పిఠాపురం యువరాణి సీతాదేవి ఎవరు? ముస్లింగా ఎందుకు మారింది? | Pitapuram Queen Sitadevi #voiceofvenkat
Author Name:Voice of Venkat
Youtube Channel Url:https://www.youtube.com/@voiceofvenkattv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vIriquh5hb0
Transcript:
(00:05) ధనవంతుల కుటుంబంలో ఏ క్యారెక్టర్ ను టచ్ చేసినా కూడా సినిమాలను నవలలను మించిన కథలు బయటకు వస్తాయి ఇక సూపర్ రిచ్ ఫ్యామిలీలో అయితే ఊహాకందని ట్విస్ట్లు కూడా ఉంటాయి వారి జీవితం గురించి లోతైన విషయాలు తెలుసుకుంటే మతి పోతుంది అలాంటి గొప్ప కథే పిఠాపురం క్వీన్ హర్ హైనస్ సీతాదేవిది ఈమె బ్యూటీ గురించి చెప్పాలంటే కవి ఊహకి అందని అందం వేటూరి పదకెళ్లికి సైతం సరిపోనంత గ్లామర్ సీతాదేవి సొంతం బహుశా అతి కొద్ది మందిని మాత్రమే బ్రహ్మ దేవుడు యధాలాపంగా అందాలను భూమి మీదకు పుట్టిస్తాడేమో పిఠాపురం యువరాణి సీతాదేవికి యుక్తవేశం వచ్చే నాటికే ఆమె అందం గురించి దేశమంతా
(00:37) తెలిసిపోయింది సీతాదేవి అందం గురించి సామాన్య ప్రజలు కూడా గొప్పగా మాట్లాడుకునేవారు అయితే యువరాణి అందం చూసిన ఉయ్యూరు సంస్థానానికి చెందిన యువరాజు మేక వెంకయ్యప్పరావు ఏరుకోరిమని పెళ్లి చేసుకున్నారు ఆయన కూడా మహా ధనవంతుడు అయితే వీరు సరదా కోసం మద్రాస్ లో రేస్ క్లబ్ కు వెళ్ళేవారు ఇక్కడికు దేశంలోని ధనవంతులంతా గుర్రపు పంద్యాల్లో భారీగా డబ్బు పోసి జోదమాడేవారు అది వారి స్టేటస్ కు కూడా ఓ గుర్తింపు ధనవంతులంతా కలుసుకునేది ఇక్కడే దేశం నలుమూలల నుంచి వచ్చే రాజులకు మద్రాస్ రేస్ క్లబ్ సెంటర్ పాయింట్ ఇక యువరాజులు రాజులంతా రేస్ క్లబ్
(01:10) లో ఎంజాయ్ చేస్తుంటే యువరాణులు అందగత్తెలంతా వారి పక్కన కూర్చొని తిలకించేవారు ఆ క్రమంలోనే బరోడా రాజైన మహారాజా ప్రతాప్ సింగ్ గైక్వాడ్ అక్కడే సీతాదేవిని చూశారు ఆమె అందం చూసి రాజుకు మతి పోయింది ఈ భూలోకంలో ఇలాంటి అందకత్తెలు కూడా ఉన్నారా అనుకున్నారు ఆయన వెంటనే చూపులు కలిపేశాడు ఇక అందరి రాజుల్లోకెల్లా ప్రతాప్ సింగ్ గైక్వాడ్ అత్యంత ధనవంతుడు ఆయన మెయింటెనెన్స్ కూడా అంతలానే ఉండేది విదేశీ కార్ల నుంచి విదేశీ నగలు ధరించి వచ్చేవారు ఇక ఆయన భార్య శాంతాదేవి కూడా అత్యంత ఖరీదైన నగలు చీరలు ధరించి వచ్చేవారు అయితే సీతాదేవితో స్నేహం మొదలు
(01:42) పెట్టాడు ఆమె భర్త ఉయ్యూరు రాజు మేక వెంకయ్య రావు తో కలిసి ఉన్నా కూడా వారి స్నేహం కొనసాగింది ఆమె కోసం చాలా రోజులు మద్రాస్ లోనే ఉండేవారు తాను ప్రతి రోజు వస్తానని సీతాదేవికి చెప్పేవారు ఆయన ఇటు బరోడా రాజు వస్తాడని తెలిసి ఆమె కూడా వెళ్ళేది ఇద్దరు రహస్యంగా వెళ్లి కలుసుకోవడం మొదలు పెట్టారు ఆ తర్వాత వారి స్నేహం కాస్త ప్రేమకు దారి తీసింది సున్నిత మనస్కుడైన రాజును చూసి ఆమె కూడా ప్రేమలో పడింది ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు సీతాదేవి ముందే తన భర్తకు విషయం చెప్పేసింది నేను బరోడా రాజును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది అయితే
