడయ్యింది. ఎప్పుడును మూడు మూడే అనుట అహంకారము. మూడూ "ఏకం" అనుట అహంస్వరూపము._*

*_దుఃఖం, సుఖం రెండూ దైవప్రసాదితాలే...బంధం, మోక్షం రెండూ దైవానుగ్రహాలే.._*

*_ప్రతి కష్టంలోనూ మన వైపు దైవం ఒక కన్ను వేసి వుంచే వుంది...అని తెలిసినప్పుడు ఆ కష్టపరిస్థితి నుండి తెలియకుండానే దాటేయగలం._*

*_ఏడ్వడంలో ఉన్న సుఖం ఏడ్చినవానికే తెలుసును. బంధం కూడా మోక్షమంత సుఖమయ వారాశి._*

*_ఏడుపు అనేది పై పొర మాత్రమే. లోపలంతా గొప్ప సుఖం నిండి ఉంటుంది_*

*_నవ్వు అనేది పై పొర మాత్రమే.లోపలంతా గొప్ప దుఃఖం నిండి ఉంటుంది._*

*_సుఖ-దుఃఖాలు గొప్ప స్నేహితులు....ఒకణ్నే రమ్మనలేం.ఒకణ్నే కాదనలేం._*

*_ఒకణ్ణి పిలిస్తే ఇద్దరూ వస్తారు.ఒకణ్ణి కాదంటే ఇద్దరూ రారు._*

*_ఇద్దరూ కావాలంటే - సంసారం.ఇద్దర్నీ కాదంటే పరమపదం._*

*_ఏకకాలంలో సంసారంలో ఉంటాను, పరమపదంలోనూ ఉంటాను.వెలుపల నేను జీవుణ్ణి, లోపల నేను దేవుణ్ణి._*

*_వెలుపల నేను సంసారిని, లోపల నేను సన్న్యాసిని. వెలుపల నేను మనిషిని, లోపల నేను ఋషిని.✍_*

*_🚩'శ్రీ గురుభ్యో నమః '🙏_* 

 *_'సర్వం కృష్ణార్పణమస్తు.🙏_*

ఓం అరుణాచల శివ ఓం

Monday, October 28, 2024

 28-10-2024-సోమవారము-శుభమస్తు...
🌹🌹🌹🌹 గుడ్ మార్నింగ్ 🌹🌹🌹🌹 మనిషికి కలిగే చాలా బాధలు వదలలేకపోవటం వలన. ఇవి వస్తువులు కావచ్చు, విషయాలు కావచ్చు, సంఘటనలు కావచ్చు, సంపదలు కావచ్చు, బంధాలు, బంధుత్వాలు కావచ్చు, అనుభవాలు, అనుభూతులు కావచ్చు...... సంపాదించేది ఖర్చుపెట్టుకోటానికి............ వస్తువులన్నీ వినియోగానికి................... బంధాలు బ్రతకటానికి........................... సంఘటనలు, సందర్భాలు కాలములో కదిలిపోతూ ఉంటాయి.................... అనుభవాలు, అనుభూతులు జీవించటములో ప్రతి సెకను అందుతూ, వచ్చి పోతూ మారిపోతూనే ఉంటాయి. అసలు మన శరీరమే పాతను వదిలేస్తూ కొత్తగా మార్పులు చెందుతూ నిరంతరం మారిపోతూనే వున్నది..................... విశ్వములో అన్నీ - ప్రతి దాని కదలిక ఉన్న స్థితిని వదులుతూ, కొత్త మార్పులు పొందుతూ - మొత్తం విశ్వమే ఎప్పటికప్పుడు కదిలిపోతున్నది................ శక్తి లక్షణం చైతన్యం అంటే కదలిక అంటే వున్నది ఉన్నట్టుగా ఉండకుండా జరిగే మార్పు. మార్పే జీవత్వపు లక్షణము.......... స్థిరత్వము జడము.చైతన్యము కదలిక మార్పు. మార్పు అంటే వున్నది ఇంకోలా..... ఎప్పుడూ మరోలా................................. అందుకే భవిష్యత్తు ఎవరికి తెలియదు. కారణం అనంత విశ్వ చైతన్యపు కదలికే మన భవిష్యత్తు. అది ఎలా కదలబోతున్నదో ఎవరికి తెలుసు................................. వదలలేక పోవడం అంటే స్థిరత్వపు భావనతో - జడత్వాన్ని కోరుకుంటున్నాము. సృష్టి తీరే మార్పు - అది శక్తి కనుక........... మనకు నచ్చినా నచ్చకపోయినా - మనము లాభమనుకున్నా, నష్టమనుకున్నా - మనకు సంతోషమయినా, బాధ అయినా - మనము ఎంత ప్రయత్నించి ఆపాలనుకున్నా............ శక్తి కదలికను - అదే మార్పును ఆపటం కుదరదు. అది మొత్తముగా అనంత విశ్వములో జరుగుతూ - ఆ విశ్వములోనే ఉన్న మనతో కలిపి జరుగుతున్న ఏక ప్రక్రియ.ఈ ప్రక్రియను అర్ధం చేసుకోవటము, అంగీకరించటం తప్ప వేరే దారి లేదు........... ఇది చైతన్యపు, కదలిక అనే సత్య లక్షణపు చర్యల యొక్క వ్యవస్థ....................... వదలలేకపోవటం అంటే విశ్వ శక్తికి విరుద్ధముగా కోరుకోవటం లేక ప్రయత్నించటం. ఎలా???? అసంభవం...... ఇక్కడ వ్యవస్థ అంతా వచ్చింది పోవటం - పొందింది పోగొట్టుకోవటం................... వచ్చిన, ఉన్న, మనమే కచ్చితముగా ఒక రోజు మనను - మనమే వదలి వెళ్లిపోక తప్పని సృష్టి విధానము............................ ఆశ్రద్దతో పారవేసుకోమని, పాడుచేసుకోమని కాదు........................ సంపూర్ణ శ్రద్దతో జరిగేదానిని అంగీకరించమని - మన పరిధిలో లేనిది, మన వల్ల కానిది, మనము ఆపలేనిది, జరుపలేనిది - జరిగినది,జరుగుతున్నది, జరగబోయేది అంగీకరించమని............... అంగీకరించడం అంటే - నేను - సృష్టితో కలిసి సాగడం................................. బలమైన ముద్రల, కోరికల, ఆశల, మనసు వదలలేక దుఃఖపడుతుంది..................... ఎప్పుడు విడిగా, విభేదముగా, పరిమితముగా ఉండిపోతుంది.......... జ్ఞానము - అర్ధం చేసుకుంటూ, అంగీకరిస్తూ సాగిపోతుంది - సృష్టిలో కలిసిపోతుంది. ఇదే ఆధ్యాత్మిక చదువు.వదలగలగటం అనే సాధన - పరిమితిని వదిల్చి - అనంతములో లయింప చేస్తుంది................................. ఇదంతా నువ్వు నీకే నేర్పుకొని - నిన్ను నీతో నువ్వే నడుపుకొని - నీలో నువ్వు - నీతో నువ్వు సాగవవలసిన అంతరంగ, ఆత్మజ్ఞాన, ఆధ్యాత్మిక స్వీయ సాధనా ప్రక్రియ.ఆధ్యాత్మిక చదువు............... 🌹🌹🌹🌹 god bless you 🌹🌹🌹🌹

