Friedrich Nietzsche : SLAVE MORALITY || vNASHanam || Telugu Podcast
Author Name:vNASHanam
Youtube Channel Url:https://www.youtube.com/@vnashanam3332
Youtube Video URL:https://www.youtube.com/watch?v=yS-vRVCqrXc
Transcript:
(00:03) ఈ ప్రపంచం మంచి చెడు అనే రెండు అభిప్రాయాలను సృష్టించింది. కానీ ఇప్పుడు అవే ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని డిఫైన్ చేసే సిద్ధాంతాలుగా చలామణి అవుతున్నాయి. అంటే ప్రపంచం మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనే రెండు వర్గాలను సృష్టించింది అన్నమాట. ఇక్కడ ఎవడికైనా చెడ్డవాడు అనిపించుకోవాలని ఉంటుందా? అందరికీ మంచివాళ్ళని పొగడించుకోవాలనే ఉంటుంది.
(00:30) నిన్ను నువ్వు నేను నిజంగా మంచివాడిని అని అనుకున్నా నిన్నెవరైనా నువ్వు మంచివాడివని పొగిడినా ఈ పాడ్కాస్ట్ నీకోసమే జాగ్రత్తగా విను ఫ్రెడ్రిక్ నీషే మనుషుల్ని రెండు రకాలుగా విభజించాడు. ఒకటి మాస్టర్ మొరాలిటీ అంటే యజమానుల మనస్తత్వం రెండు స్లేవ్ మొరాలిటీ అంటే బానిసల మనస్తత్వం ఇప్పుడు నువ్వు అనుకుంటున్న ఈ మంచితనం అంటే ఏంటో చూద్దాం.
(00:57) నిన్ను నువ్వు చాలా మంచివాడివ అని అనుకుంటున్నావా అందరితో కలిసిపోతున్నానని అందరికీ నచ్చుతున్నానని మురిసిపోతున్నావా నిజానికి నువ్వు మంచివాడివి కాదు కేవలం ఒక పిరికి పందవి నిజంగా నీకు శక్తి ఉండి పక్కవాడిని తొక్కేసే సత్త ఉండి కూడా నువ్వు దయ చూపిస్తే అది మంచితనం కానీ ఏమి చేయలేని స్థితిలో ఉండి చేతగాక అనిగి మణగి ఉండడం మంచితనం కాదు అది అది బానిసత్వం నీషే చెప్పిన స్లేవ్ మొరాలిటీ ఇదే నువ్వు పాటించే ఈ నీతులు ఈ విలువలు ఇవన్నీ నీవి కావు బలహీనులైన నీ పూర్వీకులు సృష్టించినవి అవన్నీ నీ చుట్టూ ఉన్న ఈ చేతకాని సమాజం నీ మెడకు కట్టిన ఉరితాళ్ళు
(01:46) నువ్వు వేటాడడం మర్చిపోయిన పులివి కాదు అసలు వేటాడడమే తెలియని ఒక గొర్రెవి నీలో అసూయ ఉంది కోపం ఉంది పగ ఉంది కానీ కానీ బయటకు మాత్రం వినయమని ముసుగు వేసి తిరుగుతున్నావు. ఎందుకో తెలుసా నీకు ఎదురు దెబ్బ తగులుతుందేమో అన్న భయం ఈ భయానికే నువ్వు సంస్కారం అని పేరు పెట్టి పూజిస్తున్నావు. ప్రపంచం దృష్టిలో నువ్వు మంచివాడివి అంటే దాని అర్థం ఏంటో తెలుసా నువ్వు వాళ్ళకి హాని కాదని సౌకర్యంగా ఉన్నావని నువ్వు వాళ్ళకి ఎదురు చెప్పనంతవరకు నువ్వు వినయవంతుడివి నువ్వు అందరిలాగే ఆలోచించినంత కాలం నువ్వు బుద్ధిమంతుడివి నీకంటూ సొంత ఆశలు లేకుండా
(02:30) నీ కుటుంబం కోసమో ఇతరుల కోసమో నిన్ను నువ్వు త్యాగం చేసుకున్నంత కాలం నువ్వు గొప్పవాడివి ఇక్కడ నిజం ఏంటంటే ఈ ప్రపంచం మంచితనం అని పిలిచేదంతా మంచితనం కాదు అది ఒక వ్యక్తిని బలహీన పరచడానికి చేసిన సామాజిక నియంత్రణ మాత్రమే నీ నెత్తి మీద నీకు తెలియకుండానే పెట్టే బంగారు పూతతో చేసిన ముల్ల కిరీటం అది. ఇక్కడ నువ్వు రేషనలిస్ట్ లాగా దేవుడు లేడు అని గట్టిగా చెప్తే ఈ సమాజం నిన్ను శత్రువులాగా చూస్తుంది.
(03:04) పెళ్లి అవసరం లేదు అని చెప్తే మూర్ఖుడిలా లెక్కేస్తుంది. సొసైటీ పెట్టిన నామ్స్ వేటిని పట్టించుకోకపోతే అసలు నిన్ను మనిషిలానే చూడదు ఈ సమాజం. స్లేవ్ మొరాలిటీ గురించి నీషే ఏం చెప్పాడంటే బానిస నీతి అనేది స్వతహాగా పుట్టింది కాదు అది కేవలం బలవంతుడి మీద ఉన్న ద్వేషం వల్ల పుట్టిన ప్రతిచర్య అంటాడు. ఇంకా బానిసలు చాలా తెలివైన వాళ్ళు అంటాడు.
(03:31) ఇక్కడ బానిస అంటే సొసైటీ పెట్టిన పనికి మాలిన నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ అందరితో మంచివాడు అనిపించుకునేవాడు. వీళ్ళు తమ అసమర్థతకు అందమైన పేర్లు పెట్టుకుంటారని నీషే వాళ్ళని ఎద్దేవా చేశాడు. వీళ్ళు భయానికి వినయమని ఎదురించే సత్తా లేకపోవడాన్ని క్షమా గుణమని అనిగి మణగి ఉండడాన్ని విధేయత అని ప్రతీకారం తీర్చుకోలేకపోవడానికి మంచితనం అనే పేర్లు పెట్టుకుంటారు అన్నాడు.
(04:02) బానిస నీతికి ఒంటరిగా ఉండే ధైర్యం ఉండదు. దానికి ఒక మంద కావాలి. ఆ మందలో అందరూ సమానంగా ఉండాలి ఎవరు తనకంటే పైకి వెళ్ళకూడదని ఈ నీతి చెప్తుంది. ఎవరైనా ఆ మందను దాటి పైకి వెళ్తే వాడిని అహంకారి అని పిలిచి కిందకు లాగడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మంచితనం గురించి ఈ బానిసలు చెప్పే మాటలు నమ్మొద్దు. అది కేవలం వాళ్ళ పిరికితనం చేతకానితనం ఆలోచించడం చేతకాని బుర్ర తక్కువతనం వీళ్ళ వైఖరి ఎలా ఉంటుందంటే ఒక గొర్రె సింహం దగ్గరికి వెళ్లి నువ్వు క్రూరుడివి నేను మంచిదాన్ని అందంట ఈ బానిస నీతి కూడా అంతే
No comments:
Post a Comment