నీ ఆత్మగౌరవాన్ని వస్తువులతో కొలవకు! | Real Wealth vs Fake Luxury | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=qfJgTNSZdcw
Transcript:
(00:00) మీరు సంపాదించే ప్రతి రూపాయి మీ తలరాతని మార్చాలి కానీ మీ అహంకారాన్ని కాదు కానీ ఈరోజు మనం చేస్తున్నది ఏంటి ఎవరో పరాయివాడి కాలల్లో మనం గొప్పగా కనిపించాలని చెప్పేసి మన జేబులో ఉన్న కష్టాన్ని తగలేస్తున్నాం. అవసరాలు తీర్చుకోవడానికి సంపాదించాల్సింది పోయి పక్కవాడికి మనం డబ్బు ఉన్నోళ్ళం అని చెప్పేసి చూపించుకోవడానికి మనం అప్పులు చేస్తూ ఉంటాము.
(00:24) శ్రీ అరబిందు గారు ఒక మాట అనేవారు మనిషి తన బాహ్య అవసరాల కోసం లోపల ఉన్న ప్రశాంతతని బలిస్తున్నాడు అని ఈరోజు ఇప్పుడే ఆలోచించు నువ్వు డబ్బును వాడుతున్నావా లేక డబ్బే నిన్ను వాడుకుంటుందా? ఇంక డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే డబ్బు లేకపోవడం సమస్య కాదు వచ్చిన డబ్బుని ఎలా ఉంచుకోవాలో తెలియకపోవడం అసలైన దరిద్రం. ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక రంగుల కలలా కనిపిస్తుంది.
(00:47) కొత్త ఫోన్ అవ్వచ్చు, బ్రాండెడ్ బట్టలు అవ్వచ్చు, ఖరీదైన వస్తువులు అవ్వచ్చు ఇవి ఉంటేనే నువ్వు సక్సెస్ అయినట్లు సమాజం నీకు నూరిపోస్తుంది. మనం కూడా ఆ మాయలో పడిపోతున్నాం ఆ విషయం మనకు కూడా అర్థం కావట్లేదు. శ్రీ అరవిందు గారు మానవ పరిమాణం గురించి చెబుతూ మనిషి తన ఇంద్రియాలకు బానిస కాకూడదు అని చెప్పేసి హెచ్చరించారు.
(01:08) కానీ మనం మన కళ్ళకు నచ్చిన ప్రతి వస్తువు కోసం మన భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నాం. దీన్నే షో ఆఫ్ కల్చర్ అంటారు. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే 1 రూపాయల మనిషిగా కనిపించాలని మీరు పడే తాపత్రాయం ఉందో చూడండి అది మిమ్మల్ని చాలా నాశనం చేస్తుంది. మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. జీవితం రాగానే అది మన అకౌంట్ లో పడక ముందే దేనికి ఖర్చు పెట్టాలి ఏ ఇన్స్టాల్మెంట్ కట్టాలి అనే లిస్ట్ రెడీగా ఉంటుంది.
(01:33) అంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీదే మీకు అధికారం లేదు. అది మిమ్మల్ని నడిపిస్తుంది. సో నువ్వు కూడా ఒక యంత్రంలో మారావు. పొద్దున్న లేవడం, పనికి వెళ్ళడం, సంపాదించడం, ఆ డబ్బుని ఇతరులకు కట్టేయడం ఇందులో మీకంటూ మిగిలేది ఏంటి కేవలం అలసట. మానసిక ఒత్తిడి మాత్రమే. మనం ఆస్తులను కూడబెట్టుకోవడం మానేసి అప్పులని అలంకరించుకుంటున్నాం. అంటే పాయింట్ ఏంటంటే డబ్బు సంపాదించాలి అందులోనూ మనం ఆస్తులను కూడబెట్టుకోవడంలో తప్పు లేదు కానీ వస్తువులే మన ఆస్తులు అనుకొని అందులోనూ వస్త్రాలే మన ఆస్తులు అనుకుంటే చాలా పెద్ద పొరపాటే.
(02:06) మీరు చూడండి జీవితంలో చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు వస్తువులకి వస్త్రాలకి పెద్దగా విలువఇవ్వరు. వీళ్ళేంట్రా బాబు ఇంత సింపుల్ గా ఉంటారని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళు సింపుల్ గా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు డబ్బుని దేనికి ఖర్చు పెట్టాలో బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా నేను గొప్ప అని చెప్పేసి నేను డబ్బు ఉన్నవాడిని అని చెప్పేసి వాళ్ళు చూపించుకోవడానికి ఇష్టపడరు.