Sunday, October 27, 2024

****మానవత్వం..!

 మానవత్వం..!
                    ➖➖➖✍️
నిన్న నేను నా స్కూటీనీ ఓలేక్స్ (OLX) లో అమ్మకానికి (ఫోటో తో ) మొబైల్ లో  పెట్టాను. 

ధర ₹30,000. 
రెండు గంటల్లో బేరానికి 25 నుండీ 29 వేల వరకు పలికింది.ఇంకో గంటలో... నాకు ఒకామే ఫోన్ చేసీ...
“సార్...  మీ స్కూటీ మా బాబు (కొడుకు)కి నచ్చింది... కానీ మీరు పెట్టిన ధర చాలా ఎక్కువగా ఉందీ... మేము 24 వేలు వరకు ఇచ్చుకోగలము.ఇంతకంటే మా దగ్గర డబ్బులు లేవూ...
మా బాబు ఇంజనీరింగ్ 4 వ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ చాలా దూరం. 
ఒక్కొక్క సారి సైకిల్ మీద,  
బస్ మీద వెళ్తున్నాడు.
ఒక్కొక్కసారి తన స్నేహితులతో 
బండి మీద వెళ్తున్నాడు.

నేను, నా భర్త గత 20 సంవత్సరాల నుండీ మోటారు బండి కొనుగోలు చేయాలని అనుకుంటూనే ఆయన(నా భర్త) కాలధర్మం చేసారు.
ఇప్పుడుబాబుపెద్దవాడయ్యాడు.కాలేజీ చదువుకే... డబ్బు కి అవస్థ పడుతున్నాడు.

మీ ప్రకటన చూసి వాడికి బండి కొనిద్దామని నాకు ఆశగా ఉంది.
దయచేసి...మీరు... మా ధరకి ఇవ్వ దలచుకుంటే మాకు ఫోను చేయండి... నేను మా బాబు వస్తాం.”అని ఆమే చెప్పింది.
ఇంకో అరగంటలో నేను ఆమెకు ఫోను చేసి“బండిని చూసుకోవడానికి ఎప్పుడు వస్తారు?” అని అడిగాను.

నాలుగైదు గంటలు తరువాత....ఆమే... ఆమె బాబు మా యింటికి వచ్చారు.
స్కూటీ ని చూస్తునే....ఆ కుర్రాడి మొఖం లో చాలా సంతోషం కనిపించింది.బండిని తడుముతూ... దాని చుట్టూ
రెండుసార్లు తిరగడం చేసాడు.

“ఏమయ్యా... నీకు బండి నచ్చిందా...?” అని అడిగాను.

“చాలా నచ్చింది సార్!” అని జవాబిచ్చాడు.

