తక్షణ మోక్షం పొందాలనుకునే వారు తప్పక వినాల్సిన అష్టావక్రుడి ఉపదేశం🌹అష్టావక్ర టాక్65🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2f2MetWW4yQ
Transcript:
(00:00) అష్టావక్ర సంహిత చాప్టర్ 17 టాక్ 65 ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఒక చదువుకొని వ్యక్తి ఒక మహిళ వచ్చి ఇలా అడిగిందంట నాకు శాస్త్రాలు చదివే జ్ఞానం గాని ప్రవచనాలు వినే ఓపిక గాని సాధన చేసే శక్తి గాని అలాంటివి ఏమీ లేవు అట్లాంటి నేను ఒకవేళ ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే జీవితాన్ని ఆనందంగా మలుచుకోవాలనుకుంటే అసలు నేను ఏం చేయాలి సాధన చేసే వాళ్ళ కోసం ఈ భూమిమీద అనంతమైనటువంటి మార్గాలు ఉన్నాయి.
(00:37) రకరకాల క్రతువులు ఉన్నాయి ఆ గురువులు ఉన్నారు శాస్త్రాలు ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి రకరకాల కర్మకాండాలు ఉన్నాయి చేయవలసినవి ఉన్నాయి వదిలేయాల్సి ఉన్నాయి ఈమె అడిగిన ప్రశ్న రమణ మహర్షిని చాలా వాల్యూబుల్ నిజానికి ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు అడగాలి. మనకు ప్రపంచంలో కష్టపడితే ఫలితం వస్తుంది ప్రకృతిలో కష్టపడడం అన్న ఆలోచన పోతే ఫలితం ఉంటది.
(01:06) నిద్ర కష్టపడడం వల్ల రాదు అట్లాగే ప్రశాంతత కష్టపడడం వల రాదు అప్రయత్నతనే ప్రశాంతత అప్రయత్నతనే పరమాత్మ అప్రయత్నే అప్రయత్నతనే పరమానందం అప్రయత్నతనే జీవితం ప్రకృతిలో ఆధ్యాత్మికత ప్రయత్నానికి అతీతం అప్పుడు రమణ మహర్షి సూటిగా సుత్తి లేకుండా చెప్పిన మాట ఏమిటంటే ఏవేవి నీవు అనుకుంటున్నావో ఏవేవి నిత్యము శాశ్వతమని అనుకుంటున్నావో అవి శాశ్వతము కావని గుర్తించు వాటితో మానసికంగా నువ్వు ఏర్పరచుకున్న బంధాన్ని వదిలి అంతే అవి ఎట్లా వదలాలో తెలియక మనిషి చేసే ప్రయత్నమే సాధన అయింది. అవి ఇలా ఇలా
(01:54) చేస్తే వదులుతాడు మనిషి అని చెప్పడానికి ఉపయోగపడేది ప్రవచనం అయంది శాస్త్రం అయింది. జస్ట్ ఉన్నవేవి నీవు కావు జస్ట్ అవసరానికి ఉపయోగించుకునే వస్తువులు తప్ప నీవంటూ ఇక్కడ ఏమీ లేవు అని పరిపూర్ణంగా తెలుసుకున్నవాడు తక్షణం మోక్షాన్ని పొందుతాడు. అట్లా మోక్షాన్ని పొందిన యొక్క మనిషి లక్షణాలు ఏమిటని అష్టవక్కుడు ఈరోజు జనకుడికి చెప్తున్నాడు జనకుడి మాధ్యమంగా చేసుకొని మనందరికీ చెప్తున్నాడు.
(02:24) ఒక మామిడిపండు లక్షణం ఏమిటి సో కొన్ని మనిషి తన ప్రయత్నం వల్ల సాధించే లక్షణాలు ఉంటాయి. కొన్ని పుట్టుకతో ఉన్న లక్షణాలు ఉంటాయి. సో ఆత్మజ్ఞానం అన్నది బ్రహ్మజ్ఞానం అన్నది ప్రతి మనిషి పుట్టుకతో తనతో తెచ్చుకున్నటువంటి ఒక అగోచర సంపద దాన్ని నువ్వు గుర్తించవలసిందే గుర్తించకుండా ఉన్నట్టు నీకు ఎప్పుడు తెలియదు తప్పకుండా నువ్వు గుర్తించాలి.
