అందర్నీ ఆకర్షించే 6 మాటలు | 6 Communication Tips | Telugu Geeks
Author Name:Telugu Geeks
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguGeeks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=luuzJG4-Ryg
Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా గమనించారా ఆఫీస్ లో మీకంటే తక్కువ కష్టపడే వాడికి త్వరగా ప్రమోషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో మీకు అనిపిస్తుంటుంది వీడికి అంత టాలెంట్ లేదురా కానీ వీడి దగ్గరికి ఇంతమంది జనాలు ఎందుకు క్యూ కడతారు అని మీకు అనిపిస్తుంది. మీరు ఎలా ఆలోచిస్తారంటే నాకు అన్ని అర్హతలు ఉన్నాయి అయినా సరే జనం నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు వాడి దగ్గర అంత సీనే లేదు కానీ వాడంటే ఎందుకు జనాలు అంత ఫిదా అయిపోతున్నారు అని మీరు ఆలోచించే ఉంటారు.
(00:26) ఇదంతా అదృష్టం అనుకుంటున్నారా? లేదు. ఇది అచ్చమైన సైకలాజికల్ మ్యాజిక్ ఒక రకంగా దీన్ని ఒక హాలో ఎఫెక్ట్ అని అంటారు అంటే మీరు నోరు విప్పకముందే లోకం మిమ్మల్ని ఒక హీరో లాగా లేదా ఒక విన్నర్ లాగా ముందునుంచి చూసే ఒక గ్రేట్ ట్రిక్ మనం అనుకుంటాం బాగా చదువుకుంటే కష్టపడి పని చేస్తే గౌరవం వస్తుందని కానీ నిజం ఏంటో తెలుసా ఈ ప్రపంచం మిమ్మల్ని ఎలా చూస్తుందో దాన్ని బట్టి మీకు వాల్యూ పెరుగుతుంది.
(00:51) అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక మ్యాజిక్ వర్డ్ కరిస్మా కరిస్మా అనేది పుట్టుకతో వచ్చేది కాదు అది ఒక స్కిల్ నేర్చుకునేది. మీరు ఎదుటి వారికి ఎలా కనిపిస్తున్నారు వాళ్ళని ఎలా ఫీల్ అయ్యేలా చేస్తున్నారు అనే దాని మీద మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మీరు ఒక అయస్కాంతం లాగా మారి అందరిని ఆకర్షించాలి అని మీరు అనుకుంటే నలుగురిలోకి వెళ్ళినప్పుడు అందరూ మీ మాటే వినాలి అని మీకు అనిపిస్తే మీరు రైట్ వీడియో చూస్తున్నారు.
(01:17) ఈరోజు వీడియోలో ఎదుటివారి మైండ్ ని హ్యాక్ చేసి మిమ్మల్ని ఇన్స్టెంట్ గా ఒక మాగ్నెటిక్ పర్సనాలిటీగా మార్చే సిక్స్ పవర్ఫుల్ సైకలాజికల్ ట్రిక్స్ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయను వీడియో మొదలు పెట్టేద్దాం పదండి. ముందుగా మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పా కదా ద హాలో ఎఫెక్ట్ దీని గురించి మాట్లాడుకుందాం.
(01:46) వర్షం పడే ముందు లేదా ఆకాశం మబ్బుగా ఉన్నప్పుడు సూర్యుడు చుట్టూ ఒక పెద్ద వెలుగు వలయం లాగా కనిపిస్తుంది. నిజానికి అది సూర్యుడు కాదు కేవలం సూర్యుడి యొక్క రేస్ వల్ల ఏర్పడిన ఒక బ్రమ అదే హలో కానీ దూరం నుండి చూస్తే అదంతా కూడా పెద్ద సూర్యుడులాగా మనకు కనబడతాడు. సరిగ్గా మనుషుల విషయంలో కూడా మన బ్రెయిన్ ఇలాగే ఆలోచిస్తుంది.
