Saturday, August 26, 2023

నిగూఢ రహస్యాలు (ఓషో) తీర్థ యాత్రా స్థలాల -- రూపాంతర రసయోగం Chapter - 2

 *Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *నిగూఢ రహస్యాలు (ఓషో)* 🌺
🌹 *Chapter -- 2* 🌹
🌹 *తీర్థ యాత్రా స్థలాల -- రూపాంతర రసయోగం* 🌹
🌸 *Part --1*🌸

🌼 గొప్ప చైతన్యంతో కూడిన చాలా ఆత్మలు ఒకే స్థలంలో వారి శరీరాలను వదిలివేస్తే, అలాంటి ఆ చోటుకి, మరో తలానికి మధ్య దారి వేయవచ్చు.

🌷 భూమి మీద ఎక్కువ సాంద్రతతో వున్న చైతన్యం, తక్కువ సాంద్రతతో ఉన్న చైతన్యం ఉండే ప్రదేశాలు ఉన్నాయి.

🌿 తీర్థయాత్రా స్థలాలను సృష్టించడానికి గల ఒకే ఒక కారణం చైతన్యంతో కూడిన అతి శక్తివంతమైన క్షేత్రాలను సృష్టించడానికి చేసిన ప్రయోగమే, అప్పుడు ఎవరైనా అంతరంగ ప్రయాణం తేలికగా మొదలు పెట్టవచ్చు. తీర్థ యాత్రా స్థలాలు యాంత్రికంగా చైతన్యం ప్రవహించే స్థలాలు

🌳 నువ్వు ధ్యానం చేసేటప్పుడు, నిన్ను తప్పు మార్గంలోకి తీసుకువెళ్ళని స్థలాన్ని ఎన్నుకోవాలి. ధ్యానంలో ఆందోళన కలిగించే ఆలోచనలు వస్తే, మౌనంగా ఉండడం కష్టతరం అయితే, ఆ స్థలం నుంచి వెళ్ళిపో.

🍀 శరీరం నుండి ఆత్మకి శక్తి ప్రసారం ఎక్కడైతే జరుగుతుందో, ఎక్కడైతే వాతావరణం అంతా శక్తితో నింపబడి ఉంటుందో, ఎక్కడైతే కొందరు సమాధి స్థితిని చేరుకున్నారో, ఎక్కడైతే శతాబ్దాల తరబడి మనుష్యులు ముక్తిని పొందుతున్నారో, అదే తీర్థయాత్రా స్థలం! అలాంటి స్థలాలు విశిష్టంగా శక్తితో నిండి వుంటాయి.

🍁 తీర్థం అంటే అంతులేని సముద్రంలోకి తలక్రిందులుగా నీటిలో దూకడానికి ఏర్పరచిన ఒక బల్ల అని అర్థం. జైన పదం తీర్థంకరుడు అంటే అలాంటి తీర్థాన్ని, తీర్థ యాత్రా స్థలాన్ని సృష్టించే వాడు అన్నమాట. సాధారణ మానవులు అందులోకి   ప్రవేశించి, తమ అంతరంగంలో శోధన చేయడానికి అనువైన శక్తి క్షేత్రాన్ని సృష్టించగలిగిన వారిని మాత్రమే తీర్థంకరులు అనవచ్చు. జైనులు వారిని మానవ శరీరాన్ని ధరించిన దేవతలు అనరు, తీర్ధంకరులు అనే అంటారు. దేవుడి అవతారం కన్నా తీర్థంకరుడు చాలా గొప్ప ప్రక్రియ, ఎందుకంటే ఒక మనిషి రూపంలోకి దైవం ప్రవేశించడం మంచిదే, కానీ ఒక మనిషి దైవంలోకి ప్రవేశించడానికి అనువైన స్థలం తయారు చేయడం అన్నది మరింత గొప్ప విషయం.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌸 *నిగూఢ రహస్యాలు పుస్తకాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *నిగూఢ రహస్యాలు (ఓషో)* 🌺
🌹 *Chapter -- 2* 🌹
🌹 *తీర్థ యాత్రా స్థలాల -- రూపాంతర రసయోగం* 🌹
🌸 *Part --2*🌸

🌼 మనిషి జీవితంలో చైతన్యం తప్ప అంతా పదార్థంతో చేయబడిందే. కానీ ఆ అంతరంగ చైతన్యం ఏమిటో మనకు తెలియదు. మనకు ఈ శరీరం మాత్రమే తెలుసు, ఈ శరీరం అన్ని విధాలా పదార్ధానికి సంబంధించిందే. 