(02:13) బరోడా రాజుకు ఇష్టం ఉన్నా కూడా రాజ కుటుంబ నిబంధనల ప్రకారం రెండో పెళ్లి చేసుకోవడానికి వీల్ లేదు పైగా రాజుకు మొదటి భార్య ఉంది కొడుకు కూడా ఉన్నాడు ఇటు సీతాదేవికి కూడా వివాహం అయింది దీంతో ముందు విడాకులు తీసుకోవాలి అనుకున్నారు అందుకోసం ఏకంగా ఇస్లాం స్వీకరించి విడాకులు తీసుకున్నారు దేవి ఎందుకంటే వేరే మతం మహిళను పెళ్లి చేసుకుని హిందూ మతంలోకి మారేందుకు బరోడా సంస్థాన ఆచారాలు తెలుపుతున్నాయని చెప్పారు ఇక రెండో పెళ్లిని గుర్తించేందుకు నాటి బ్రిటిష్ సర్కార్ మాత్రం నిరాకరించింది అయినా కూడా సీతాదేవి ప్రతాప్ సింగ్ గైక్వాడ్ భయపడలేదు
(02:45) చివరకు ఇస్లాం స్వీకరించిన సీతను పెళ్లి చేసుకొని మళ్ళీ హిందూ మతంలోకి మారి వివాహం చేసుకుంది దీంతో హిందూ వివాహ చట్టం నుంచి కూడా ఆమె తప్పించుకోగలిగారు అన్నమాట అయితే ఇంతలోనే బ్రిటిష్ అధికారులు కూడా బరోడా రాజుకు షాక్ ఇచ్చారు నీ మొదటి భార్య శాంతాదేవి సంతానం కే వారసత్వ హక్కులు ఉంటాయి అంటే రాజు అయ్యేందుకు అన్నమాట ఆస్తిలో ఇద్దరికీ వాటా ఉన్నా కూడా బ్రిటిష్ ప్రభుత్వం రెండో భార్య సీతాదేవిని గుర్తించడం లేదు అని తేల్చేసింది దీంతో 1943 లోని వారి పెళ్లికి చట్టబద్ధత లభించలేదు కానీ రాజు కాబట్టి వాటిని అసలు పట్టించుకోలేదు మనకు చట్టాలు వర్తించమన్నాడు రాజు సీతాదేవి
(03:19) కూడా ఒప్పుకున్నారు అయితే బ్రిటిష్ వారు ఏ కార్యమైనా సరే ప్రతాప్ సింగ్ మొదటి భార్యనే పిలిచేవారు కనీసం ప్రోటోకాల్ ప్రకారం కూడా హర్ హైనెస్ అని సీతాదేవిని కూడా పిలిచేవారు కాదు దీంతో సీతాదేవికి అవమానం కలిగింది డబ్బుతో మొదటి భార్య బ్రిటిష్ అధికారులను కొనేసిందని కూడా కోపం పెంచుకుంది రాజు భార్యనైనప్పుడు సమాన హక్కులు వస్తాయి కానీ బ్రిటిష్ అధికారులకు భారీగా లంచాలు ఇచ్చి తనను సంస్థాన రాణి కాకుండా కుట్ర చేసిందని రగిలిపోయింది దీంతో ఏకంగా వేరు కాపురం పెట్టాలని భర్త మీద ఒత్తిడి తీసుకొచ్చింది అప్పటికే సీతాదేవి రాజా ప్రతాప్ సింగ్ కు ఓ కొడుకు