(02:05) ఒక వ్యక్తిలో మనకి నచ్చిన ఒకే ఒక్క మంచి క్వాలిటీ ఉంటే ఆ వెలుగు వల్ల వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని మంచోళ్ళని మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. ఆ ఒక్క పాజిటివ్ పాయింట్ వల్ల వాళ్ళ లోపాల్ని మనం చూడకుండా వదిలేస్తాం. దీన్నే హాలో ఎఫెక్ట్ అని అంటారు. దీన్ని ఎడ్వర్డ్ థాన్ డైక్ అనే ఒక సైకాలజిస్ట్ 1920 లో కనిపెట్టారు.
(02:27) మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళ కింద పని చేసే సోల్జర్స్ కి రేటింగ్ ఇచ్చేవారంట. అప్పుడు ఇది గమనించారు ఆయన. ఒక సోల్జర్ చూడటానికి స్ట్రాంగ్ గా ఉంటే ఆ ఆఫీసర్స్ అతని గురించి తెలుసుకోకుండానే వాడికి డిసిప్లిన్ ఉంది వీడికి తెలివు ఉంది అని మిగతా విషయాల్లో కూడా ఎక్కువ మార్కులు వేసేసారు. అంటే ఒకే ఒక ఫిజికల్ క్వాలిటీని బట్టి అతని క్యారెక్టర్ మొత్తం తోపు అని ఆఫీసర్స్ ఫిక్స్ అయిపోయారు.
(02:49) ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక ఫంక్షన్ కి వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి నీట్ గా బట్టలు వేసుకొని కాన్ఫిడెంట్ గా నవ్వుతూ మీకు కనిపించాడు. అతన్ని చూడగానే మీ మైండ్ ఎలా ఆలోచిస్తుంది వీడు బాగా రెడీ అయ్యాడు అంటే కచ్చితంగా మంచి జాబ్ చేస్తున్నాడు బాగా రిచ్ అయి ఉంటాడు మంచి తెలివైనవాడు కూడా అయి ఉంటాడు అని మీరు ముందే అనేసుకుంటారు.
(03:08) నిజానికి అతను ఆ బట్టలు అద్దికి తెచ్చుకుని ఉండొచ్చు లేదా బయట మనుషులతో చాలా బ్యాడ్ గా బిహేవ్ చేసే వ్యక్తి అయి ఉండొచ్చు మనోడికి అసలు అంత సీన్ లేకపోయి ఉండొచ్చు అంటే తెలివి తేటలు లేకపోయి ఉండొచ్చు. కానీ ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అనే హాలో వల్ల మీరు అతని నెగిటివ్ పాయింట్స్ ని అసలు చూడలేదు. ఇక్కడ బ్రాండ్స్ కూడా ఈ హాలో ఎఫెక్ట్ ని చాలా బాగా వాడతాయి.
(03:25) ముందు సెలబ్రిటీల గురించి ఆలోచిద్దాం. మీకు నచ్చిన ఒక హీరో లేదా క్రికెటర్ ఒక కొత్త కూల్ డ్రింక్ యాడ్ లో కనిపిస్తే ఆ హీరో మీద ఉన్న ఇష్టంతో ఆ ప్రొడక్ట్ కూడా చాలా బాగుంటుందని చాలా మంది నమ్ముతారు. నా ఫ్రెండ్ సచిన్ టెండూల్కర్ ఫ్యాన్ ఇప్పటికి కూడా అడిస్ కంపెనీ షూస్ లేదా బట్టలు కొనడానికే ఇష్టపడతాడు. ఇది సచ్చిన్ వల్ల ఎడిడాస్ కంపెనీ మీద అతనికి క్రియేట్ అయిన హలో అలాగే appపిల్ఆపిల్ ఐఫన్ చాలా బాగుంటుంది కాబట్టి ఆ కంపెనీ నుండి వచ్చే వాచ్ గాని లాప్టాప్ గాని ఐపాడ్ గాని ఇవన్నీ రిలీజ్ అవ్వకముందే మనం బుక్ చేసేసుకుంటాం.
(03:56) కచ్చితంగా అద్భుతంగా ఉంటుందని మనం ముందలే అనేసుకుంటాం. సో ఐఫ కి ఉన్న క్రేజ్ మిగిలిన డివైసెస్ మీద కూడా అలా పడుతుంది. అందుకే చాలా మంది appపిల్ ఐఫ కొన్న తర్వాత స్లోగా ఆ ఎకోసిస్టం లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే హాలో ఎఫెక్ట్ అనేది ఫామ్ అవ్వడం ఈజీ కానీ తర్వాత స్లోగా జనాలకి మన నిజం అనేది బయటికి వచ్చేస్తుంది తెలిసిపోతుంది.