🍀 నీ శరీరంలోని ఉప్పు శాతం మారితే నీ చైతన్యంలో మార్పు ఉంటుంది. లెక్కలేనన్నిసార్లు వేడి చేసిన నీటిని తాగితే, అది నీ కోరికలలో, నీ నడవడిలో మార్పులు తెస్తుంది.

🍁 చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయడంతో కొన్ని రోజుల తర్వాత విసుగు పుడుతుంది. విసుగుపుట్టి ఆ ప్రక్రియ చేయడం మానితే, అతడు పాత మానసిక స్థితికి చేరతాడు; కాన్రీ విసుగుపుట్టిన క్షణమే నిర్ణయాత్మకమైన మార్పు కలిగే సమయం. విసుగు పుట్టినా అతడు ఆ ప్రక్రియని కొనసాగిస్తే కొత్త చైతన్యానికి జన్మనిస్తాడు.

🌿 ఏ నది నీటినైనా నిల్వ చేస్తే అది చెడిపోతుంది లేదా కలుషితం అవుతుంది, కానీ గంగాజలం ఎంతకాలం నిల్వ చేసివా ఏమీ కాదు. ఎలాంటి మార్పు లేకుండా ఆ నీటిని సంవత్సరాల తరబడి నిల్వ ఉంచవచ్చు. కానీ వేరే ఏ నది నీటినైనా అలా ఉంచితే, అవి కొద్ది వారాలలోనే చెడిపోతుంది, గంగా జలం పవిత్రతని పోగొట్టుకోకుండా ఉండడమే కాకుండా సంవత్సరాల తరబడి మారదు. వేరే నదులలోకి శవాలను విసిరితే, నది మురికిగా అవుతుంది, చెడు వాసన వస్తుంది, కాని గంగానది వేలాది శవాలను ఎలాంటి వాసన లేకుండా లీనం చేసుకుంటుంది. 

🌳 మరొక ఆశ్చర్యకరమైన విషయం ఉంది: ఎముకలు మామూలుగా నీటిలో కరగకపోయినా, గంగా జలంలో అవి తప్పనిసరిగా కరుగుతాయి - ఏమీ మిగలదు. గంగానదిలో ప్రతీదీ త్వరగా అఖండత్వాన్ని కోల్పోయి, ప్రాధమికమైన మూల పదార్థాల దశకు వస్తుంది. అందుకే శవాలను గంగలోకి తోయమని నొక్కి చెప్పడం, వేరే ఏ నదిలోనైనా లేదా శవాలను వదుల్చుకునే ఏ పద్ధతిలోనైనా, ఎముకలు అఖండత్వాన్ని కోల్పోవడానికి సంవత్సరాల తరబడి పడుతుంది - కానీ గంగానది ఆ పని చాలా త్వరగా చేస్తుంది; అదంతా రసాయనికంగా - ఈ లక్ష్యం కోసమే అది సృష్టించబడింది. 