(03:02) సో ఈరోజు అష్టవక్రుడు జనకుడికి చెప్తున్న సూత్రం చాలా అద్భుతమైంది. ఒక ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలు ఒక యోగి లక్షణాలు ఎలా ఉంటాయి ఒక సాదా సీదా సాధన లేకుండా జీవితాన్ని అనుభవిస్తున్న వాడి లక్షణాలు ఎట్లా ఉంటాయి మోక్ష స్థితిలో మనిషి యొక్క ప్రవర్తన దాని యొక్క సుగంధం సువాసన ఎట్లా ఉంటదని తేలికైన పరిభాషలో చెప్తున్నాడు. ననిందీ నచస్తౌతి నహృష్యతి నకుప్యతి నాదతి నా గృహనాతి ముక్తః సర్వత్ర నీరసః
(03:48) ఓ జనక ఆత్మజ్ఞాని జీవన్ముక్తుని యొక్క లక్షణాలు విను జీవన్ముక్తుడు ఎవరిని నిందించడు దూషించడు వేరేవారి తప్పులు ఎప్పుడు ఎంచడు అలానే ఎవరిని భూషించడు కూడా స్తుతించడు హర్షం ప్రకటించడు ద్వేషము చూపడు ఎవరిపైన కోపాన్ని వ్యక్తపరచడు అతని యొక్క స్థితిని ప్రజలు పూజించవచ్చు అయినా సరే అతను హర్షాన్ని ప్రకటించడు అతను దానికోసం ఆరాటపడడు జీవన ముక్కుత స్తుతి అంటే అదే అతను దేన్ని హక్కున చేర్చుకోడు దేన్ని ఈసడించడు ఇంతే ఇంతకుమించి మరేమీ లేదు ఇప్పుడు ఒక్కొక్క మాట మన జీవితానికి అప్లై
(04:33) చేసుకొని చూసుకుంటే సరిపోతది. నిజంగా నీ మనసు క్లెన్స్ అయితే ఈ ప్రపంచం అనే ఒకానొక ఆ ఫినామినా నుంచి నీ మనసు తక్షణ విముక్తి కలిగితే ఇప్పుడు అష్టవక్కుడు చెప్పిన ప్రతి మాట అప్లికబుల్ న నిందాతి నచస్తౌతి నహృష్యతి నకుప్యతి సో జ్ఞాని జీవన్ ముక్తుడు ఎవరిని నిందించడు ఎప్పుడు ఎవరిని దూషించడు ఎవరి తప్పులు ఎంచడు ఇది నిజంగా నిజం అసలు నీ మనసులో వేరేవాడు అంటూ ఉంటే కదా దూషించడానికి సో [గురకలు] నింద ఒకవేళ నువ్వు చేయాలంటే నీ మనసులో వేరేవాడు
(05:19) ఉండాలి. నేను ఒక దేవాలయంలో ఉండేవాడిని అక్కడ ఒక 80 ఏళ్ల ముసలావిడు ఉండేది. తన కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరితో సంబంధాలు లేవు. కారణాలు ఏమైనా కావచ్చు తను బట్టలు ఉత్తుతున్నప్పుడు స్నానం చేస్తున్నప్పుడు వంట చేస్తున్నప్పుడు ఎప్పుడు ఏదో గులుగుతూ ఉండేది. నేను ఒకసారి దగ్గరికి వెళ్లి వింటే ఆమె తన బంధువులు ఎంతమంది ఉన్నారో ఆ బంధువులని తలుచుకొని ఒక్కొక్కరిని పేరు పేరున నిందిస్తుంది.
(05:49) నేను ఒకసారి అడిగాను నీ చుట్టుపక్కల ఎవరు లేరు కదా వాళ్ళు వచ్చినప్పుడేమో మౌనంగా ఉంటావు మరి వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళని నిందిస్తూ ఉంటావు అంటే ఏవేవైతే నేను వాళ్ళని అనాలఅనుకుంటున్నానో వాళ్ళ ముందు అంటే నన్నెత్తి బలగొడతారు. వాళ్ళు నాకంటే బలవంతులు నన్ను అననివ్వరు అందుకని వాళ్ళు లేనప్పుడు వాళ్ళని తలుచుకుని తలుచుకొని మరి నేను నిందిస్తాను అన్నారు.
(06:11) అప్పుడు నేను అడిగాను అందులో నేను కూడా ఉన్నానా అంటే అప్పుడు ఆవిడ చెప్పింది అదృష్టవశాత్తు నువ్వు లేవు సో నింద అనేది కోపం అనేది స్తుతి అనేది అట్లాగే హర్షం అనేది ఇలాంటి విషయాలు నువ్వు ప్రకటించాలి వ్యక్తపరచాలి అంటే వేరేవాడు ఉండాలి ఆత్మజ్ఞానం యొక్క మూల స్థితి ఏమిటంటే నీలో వేరే అన్న భావన పోయింది నీకు అన్యముగా ఉన్నది ఏది లేదు అని తెలిసిపోయింది.