(04:15) సో ముందు మనం కూడా మన పనిలో కరెక్ట్ గా ఉంటే హాలో ఎఫెక్ట్ ఎక్కువ కాలం పని చేస్తుంది. లైక్ అడిడాస్ ని తీసుకోండి సచిన్ బ్రాండ్ అంబాసిడర్ అయినా సరే అంటే ఆ టైంలో ఈ టైంలో నాకు తెలిీదు బ్రాండ్ అంబాసిడర్ కాదు బట్ క్వాలిటీ విషయంలో ఎడిడాస్ టాప్ మంచి ప్రొడక్ట్స్ అలాగే ఇస్తుంది అలాగే ఆపిల్ ప్రొడక్ట్స్ తీసుకున్న బేసిక్ గా అవి స్మూత్ గా ఉంటాయి క్వాలిటీలో ఆపిల్ కూడా బాగుంటుంది.
(04:38) సో అవి హాలో ఎఫెక్ట్ ని ఇంకొంచెం ఎక్కువ కాలం తీసుకువెళ్తాయి. సో ఈ హాలో ఎఫెక్ట్ ని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఈ హాలో ఎఫెక్ట్ ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ కలగాలంటే ముందు నీట్ గా రెడీ అవ్వండి. కాన్ఫిడెంట్ గా కనబడండి అంతే ఈ రెండు చేయండి చాలు. మీరు ఇచ్చే ఆ ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంటే జనం మీ చిన్న చిన్న తప్పుల్ని వదిలేస్తారు.
(04:59) మిమ్మల్ని ఒక హీరోలా చూస్తారు. మీరు ఆలోచించండి ఊరికినే జనాలు హీరోలు వెంట పడరు హీరోలు చాలా కష్టపడతారు వాళ్ళ ఇమేజ్ కోసం అలాగే మనం అట్లీస్ట్ కొంచెం కష్టపడి రెడీ అయితే అది ఒక హలో క్రియేట్ చేస్తుంది. సాధారణంగా ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఒక మంచి వార్త చెప్తే ఏం చేస్తాం అంటే నాకు ప్రమోషన్ వచ్చింది లేదా నేను కొత్త కారు కొన్నాను అంటే మనం ఏం చేస్తాం ఓ అవునా సూపర్ వెరీ గుడ్ మంచిది కంగ్రాాట్స్ అని సింపుల్ గా అనేస్తాం.
(05:28) కానీ సైకాలజీ ప్రకారం మీరు ఇలా రియాక్ట్ అయితే అవతలి వ్యక్తికి మీ మీద పెద్దగా ఇంప్రెషన్ కలగదు. నలుగురిలో మీరు స్పెషల్ గా కనిపించాలంటే మీరు యక్టివ్ కన్స్ట్రక్టివ్ గా రెస్పాండ్ అవ్వాలి. అంటే ఎదుటివాడి సక్సెస్ ని మీ సక్సెస్ లాగా సెలబ్రేట్ చేయాలి. మన హీరోలు లేదా మూవీ ప్రొడ్యూసర్స్ మూవీ హిట్ అయితే మనం చూస్తూ ఉంటాం ఈ మధ్యన పెద్ద పెద్ద కార్లు డైరెక్టర్లకి గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నారు.