🍀 ఏ మామూలు నదిలానో గంగానది, పర్వతం నుంచి పారడం లేదు, దాన్ని పారేలా చేసారు. ఈ ప్రక్రియని అర్థం చేసుకోవడం తేలిక కాదు. గంగోత్రి, ఎక్కడైతే గంగ పుట్టింది అంటున్నామో, అది చాలా చిన్న స్థానం కానీ అది గంగ అసలైన ఊట కాదు. నిజమైనది ఎప్పటికీ గోప్యంగా ఉంచబడి, కాపాడబడాలి. అక్కడ ఏముందో అది ముందుభాగం. యాత్రీకులు అక్కడికి వెళ్తారు, నమస్కరించి తిరిగి వస్తారు. వేలాది సంవత్సరాలుగా నిజమైన గంగోత్రి గోప్యంగా ఉంచబడి, కాపాడబడింది. సాధారణ పద్ధతుల ద్వారా అక్కడికి చేరుకోవడం జరగదు, సూక్ష్మ శరీర యాత్ర ద్వారానే అది సంభవం. స్థూల శరీరంతో అక్కడికి చేరడం జరగని పని. అసలైన గంగోత్రిని సూక్ష్మ శరీరంతో తప్ప స్థూల శరీరంతో చేరుకోలేవు. గంగోత్రిని భౌతికమైన కళ్ళతో చూడలేవు, ధ్యానంలో స్థూల శరీరాన్ని వెనుక వదిలితే, సూక్ష్మశరీరం గంగోత్రికి పయనించగలదు; అప్పుడు మాత్రమే గంగాజలం యొక్క ప్రత్యేక గుణాల రహస్యం గురించి తెలుసుకోగలరు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌸 *నిగూఢ రహస్యాలు పుస్తకాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *నిగూఢ రహస్యాలు (ఓషో)* 🌺
🌹 *Chapter -- 2* 🌹
🌹 *తీర్థ యాత్రా స్థలాల -- రూపాంతర రసయోగం* 🌹
🌸 *Part --3*🌸

☘️ గంగా నదిలో స్నానం చేయడం, వెంటనే ప్రార్ధన లేదా పూజ చేయడం, దేవాలయానికి లేదా ఒక పవిత్ర స్థలానికి వెళ్ళడం, అంతరంగ ఆధ్యాత్మిక ప్రయాణానికి బాహ్య శరీరాన్ని ఉపయోగించుకునే ఒక విధానమే.

🌿 ఈజిప్ట్ లోని పిరమిడ్లు గతించిన ఒక పాత నాగరికత తీర్థాలు. పిరమిడ్ల గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వాటి లోపల పూర్తిగా చీకటి ఉంటుంది. పిరమిడ్ల నిర్మాణం జరిగే నాటికి విద్యుత్తు ఉండి ఉండదని శాస్త్రజ్ఞుల ఆలోచన. పది వేల సంవత్సరాల క్రితం కొన్ని, ఇరవై వేల సంవత్సరాల క్రితం మరికొన్ని నిర్మించారు. వారు దివిటీల సాయంతో పిరమిడ్ లోకి వెళ్ళేలా సాధ్యపడి ఉండవచ్చు, గోడల మీద కానీ, పై కప్పు మీద కానీ ఎక్కడా పొగ చిహ్నాలు కనిపించ లేదు. 

🍁 పిరమిడ్ లో దారులు చాలా పొడవుగా, ఎన్నో మెలికలతో, వంపులతో మరియు అంతా చీకటిగా ఉంటుంది. విద్యుత్తు ఉండి ఉండకపోవచ్చు ఎందుకంటే విద్యుత్తు అమరికలు కానీ, విద్యుత్తు సరఫరా చోటు కానీ లేవు. దివిటీలు, మండే నూనె లేదా నెయ్యి పొగ ఏదైనా గుర్తులని వదిలేది. కాబట్టి లోపల మనుష్యులు ఎలా తిరిగేవారు అన్న సమస్య ఉదయిస్తుంది. కొందరు సూచించినట్లుగా, లోపలికి ఎవరూ వెళ్ళకపోతే అన్ని దారులు ఎందుకు పెట్టారు? అక్కడ చాలా దారులు, మెట్ల వరుసలు, తలుపులు మరియు లోపల కిటికీలు, కూర్చోవడానికి, నిలబడడానికి అనువైన ఏర్పాట్లు ఉన్నాయి. ఇదంతా దేనికోసం? ఇది విడదీయలేని ఒక చిక్కు ప్రశ్నగా మిగిలింది. ఏ చక్రవర్తికో ఉన్న మోజుతో పిరమిడ్లు కట్టబడ్డాయి అన్న భావం దృఢంగా ఉన్నంత కాలం అది  స్పష్టం కాదు. 

