సోక్రటీస్ ఎందుకు విషం తాగి చనిపోయాడు? | The Truth About Socrates | Nagna Satyam Telugu Podcast
Author Name:Nagna Satyam
Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2lJk24lc-jY
Transcript:
(00:03) మీరు ఎప్పుడైనా గమనించారా మన చేతిలో ఒక గంట ఫోన్ లేకపోతే మనం దేని గురించి ఆలోచించాలో తెలియక కంగారుపడిపోతాం. అంటే మనల్ని మనం ఫేస్ చేయడానికి భయపడుతున్నాం. ఎందుకు రియాలిటీని ఫేస్ చేయలేము గనుక. అందులో ఉన్న నిజాన్ని భరించలేము గనుక. గ్రీక్ ఫిలాసఫర్ అయిన సాక్రటీస్ మాత్రం ఆయనకు మరణ శిక్ష పడే ముందు 500 మంది జడ్జ్‌ల ముందు నిలబడి చెప్పిన మాట ఏంటంటే నిజాన్ని ధర్మంగా పాటించడమే అని అసలు సాక్రటీస్ చేసిన తప్పుఏంటి ఆయనే దొంగతనమో హత్యో చేయలేదుగా ఆయన చేసిన ఏకైక తప్పు ఏంటంటే ప్రశ్నించడం ఎథెన్స్ లో పెద్ద మనుషులమని చెప్పుకునే వారి దగ్గరికి వెళ్లి జ్ఞానం
(00:50) అంటే ఏంటి న్యాయం అంటే ఏంటి భక్తి భక్తి అంటే ఏంటి అని అడిగేవాడు. ఆయన ఒక సైనికుడి దగ్గరికి వెళ్లి ధైర్యం అంటే ఏంటి అని అడిగేవాడు. ఆ సైనికుడు యుద్ధంలో వెనక్కి తగ్గపోవడమే ధైర్యం అంటే మరి శత్రువుని ట్రాప్ చేయడానికి వెనక్కి తగ్గుతాం కదా అది ధైర్యం కాదా అని అడిగేవాడు. అలా ఎదుటివాడికి తనక ఏం తెలియదో అర్థమయ్యేలా చేసేవాడు.
(01:15) సో అలా వాళ్ళు చెప్పే సమాధానాల్లోనే డొల్లతనాన్ని బయట పెట్టేవాడు. సాక్రటీస్ యువతను చెడగొడుతున్నాడని ఆయనపై కేసు వేశారు. కోర్టు ఆయనక ఒక ఆఫర్ ఇచ్చింది. సాక్రటీస్ నువ్వు ఈ పిచ్చి ప్రశ్నలు అడగడం ఆపేస్తే నిన్ను వదిలేస్తామని చెప్పారు. బట్ దానికి ఆయన సమాధానం నేను ప్రశ్నించకుండా నా గురించి నేను తెలుసుకోకుండా ఎదుటివారిని ఆలోచింపచేయకుండా బ్రతకడం కంటే చనిపోవడమే మేలు అని అన్నాడు.
(01:43) అంటే ఆలోచన లేని బ్రతుకు ఒక జంతువు బ్రతుకుతో సమానం అని ఆయన ఉద్దేశం. మీరు గమనిస్తే ఈ ప్రపంచంలో మానవుడు అతి తెలివైనవాడు. జంతువులకి మనకి తేడా ఏంటంటే పులి వేటాడుతుంది. ఆవు గడ్డి తింటుంది. కానీ మనిషి మాత్రం అసలు నేను ఎందుకు తినాలి వేరేది ఎందుకు తినకూడదు అని ఆలోచించే తెలివైన జంతువు. కాబట్టి ఒక ఆలోచనతోనే మొదలైన ఈ హ్యూమన్ ఎవల్యూషన్ ఇప్పుడు అదే ఆలోచన వల్ల ఒక బద్ధకస్తుడిగా తయారైసి సుఖాన్ని కోరుకుంటూ [సంగీతం] చివరికి ఆలోచించాల్సిన అవసరం లేకుండా చేసుకుని ఒక ఫ్లో లో జీవితాన్ని గడుపుతున్నారు.
(02:23) అంటే ఒక గొర్రెల గుంపు ఎలా అయితే ఒక మేకని ఫాలో అవుతాయో అలానే ఇప్పుడు మానవజాతి తయారయింది. చాలామంది అనుకుంటారు ఎగ్జామినేషన్ అంటే మన తప్పులను మనం వెతుక్కోవడం అని అది ఒక భాగం మాత్రమే ఎగ్జామినేషన్ అంటే మన జీవితాన్ని ఒక థర్డ్ పర్సన్ లాగా గమనించడం మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు హీరో తప్పు చేస్తే అరేయ్ అది తప్పురా అని గట్టిగా అరుస్తాం. ఎందుకంటే మనం ఆ సినిమాకి బయట ఉన్నాం కాబట్టి మనకు ఒక క్లారిటీ ఉంటుంది.