(05:50) గుజరాత్లో ఒక డైమండ్ మర్చెంట్ తన స్టాఫ్ మొత్తానికి కార్లు ఇచ్చాడు. ఎందుకు యు డిడ్ గుడ్ అని వదిలేయచ్చు కదా కరిస్మా మెయింటైన్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ కింద పని చేసే వాళ్ళ సక్సెస్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం కార్లు బైకులు ఇవ్వలేం కానీ మన మాటలయతే ఫ్రీ కాబట్టి అవి ఇచ్చేద్దాం. దానికి త్రీ స్టెప్స్ ముందుగా ఉత్సాహం చూపించండి వామ్మో అద్దిరిపోయిందిరా కంగ్రాాట్స్ అని ఫేస్ లో ఒక ఆనందంతో చెప్పండి రెండోది ప్రశ్నలు అడగండి అసలు నీకు ఆ న్యూస్ తెలిసినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావురా మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు
(06:24) అని వాళ్ళని ఇంకా మాట్లాడించండి. మూడోది క్రెడిట్ ఇవ్వండి. నువ్వు దీనికోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసురా ఇది నీకు రావాల్సిందే ఇది నీకు దక్కాల్సిందే యు డిసర్వ్ ఇట్ అని వాళ్ళని మెచ్చుకోవాలి. ఎందుకు ఈ ట్రిక్ మిమ్మల్ని హీరోగా చూపిస్తుంది ప్రతి మనిషికి తన గురించి తను గొప్పగా చెప్పుకోవాలని ఉంటుంది. మీరు ఎప్పుడైతే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చి వాళ్ళ సంతోషాన్ని డబుల్ చేస్తారో అప్పుడు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ లో మీరు ఒక అద్భుతమైన వ్యక్తిలాగా రిజిస్టర్ అయిపోతారు.
(06:50) లోకమంతా కుల్లుకునే వాళ్ళతో నిండిపోయింది. ఇలాంటి టైంలో పక్కవాడు గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఎంకరేజ్ చేసే మిమ్మల్ని అందరూ ఒక లీడర్ లాగా ఒక హీరో లాగా చూడటం మొదలు పెడతారు. గుర్తుంచుకోండి మీరు ఎంత తెలివైన వారో చూపించుకోవడం కంటే కూడా వేరే వాడు ఎంత గొప్పవాడో మీరు గుర్తించడం ముఖ్యం మీరు వాళ్ళని గెలిపిస్తే వాళ్లే మిమ్మల్ని ప్రేమిస్తారు.
(07:13) అమెరికా వ్యవస్థాపకుల్లో ఒకళ్ళైన బెంజమిన్ ఫ్రాంక్లిన్ దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ కథ మొదలైంది. ఆయన గవర్నెన్స్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయన్నను అస్సలు ఇష్టపడేవాడు కాదంట. ఎప్పుడు ఆయన్ని తిడతా ఉండేవాడు. ఫ్రాంక్లిన్ అతన్ని తన వైపు తిప్పుకోవడానికి ఒక తెలివైన పని చేశాడు. ఆ వ్యక్తి దగ్గర ఒక చాలా రేర్ బుక్ ఉందని ఫ్రాంక్లిన్ కి తెలుసు అప్పుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆయనక ఒక లెటర్ రాశడు.
(07:36) నీ దగ్గర ఉన్న పుస్తకాన్ని నాకు ఒక రెండు రోజులు ఇస్తావా చదువుకొని ఇచ్చేస్తాను అని ఒక చిన్న సహాయం అడిగాడు. ఆ వ్యక్తి పుస్తకాన్ని పంపించాడు. వారం తర్వాత ఫ్రాంక్లిన్ ఆ పుస్తకాన్ని తిరిగిస్తూ ఒక థాంక్స్ నోట్ పెట్టాడు. ఆశ్చర్యకరంగా ఆ తర్వాత నుండి ఆ వ్యక్తి ఫ్రాంక్లిన్ కి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. అందుకే ఈ ట్రిక్ ని బెన్ ఫ్రాంక్లిన్ ఎఫెక్ట్ అని అంటారు.
(07:58) సాధారణంగా మనం ఎవరినైనా ఇంప్రెస్ చేయాలంటే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి అనుకుంటాం. కానీ సైకాలజీ ఏం చెప్తుందంటే మనం ఎవరినైనా హెల్ప్ అడిగితే వాళ్లే మనల్ని ఎక్కువగా ఇష్టపడతారు. దీనికి కారణం కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటే ఆ వ్యక్తి బ్రెయిన్ తనలో తాను ఇలా అనుకుంటుంది. నేను వీడికి హెల్ప్ చేస్తున్నాను అంటే వీడు కచ్చితంగా మంచోడై ఉండాలి. అందుకే నేను సహాయం చేస్తున్నాను అని తనని తాను ఒప్పించుకుంటాడు.