వాళ్లనీ ఇంటిలోపలకీ తీసుకొని వెళ్ళికూర్చోబెట్టాను.ఆమె తన చేతిలోనున్న సంచి నుండి
డబ్బులు తీసి టీపాయ్ మీద పెట్టీ“ఇదుగొండి సార్... మీరు ఒప్పుకున్న 24 వేలు లెక్క చూసుకోండి!” అని చెప్పింది. 

అందులో... ₹.100, 50, 20, 10 నోట్లు రూపంలో... ఒకటి రెండు ₹500, 200 నోట్లు కనబడ్డాయి.
ఓ....మైగాడ్...ఇవన్ని కూడ బెట్టినడబ్బులు లాగా ఉన్నాయే...అని నేను నా భార్య శైలజ అనుకున్నాము.

నా ప్రక్కనే  ఉన్న నా భార్య తో...
“వీరికీ భోజనం ఏర్పాటు చేయమ”ని చెప్పాను.

భోజనాలు అయినాక కొంత సేపటికివాళ్లు వెళ్తాం అన్నప్పుడు...

“స్కూటీ తాళాలు తో... ఒక కవర్
చేతిలో పెడుతూ... “ఈ కవర్ లో
మీరు కూడ బెట్టిన ₹.24 వేలు
ఉన్నాయి... బాబుకు పెట్రోలు కి,
చదువుకీ పనికొస్తుంద”ని నా భార్య శైలజ ఆమెతో చెప్పడం జరిగింది.వాళ్లు ఆశ్చర్యంతో... 
ఆమె కళ్లనీళ్లు పెట్టుకుంటూ...
మా కారు ప్రక్కనే ఉన్న వాళ్ల స్కూటీదగ్గరకు వెళ్లారు.✍️```
*****
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Sekarana

            🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏.****************
     బాధపడ వలదు!
       ➖➖➖✍️
యావత్ కాలం భవేత్ కర్మ                     తావత్ తిష్ఠతి జంతవః|                         తస్మిన్ క్షీణే వినశ్యంతి                                      తత్ర కా పరివేదన||
తా:- ```
ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో,  అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం విడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు?```

ఋణానుబంధ రూపేణ.                            పశుపత్నిసుతాలయః|                       ఋణక్షయే క్షయం యాంతి                            తత్ర కా పరివేదన|| 
తా:- ```
గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. 
ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడమెందుకు?```

“పక్వాని తరుపర్ణాని                                పతంతి క్రమశో యథా|                                   తథైవ జంతవః కాలే                                   తత్ర కా పరివేదన|| 
తా:-  ```
పండిన ఆకులు చెట్టునుండి  ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు? ```

“ఏక వృక్ష సమారూఢ                            నానాజాతి విహంగమాః|                         ప్రభతే క్రమశో యాంతి                                  తత్ర కా పరివేదన||”
తా:- ```
చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు 
వెళ్ళిపోతాయి.అదేవిధంగాబంధువులతో కూడిన మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని, ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడనవసరములేదు!```

“ఇదం కాష్టం ఇదం కాష్టం                           నధ్యం వహతి సంగతః|                                సంయోగాశ్చ వియోగాశ్చ                                                   కా తత్ర పరివేదన||”
తా - ```
ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరతాయి.కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడుఈప్రపంచప్రవాహంలోకొంతకాలంసంయోగసుఖమును,మరికొంతకాలంవియోగదుఃఖమును అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరములేదు.✍️```

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
               🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏🌹
 ఓ కవిని ఆతని భార్య, మురిపెంగా,  అడిగిందిలా

"ఏమండీ ! మీరెపుడూ అమ్మ గురించే రాస్తారు, భార్యను గురించి రాయరా?"

అంతే, అతని కలం పరుగులు తీసింది  ఇలా ......

#భార్య 
          -------
(రెండక్షరాల ప్రేమ మరియు జీవితం)

ఎవరో నీవు
చందమామంత అందం లేదు
కలువ భామంత  సుకుమారం లేదు

సరస్వతీ దేవంత చదువు లేదు
కనక మాలక్ష్మంత ధనం లేదు
పార్వతీ దేవంత శౌర్యం లేదు

కానీ ....... 

కన్నుల నిండా వెన్నెల
మనసు నిండా కరుణ

మాటల్లో తేనెలా కమ్మదనం
ఆకలైతే కడుపు నింపే అమ్మదనం

ప్రేమలో నాలో ఐక్యమయ్యే కనకాంబరం

ఆకాశమంత నీకు
నా బతుకంతా నీవైన నీకు
రెండు అక్షరాల 'భార్య' పదం  చాలునా ? 