🌳 కానీ నిజానికి పిరమిడ్లు తీర్థాలు. అంతర్గత అగ్నితో ఎవరైనా సరియైన పద్ధతిలో ప్రయోగం చేసినప్పుడు, అతడి శరీరం నుండి కాంతి ప్రకాశం పుడుతుంది. అలాంటి వ్యక్తులే పిరమిడ్ లోకి ప్రవేశించడానికి అర్హులు. విద్యుత్తు కానీ, దివిటీల అవసరం కానీ ఎప్పుడూ లేదు; పిరమిడ్ లో కదలడానికి వారి శరీరపు కాంతి ప్రకాశం చాలు. అగ్నితో ప్రత్యేకమైన ధ్యాన పద్ధతుల ద్వారా శరీర కాంతి ప్రకాశం ఉత్పత్తి అవుతుంది. శరీర కాంతి ప్రకాశాన్ని ఉత్పత్తి చేయగలగడమే పిరమిడ్ ప్రవేశార్హత.

🌼 ఏ కొలతలతో గదిని నిర్మిస్తే ధ్యానానికి అనువుగా ఉంటుందో ప్రయోగాల ద్వారా తెలుసుకున్నారు. నీ చైతన్యాన్ని సంకోచింప చేయడానికి లేదా వ్యాకోచింప చేయడానికి అనువైన కొలతలతో గదిని నిర్మించుకోవచ్చు. గదుల లోపల, బయట వాడే రంగులు, గదిలోని సువాసన, ధ్వని తరంగ విజ్ఞానం, ధ్యానానికి సాయపడేలా అమర్చుకోవచ్చు.

☘️ అన్వేషకుడికి సాయం చేయడానికి తీర్థాలలో, దేవాలయాలలో ఎన్నో విధానాలు కని పెట్టారు. దేవాలయంలో గంటలు, వాటి నుండి జనించే శబ్దాలు, సాంబ్రాణి, పువ్వులు వాటి పరిమళం - అన్నీ ప్రత్యేకంగా సిద్ధపరచినవే. రాత్రింబవళ్ళు, అవిచ్చిన్నంగా ఒక ప్రత్యేకమైన సామరస్యత కొనసాగించడానికే అదంతా రూపొందించబడింది. 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌸 *నిగూఢ రహస్యాలు పుస్తకాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *నిగూఢ రహస్యాలు (ఓషో)* 🌺
🌹 *Chapter -- 2* 🌹
🌹 *తీర్థయాత్రా స్థలాల -- రూపాంతర రసయోగం* 🌹
🌸 *Part --4*🌸

🌼 నీటిని చాలాసార్లు ఆవిరిచేసి మళ్ళీ ద్రవంగా మారిస్తే , దాని విలువ మారుతుందని , అలాగే ఒక గదిలో ఒక శబ్దాన్ని వేలాదిసార్లు సృష్టిస్తే , ఆ గదిలోని ప్రకంపనలు , ఆ గది విలువ మారతాయి . ఒక అన్వేషిని ఆ గదిలోకి తీసుకువెళ్తే , అతడు మారడానికి సహాయం దొరుకుతుంది . ప్రదార్థం నుండే మన వ్యక్తిత్వం నిర్మించబడింది కనుక , పదార్థంలో ఎలాంటి మార్పులు  తెచ్చినా అవి మన వ్యక్తిత్వాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.