(08:21) ఈ బెన్ ఫ్రాంక్లిన్ ఎఫెక్ట్ ని మనం లైఫ్ లో ఎలా వాడుకోవాలి ఆఫీస్ లో మీకు నచ్చని కొలీగ్ లేదా మిమ్మల్ని పట్టించుకొని బాస్ దగ్గరికి వెళ్లి సార్ ఈ విషయంలో మీ సలహా కావాలి మీరు మంచి సజెషన్ ఇస్తారని వచ్చాను అని ఒక చిన్న అడ్వైస్ అడగండి. ఫైనాన్షియల్ అడ్వైస్ అడగొచ్చు లైక్ మీరు మంచి ఇన్వెస్టర్ అని విన్నాను నాకు కూడా ఇన్వెస్ట్మెంట్ లో ఒక మంచి ఐడియా ఇవ్వండి అని అడగండి.
(08:41) మీరు గనుక ఒకళని గౌరవించి అడిగితే వాళ్ళు మంచిగా ఫీల్ అవుతారు మీ గురించి వెంటనే మీ మీద వాళ్ళక ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది ఏర్పడిపోతుంది. సో ఈ పాయింట్ గట్టిగా గుర్తుంచుకోండి. అలాగే కొత్త మనుషులతో ఎవరైనా కొత్త వాళ్ళతో మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు బ్రో టైం ఎంత అయింది చెప్తారా అని అడగొచ్చు. ఇక్కడ మంచి కాఫీ ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా అని ఒక చిన్న హెల్ప్ అడగండి.
(09:02) మీరు అడగడం వల్ల వాళ్ళకి మీ మీద ఒక తెలియని నమ్మకం ఒక ఇష్టం మొదలైపోతాయి. అలాగే రిలేషన్షిప్స్ లో ఇది ఎలా వాడొచ్చుఅంటే నాకు ఈ వర్క్ లో కొంచెం హెల్ప్ చేస్తావా అని మీ పార్ట్నర్ ని అడగండి. మీరు వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు అని తెలిసినప్పుడు వాళ్ళు ఇంకా మీ మీద బాధ్యతగా ప్రేమగా ఫీల్ అవుతారు. అండ్ ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే మీరు అన్ని తెలిసిన సర్వజ్ఞానిల బిల్డప్ ఇవ్వడం కంటే కూడా ఎదుటివాడిని ఒక చిన్న సాయం అడిగి వాళ్ళని హీరో చేయడం వల్ల మీరే వాళ్ళ దృష్టిలో రియల్ హీరో అవుతారు.
(09:32) 1966 లో ఎలియట్ ఆరోన్సన్ అనే ఒక సైకాలజిస్ట్ ఇది కనిపెట్టాడు. ఆయన ఒక ఇంట్రెస్టింగ్ ప్రయోగం చేశారు. ఒక తెలివైన వ్యక్తి ఇంటర్వ్యూ ఇస్తూ చివర్లో పొరపాటున తన మీద కాఫీ వలగపోసేసుకున్నాడు. ఆశ్చర్యకరంగా ఆ చిన్న తప్పు చేసిన తర్వాతే అతన్ని ఇంకా ఎక్కువగా వీళ్ళు ఇష్టపడటం మొదలు పెట్టారు. ఇదే ప్రాట్ ఫాల్ ఎఫెక్ట్ అంటే వెనక్కి పడిపోవడం ముందుకు వెళ్తూ ఒకేసారి వెనక్కి పడిపోవడం.
(09:56) ఇది మనక ఎలా ఉపయోగపడుతుంది మనం నలుగురిలోకి వెళ్ళినప్పుడు అస్సలు తప్పులు చేయకూడదని చాలా పర్ఫెక్ట్ గా ఉండాలని మనం ట్రై చేస్తాం. కానీ మీరు అతిగా పర్ఫెక్ట్ గా ఉంటే జనం మిమ్మల్ని ఒక మెషిన్ లాగా లేదా ఒక అహంకారి లాగా అయ్యబో వీడికి చాలా తెలుసు అన్నట్టు చూస్తారు. అదే మీరు ఒక చిన్న పొరపాటు చేసి దాన్ని చూసి మీరే నవ్వుకుంటే మీరే అందరికీ అరే వీడు కూడా మనలాంటోడేరా అని అనుకుంటారు.