(06:44) సో నీకు అన్యముగా ఉన్నది ఏదైనా ఉందంటే అదే బాధని అదే భయాన్ని అదే కోపాన్ని అదే దుగ్ధని అదే జుగుప్స్ అని అదే ఈసడింపుని నీలో నిరంతరం జనరేట్ చేస్తూ ఉంటది. దానికి ఒక అంతం లేదు నువ్వు మరణశీయం మీద చివరి క్షణం గడిపే ముందు కూడా నీ మనసులో వేరేవాళ్ళు ఉంటే నువ్వు స్ప్లిట్ పర్సనాలిటీ అవుతావ్ సో ఇది సాధన వల్ల అర్థం చేసుకునే విషయం గాని కాదు నీకు తప్ప అన్యముగా మరేది లేదు అన్నిట్ిలో నీ స్వరూపాన్ని దర్శించినప్పుడు దీనికి యొక్క చిక్కు ముడి విడిపోతది.
(07:24) సో జ్ఞాని యొక్క స్థితి ఏది ఉందో అది అనుభవించడం ఎవరు తనతో ఉంటే వాళ్ళని అందులో కలిపేసుకోవడం ఎలాగైతే ఒక చెయ్యి ఒక ముక్కు ఒక వేలు ఒక కాలు వీటిని ఎప్పుడైనా నిందిస్తావా నువ్వు ఏది నీలో భాగమో దాన్ని ఎప్పుడైనా నిందిస్తావా చాలామంది మనసుని నిందిస్తారు ఎందుకంటే మనసు అన్యంగా కనిపించే ఒక వస్తువుగా మనకు నిరంతరం దర్శనం ఇస్తూనే ఉంది ఇట్ యక్ట్స్ ఇన్ ఏ డిఫరెంట్ డైమెన్షన్ దాని నేచర్ మనిషి ఇంకా పట్టుకోలేకపోయాడు.
(08:00) సో మనసు వేరే దాన్ని పట్టుకున్నప్పుడు చాలా శక్తివంతంగా మారుతది మనసు స్వయాన్ని పట్టుకున్నప్పుడు నిర్వీర్యం అయిపోయి డిసపి అయిపోతది. సో లోకంలో ఉంటూ అందరి మధ్యనే ఉంటూ ఎవరితో తాదాత్మత లేని ఏ వస్తువుతో తాదాత్మత లేని ఒకానొక అలౌకిక స్థితి జ్ఞానం సో ఒకసారి నేను ఒక మిత్రుడి చురవ వల్ల అతని బలవంతం వల్ల ఓషో డైనమిక్ మెడిటేషన్ కి వెళ్ళాను అందులో నాలుగు భాగాలు ఉంటాయి.
(08:34) అందులో కెథారిస్ అనే ఒకానొక ప్రక్రియ కూడా ఉంటుంది ఆ కెథార్సిస్ అంటే ఏమీ లేదు. నువ్వు కాస్త ఎగిరి దుంకి డాన్స్ చేసిన తర్వాత ఒక మ్యూజిక్ స్టార్ట్ అవుతది. ఆ తర్వాత మ్యూజిక్ బంద అవుతది అప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీలో ఉన్న రిప్రెషన్స్ అన్ని గుర్తు చేసుకొని నువ్వు ఎవరెవరిని తిట్టాలనుకున్నావో ఎవరెవరిని నువ్వు బాధ పెట్టాలనుకున్నావో ఎవరెవరిని ఎలాంటి బూతులు అనాలనుకున్నావో ఇట్లాంటివన్నీ గుర్తు చేసుకొని అక్కడ నువ్వు బయటికి కక్కేయాలి.
(09:00) సో నేను ఆ డైనమిక్ మెడిటేషన్ కి వెళ్ళింది 2009 తర్వాత నేను డాన్స్ చేసినప్పుడు డాన్స్ చేశాను నిశశబ్దంగా ఉన్నప్పుడు నిశబ్దంగా ఉన్నాను శివాసనం వేసినప్పుడు వేశను కానీ క్యాథర్సిస్ అనే ప్రక్రియ వచ్చినప్పుడు నేను నిశబ్దంగా ఉండిపోయాను. అంటే నేను కళ్ళు మూసుకొని తలుచుకున్న నాకు ఎవరి మీద కోపం లేదు.