(02:30) ముఖ్యంగా ఈ అమ్మాయిల జోలికి అసలు వెళ్లరు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అని మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. ఎందుకు మనం ఇలా తయారయ్యాం ఎందుకు సంపాదన పెరిగినా సంతోషం పెరగట్లేదు. దీనికి కారణం మన లోపల ఉన్న అభద్రత భావం. మనల్ని మనం తక్కువగా ఊహించుకోవడం వల్లే బయట వస్తువులతో మనం విలువ పెంచుకోవాలని చూస్తాము. అంటే ఇప్పుడు మనం ఉన్నామ అనుకోండి మనం మామూలు మనుషులం అనుకోండి మనం మామూలు మనుషులం అని చెప్పేసి మనం ఫీల్ అయితే ఏం ప్రాబ్లం లేదు.
(02:57) 10 మందిలో నాకు విలువ తక్కువ నా దగ్గర ఐఫోన్ ఉంటే నన్ను గొప్పగా చూస్తారు. నా కాళ్ళకు ఒక ₹5000 రూపాయల షూస్ ఉంటే నాకు కొంచెమైనా రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పేసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఆ వస్తువులు మీ దగ్గర ఉంటే వాళ్ళు మిమ్మల్ని గొప్పగా చూస్తారు అనుకోవడం వల్లే ఈ సమస్యలన్నీ వస్తాయి. శ్రీ అరవిందో గారి దృష్టిలో మనిషికి అసలైన శక్తి తన అంతరాత్మ నుంచి రావాలి.
(03:20) కానీ మనం ఆ శక్తిని ఐఫోన్ కెమెరాలోనో లగ్జరీ కార్ లోగోలోనో వెతుకుతున్నాం. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను గొప్పవాడిని అనుకోవడం అహంకారం. అహంకారం నిన్ను ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనివ్వదు. పక్కవాడు కొత్త మోడల్ కారు కొనగానే నీ కారు పాతది అయిపోతుంది. నిజం చెప్పాలంటే పనికి రాని వస్తువు అయిపోతుంది. ఇది ఒక విషవలయం. సమాజం నిన్ను ఒక వినియోగదారుడిగా మాత్రమే చూడాలనుకుంటుంది.
(03:44) నువ్వు ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే ఈ కార్పొరేట్ ప్రపంచానికి అంత లాభం. అందుకే నీకు ప్రతి నిమిషం యాడ్స్ ద్వారా నీ దగ్గర ఇది లేదు. అందుకే నువ్వు వెనకబడి ఉన్నావని గుర్తు చేస్తూనే ఉంటారు. మనం ఆ ట్రాప్ లో పడిపోతున్నాం. శ్రీ అరబిందు గారు ఒకచోట ఇలా అంటారన్నమాట అజ్ఞానం అంటే ఏమి తెలిగిపోవడం కాదు ఏది అవసరమో అది అనవసరమో తెలుసుకోపోవడం అని అవసరం లేని వస్తువులు మనకి ఇష్టం లేని వ్యక్తులు ఇంప్రెస్ చేయడానికి మన దగ్గర లేని డబ్బుతో కొనడమే ఈ తరపు అతి పెద్ద ట్రాజడీ.
(04:13) సో బేసికల్గా కొంతమంది ఉంటారన్నమాట. ఇప్పుడు ఐఫోన్ తనకి అవసరం లేదు అసలు దాంతో పని కూడా లేదు. కాకపోతే తన దగ్గర లేని డబ్బుతో అంటే ఈఎంఐ తో ఆ ఫోన్ కొని నా దగ్గర ఇది ఉంది నేను గొప్ప అని చెప్పుకొని ఆ ట్రాప్ లో పెడతారు చూశారు వాళ్ళు నిజమైన అమాయకులు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఆర్థిక స్వేచ్ఛ లేని జీవితం బానిస బ్రతుకుతో సమానం అంటే డబ్బు ఉన్నా కూడా వాటిని ఈఎంఐలు కట్టుకుంటూ వాటిని ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగించుకోకపోతే మాత్రం వాళ్ళు నిజమైన బానిసలు అని చెప్పేసి అంటారు.