(10:19) ఆ చిన్న హ్యూమానిటీ మిమ్మల్ని అందరిలో వెరీ స్పెషల్ గా మారుస్తుంది. మీరు రాజకీయ నాయకుల స్పీచ్లో హీరోల స్పీచ్లో చూడండి వాళ్ళు ఏమైనా మర్చిపోతే నవ్వుతూ ఇలా మర్చిపోయాను అని మర్చిపోయాను సారీ అంటారు. మనం వాళ్ళని ఒక దేవుడిలాగా చూస్తాం కానీ వాళ్ళు స్పీచ్ లో ఇలాంటి చిన్న చిన్న తప్పులు లేదా తడబాట్లు చేసినప్పుడు వాళ్ళతో ఒక హ్యూమన్ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. అండ్ అది బలంగా ఉండిపోతుంది.
(10:41) ఇది మనం ఎలా ఉపయోగించొచ్చు ప్రెసెంటేషన్ ఇస్తున్నప్పుడు మీరు స్టేజ్ మీద మాట్లాడుతున్నారు. ఏదైనా పదం మర్చిపోతే కంగారు పడకుండా సారీ ఈ మధ్య నా చిప్ సరిగ్గా పని చేయట్లేదు మర్చిపోయాను అని అనండి నవ్వుతూ ఆడియన్స్ అందరూ మీకు కనెక్ట్ అవుతారు అండ్ ఒక సీరియస్ టాపిక్ లో కూడా మంచి కామెడీగా మాట్లాడితే జనాలు ఎక్కువగా ఇష్టపడతారు.
(10:59) ఇంటర్వ్యూలో కూడా మీరు అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి చివర్లో ఏదైనా మీకు తెలియకపోతే సారీ ఇది నాకు తెలియదు అని నిజాయితీగా చెప్తే ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి మీ మీద ఇంకా గౌరవం పెరుగుతుంది. పర్ఫెక్ట్ గా ఉండాలని చూసి జనాన్ని దూరం చేసుకోకండి మీరు పర్ఫెక్ట్ కాదని తెలిస్తేనే జనం మిమ్మల్ని ప్రేమిస్తారు. ఆ చిన్న ప్లాట్ఫామ్ మిమ్మల్ని వేరే వాళ్ళకి ఇంకా దగ్గర చేస్తుంది.
(11:22) మనలో చాలా మందికి ఉండే ఒక పెద్ద అలవాటు ఏంటంటే నలుగురిలోకి వెళ్ళినప్పుడు నేను చాలా తెలివైన వాడిని నాకు చాలా విషయాలు తెలుసు అని ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం. కానీ సైకాలజీ ఏం చెప్తుందంటే మీరు మీ తెలివి తేటలను చూపిస్తే జనం మిమ్మల్ని చూసి అసూయ పడతారు అమ్మో వీడు పెద్ద నసగాడురా అని అనుకుంటారు.
(11:40) అదే మీరు గనుక వేరేవాడిని వీడు ఎంత తెలివైన వాడో అని మీరు గనుక గుర్తిస్తే వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారు. ఇది ఎలా పనిచేస్తుంది ప్రతి మనిషికి ఉంటుంది కదా నా గురించి నేను గొప్పగా చెప్పుకోవాలని అనుకుంటాను. అందరూ వాళ్ళని గుర్తించాలని ఒక బలమైన కోరిక వాళ్ళకి ఉంటుంది. మీరు ఎప్పుడైతే అవతల వ్యక్తికి ఆ ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళ దృష్టిలో మీరు ఇన్స్టెంట్ గా ఒక హీరో అయిపోతారు.
(12:02) మీరు వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తారు. సో మీరు ఎలాగ దీన్ని వాడొచ్చు మాట్లాడటం కంటే వినడం ముఖ్యం అని తెలుసుకోండి. ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు మధ్యలో ఆపకుండా పూర్తి శ్రద్ధతో విని అవునా ఆ తర్వాత ఏమైందని వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయండి మాట్లాడనివ్వండి. మీరు వాళ్ళ మాట వింటున్నారంటే మీరు వాళ్ళకి వాల్యూ ఇస్తున్నారని వాళ్ళు తెలుసుకుంటారు.