గృహస్తాశ్రమ ధర్మాలు నీతోనే
వానప్రస్తాశ్రమ ధర్మం నీతోనే
ధర్మేన అర్థేన కామేన నాతిచరామి నీతోనే

మా అమ్మ నాతో చెప్పిన మాట
ఆ చేయి పట్టుకోరా

మీ అమ్మ నీతో చెప్పిన మాట
ఆ చేయి విడువకమ్మా

అలా నా దీపమైనావు
నా ఇంటి మణిదీపమైనావు
నా జీవితపు మణి ద్వీపమైనావు

పాలేవో నీరేవో తెలియనంతగ కలిసాం

వెన్నెలైనా చీకటైనా కలిసి ఒక్కటై సాగాం

నాలో నీవు ... నీలో నేను
అమరమైన ఈ అద్వైతంలో
వేలకొద్దీ తీయని గురుతులే
ఎగిరే సీతాకోక చిలుకల్లా 
కమ్మని కవితలా .. 
మధుర గీతంలా ..
మధు మాసంలా ..

అర క్షణంలో 
ఆవిరై పోయే కోపతాపాలు
మరుక్షణంలో కలిసిపోయే అనుబంధాలు

అదే అదే నీవు నేర్పిన  
భార్యాభర్తల బంధాలు

గొప్ప బహుమతులు వద్దంటివి
ప్రేమతో ఇచ్చే చిన్ని జ్ఞాపకాలు చాలంటివి

భూతల్లి పిలిచేవరకు
కష్టమైనా
సుఖమైనా 

నీతోనే
నీతోనే

కన్నుల్లో నిలిచావు కంటిపాపలా

గుండెల్లో ఉన్నావు గుండె సవ్వడిలా

"మన జీవన లీల ఆనంద హేల"

ఋణం ఉండి కలిసామో
ఋణం తీర్చుకోవడానికి కలిసామో
తెలియదు కానీ 

నీవో అద్భుతానివి 
నేనో నిమిత్ర మాత్రుడను

ప్రతి ఇంటిలో
ప్రతి భర్తలో
ఆకాశమంత  'ప్రేమైన'  నీకు
రెండక్షరాల 'భార్య' అను పదం చాలునా? 

ఓ దేవతలారా !
ఓ కవి శ్రేష్ఠులారా !

ఈమెకో  పేరు సూచించండి
అమ్మలా ....  తీయగా ఉండేలా 

P.S.: ఇది రాసిందెవరో  తెలియదు.

 *దార్గా హటావో వేములవాడ బచావో* గత 300 సంవత్సరాల క్రితం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవాలయం పైకి దండయాత్రకు కు వచ్చి  శ్రీ రాజరాజేశ్వర శివలింగం అపవిత్రంగా తాకి ఘోరాతి ఘోరమైన అపచారం చేసి  అవమానపరిచిన అజాం గోరి, వాడు చేసిన మహా పాపనికీ అగ్రహించిన శివ భక్తులు వాడిని అక్కడికక్కడే శులాల తో పొడిచి 🔱 చంపేశారు
ఈ విషయాన్ని తెలుసుకున్న నైజం వాడి సేనలతో వేములవాడ దేవస్థానం ప్రాంతం లో ఉన్న 400 మంది హిందువులను ఊచ కోత  కోయించి వాడి తొత్తు గోరీ గాని సమాధి దేవస్థానం ముందు కట్టించాడు మిదేవుని దర్శనం చేసుకునే ముందు మా తురుక గోరీగాని  ముక్కిన తర్వాతే వెళ్లాలని హుకుం జారీ చేశాడు
 నాటి రోజుల్లో తప్పనిసరై బలవంతంగా మన హిందువులు వాడి గోరిని ని మోక్కి వెళ్లేవారు
కానీ నేడు కొంతమంది మూర్ఖులు వాడి సమాధికి మోక్కితే ఏదో కలిసివస్తుందని భ్రమించి  మూర్ఖంగా గొర్రెల ప్రవర్తిస్తున్నారు  కనుక వేములవాడ కు వెళ్లే హిందూ భక్తులు ఇకనైనా గ్రహించి అటు వైపు వెళ్లకుండా జాగ్రత్త పడగలరు ఈ విషయాన్ని అందరికీ హిందూ బంధువులందరికీ తెలియపరచగలరు

****బంధాలు మునిపటిలా బలంగా ఉండడం లేదు చాలా బలహీనంగా మారుతున్నాయి...

 బంధాలు మునిపటిలా బలంగా ఉండడం లేదు చాలా బలహీనంగా మారుతున్నాయి... 

..వీటిపై ఒక విశ్లేషణ.. 

బంధాలు బలహీనంగా మారడానికి కారణం ఏమిటి?
ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది...
నాకు కనిపించిన కొన్ని సాధారణ కారణాలు ఇవి...
(ఇవి కాకుండా కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉండవచ్చు)

#సమయం 

నేటి కాలం లో మనిషి తన తోటి మనిషికి సరి అయిన టైమ్ కేటాయించ లేకపోవడం ప్రధాన సమస్య...
 జీవితంలో ప్రతీ విషయానికి ప్రక్కన వాళ్లతో పోలిక (comparison) చూసుకొని పోటీ పడడటంతో జీవితం పరుగు పందెం అయిపోయింది..
గెలుపు... 
ఓటముల లెక్క అయిపోయింది... అస్వాధన...
 ఆనందం...
 కరువు అయిపోయాయి... దీని ఫలితం సువాసనలు వెదజల్లే సంబంధాలు కూడా కాగితపు పూవులు అయిపోయాయి....