(03:51) కూడా పుట్టాడు దీంతో మొదటి భార్య శాంతాదేవి లక్ష్మీ విలాస్ ప్యాలెస్ లో ఉంటే తన కోసం దూరంగా ఉన్న మకరపురా ప్యాలెస్ ను ఆధునిక హంగులతో తీర్చిదిద్దుకొని అక్కడ గడిపేది సీతాదేవి కానీ రాజు మాత్రం ఎప్పుడూ సీతాదేవి తోనే గడిపేందుకు ఇష్టపడేవాడు ఎందుకంటే రేసు గుర్రాల గురించి సీతాదేవికి బాగా తెలుసు పైగా ఆంగ్ల పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది ఇక అద్దం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సీతాదేవిని పక్కన పెట్టుకొని వేడుకలకు వెళ్ళడాన్ని ఎంజాయ్ చేసేవాడు రాజు ప్రతాప్ సింగ్ రాజు గారి భార్య అంటే అతిలోక సుందరిలా ఉండాలనుకునేవారు ఆయన అందుకు తగ్గట్టుగానే
(04:23) సీతాదేవి ఉండేది అయితే విదేశీ మ్యాగజిన్లు విపరీతంగా చదివే సీతాదేవికి మొనాకో దేశంలో మ్యాంటికార్ల గురించి తెలుసుకుంది అది ఆ రోజుల్లో ప్రపంచంలోని ధనికుల విలాస నగరం అక్కడే రేస్ కోర్సులు ఖరీదైన వైన్ జోదం ఒకటేంటి స్వర్గలోకం మొత్తం యాంటికార్ లోనే ఉంటుందని తెలుసుకుంది ఆ వెంటనే స్నేహితులతో కలిసి ఓ నెల రోజులు యాత్ర చేసి వచ్చింది యువరాణి సీతాదేవి వెంటనే భర్తకు కూడా విషయం చెప్పింది మనం ఇక్కడ నిత్యం అలజడిలో ఉండలేం బ్రిటిష్ వారి ఒత్తిడికి తలగ్గి బ్రతకాలి పైగా స్వాతంత్రం వచ్చే సమయం కూడా ఆసన్నమైంది ప్రజాస్వామ్యం ఏర్పడితే మనం
(04:55) నిమిత్తమాత్రులం అవుతామని ముందే ఊహించింది సీతాదేవి ఆమె తెలివి మాత్రమే కాదు ముందు చూపు కూడా చాలా ఎక్కువగా ఉండేది దీంతో భర్త సరేనన్నాడు ఆ వెంటనే చడీ చప్పుడు లేకుండా బరోడా సంస్థానంలోని భారీగా డబ్బును మాత్రమే కాదు కళ్ళు చెదిరే నగలను వందల పెట్టెల్లో కుక్కి మ్యాంటికార్ లోకి తీసుకెళ్లారు వాటిలో ముత్యాల హారాలు వజ్రాల హారాలు బంగారంతో చేసిన ఖరీదైన నెక్లెస్ లు ఒకటా రెండా క్వింటా పైనే ఉన్నాయి అలాంటి నగలు ప్రపంచం మొత్తం వెతికినా కూడా దొరకవు అక్కడే ఇద్దరు తమ కొడుకుతో కలిసి ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత
(05:27) అమెరికా వెళ్లి స్థిరపడాలి అనుకున్నారు ఆ రోజుల్లోనే కోట్లు పోసి కరేదన విమానంలో అమెరికాకు రెండు సార్లు వెళ్లి వచ్చారు అమెరికాలోనే స్థిరపడాలి అనుకున్నారు ఇక ఈ లోపు భారత్ కి స్వాతంత్రం రానే వచ్చేసింది ఆ తర్వాత భారత ప్రభుత్వం 1951 లో సంస్థానాలను విలీనం చేసుకుంది వారికి సంస్థాన అధిపతి లేదా రాజ హోదాను తీసేసింది మీరంతా కూడా భారతీయ పౌరులే అని తెలిపింది కానీ మీరు మీ యొక్క ఆస్తులను తీసుకున్నందుకు మీ ఆభరణాలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిచింది అలా మొత్తం బరోడా సంస్థానంలోని చాలా వరకు నగలు ప్రజల ఆస్తులు ప్రభుత్వ వరమయ్యాయి కానీ
(05:59) ప్రభుత్వం నుంచి రాజవంశీయులకు ప్రత్యేక గౌరవంతో పాటు రాయితీలను కూడా చెల్లించింది నాటి కేంద్రం ఎందుకంటే ఆయాచితంగా చట్ట విరుద్ధంగా తీసుకోమని మీకు గౌరవం మాత్రమే కాదు ధన రూపేణ కూడా సాయం చేస్తామన్నారు కానీ ఇక్కడే సీతాదేవికి షాక్ తగిలింది మొత్తం రాయితీలు మొదటి వారికే వెళ్తాయని తేల్చేసింది దీంతో ఇక దేశం రావద్దు అనుకుంది మరోవైపు ముందే తనకు గుర్తింపు ఉండదని ఊహించిన సీతాదేవి భర్త సాయంతో బరోడా సంస్థానం నుంచి భారీగా అప్పులు తీసుకొని విలాసవంతమైన జీవితాన్ని గడపడం మొదలు పెట్టింది 1956 లో మళ్ళీ దేశం వెళ్ళడం అని భర్త చెప్పాడు కానీ సీతాదేవి