(12:19) అలాగే సలహ అడగడం ఈ విషయంలో నీ జడ్జిమెంట్ బాగుంటుంది అందుకే నిన్ను అడుగుతున్నాను అని ఒక చిన్న సలహా అడగండి. దీనివల్ల వాళ్ళు చాలా స్పెషల్ గా ఫీల్ అవుతారు. అలాగే గుర్తించండి. ఆఫీస్ లో ఒక చిన్న పని చేసినా నువ్వు భలే చేశవు బ్రో ఇది నీ వల్లే అయింది అని అందరిలో మెచ్చుకోండి. ఆ ఒక్క మాట వాళ్ళకి మీ మీద లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఇంప్రెషన్ ఇస్తుంది.
(12:40) ఈ ప్రపంచంలో అందరూ నేనే తోపు అని అనిపించుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి టైంలో మీరు ఎదుటివాడిని తోపు అని గుర్తిస్తే వాళ్ళ మనసులో మీ ప్లేస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీరు వాళ్ళని గొప్పగా ఫీల్ అయ్యేలా చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఒక మాగ్నెటిక్ పర్సనాలిటీలా చూస్తారు. చాలా మంది కరిస్మా అంటే గంటలు తరబడి మాట్లాడటం జోకులు వేసేయడం అని అనుకుంటారు.
(13:04) కానీ రియల్ చీట్ కోడ్ ఏంటో తెలుసా తక్కువ మాట్లాడటం మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీరు మాట్లాడే ప్రతి మాటకి అంత వాల్యూ పెరుగుతుంది. సైకాలజీ ప్రకారం ఎవరు తక్కువ మాట్లాడితే వాళ్ళని లోకం హై స్టేటస్ ఉన్న వ్యక్తిగా చూస్తుంది. ఇది ఎలా పని చేస్తుందంటే మీరు ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు అందరూ వాగుతున్న మీరు మాత్రం ప్రశాంతంగా వింటూ ఉండండి.
(13:26) ఎప్పుడైతే మీరు నోరు విప్పుతారో అప్పుడు అందరూ నిశబ్దంగా మీ మాట వింటారు ఎందుకంటే మీ మాటలు అరుదుగా స్కేర్స్ గా వస్తున్నాయి. ఏదైనా వస్తువు తక్కువగా దొరికితే దానికి డిమాండ్ ఎలా పెరుగుతుందో మీకు అందరికీ తెలుసు అలాగే మీరు కూడా తక్కువగా మాట్లాడితే మీ మాటలకు కూడా ఆ డిమాండ్ పెరుగుతుంది. అండ్ గుర్తుంచుకోండి ఈ టెక్నిక్ ఇంకా మీకు బాగా పని చేయాలంటే ముగింపు మీదే అవ్వాలి.
(13:46) ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు అందరి పాయింట్స్ వినండి. చివర్లో అందరినీ కలిపి ఒక పవర్ఫుల్ పాయింట్ చెప్పండి. ఆ మీటింగ్ అయిపోయాక అందరికీ మీ పాయింట్ ఎక్కువగా గుర్తుంటుంది. అలాగే నిశబ్దాన్ని భరించండి. ఎవరైనా మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినప్పుడు వెంటనే ఆన్సర్ చెప్పండి ఒక టూ సెకండ్స్ ఆగి వాళ్ళ కళ్ళల్లోకి చూసి అప్పుడు చెప్పండి.
(14:05) ఆ రెండు సెకండ్ల గ్యాప్ లో మీ పవర్ ఏంటో వాళ్ళకి అర్థమైపోతుంది. అలాగే ఎవరు అడగనిదే చెప్పకండి. మీ గురించి మీరు డబ్బా కొట్టుకోవడం ఆపేయాలి. ఎవరైనా అడిగినప్పుడు మాత్రమే చాలా సింపుల్ గా షార్ట్ గా ఆన్సర్ ఇవ్వండి. మీ గురించి వాళ్ళకి ఒక మిస్టరీ ఉండాలి. ఆ మిస్టరీనే మిమ్మల్ని ఒక అయస్కాంతం లాగా ఒక మాగ్నెటిక్ పర్సనాలిటీ లాగా మారుస్తుంది. గుర్తుంచుకోండి సింహం ఎప్పుడు పడితే అప్పుడు గర్జించదు.