(02:52) కానీ మన జీవితం అనే సినిమా దగ్గరికి వచ్చేసరికి మనం అందులో యక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనకు క్లారిటీ ఉండదు. ఇక్కడే సాక్రటీస్ ఏమంటాడంటే మనం బ్రతికే మన బ్రతుకు నుండి ఒక్క అడుగు బయటకు వేసి చూస్తే అప్పుడు కనిపిస్తుంది నీ అసలు సినిమా ఏంటో అని ఇంట్లో పెళ్లా మొగుడు మీద కోపంతో అరిస్తే దాని ప్రభావం ఎలా అయితే పిల్లల మీద చూపిస్తదో అలా కొంచెం ఒక స్టెప్ పక్కకు వేసి చూసి ఆలోచిస్తే అర్థంవుతుంది.
(03:18) అసలు ఆ కోపానికి అర్థం ఏంటో ఎందుకు వచ్చిందో అని నీకు క్లారిటీ వస్తే ఇంకా రెండోసారి దాని మీద అసలు కోపం అనేదే రాదు. ఇలా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నప్పుడు మీలోని అజ్ఞానం అదే ఇగ్నోరెన్స్ తొలగిపోతుంది. మనల్ని మనం పరీక్షించుకోకపోతే మనం మన ఎమోషన్స్ కి సమాజం ఇచ్చే కండిషన్స్ కి బానిసలం అయపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రోబోని తయారు చేశం అనుకుందాం.
(03:43) దానికి కొన్ని కమాండ్స్ ఇచ్చాం. అది రోజు ఉదయం లేచి ఇల్లు క్లీన్ చేస్తుంది వంట చేస్తుంది. [సంగీతం] దానికి సొంతంగా ఆలోచించే శక్తి లేదు. ఆ రోబో బ్రతుకుతున్నట్టా అంటే లేదు అది కేవలం ఫంక్షన్ అవుతోంది. సమాజం గీసిన గీతలో బ్రతకడం చాలా ఈజీ [సంగీతం] ఎందుకంటే అక్కడ మనం ఆలోచించక్కర్లేదు తప్పు జరిగితే అందరూ అలాగే చేస్తున్నారుగా అని తప్పించుకోవచ్చు.
(04:08) కానీ మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఆ బాధ్యత మన మీద పడుతుంది. ఆ బాధ్యత తీసుకోవడానికే చాలామంది భయపడతారు. మనం కూడా మన ఆలోచనలను ప్రశ్నించకుండా ఎవరో ప్రోగ్రాం చేసినట్టు అంటే సమాజం పేరెంట్స్ మీడియా [సంగీతం] బ్రతికేస్తుంటే మనం కూడా ఆ రోబో లాంటి వాళ్ళమే. మనిషికి ఉన్న గొప్ప వరం కాన్షియస్నెస్ ఆ కాన్షియస్నెస్ ను వాడనప్పుడు మనం ఆ వరాన్ని వేస్ట్ చేసినట్టే అందుకే అది వ్యర్థం అన్నారు.
(04:35) ఇంకో విషయం ఏంటంటే సాక్రటీస్ మరణ శిక్ష పడ్డాక విషం హెమ్లాక్ తాగి చనిపోయాడు. ఆయన చనిపోయే ముందు కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన శిష్యులు ఏడుస్తుంటే ఆయన వారిని ఓదార్చాడు. ఎందుకు ఆయన అంత ధైర్యంగా ఉన్నాడు? ఎందుకంటే ఆయన తన జీవితాన్ని ప్రతిక్షణం పరీక్షించుకున్నాడు. ఆయనకు తన గురించి తన ఆత్మ గురించి పూర్తి అవగాహన ఉంది.
(05:01) మరణం ఆయన శరీరాన్ని మాత్రమే చంపగలదు. ఆయన సత్యాన్ని కాదని ఆయనకు తెలుసు. కానీ మనం సాక్రటీస్ లాగా విషం తాగాల్సిన అవసరం లేదు. కానీ ఆయన చెప్పిన ఆ ఒక్క సూత్రాన్ని అర్థం చేసుకుంటే చాలు. మన జీవితం మనకు ఒక భారం కాకుండా ఒక అద్భుతమైన ప్రయాణంలా మారుతుంది. ఆలోచించే మెషీన్ మనలోనే ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వాడకూడదు ప్రశ్నించకూడదు.
(05:26) నా దృష్టిలో చేతకాని దద్దమ్మలే ప్రశ్నించకుండా గుంపులో గోవింద అని వెళ్ళేవాళ్లే ఏంటి నువ్వు కూడా ఆ గుంపులో వాడివేనా
No comments:
Post a Comment