Why Masturbation and Nightfall Occurs ♂️ | Semen Retention Telugu
Author Name:TonsOfVeerya
Youtube Channel Url:https://www.youtube.com/@TonsOfVeerya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DVtJoDclIn4
Transcript:
(00:01) ఒకానొకప్పుడు ఒక అడవిలో ఒక యోగి ఏకాంతంలో కఠోరమైన తపస్సు చేసేవాడు అతను ఒక సన్యాసి నవయవ్వనుడు రోజు రోజుకి తన తపస్సు తీవ్రమవుతూ వచ్చింది. అత్యధిక సమయం ధ్యానావస్థలోనే గడుపుతూ మధ్య మధ్యలో చాలా తక్కువ సమయం మాత్రమే కళ్ళు తెరిచి బాహ్య ప్రపంచంలోకి వచ్చేవాడు స్నానపానాదులు ముగించుకుని తిరిగి ధ్యానమగ్ఞుడు [గొంతు సవరించుకోవడం] అయ్యేవాడు అదే అడవిలో ఒక ఋషి ఆశ్రమంలో ఋషి పుత్రిక ఉండేది తను ఒకసారి తపస్సు చేస్తున్న ఈ యోగిని చూసి ఎలాగైనా
(00:51) సరే ఈ తపస్వికి గుప్తంగా ఎవరికంటా పడకుండా సేవలు అందించాలని సంకల్పిస్తుంది. ఈ యోగి ఒక సన్యాసి ఒకవేళ నేను సేవలు చేయడం చూసినట్లయితే అతని తపస్సు భంగమవుతుంది అని భావించి గుప్తంగా ప్రతిరోజు ఆ సన్యాసికి కొంత నీరు ఫలాలు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి పూలతో అలంకరించేది. ఇలా కొంతకాలం సాగింది. ఒకరోజు ఆ కన్య పాత్రలో నీళ్లు పూస్తున్న అలికిడికి
(01:37) సన్యాసి కళ్ళు తెరిచాడు. కన్యను చూసిన తక్షణమే కళ్ళు మూసుకుని ధ్యానమగ్నుడై కూర్చున్నాడు. అనుకోకుండా జరిగిన ఈ వృత్తాంతం ఋషి పుత్రికకు ఆత్మగ్లానిగా తోస్తుంది. ఆత్మగ్లాని భావన వల్ల ఆ ఋషి పుత్రిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తిరిగి ఎప్పుడూ ఆ ఛాయలకి రాదు. సన్యాసి తన ధ్యానంలో నిమగ్నం [గొంతు సవరించుకోవడం] నానాటికి ఇంకా కఠోర సాధన.
(02:18) ఇప్పుడు ఆహారం కోసం కూడా బయటకి రాకుండా నిరాహార యోగిగా నిర్జల యోగిగా మారిపోయాడు. అతనిపై మట్టి పుట్టలు పుట్టలుగా పెరగసాగింది. కొన్ని సంవత్సరాలకు యదా ప్రకారంగా ఇంద్రసింహాసనం కదిలింది. ఇంద్రుడు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలో చెప్పమంటాడు. కానీ ఆ యోగి నాకు ఏమీ అవసరం లేదు అంటాడు. కావాలంటే నా సింహాసనాన్ని ఇవ్వడానికైనా నేను రెడీ అంటాడు ఇంద్రుడు అవసరం లేదు అంటాడు యోగి ఇంద్రుడు ఆశ్చర్యంగా
(03:03) నీకు మోక్షం కావాలా ముక్తి కావాలా నేను ఇస్తాను అంటాడు. అవి కూడా వద్దు అంటాడు. ఇంద్రుడు ఇంకా ఆశ్చర్యానికి గురై ఏ కోరిక లేకుండా ఈ యోగి తపస్సు చేశాడు. అయినా కూడా ఏదో కోరిక తప్పకుండా ఉంటుంది. అదేంటో చెప్పమంటాడు. కొంతసేపు మౌనం వహించిన ఆ యోగి ఎక్కడ ఆ స్త్రీ ఎక్కడ ఆ స్త్రీ అని అడుగుతాడు. మానవుని తృష్ణ వాసనలు కోరికలు చాలా సూక్ష్మమైనవి ధ్యానావస్థలో అకస్మాత్తుగా
(03:48) కళ్ళు తెరిచి క్షణకాలం పాటు చూసినటువంటి ఆ స్త్రీ అతని మదిలో మెదులుతుంది. అందుకనే ఎప్పుడైతే శరీర వాంచల్ని కలిగించే సినిమాలు పోర్నోగ్రఫీ లేదా లస్ట్ ఫుల్ గ్లాండ్స్ తో స్త్రీని చూస్తారో అప్పుడే వీర్యం తయారవుతుంది. దాని అర్థం డార్మెంట్ సీమన్ అంటే నిద్రావస్థలో ఉన్నటువంటి వీర్యం విస్కస్ సీమెన్ గా మారుతుంది.
(04:24) ఎలాగైతే మంచు నుండి నీరు తయారవుతుందో డార్మెంట్ సీమెన్ నుండి విస్కస్ సీమెన్ గా మారిన కారణం చేత రజో గుణం ఎక్కువవుతుంది. దాని కారణంగా మాస్టర్బేషన్ చేసుకోవాలి అనే కోరిక మరింత బలపడుతుంది. ఇఫ్ సీమెన్ ఇస్ నాట్ మేడ్ విస్కస్ మన శరీరం ఆత్మ బుద్ధి పూర్తి శక్తివంతంగా మారుతాయి. అయితే ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే వీర్యాన్ని వృధా చేయడం మానేసినప్పుడే అందుకనే అఖండ బ్రహ్మచర్య సాధన అంటే అందులో కామవికారం
(05:09) అంశ మాత్రం కూడా ఉండకూడదు అని చెప్తారు. ఎందుకంటే పవిత్రత సాధించామంటే ఇక అన్ని సాధించినట్టే ఒకవేళ పవిత్రత లేదంటే ఇంకేమీ సాధించనట్లే లెక్క. స్వామి వివేకానంద ఒకచోట ఇలా రాశారు. నా జీవితంలో దాదాపు సగం భూమండలాన్ని చుట్టి వచ్చాను. కనీసం 20 మంది కూడా అఖండ బ్రహ్మచారులు నాకు కనబడలేదు. ఏ వ్యక్తి అయితే 12 సంవత్సరాలు అఖండ బ్రహ్మచర్య పాలన చేస్తాడో అతనిలో ఇంద్రియ శక్తి ఓజస్సుగా పరిమితి చెందుతుంది.
(05:58) స్మరణ శక్తి పెరుగుతుంది. మనిషి మేధావిగా మారుతాడు. వ్యక్తిత్వంలో ఒక దివ్య ఆకర్షణ ఉంటుంది. అతనిలో యోగశక్తి ఎంతలా పెరుగుతుంది అంటే కేవలం సంకల్పంతోనే అన్ని కార్యాలు చేయగలుగుతాడు. ఇది జరగాలి అని సంకల్పం చేశారంటే చాలు అది సంభవం అవుతుంది. ఇక అతని మాటలో ఒక దివ్య ప్రవాహం ఒక దివ్య ప్రభావం ఉంటుంది. అతను ఏమి మాట్లాడినా ఒక మహా వాక్యంగా ఒక బాణం మాదిరిగా పని చేస్తుంది.
No comments:
Post a Comment