# కమ్యూనికేషన్ (ప్రేమ వ్యక్తికరణ)
  
ఒక సంబంధం (relation) కొరకు ఎంతగానో ప్రయత్నం చేసే మనం ఆ సంబంధం ఏర్పడిన తరువాత ప్రాధాన్యత తగ్గించివేస్తాం... కనీసం మన మనస్సులో ఉన్న భావాన్ని కూడా సవ్యంగా వ్యక్తం చేయం... 
మన వారే కదా అని నిర్లక్ష్యం చేస్తాం....
 కానీ ఒక బంధాన్ని కాపాడు కోవాలి అంటే వారి పట్ల మనకు ఉన్న ప్రేమను తప్పకుండా వారికి తెలియచేయాలి...

#అభద్రత 

ఒక మనిషిని ఎక్కువ ప్రేమిచినప్పుడు అది ఆరాధనగా మారిపోతుంది అలా ఆరాధించినప్పుడు అభద్రతా భావం ఎక్కువ అవుతుంది. సొంతం అయినా కూడా చేయి జారిపోతుందేమో అనే భయం పెరిగి పోతుంది.... ఒక్కోసారి ఇద్దరు దూరంగా ఉండటం,  ఇద్దరి మధ్య బలమైన గుర్తింపు కలిగిన బంధం లేకపోవడం, సమాజంలో తమ బంధానికి ఆమోదయోగ్యం  లేకపోవడం ఈ అభద్రత భావం ఎక్కువ అవ్వడానికి ఇతర కారణాలు... 
ఆభద్రత ఎక్కువ అయ్యి  క్రమంగా అది అనుమానం, ఆధిపత్యంగా మారి నాకు మాత్రమే సొంతం లాంటి ఓవర్ పొసేసివ్ నెస్ కు దారితీసి బంధం బలహీనం అవుతుంది...

#అనుమానం 

చాలా మంది ప్రేమ ఉంటే అనుమానం ఉంటుంది అంటారు... అనుమానించాలి అని కూడా అంటారు... నిజానికి అది అబద్దం  ప్రేమ నిజం ఐతే నీది ఎప్పటికి నీదే... దానికోసం ఎవరు రారు... 
రాలేరు... 
మధ్యలో ఎవరు ఐనా వచ్చారు అంటే  ప్రేమ  లేనట్టే...
 అనుమానం మొదలు అయిన క్షణం నుండి బంధానికి బీటలు వారడానికి మొదటి అడుగు పడినట్టే....

#అవమానం 

చాలా మంది మాట్లాడేటప్పుడు మాట జారేస్తారు... తొందరలో కొన్ని సార్లు...
చులకనగా కొన్ని సార్లు....
మనం అనే ప్రతిమాటనీ ఎదుటివారు తీసుకునే పరిస్థితులలో ఉన్నారో లేరో కూడా ఆలోచించరు... అనేస్తారు...
 బంధాన్ని కలిపేది మాటే... 
బంధాన్ని తెంచేది మాటే...
 నాలుగు గోడల మధ్య అపురూపంగా చూసుకొని నలుగురు మధ్య అవమానిస్తే ఏ బంధం కూడా ఎక్కువ రోజులు నిలబడదు....

#అభిమానం 

ప్రతి ఒక్కరికీ అభిమానం... ఆత్మాభిమానం... ఉంటాయి మనం నిజంగా ప్రేమిస్తే తన అత్మభిమానాన్ని కూడా గౌరవించాలి... ఎదుటివారి ఆత్మాభిమానాన్ని కించపరిచేలా మాట్లాడినా... ప్రవర్తించినా...
 ఏ బంధం కూడా ఎక్కువ రోజులు నిలబడదు... 

#అలకలు 

చిన్న చిన్న మాట పట్టింపులే అలకలు... ఇద్దరి మధ్య అలకలు చాలా బావుంటాయి... కానీ ఇవి పరిధి దాటితే గొడవలుగా మారతాయి...
చిన్నగా మొదలు ఐన గొడవలు పెద్దగా మారి ప్రశాంతతని దూరం చేస్తాయి... 
ఎప్పుడూ ఈ గొడవలు పడుతూ కలిసి ఉండటం అవసరమా అనే ఆలోచన పెరిగి క్రమంగా ఒకరికి ఒకరు దూరం జరుగుతారు... 

అపురూపమైన బంధాలని 
మరపురాని సంబంధాలుగా 
మార్చుకోవాలి....
కలిసి ఉన్నాం అంటే భౌతికంగానో...
సమాజం కోసమో...
రాజీ పడుతూ కలిసి ఉండడం కాదు మనసా... 
వాచా...
కర్మణా....
త్రికరణ శుద్ధిగా...
జన్మ జన్మలకూ... 
ఇదే బంధం కావాలి అనేంత బలంగా.... ప్రేమగా.... 
బంధాన్ని కోరుకోవాలి....
నిలబెట్టుకోవాలి....
దానికోరకు మన ప్రయత్నం నిత్యం క్రమం తప్పక చేస్తూనే ఉండాలి....