🌿 సాధారణంగా మనమంతా వేర్వేరు వ్యక్తులం అనే భ్రాంతిలో వుంటాం. అది సరియైన నమ్మకం కాదు. ఇక్కడ మనం చాలామంది కూర్చున్నాం , కానీ మనమంతా మౌనంగా కూర్చుంటే అప్పుడు వేర్వేరు వ్యక్తులు వుండరు , ఒకే ఒక మౌన వ్యక్తిత్వం ఉంటుంది . మన చైతన్యాలు కలిసి స్పందిస్తాయి మరియు అవి ఒక దానిలోకి మరొకటి ప్రవహిస్తాయి .

☘️ తీర్థం అనేది సమూహపు ప్రయోగం. సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన రోజు , వేలమంది జనాలు తీర్థం దగ్గర చేరతారు. అందరూ ఒకే వాంఛతో , ఒకే అభిలాషతో , వేలమైళ్ళ దూరం నుండి , ఒక నిర్దిష్టమైన ఘడియలో , ఒక నక్షత్రం లేదా నక్షత్ర సముదాయం క్రింద కలిసి ఉండడానికి వస్తారు. అంతమంది జనం ఒకే వాంఛత ఒకే అభిలాషతో , ఒక ప్రార్థన , ఒక ధ్యేయంతో ఉండడంతో చైతన్యపు మడుగు సృష్టించబడుతుంది . అప్పుడు అక్కడ చాలామంది వ్యక్తులు వుండరు . 

🌳 కుంభమేళా వేడుకలో పదికోట్ల జనాల చైతన్యాలను మడుగులా చేరిస్తే , అన్ని కలిసి సమగ్రమైన ఒకే చైతన్యం అయితే , అంతమంది వ్యక్తులలోకి వేర్వేరుగా ప్రవేశించడం కన్నా కలిసి ఉన్న చైతన్యంలోకి దైవత్వం ప్రవేశించడం తేలిక . ఇది చాలా పెద్ద సంపర్క క్షేత్రం .మానవ చైతన్యం పెద్ద సంపర్క క్షేత్రంగా తయారైనప్పుడు , దానిలోకి దైవత్వం ప్రవేశించే అవకాశం ఎక్కువ అవుతుంది .

🍁 స్త్రీల ఋతుస్రావం క్రమపద్దతిగా ఉంటూ, అది ఏదో రకంగా చంద్ర భ్రమణానికి సంబంధం కలిగి ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా, సాధారణంగా ఉంటే 28 రోజుల తర్వాత ఋతుస్రావం జరుగుతుంది . ఆ చక్రం తెగితే , ఆ స్త్రీ శరీరంలో ఎక్కడో ఏదో క్రమం తప్పిందని అర్థం.

🍀 నువ్వు దేనినైనా స్వీకరించడానికి సిద్ధంగా వుండి , ఆ పూర్తి ఎరుకలో వుంటే , ఆ జరిగేది నీ అనుభవంలోకి వస్తుంది . ఆ క్షణంలో నువ్వు నిద్రమత్తులో , ఎర్రుకలేని స్థితిలో ఉంటే ఆ సంఘటన నీ అనుభవంలోకి రాదు .

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌸 *నిగూఢ రహస్యాలు పుస్తకాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.

👍 *VicTorY oF Light*🌟🌕✨💥☣

*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *నిగూఢ రహస్యాలు (ఓషో)* 🌺
🌹 *Chapter -- 2* 🌹
🌹 *తీర్థయాత్రా స్థలాల -- రూపాంతర రసయోగం* 🌹
🌸 *Part --5*

