Monday, August 7, 2023

జ్ఞాననేత్రం.....

 *జ్ఞాననేత్రం.....*

*రెండు కళ్లులేని అవధూత ఒకరు అమర్ నాథ్ గుహ ముందు కూర్చున్నారు. ఒకరిద్దరు ఆయనని గుర్తించిన సాధువులు సాష్టాంగ ప్రణామం చేశారు. ఆయన గురించి ఆ సాధువులనడిగితే అవధూత బాబా అని చెప్పారు. నేను ప్రణామం చేసాను. బైటో బేటా అన్నారు. ఈలోపు ఒకాయన బాబాకు పాదాలు తాకి నమస్కరించాలని వడి వడిగా పరుగెత్తుకొచ్చాడు. వెళ్ళిపో మూర్ఖుడా అని బాబా అరిచాడు. ఆయనక్కడే భయపడి ఆగాడు బాబా మీరు సమానత్వం కలిగిన వారు కదా ఒకరిని దగ్గరికి రానించి ఇంకొకరిని నిరాకరించుటకు కారణమేమి అని వినయంగా నేను అడిగాను.*

*ఎదురుగా ఉన్న తెల్లటి వస్త్రాలున్న వాడి పేరు శ్యామ్ లాల్ బొంబాయిలో పెద్దవ్యాపారి. భార్యకు భయపడి తల్లిదండ్రుల సేవ చేయవలసి వస్తుందని బీద వృద్ధాశ్రమంలో చేర్చాడు. అక్కడ 4 నెలల నుండి డబ్బులు చెల్లించనందున వృద్ధాశ్రమం వారు వీడి తల్లిదండ్రుల మెడలు పట్టి బయటికి నెట్టారు. రోడ్డులో అడుక్కోని తింటున్నారు. వీడు తల్లిదండ్రుల సేవ చేయకుండా ఎన్ని యాత్రలు చేస్తేనేమి. నీకు సంతానం కలుగుతుందా అని అరిచాడు బాబా వాడిని అడగండి అన్నారు. ఏమయ్య పెద్దమనిషి నిజమేనా అని అడగగా, అయ్యా అద్దం ముందుండి ముఖం దాచలేము. బాబా నా కళ్లు తెరిపించారు, దయచేసి నా తల్లిదండ్రులు ఇప్పుడెక్కడ ఉన్నారో బాబా వారే చెబితే ఎన్ని కష్టాలొచ్చిన నా ఇంట్లోనే సేవ చేస్తాను అన్నాడు.*

*శివాజీ టెర్మినల్ స్టేషన్ ముందున్నారు పోయిన వెంటనే తల్లిదండ్రులను సేవించు. దానధర్మం చేసుకో నీ వెంట వచ్చేది పుణ్యకర్మలె లేదంటే ఎంత సంపాదించినా ఇక్కడ వదిలి వెళ్లేదే, పుణ్యకర్మ ఫలమే నీ వెంట వస్తుంది. తల్లిదండ్రులు పెంచి పెద్దచేసి ఉన్న ఆస్తి ఇచ్చి, నీవే సర్వస్వంగా భావించి నీకు సేవలు చేశారు. వారి ఋణంలో పడకు అని బాబా చెప్పారు. బాబా మీ ఆజ్ఞ శిరసారవహిస్తాను. కాని మీకు కళ్లే లేవు ఎలా నన్ను తెల్లవస్త్రాల వాడు అన్నారు. ఒరే చర్మనేత్రాలు లేకున్నా జ్ఞాన నేత్రం లేనివాడే నిజమైన గుడ్డివాడు. ఇప్పుడు చెబుతా చూడు. ఇక్కడి సాధువులు ఇతను "రామ్ పురి నాసిక్" ఇతను "లక్ష్మణ్గిరి ఇఠార్గి" ఇతను "జ్ఞానానంద్ ఆంధ్రదేశం" ఇతను "సీతారామ్ బాబా అయోధ్య".. బేటా అందుకే జ్ఞాననేత్రము సంపాదించుకోవాలి.. అన్నారు.*

*అప్పుడు సేట్ జి బాబా మీరు గొప్ప మహాత్ములు కళ్లు లేకుండానే అందరినీ గుర్తించారు. నా కళ్లు తెరిపించారు బాబా ఇప్పుడు నా గురించి నా తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు. ఒక్కక్షణం ఆగి శ్యామ్లాలని ఎంతో అల్లారు ముద్దుగా ఒక్కడని గారాబంచేసి పెంచాము వాడు భార్యపై ప్రేమచే ఆమె చెప్పిందెల్లా వింటూ చివరికి మనల్ని రోడ్డుపై వేశాడు. వానికెలా పుణ్యమొస్తుంది అని నీ తండ్రి, మీరలా అనకండి హేరామ్ వాడు ఎక్కడున్నా చల్లగా ఉంటే మనకదే చాలండి అని నీ తల్లి అంటుంది. అదేరా తల్లి ప్రేమ అని బాబా చెప్పారు.*