అంతేగానీ అర్దం పర్డం లేని విషయాలకి మనుషులనీ... మనసులనీ....
దూరం చేసుకోకూడదు....

ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే... 

చదివినందుకు ధన్యవాదములు....

మీ మనస్సుకు స్వీకరిస్తే కోటి నమస్కారములు....

ఆచరించి ఆణువంతయినా సంతోషాన్ని పొందితే శత సహస్ర కోటి నమస్కారములు....

💐💐💐💐💐💐💐
❤️❤️❤️❤️❤️❤️❤️
🙏🙏🙏🙏🙏🙏🙏

(#సేకరణ K V Shekhar)

*******మౌనం, ధ్యానం, జ్ఞానం

మనసు గుణాన్ని వదిలితే మౌనం! 
పరధ్యాసను వీడితే ధ్యానం!! 
దేహత్మభావం పొతే జ్ఞానం!!!

శివశ్రీ గెంటేల వెంకటరమణ
 రామాయణమ్.96
.
ఇంత సైన్యము గంగ ఒడ్డుకు ఎందుకు వచ్చింది? కారణమేమై ఉంటుంది ? అనుమానం వచ్చింది గుహుడికి.ఆ రధము మీద కనపడే ధ్వజాన్ని బట్టి చూస్తే ఇది భరతుడిసేనావాహిని అని తేటతెల్లమవుతున్నది.
.
భరతుడు ఇప్పుడెందుకు వచ్చినాడు ? ఇక్కడున్న పల్లెలోని జనులను బంధించటానికి రాలేదుకదా! మనలను చంపటానికి కాదుకదా ! లేక రాజ్యాన్ని పూర్తిగా నిష్కంటకం చేసుకోవాలనే ఉద్దేశంతో రాముని చంపివేయటానికి కాదుకదా!
.
రాముడు నాకు ప్రభువే కాదు ,నాకు మిత్రుడు కూడా ఆయన ప్రయోజనం కాపాడటానికి అందరూ సన్నద్ధం కండు అని సేనను ఆజ్ఞాపించాడు .
.
ఐదువందల నావలలో ఒక్కొక్క దానిపై నూర్గురు యోధులు కవచధారులై సిద్ధంగా ఉండండి ! రాముడివిషయంలో భరతుడికి ఏ విధమైన దుష్టబుద్ధిలేదని తేలిన తరువాతనే ఆతని సేన గంగను సుఖంగా దాటగలుగుతుంది.అని పలికి అందరినీ సిద్ధం చేసి తాను మాత్రం భరతుడికి మత్స్యమాంసములు,తేనె పట్టుకొని వినయంగా భరతుడికి ఎదురు వెళ్ళాడు.
.
సుమంత్రుడు ఆతనిని చూపి భరతునితో ఈయన పేరు గుహుడు నీ అన్నకు ప్రాణస్నేహితుడు ఆయనను నీవుకలిసి మాట్లాడితే రాముని ఆచూకీ మనకు తెలుస్తుంది.అని చెప్పాడు.
.
అప్పుడు భరతుడు శీఘ్రంగా గుహుని తనవద్దకు తీసుకురమ్మన్నాడు.
.
గుహుడు వినయంగా భరతుడితో మేమంతా నీకు లొంగిఉండేవారము.ఇది నీదాసుని గృహము. దీనిలో నీ ఇచ్ఛానుసారము నివసింపు అని కోరినాడు
.
.నీకునీసైన్యమునకుసరిపడునంతదుంపలు  ,పండ్లు,పచ్చిమాంసము,ఎండుమాంసము ఉన్నది నీ సైన్యము సుఖముగా నేటిరాత్రికి భుజించి ,విశ్రమించి రేపు బయలుదేరవచ్చును అని వినయంగా పలికాడు గుహుడు.
.
రాముని మిత్రుడా   ఇంత సేనకు నీవు ఒక్కడవే ఆతిధ్యమివ్వాలనుకొనే నీ మనస్సు ఎంతగొప్పది ! .
.
మాకు ఒకటే కోరిక ఈ గంగ దాటి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాలి మేమంతా సుఖంగా గంగదాటే మార్గం చూపించు అని భరతుడు కోరాడు.
.
అదెంత పని మేమంతా నీ వెంట వచ్చి దాటించగలము కానీ నాకొక సందేహమున్నది ,ఇంత సేనతో నీవెందుకు బయలుదేరావు రామునికి కీడు తలపెట్టే ఉద్దేశ్యమేమీ లేదుకదా!
.
అతని మాటలు విన్న భరతుడు ,రాముడికి కీడు తలపెట్టే దుష్కాలము ఎన్నడునూ రాకుండు గాక రాముడు నాకు తండ్రివంటి వాడు ! ( భ్రాతా ! జ్యేష్టః పితృసమో).
.
వనములో నివసిస్తున్న రాముని వెనుకకు తీసుకొని వచ్చుటకే వెళుతున్నాను .గుహుడా మరొక విధముగా తలపకుము .
ఇది సత్యము!.
.
భరతుడి మాటలువిన్న గుహుడి ముఖం వికసించింది.
.
ఆహా ! అప్రయత్నముగా లభించిన రాజ్యలక్ష్మిని తృణప్రాయంగా విడిచిపెట్టే నీవంటివాడు నాకీ లోకంలో ఎవ్వరూ కనపడలేదు.నీ కీర్తి లోకంలో శాశ్వతంగా వ్యాపించగలదు .
.
ఇంతలో రాత్రి అయ్యింది .అందరూ విశ్రమించారు.
.
రాముడిగురించిన ఆలోచనలతో భరతుడికి దుఃఖము చుట్టుముట్టింది.ఆయనను అది కాల్చి వేయసాగింది.అన్ని అవయవాలనుండీ ధారాపాతంగా చెమట కారటం మొదలుపెట్టింది.
.
 ఆయన దుఃఖమే ఒక మహా పర్వతము
ఆయన ఆలోచనలే ఆ పర్వతమందలి శిలలు
ఆయన నిట్టూర్పులు ధాతువులు
ఆయన దైన్యమే ఆపర్వతమందలి వృక్ష సముదాయము
ఆయనకు కలిగే శోకము,ఆయాసము ,మనస్తాపము దాని శిఖరములు.
ఆయనకు కలిగిన మోహము అనంతమైన జంతుసముదాయము
ఆయనకు కలిగిన సంతాపము దానిమీదున్న వెదురుపొదలు.
.
ఏమి చేయాలో తోచటం లేదు నిదురరాదు !కనులు మూత పడటం లేదు. దుఃఖము దుఃఖము ఒకటే దుఃఖము.మనశ్శాంతి కరవై అల్లల్లాడిపోతున్న భరతుడిని గుహుడు ఆ రాత్రి అంతా ఓదారుస్తునే ఉన్నాడు.
.
NB
చుట్టూ అష్టదిగ్బంధము చేసి వచ్చాడు గుహుడు .రాముడికి హాని జరుగుతుందేమో అని ఏమాత్రం అనుమానంకలిగినా భరతుడి సేన ముందుకు కదలలేదు.
.అందుకే "రామస్య ఆత్మ సమో సఖా" అని గుహుడి గురించి మహర్షి వ్రాసింది.
.
వూటుకూరు జానకిరామారావు