🌷 అసలు సమస్య పాపం కాదు, దాని జ్ఞాపకమే. నిన్ను అంటి పెట్టుకుని ఉండేది పాపం కాదు, పాపపు చర్య జ్ఞాపకమే. నువ్వు ఎవరినైనా చంపితే, దాని జ్ఞాపకం నీ జీవితమంతా ఒక పీడకలలా వెంటాడుతూనే ఉంటుంది. హత్య చేసినా, చేయకపోయినా అది నాటకంలో భాగమేనని, అది అంత ముఖ్యం కాదని ఆత్మ పరమైన విషయాలు తెలిసినవారు చెబుతారు. ఎవరూ చావరు, ఎవరూ చంపబడరు. కానీ హత్య తాలూకు జ్ఞాపకం నీ గుండె పై రాయిలా ఉంటుంది. ఆ చర్య జరపబడి, అనంతంలోకి మాయమైంది; అనంతం దాన్ని లీనం చేసుకుంటుంది. సత్యం ఏమిటంటే అన్ని చర్యలు అనంతానికి సంబంధించినవే. నువ్వు అనవసరంగా కలత పడుతున్నావు. నువ్వు దొంగతనం చేస్తే, అది నీ ద్వారా అనంతం చేసిన పని. నువ్వు చేసిన పని వల్ల నీ జ్ఞాపకాలతో నువ్వు అనవసరంగా మధ్యలోకి వస్తున్నావు మరియు ఆ జ్ఞాపకం నీ పై ఓ బరువు లాంటిది.

🌼 *“పశ్చాత్తాపపడు, నీ పాపాలు నేను తీసివేస్తాను”* అని అంటాడు జీసస్. జీసస్ ని నమ్మిన వారు బరువు తొలగించుకుని, పరిశుద్ధులై ఇంటికి తిరిగి వస్తారు. నిజానికి జీసస్ మిమ్మల్ని మీ పాపాల నుండి కాదు, వాటి జ్ఞాపకాల నుంచి విముక్తులని చేస్తాడు. జ్ఞాపకం అనేది నిజం; దాన్ని మాత్రమే జీసస్ తొలగిస్తాడు. 

🌳 అలాగే గంగ మీ పాపాల నుండి మిమ్మల్ని విముక్తులని చేయదు, పాపాల జ్ఞాపకాల నుంచి మీకు విముక్తి కలిగించగలదు. గంగ పై ఎవరికైనా నమ్మకం ఉంటే, నదిలో స్నానం చేస్తే పాపాల నుండి విముక్తి పొందుతారు అన్నది నమ్మితే వేలాది సంవత్సరాలుగా నిర్మించుకున్న సామూహిక చైతన్యం ఈ నమ్మకాన్ని బలపరిస్తే - అతడు నివసిస్తున్న సమాజం కూడా దాన్ని ధృవీకరిస్తే అప్పుడు విముక్తుడు అవుతాడు. అలాగే గంగలో స్నానం చేయటం వలన పాపం పోదు, ఎందుకంటే పాపం అప్పటికే చేయబడింది - చేయబడిన దొంగతనం లేదా హత్య గురించి ఏమీ చేయలేరు- కానీ ఆ నమ్మకంతో గంగలో నుండి అతడు బయటికి వస్తే, దాని స్వచ్ఛతలో, శక్తిలో అతడికి వున్న నమ్మకం, స్నానం చేయటం అన్నది  కేవలం ఒక సంకేత చర్య అయినా, అతడిని అపరాధభావం నుండి విముక్తుడిని చేస్తుంది. 

🌿 జ్ఞాపకమే ఒక బంధనం అయ్యింది. నిన్ను వెంటాడే పాపపు నీడే అపరాధి. దాని నుండి విముక్తి పొందవచ్చు. కానీ దానికి ఒక షరతు ఉంది. అతి ముఖ్యమైన షరతు ఏమిటంటే - నువ్వు పాపం నుండి విముక్తుడివి అవుతావన్న దానిలో నీకు సంపూర్ణ విశ్వాసం ఉండడం.

🍀 శాశ్వతంగా ఉండే తీర్థాలు కొన్ని ఉన్నాయి - అందులో కాశీ ఒకటి. కాశీ మరియు వారణాసి తీర్థం కాని కాలం అంటూ భూమ్మీద లేదు. ఇవి మానవుడి తీర్థయాత్రా స్థలాలలో అతి పురాతనమైనవి, కాబట్టి అతి సుదీర్ఘ చైతన్య ప్రవాహంగా ఇవి అతి విలువైనవి.