(06:32) మీద భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది ప్రభుత్వం కళ్ళు కప్పి లెక్కలేనంత డబ్బు విలువైన నగలను తరలించిందని కాబట్టి ఆమె దేశం రాకుండా ఆంక్షలు విధించేసింది దీంతో భర్తను మరింత డబ్బు నగలు ఇవ్వాలని కోరింది సీతాదేవి దేశం వస్తే ఇస్తానన్నాడు రాజు తాను కేంద్రంతో మాట్లాడి ఆంక్షలు కూడా తొలగించేలా చేస్తానన్నాడు అది నాకు పెద్ద పని కాదన్నాడు అయినా సరే రాను అని చెప్పింది సీతాదేవి తాను ఇక్కడే తన కొడుకుతో కలిసి ఉంటానని చెప్పడమే కాదు నువ్వు నీ మొదటి భార్యతోనే ఉండమని విడాకులు కూడా తీసుకుంది రాజు స్వదేశానికి వెళ్ళిపోవడంతో పాటు మన దేశంలో సీతాదేవితో
(07:04) విడాకులు తీసుకున్నట్లు ప్రభుత్వానికి చెప్పారు దీంతో ఆ ఉన్న హోదా కూడా కోల్పోయింది సీతాదేవి అయితే ఆమె చాలా షార్ప్ కావలసినంత డబ్బు నగలను తన దగ్గరే పోగేసుకుంది అయితే మ్యాంటికార్లలో ఎంజాయ్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది శాశ్వత నివాసంకు పనికిరాదని తేల్చుకుంది ఆ వెంటనే పారిస్ కు భారీగా నగలతో వెళ్ళిపోయింది సీతాదేవి అయితే భారత సర్కారు ఏర్పడిన తర్వాత వందల కొద్ది పెట్టెలను దేశం ఎలా దాటించగలిగారు సీతాదేవికి ఎలా సాధ్యమైంది అనేది విచారణ చేయగా సంచలన విషయాలు బయటపడ్డాయి బరోడా ఎయిర్పోర్ట్ లో ఒక విమానం వెయిటింగ్ లిస్ట్ లో ఉంది రాజుల
(07:37) కోసం ఆ విమానాన్ని నడిపేవారు ఏ రాజు ఎప్పుడు వచ్చినా ఏ దేశమైనా తీసుకెళ్లేందుకు డకోటా విమానం రెడీగా ఉండేది ఆ రోజు ఉదయమే తన సేవకురాలు కొడుకును తీసుకొని ఎయిర్పోర్ట్ కు ఓ కారులో వెళ్ళింది వెనక ట్రక్ లో కనీసం 60 పెట్టలు వచ్చాయి సరాసరి రన్వే మీదకు తీసుకెళ్ళిపోయింది అక్కడ ఓ విమానం ఆగే ఉంది దాని యజమానే పైలట్ పెట్టెలన్నీ విమానంలో సద్ది మ్యాట్ కార్ లో వెళ్దాం అంది రాణి కానీ అతను రెండింతల ఖర్చు అవుతుందని చెప్పాడు కోపంతో నన్నే ప్రశ్నిస్తావా నా దగ్గర డబ్బులు లేవు అనుకున్నావా మరో విమానం కొనిపెడతాను మొత్తం సర్ది తొందరగా టేక్ ఆఫ్ చేయాలని