(04:45) ఇప్పుడు ఇల్లుకి మనం డబ్బులు కడుతున్నాం అనుకోండి ఈఎంఐ అది కచ్చితంగా జీవితాంతం మనతో ఉంటుంది. కట్టినా తప్పులేదు. ఒక సెల్ ఫోన్ కానీ ఒక బైక్ కానీ ఇంకొక ఐదారు సంవత్సరాల్లో పాడైపోయే వస్తువులు కూడా మనం జీవితాంతం కడుతూనే ఉంటాం కదా రెండు సంవత్సరాలని మూడు సంవత్సరాలు అని చెప్పేసి దాన్ని ఆయన బానిస బ్రతుకు అంటారు. నువ్వు చేసే ఉద్యోగం నీకు నచ్చకపోయినా ఆ అప్పులు కట్టడానికి నువ్వు వెళ్ళక తప్పట్లేదు కదా అంటే నువ్వు స్వతంత్రుడివి కాదు నువ్వు కేవలం ఒక జీతగాడివి మాత్రమే అని చెప్పేసి ఆయన అంటాడు.
(05:15) మరి ఈ సమస్యని ఎలా అధిగమించాలి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఎలా అధిగమించాలంటే దీనికి కావాల్సింది సంకల్పం శ్రీ అరవిందో గారి బోధనల్లో ఈక్వాలిటీ ఆఫ్ మైండ్ అనే పదం వినిపిస్తూ ఉంటుంది. అంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎవరో ఏదో అన్నా సరే నీ మనసు నిలకడగా ఉండాలి. నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా నీ విలువ తగ్గదు అనే నమ్మకం నీలో కలగాలి. మొదటి మెట్టు ఆస్తులు మరియు అప్పులు.
(05:39) ఆస్తులకి అప్పులకి మధ్య తేడా తెలుసుకోవాలి. నీ జేబులోకి డబ్బులు తెచ్చేది ఆస్తి నీ జేబులో నుంచి డబ్బులు తీసేది అప్పు నువ్వు కొనే కొత్త ఫోన్ ఆస్తి కాదు అది ఒక తరుగుదల ఉన్న వస్తువు నువ్వు చేసే పెట్టుబడి మాత్రమే నీకు రక్షణ ఇస్తుంది. అరబిందు గారు చెప్పినట్లు ప్రతి మనిషి తన జీవితంపై పూర్తి కాన్షియస్నెస్ ఉండాలి. నువ్వు రూపాయి ఖర్చు పెడుతున్నావు అంటే అది నీ జీవిత కాలంలో కొంత భాగాన్ని వెచ్చించి సంపాదించింది అని గుర్తుంచుకోవాలి.
(06:07) ఆ రూపాయి ఖర్చు చేసేటప్పుడు అది నీకు నిజంగా అవసరమా లేక నీ అహానికి అవసరమా అని చెప్పేసి ప్రశ్నించుకోవాలి. రెండవ మెట్టు నిరాడంబరత గొప్పగా బ్రతకడం అంటే ఖరీదైన వస్తువుల మధ్య ఉండటం కాదు కనీస అవసరాలతో అత్యున్నతమైన ఆలోచనలు చేయడం నీ ఆర్థిక స్థితిని కేవలం అంకెల్లో కాకుండా నీకున్న స్వేచ్ఛలో కొలుచుకో నీకు నచ్చిన పని చేయడానికి నీ దగ్గర ఎంత సమయం ఉంది? అంతేకాకుండా నీ కుటుంబంతో గడపడానికి నీకు ఎంత సమయం ఉంది? ఇదే అసలైన సంపద.
(06:37) ఈ విషయం చాలా మందికి అర్థం కావట్లేదు. సరే ఇదంతా పక్కన పెట్టండి. మన జీవితాన్ని మనం ఎలా మెరుగుపరుచుకోవాలి అని మీరు అడిగితే మాత్రం ఇప్పుడు అసలైన ప్రాక్టికల్ అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం. జీవితం కేవలం ఫిలాసఫీతో మారదు. ఆచరణతో మారుతుంది. శ్రీ అరబిందో గారు యోగ అంటే కేవలం కళ్ళు మూసుకోవడం కాదు ప్రతి పనిని దైవ కార్యంలా పరిపూర్ణంగా చేయడం.