🍁 బుద్దుడు కాశీకి వెళ్ళాడు, జైన తీర్థంకరులు కాశీలోనే పుట్టారు, శంకరాచార్య కూడా కాశీకి వెళ్ళాడు, కబీరు కాశీలో నివసించాడు; కాశీ తీర్థంకరులని, అవతారులని, ఋషులని చూసింది. కానీ వారెవరూ ఇప్పుడు లేరు. వారందరి పవిత్రతను, వారి ఆధ్యాత్మిక యోగ్యతను, వారి జీవన సరళిని, వారి సామూహిక పరిమళాన్ని కాశీ లీనం చేసుకుంది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌸 *నిగూఢ రహస్యాలు పుస్తకాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *నిగూఢ రహస్యాలు (ఓషో)* 🌺
🌹 *Chapter -- 2* 🌹
🌹 *తీర్థ యాత్రా స్థలాల -- రూపాంతర రసయోగం* 🌹
🌸 *Part --6*🌸

🌷 నువ్వు ఒంటరిగా ఎక్కడో ధ్యానంలో కూర్చుంటే, నీ చుట్టూ ఉన్న ఆత్మలని నువ్వు చూడలేవు . కానీ తీర్థంలో వారి ఉనికిని గురించిన అనుభవం చాలా అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు అది ఎంత గాఢంగా ఉంటుందంటే, ఆత్మల ఉనికి కన్నా నీ ఉనికే తక్కువగా ఉందని నీకు అనిపిస్తుంది.

🌼 నువ్వు కైలాసం చేరుకున్న క్షణం నుండీ ధ్యానం చేయగలిగితే చాలా ఆత్మలు, అద్భుతమైన ఆత్మలు అక్కడ నివసిస్తున్నాయని చెబుతావు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ధ్యానం చేయలేకపోతే, కైలాసం నీకు శూన్యంగా కనిపిస్తుంది. రైలులో వచ్చిన వారు మురికిగా, మరింత కంపుకొడుతూ ఉండే కాశీ నే చూస్తారు. కంటికి కనిపించే కాశీ మాత్రమే ఇది. అందమైన ఆ మరో కాశీ కవి ఊహలలో మాత్రమే ఉంటుందని కొందరు అంటారు - కానీ ఈ కాశీ కూడా అక్కడే ఉంది. ఈ ప్రాపంచిక కాశీ కనిపించని కాశీకి సంపర్క క్షేత్రం. 

🌿 రైలులో వచ్చిన వారు రోతగా ఉండే కాశీని మాత్రమే దర్శించి ఇంటికి తిరిగి వెళ్తారు, కానీ ధ్యాన వాహనంలో కూర్చుని వచ్చిన వారు ఆధ్యాత్మిక కాశీని తాకుతారు. ధ్యానం ద్వారా ఎవరు చేరతారో, వారు ఆధ్యాత్మిక కాశీని చేరతారు. 

☘️ కైలాస పర్వతం పైన ఇహ లోకానికి సంబంధించని రూపంలో ఉన్న ఉనికి ఉందని చెప్పాను. రమారమి అక్కడ ఎప్పుడూ 500 మంది బౌద్ధ సిద్ధులు ఉంటారు; 500 మంది జ్ఞానోదయం పొందిన బుద్ధుళ్ళు ఎప్పుడూ కైలాసం పైనే ఉంటారు. అందులో ఒకరికి వేరొక చోటుకి ప్రయాణం చేయవలసి వస్తే, అతడు తన స్థానాన్ని మరొక బుద్ధుడు తీసుకుంటే తప్ప వెళ్ళడు. కైలాసాన్ని ఒక తీర్థంగా చేయడానికి అక్కడ తప్పనిసరిగా కనీసం 500 మంది జ్ఞానోదయం పొందిన బుద్ధుళ్ళు ఉండాలి. జ్ఞానోదయం పొందినవారు ఒక నిర్దిష్ట సంఖ్యలో కాశీలో తప్పనిసరిగా ఉంటారు. 