*** అందంగా ఉన్నానని

 *_అందంగా ఉన్నానని మురిసిపోకు... అసలు నిజమైన అందం అంటే నీకు తెలుసా.?_*

*_ఈ రోజు ఉన్న అందం రేపు ఉంటుందా.? శరీరం అందం ఎన్ని సంవత్సరాలు.?_*

*_అయినా మనసు అందంగా లేనప్పుడు, బాహ్య అందం ఉన్న ఏమి లాభం.?_*

*_ఈ అందం ఎప్పటికి అయినా, మట్టిలో కలిసిపోతుంది... మనసు మంచిది అయితే, నువ్వు ఉన్నా లేకున్నా, నీ మంచితనం గురించి  మాట్లాడుకుంటారు..._*

*_అందమంటే... చిన్ని పాప చిరునవ్వు అందం. అమ్మ మనసు అందం నీవు వేరే వాళ్లకు సహాయం చేస్తావు చూడు... అది చేసే చేసే నీ హృదయం అందం..._*

*_"మాట " జారడం సులభమే... కానీ, మాట పడిన వారికే తెలుస్తుంది, దాని "నొప్పి "._*

*_కట్టె కాలి బూడిద అయినా..."మాట " మాత్రం బతికే ఉంటుంది. కాబట్టి... ఆలోచించి, ఆచి తూచి మాట్లాడండి._*

*_ఒకరి ఆత్మవిశ్వాసాన్ని అహంకారం అనుకోకు. ఒకరి నిజాయితీని పొగరు అనుకోకు. ఒకరి మౌనాన్ని చేతకాని వాడని అనుకోకు..._*

*_ఒకరు పలకరించలేదని గర్వం అనుకోకు. ఒకరు నీకు తందాన పాడలేదని ఆగ్రహించకు._*

*_అడుగులకు మడుగులు వత్తలేదని దూరం చేసుకోకు. అలా చేస్తే ఈ లోకంలో... నువ్వు ఎప్పుడూ ఏకాకివే._*

*_ఐనా... మనుసులో స్వచ్ఛత, ప్రేమా, దయ, కరుణ, లేనప్పుడు... నీవు నా దృష్టిలో ఎప్పుడు అజ్ఞానివే...☝️_*

     *_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*

🌿☘️🌿 🌷🙇‍♂️🌷 🌿☘️🌿
 *మీరు తప్పకుండా చదవాల్సిన ఓ మంచి నీతికథ*

*ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒకతను ఉండేవాడు. అతనికొక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే, ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అందుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో నేను కూడా చేరాలి అని.*