*అప్పుడు ఆ సేట్ జి.. బాబా నాకొక మేలు చేయండి.. మీరు నా తల్లిదండ్రులకు ఒక సందేశం పంపండి మీ శ్యామ్లాల్లో మార్పు వచ్చింది మిమ్ముల ఇంటికి తీసుకెళ్ళి సేవ చేస్తాడు, మీరు అక్కడే అతనొచ్చిన దాక ఉండండి అని తెలుపండి. అని వేడుకున్నాడు. బాబా అతనిలో కలిగిన మార్పుకు సంతోషించి అలాగే నాయన అని ధ్యానముద్రలో ఉండి అతని తల్లిదండ్రులకు ఇక్కడి నుండే సందేశమిచ్చారు. ఈ మాటలు వారికి వినిపిస్తున్నాయి. వారు అలాగా హేరామ్ ఎంత సంతోష కరమైన వార్త వాడి కోసం ఇక్కడే ఎన్ని రోజులైనా ఎదురుచూస్తాము ఇద్దరికి కంటి చూపు తగ్గింది ఎక్కడికి వెళతాము, మీరెవరో మా శ్యామ్ని తొందరగా రమ్మని చెప్పండి చూడక చాలా కాలమైందని నీ తల్లిదండ్రులు అంటున్నారు. వెంటనే వెల్లి వారిని సేవించు నీకు సంతానము కలుగుతుంది అని బాబా అన్నారు. అప్పుడు బాబాకు మ్రొక్కి అతను వెళ్లి పోయాడు.*

*అప్పుడు నేను బాబాని బాబా మీరిక్కడ నుండే ఫోన్ కైనా ఈ అడవిలో సిగ్నల్స్ లేవు. ఈ భూమండలంలో మీకు ఏ ఎదురులేకుండా దూరంలోనిది దర్శించడం, వినడం, చూడడం, వారికి సందేశం పంపడం, వారితో మాట్లాడడం కొన్ని వేల కిలో మీటర్ల దూరం పనులు మీరు దగ్గరి వ్యక్తితో జరిపినట్టు జరిపారు. మీరు పుట్టుగ్రుడ్డివారై ఇంత గొప్పగా ఎలా తయారైయారు. అని అడుగగా.. అప్పుడు బాబా.. నాయన పూర్వం ఋషులకు పుస్తకాలు, ఫోన్లు, విమానాలు లేవు, ఆకాశంలో వెళ్లుట, మస్తకం నుండి మస్తకానికి చదువు చెప్పుట, సందేశాలు పంపుట చేసేవారు. మా గురువుతో యోగధ్యానం, గురుసేవ 20 సంవత్సరాలు కఠోరంగా చేసి నేర్చుకున్నాను. నిత్యం నిరంతరం 50 సంవత్సరాలు ధ్యానం చేశాను. నా వయస్సు 90 సంవత్సరాలు, ధ్యానంతో అన్నీ సిద్దిస్తాయి. కళ్లు లేకున్నా పర్వాలేదు జ్ఞాననేత్రం ఉంది చాలు అని అన్నారు.*

*బాబా.. నేడు మానవులు సాదన చేసి ఫలితం రాలేదని మాని వేస్తున్నారు ఎందుకు అని అడుగగా.. నాయన.. ఒక్క రోజులో ఏమి సాధించలేము ఋషులు, మునులు కొన్ని సంవత్సరములు కఠోర ధ్యానం చేస్తే ఫలితం పొందారు. మనస్సులో ఏ కోరిక, యోగం సైత ధ్యానం చేస్తే త్వరగా ఫలితమొస్తుంది. మనస్సును శూన్యం చేయాలి. వెంటనే ధ్యానావస్థ కలుగుతుంది. లేనిచో ఎన్ని రోజులు ధ్యానం చేసినా ఫలితం సున్నా. ధ్యానికి యోగం చక్కగా ఉపకరించుచూ. మనోలయం చేయుటకు శ్వాసని శ్వాసతో లయం చేసినచో ప్రాణాప్రాణంలు ఏకమై కేవల కుంభకం సిద్ధించి నిర్వికల్ప సమాధి సిద్ధిస్తుంది. అప్పుడు దివ్యనేత్రం తెరవబడుతుంది. ఆత్మజ్ఞానం లభిస్తుంది. త్రికాలజ్ఞానం కలుగుతుంది. ఎందరో యోగులు సర్వం తెలసి పిచ్చివాళ్ళలాగ మౌనంగా ఉన్నారు. యోగులు అంతటా ఉన్నా రహస్యంగా ఇతరులు గుర్తు పట్టకుండా వారిని మరుగు పరుచుకొని ఉంటారు. ఇప్పుడు నేను శ్యామ్ కళ్లు తెరిపించుటకే ఇలా చేశాను నేను రహస్యంగా ఉంటాను. మీరు సాధువులు యోగం ధ్యానం మహిమ గ్రహించారు కదా, ఇప్పుడు మీరు కూడా సాధన చేసి తరించండి. అని.. ఓం నమః శివాయ.. అని మౌనముద్రలోకి బాబా వెళ్లి పోయారు...*

   *🌟|| ఓం నమః శివాయ ||🌟*
🪷🪷🍁 🙏🕉️🙏 🍁🪷🪷

No comments:

Post a Comment