🌳 జ్ఞానోదయం పొందిన ఒక వ్యక్తి భౌతిక శరీరాన్ని వదిలి వేసినప్పుడు, అతడి కరుణ అతడి వెనకాల కొన్ని భౌతిక చిహ్నాలను వదిలేలా చేస్తుంది. తనతో తిరిగిన వారికి, తను సూచించినదంతా చేసిన వారికి, జ్ఞానోదయ సిద్ధి కోసం చాలా ప్రయత్నించి విఫలమైన వారికి సహాయం చేయటం కోసం తను కొన్ని మార్గదర్శక సూచనలు, చిహ్నాలు వదలాలి. వారికి అవసరం అనిపించినప్పుడు అతడితో సంబంధం ఏర్పరచుకోవచ్చు. 

🍁 ఈ రోజు రాడార్ చేస్తున్న పనిని తీర్థాలు చేస్తున్నాయి: కళ్ళతో చూడలేని నక్షత్రాలను రాడార్ కనిపెడుతుంది. తీర్థాలు ఆధ్యాత్మిక రాడార్లు; ప్రస్తుతం శరీరంలో లేనివారికి మరియు ఇక్కడ సశరీరంతో ఉన్న వారికి, తీర్థం ద్వారా సమాచారం ఏర్పరచుకోవచ్చు. ఆధ్యాత్మిక పథంలో నడుస్తున్నవారికి, ఇంకా గమ్యం చేరని వారికి, ఇంకా దారితప్పే అవకాశం ఉన్నవారి కోసం, శరీరాలు వదిలిన వారు ఏర్పరచినవే ఈ తీర్థాలు. వెనుక ఉండిపోయిన వారు కొన్ని సందర్భాలలో ఏదైనా అడగవలసిన అవసరం రావచ్చు, ముందుకు సాగడానికి అది తెలుసుకోవటం తప్పనిసరిగా అవసరం కావచ్చు. అది తెలియకపోతే వారు దారితప్ప వచ్చు. వారి భవిష్యత్తు ఏమిటో వారికి తెలియదు, ముందున్న దారి వారికి తెలియదు; కాబట్టి అవసరం ఉన్న అలాంటి అన్వేషకుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయబడ్డాయి - తీర్థాలు, దేవాలయాలు, మంత్రాలు, విగ్రహాలు లాంటివి. అవన్నీ క్రతువులు, అయినా కానీ అవి తప్పనిసరిగా ఆచరించవలసిన నిర్దిష్టమైన ప్రక్రియలు.

☘️ బుద్దుడు జ్ఞానోదయం పొందినప్పుడు బోధి చెట్టు బుద్ధుడి చైతన్యాన్ని లీనం చేసుకుని ఉంటుంది. బుద్ధుడికి సంభవించిన జ్ఞానోదయం అనుభవం అంతకు ముందు ఎప్పుడూ జరగని అసాధారణమైన సంఘటన. జ్ఞానోదయానికి ముందు, బుద్దుడు చాలా కాలం ఆ చెట్టు క్రింద నివసించాడు. ధ్యానంతో అలసిపోయినప్పుడు, ఆ చెట్టు చుట్టూ తిరిగే వాడు - ఆ చెట్టుతో కలిసి ఉన్నంత కాలం అతడు ఎవరితోనూ లేడు. ఆ చెట్టుతో జీవించినంత సులువుగా, నిర్మలంగా వేరెవ్వరితోనూ జీవించగలిగి ఉండేవాడు కాదు. అతడు దానిక్రింద నిద్రపోయాడు, దానిక్రింద కూర్చున్నాడు, దాని చుట్టూ తిరిగాడు; అతడు బహుశా దానితో మాట్లాడి ఉంటాడు. ఆ చెట్టు యొక్క ప్రాణశక్తి అంతా బుద్ధుడితో నిండిపోయింది, తడిచిపోయింది, శక్తివంతమైంది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌸 *నిగూఢ రహస్యాలు పుస్తకాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣


No comments:

Post a Comment