(08:09) చెప్పింది అందుకోసం తుపాకీ కూడా చూపించి పైలట్ ని బెదిరించింది దీంతో పైలట్ వెంటనే పెట్టెలను విమానంలో సర్దారు ఇంతలో భర్త ప్రతాప్ సింగ్ కూడా వచ్చేసారు ఇద్దరు కలిసి వేగంగా బ్యాంట్ కర్లోకి ముందు ఎగిరిపోయారు మొత్తం 60 పెట్టల్లో బట్టలు ఖరీదైన నగలు డబ్బు మొత్తం సర్దుకొని ఆమె చెక్కేశారన్నమాట మొదటి భార్యకు చెందిన నగలను కూడా సీతాదేవి మొత్తం ఎత్తుకెళ్ళినట్లు ఆ రోజుల్లో ప్యాలెస్ లో గుసగుసలు వినిపించాయి కానీ రాజు కూడా ఆమెతో వెళ్లారు కాబట్టి అతని అనుమతి ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకున్నారు సీతాదేవి ఆభరణాలపై ఆసక్తికర విషయాలను పుస్తకంలో రాసిన మైలాన్ వెల్సన్ ఈ
(08:42) స్టోరీని రాశారు ఈ వార్త ఆ రోజుల్లో భారతదేశాన్ని షేక్ చేసింది ఒక రాణి అది కూడా అత్యంత ధనవంతుడైన బరోడా రాజు ప్రతాప్ సింగ్ రెండవ భార్య నగలు డబ్బుతో సినిమా రేంజ్ లో ఉడాయించిందని కోకొలలుగా చెప్పుకున్నారు కానీ ఆమె జీవితం పారిస్ కి వెళ్ళాక మలుపు తిరిగింది పారిస్ లో ఆమె దగ్గర ఉన్న నగల డిజైన్లు చూసి ఫ్యాషన్ డిజైనర్స్ అవాక్ అయ్యేవారు గారు వాటిని భారీ ధరకు అమ్ముకొని విలాస జీవితం గడిపేది కొన్ని ఆస్తులు కూడా కొన్నారు ఆమె వాటిపై వచ్చే ఆదాయంతో పాటు ఎంత తిన్నా తరగనంత నగలు ఆమె దగ్గర పోగుపడ్డాయి ఆ రోజుల్లోనే ఒక్క ముత్యాల హారం దాదాపుగా 6 లక్షల
(09:12) డాలర్లకు అమ్మిందట సీతాదేవి ఆ తర్వాత వేలకొద్ది డాలర్లకు చాలా అరుదుగా దొరికే నగలను కూడా అమ్మేసి విలాసవంతమైన జీవితం గడిపింది ఆమె కొడుకు కూడా బాగా చదువుకొని వ్యాపారం మొదలు పెట్టాడు కానీ ఏం జరిగిందో ఏమో కానీ సాయిజీరావు గైక్వాడ్ ఆత్మహత్య చేసుకున్నాడు అంటే సీతాదేవి కొడుకు 1985 లో తన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో సీతాదేవి కుంగిపోయింది నేను ఇక ఎవరి కోసం బ్రతకాలని ఆమె కొడుకు చనిపోయిన నాలుగేళ్లకే 1989 లో ఫిబ్రవరి 15న మరణించారు అప్పటికే తనకు ఇష్టమైన అక్క కూతుర్ని పిలిపించుకొని ఆస్తులు మొత్తం ఆమెకు రాసి ఇచ్చేసారు సీతాదేవి చనిపోయిన
(09:46) తర్వాత పిఠాపురం వాసులు ఆమెకు నివాళలు అర్పించారు జనం కోసం ఆమె తండ్రి అయిన రావు వెంకట కుమార మహాపతి సూర్యరావు తల్లైన చిన్నమాలు ఎంతో సేవ చేశారు 1917న పుట్టిన సీతాదేవి కారణంగా వీరి సంస్థానానికి దేశవ్యాప్త గుర్తింపు కూడా లభించింది వీరికి ఆ రోజుల్లోనే ప్రత్యేక విమానం కూడా ఉండేది సీతాదేవి తమతోనే ఉండాలని తండ్రి కోరుకున్నారు కానీ ఆమె మాంటి కార్ లో వెళ్ళిపోయారు మరోవైపు కూతురు విదేశాల్లో సెటిల్ కావడంతో మొత్తం కుటుంబ సభ్యులు లండన్ లో సెటిల్ అయిపోయారు దేశంలోనే అత్యంత విలాసవంతమైన జీవితం గడిపిన ఏకైక రాణి సీతాదేవి మాత్రమే ఆమెకున్న తెలివి
(10:18) ఎవ్వరికీ లేదు బ్రెయిన్ విత్ బ్యూటీ అంటే సీతాదేవే కానీ కొడుకు మరణం ఆమెను కొంగదీసింది ఏదేమైనా సీతాదేవి చరిత్రలో నిలిచిపోయింది మరి సీతాదేవి స్టోరీ పై మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి
No comments:
Post a Comment