(14:26) అది అడుగు పెడితే చాలు అడవంతా సైలెంట్ అయిపోతుంది. మీరు కూడా నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీ మాటల్ని జాగ్రత్తగా వాడండి. తక్కువ మాట్లాడేవాడికి లోకం ఇచ్చే గౌరవం వేరే లెవెల్ లో ఉంటుంది. సో ఇప్పుడు వీడియో చివరికి వచ్చేసింది ఒకసారి ఫాస్ట్ గా టపా టపా రివైజ్ చేసేద్దాం. ముందుగా పాయింట్ వన్ వాట్ ఇస్ ద హలో ఎఫెక్ట్ ఒక మంచి గుణం నీలో ఉంటే చాలు లోకం నిన్ను ఒకేసారి తోపు అని ఫిక్స్ అయిపోతుంది.
(14:46) సో నీ ఫస్ట్ ఇంప్రెషన్ బాగుండేలా చూసుకో యక్టివ్ కన్స్ట్రక్టివ్ రెస్పాండింగ్ పక్కవాడి విజయాన్ని నీదిలా సెలబ్రేట్ చెయ్ వాడి సంతోషాన్ని నీ మాటలతో డబల్ చెయ్ లోకం కుల్లుకునే వాళ్ళతో నిండిపోయింది మనస్ఫూర్తిగా మెచ్చుకుంటే నువ్వే లీడర్ అవుతావ్. ద బెన్ ఫ్రాంక్లిన్ ఎఫెక్ట్ ఎదుటివాడికి సహాయం చేయడం కంటే ఒక చిన్న సాయం అడిగితే వాడు నిన్ను ఎక్కువ ప్రేమిస్తాడు.
(15:07) నువ్వు అన్నీ తెలిసిన సర్వజ్ఞాని అవ్వక్కర్లేదు ఎదుటి వాడికి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ దృష్టిలో హీరో అయిపో ద ప్లాట్ఫాల్ ఎఫెక్ట్ అతిగా పర్ఫెక్ట్ గా ఉండాలని చూసి దూరం పెంచుకోకు చిన్న పొరపాట్లు చేసి అందరికీ మనవాడిలాగా అనిపించుకో నీ హ్యూమానిటీని నిజాయితీని చూపించు అప్పుడే జనం నిన్ను ఒక మెషీన్ లా కాకుండా మనిషిలా ప్రేమిస్తారు.
(15:26) మేక్ దెమ ద స్మార్టెస్ట్ పర్సన్ నీ తెలివితేటలు చూపిస్తే అసూయ పడతారు. అదే ఎదుటివాడు తోపు అని మీరు గుర్తిస్తే నిన్ను నెత్తిని పెట్టుకుంటారు. మాట్లాడటం కంటే కూడా వినడం నేర్చుకో ఎదుటివాడిని గొప్పగా ఫీల్ అయ్యేలా చేస్తే నువ్వే ఒక అయస్కాంతంలా మారుతావ్. ద స్కేర్సిటీ ఆఫ్ స్పీచ్ ఎంత తక్కువ మాట్లాడితే నీ మాటకంతా డిమాండ్ పెరుగుతుంది.
(15:46) నీ నిశబ్దమే నీ హై స్టేటస్ ని చూపిస్తుంది. గుర్తుంచుకో సింహంలా గర్జించాల్సిన పని లేదు. కరిస్మా అంటే గంటలు తరబడి మాట్లాడటం కాదు నీ పక్కన ఉన్నవాడిని గొప్పగా ఫీల్ అయ్యేలా చేయడం. ఈ సిక్స్ సైకలాజికల్ ట్రిక్స్ ని ఆయుధాలుగా వాడుకోండి. అప్పుడు లోకం మిమ్మల్ని ఒక మాగ్నెటిక్ పర్సనాలిటీలా చూస్తుంది. నువ్వు ఎంత తోపవో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నీ ప్రవర్తనతో నీ బిహేవియర్ తో ఎదుటివాడిని గెలిపిస్తే వాళ్లే నిన్ను నెత్తిని పెట్టుకుంటారు.
(16:11) సో బి ఏ లీడర్ నాట్ జస్ట్ ఏ టాకర్ జై హింద్.
No comments:
Post a Comment