*దానికోసం యవ్వనం నుంచి బాగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళూ కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు.*
*40 ఏళ్ళ లోపే కోటీశ్వరుడయ్యాడు.*

*ఒక కోటి తర్వాత మరో కోటి. అలాఅలా యాభై ఏళ్ళ లోపే ఎన్నో కోట్లు కూడ బెట్టాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాల్లాంటివి రెండుమూడు కట్టించాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడున్న ఇళ్ళు కాకుండా నగరం మధ్యలో తన_హోదా ను చాటేలా, తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్రభవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు. దానికోసం మరింత కష్ట పడ్డాడు.*

*ఎలాగో అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి.*
*నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం  కట్టించాడు.*
*గృహప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు.*

*ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒక్క చోటే పోగుపడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి 'ఔరా' అని ఆశ్చర్యపోయారు అందరూ.* *శభాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు.*

*అతిథులంతా వెళ్ళిపోయాక తన పడకగదికి వెళ్ళి పడక మీద నడుము వాల్చాడు. భార్యా పిల్లలు ఇంకా ఫోన్లలో స్నేహితులతో ఆనందంగా మాట్లాడుతున్నారు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథుల కామెంట్లు, ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు. లక్ష్మీపతికి ఈ రోజెందుకో కంటి నిండా నిద్ర పోవా..లనిపిస్తోంది.*

*నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా*

 *నేను వెళ్తున్నా*
*అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అన్నారు. కళ్ళు తెరచి చూస్తే ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటిగా ఉంది.*

*ఎవరది? అన్నాడు లక్ష్మీపతి.*
*కానీ*
*తన గొంతు తనకే ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది.*

*నేను నీఆత్మను, నేను వెళ్తున్నా' ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం.*

*అదేంటి! నువ్వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా? కంగారుగా అన్నాడు లక్ష్మీపతి.*

*అవును! ప్రతిధ్వనించింది ఆత్మ.* 

*వద్దు వెళ్ళకు! చూడు ఎంత అందంగా, గొప్పగా కట్టించానో ఈ భవంతిని.*
*ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇవన్నీ నీ కోసమే కదా. నిన్ను సుఖపెట్టడానికే కదా.*
*నీ తృప్తి కోసమే కదా?*
*ప్లీస్ ఉండు.*
*నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు' అన్నాడు లక్ష్మీపతి.*

*అనుభవించాలా? ఎలా?* 

*నీ శరీరానికి డయాబెటిస్ కాబట్టి  తీపి పదార్థం తినలేను,* 
*నీ శరీరానికి BP సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపు కున్నాను.* 

*ఇవి కాక గ్యాస్, అల్సర్ ఉండనే వున్నాయి కదా!ఇష్టమైనది ఏదీ తినలేను, ఎందుకంటే నీ శరీరం ఇవన్నీ అరిగించుకోలేదు కాబట్టి.* 

*నీ శరీరం మొత్తం... నీ కళ్ళ నుండి కాళ్ళ వరకు ఒక రోగాలపుట్ట.*

*అడుగు తీసి అడుగు వేయ డానికి నువ్వెంత ఆయాస పడతావో మనిద్దరి కే  అది తెలుసు.*

*నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉండను???*

*ఎక్కడికక్కడ చెదలు పట్టి, దుమ్ము ధూళి, చెత్త చెదారంలతో శిధిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా?*

*నువ్వు కట్టించుకున్న ఈ అందమైన ఇంటితో నాకేంటి సంబంధం?*

*నేనుండేది నీ శరీరంలో. అదే నా అసలైన ఇల్లు కదా! నా ఇంటికి ఉన్న 9-ద్వారాలకూ సమస్యలే.*

*నాకు రక్షణ లేదు. సుఖం లేదు.*

*అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన పెద్ద జబ్బు డబ్బుజబ్బు.* 
*నీకు అది వచ్చిన నాటి నుండి నన్నసలు నిద్ర పోనిచ్చావా?*

*నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చావా?*
*చెమట కంపు రేపావ్*

*ప్రతి క్షణం ఇంకొకడితో పోటీపడి నాలో అసూయ నింపావు*

*ఇంకొకడిని అణగతొక్కడానికి  నాతో కుట్రలు చేయించావు.*

*ఎన్నిసార్లు నన్ను పగ, ద్వేషంతో రగిలిపోయేలా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలా, చేసావో గుర్తు తెచ్చుకో.*

*అర్థం కాని అడ్డమైన రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా?*

*ఇక నేనుండలేను వెళ్తున్నా!*

*ప్రతి మనిషికీ రేపటి గురించిన ఆందోళన ఎక్కువ య్యింది.*

*దాంతో ఈరోజు ఈక్షణాన్ని ఆనందించడం మరచి పోతున్నాడు.*
*దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరచి, మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు.*

*ఒక్కమాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి, అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు.*

*మన అవసరాలు తీర్చుకోడానికి కష్టపడాలి. ఆనందించడానికి కష్టపడాలి. మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతే కాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటంలో రీజనింగ్ ఉందా?*