(06:59) మీ ఆర్థిక క్రమశిక్షణ కూడా ఒక రకమైన సాధన కావాలి. ముందుగా ఒక సూత్రం పెట్టుకోండి 20% రోల్ నీకు ఎంత ఆదాయం వచ్చినా అందులో 20% నీ కంటికి కనిపించకుండా అది నీ భవిష్యత్తు కోసం నీ ఆస్తుల కోసం పక్కన పెట్టాలి. మిగిలిన 80% తోనే నీ ప్రపంచాన్ని నిర్మించుకోవాలి. అది నిన్ను అప్పుల వైపు వెళ్ళకుండా కాపాడుతుంది. గుర్తుంచుకోండి సంపద అనేది ప్రదర్శించడానికి కాదు అది మిమ్మల్ని రక్షించడానికి నీ దగ్గర కోటి రూపాయలు ఉండి నువ్వు సాధారణ కార్నో వెళ్తే ఎవరికీ నష్టం లేదు కానీ మీ దగ్గర కేవలం కొంత డబ్బులు మాత్రమే ఉండి అప్పు చేసి కోటి రూపాయల కారులో వెళ్తే ఆ భారంతో నువ్వు అనుభవించే
(07:35) నరకం ఇంకా వర్ణనా తీరం. శ్రీ అరవిందు గారి మాటల్లో చెప్పాలంటే మనలోని దివ్యత్వం మేల్కొనాలి అంటే మనకి మనపై నియంత్రణ ఉండాలి. మన కోరికల మీద మనకి పట్టు ఉండాలి. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. నేను నా అవసరాల కోసం బ్రతుకుతాను. ఇతరుల అభిప్రాయాల కోసం కాదు అనవసరపు ఖర్చులను తగ్గించి మీ స్కిల్స్ పెంచుకోవడానికి పెట్టుబడి పెట్టండి.
(07:59) అది మాత్రమే మీకు జీవితాంతం తోడుంటుంది. మీ ఆర్థిక స్వేచ్ఛ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు సంపాదించే ప్రతి పైసా మీకు బలం కావాలి కానీ మీ మెడకి ఊరితాడు కాకూడదు. ఈ క్షణమే మీ ఖర్చుల డైరీ తెరిచి చూడండి. అందులో ఏమి మీకు ప్రాణం పోస్తున్నాయి ఏమి మీ ప్రాణం తీస్తున్నాయి అనేది మీకు అర్థం కావాలి. ఎందుకంటే మీరు ఎంత దాచి పెట్టుకుంటున్నారు ఎంత ఖర్చు చేస్తున్నారు ఆ చేసే ఖర్చులో కూడా మీకు అవసరమైనవా అనవసరమైనవా అందరూ కొంటున్నారు అనుకుంటున్నారా లేకపోతే మీకు అవసరం ఉన్నది కాబట్టి కొంటున్నారా ఇలా ప్రతి ఒక్క దాన్ని మీరు ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటూ
(08:35) ఉండాలి. ఒక మనిషికి వాల్యూ అనేది అతని దగ్గర ఉన్న వస్తువుల వల్ల కాదు అతను జీవించే జీవితం వల్ల వస్తుందన్నమాట. కొంతమంది ఉంటారు ఎక్కువగా ఈఎంఐలు పెట్టేసుకుంటూ ఉంటారు. పోనీ అవేమన్నా ప్రాపర్టీస్ అసెట్స్ అంటే కానే కాదు అవి కేవలం వస్తువులు మాత్రమే కొన్ని సంవత్సరాల తర్వాత పాడైపోతాయి. మరి ఆ వస్తువులు పాడైపోయిన తర్వాత నిజంగా వాళ్ళకు విలువ ఉంటుందా ఉండదు కదా అలాగే మీరు ఏం చేస్తారంటే వస్తువులకు ప్రాధాన్యత తగ్గించి మీ జీవితం మీద ఫోకస్ చేయండి.
(09:03) మీకు నిజంగా అవసరం ఉంటే ఖర్చు పెట్టండి తప్పులేదు. మీరు వేరే వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర ఉంది కదా మన దగ్గర కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఖర్చు పెడితే మాత్రం మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్లే కాబట్టి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం ఆపేయండి. ఈరోజు మీ దగ్గర ఉన్న వస్తువులని తీసేస్తే సమాజం ముందు నిలబడటానికి మీ దగ్గర మిగిలేది మీ అసలైన గుర్తింపు ఏంటి కింద కామెంట్ చేయండి.
(09:26) ఈ ప్రయాణంలో మీ మార్పు ఈ క్షణం నుంచే మొదలవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందులోనూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరి ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీ కోసం ఇంకొక రెండు అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి.
(09:42) ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి బాయ్. ఓం
No comments:
Post a Comment