(09:24) ఈనాటికి నాకు ఎవరి మీద ద్వేషం లేదు ఈనాటికి ఎప్పటికీ ఏదైనా సందర్భంలో ఏదనా చెప్పవలసి వస్తే చెప్పడమే తప్ప దాన్ని క్యారీ చేయడం అట్లాంటివి ఏమీ లేవు ద్వేషం నీలో జనరేట్ అవ్వాలంటే ఒక థాట్ మురిగిపోవాలి. కోపం నీలో జనరేట్ అవ్వాలంటే నీలో ఎక్స్పెక్టేషన్ ఉండాలి. నీలో ఈర్ష కలగాలంటే నీకు వేరేవాడు ఎవడో ఉండాలి వాడు నీకంటే ఉన్నతంగా ఉండాలి నువ్వు ఒకడిని దూషించాలంటే వాడిని నువ్వు నీచంగా చేయాలంటే అతను నీకంటే తక్కువ వాడని నువ్వు అనుకుంటూ ఉండాలి ఇదంతా వేరేవాడు నీ మనసులో ఉన్నంతవరకు నీలో జరిగే ప్రక్రియ సో అలా నేను నిశశబ్దంగా ఉండిపోయినప్పుడు ఆ డైనమిక్ మెడిటేషన్ కండక్ట్ చేసుకున్న ఓషో
(10:02) సన్యాసి ఒకతను నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నీలో ఉన్న ద్వేషాన్ని నీలో ఉన్న రిప్రెషన్స్ ని బయటికి కక్కమని ఓషో గారు అంటారు మీరు ఆ పని చేయండి అన్నా అన్నాలు అలా లేదన్నాను అప్పుడు అతను అన్నాడు ఇది అసాధ్యం అలా వేరే వాళ్ళ మీద ద్వేషం ఉండని మనిషి భూమి మీద ఉండడు అంటే నేను మొదటిసారి మీరు నన్ను చూస్తున్నారు నాలో ఏ ద్వేషం లేదు మీరు నమ్ముతారా నమ్మరా అని ఏదైనా ఒక అప్లికేషన్ లేకపోతే ఏదైనా ఒక ఆ మెకానిజం ఏదైనా ఉంటే అంటే ఐ వుడ్ హవ ప్రూవడ్ బట్ అలాంటిది ఏమీ లేదు అతను నా వైపు తీక్షణంగా చూసి వెళ్ళిపోయాడు.
(10:42) అయితే మీకు ఇది అవసరం లేదు అన్నాడు నేను వచ్చేసాను ఆ తర్వాత ఎప్పుడు పోలేదు. సో నీవు తప్ప మరొకరు లేరనుకో ఎవరిని నిందిస్తావ్ ఇది ఒక డైమెన్షన్ రెండవది నీవు తప్ప మరొకరు నీ మనసులో ఉండకూడదు నీ చుట్టుపక్కల ఖచ్చితంగా ఉంటారు. సో ఇప్పుడు ఆధ్యాత్మికతను అర్థం చేసుకునే కీలక సూత్రం ఇదే చాలామంది ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోక మనుషులని వదిలేసి ఎటో పోయారు హిమాలయాలకి నువ్వు మనుషులని వదిలేసిపోకు స్వామి మనుషుల్ని నీ మనసులో వదిలేయ్ ఎంత దూరం పోతావు ఎంత దూరం పోయినా కళ్ళు మూసుకుంటే ఎవరో ఒకరు నీకు గుర్తుకవస్తారు అదిగ అసలు అది మార్గము కానే కాదు అదిఒక మూర్చ స్థితి అట్లా కాకుండా నువ్వు
(11:22) అందరి మధ్యలోనే ఉండు ఎవరిని నీ మనసులో మోయకు ఇది నా దగ్గరికి ఎవరు వచ్చినా చెప్తాను ఎవరువచ్చినా వేరే వ్యక్తి గురించే చెప్తూ ఉంటారు నేను అంటాను ఇంకా ఎందుకు మూస్తున్నావ్ చెప్పులు వదిలేసిన చోటే ఆ వేరే వ్యక్తులని వదిలేసి రాలేవా సినిమా చూస్తున్నంతసేపు సీరియల్ చూస్తున్న సేపు మర్చిపోతావు వేరే వ్యక్తుల్ని అక్కడ మర్చిపోబడ్డది అసలు వేరే వ్యక్తుల్ని మోయనేవత్తుంది సో నిందించడం అనేది ఒక మనిషి జీవితంలో ఎప్పుడు మొదలవుతది అనేదానికి చిన్న డెఫినిషన్ ఏమిటంటే ఏరోజైతే నీవు వేరేవాళ్ళని గుర్తిస్తావో ఏరోజు నేను అనే భావన ప్రాణం పోసుకుందో ఆ రోజే నింద
(11:58) మొదలైంది ఆరోజే బాధ మొదలైంది ఆరోజే దుగ్ధం మొదలైంది ఆరోజే అసూయ మొదలైంది ఆరోజే ఈర్ష మొదలైంది ఆరోజే కాంపిటిటివ్ నేచర్ మొదలైంది. సో అవన్నీ పోవాలి ఇప్పుడు అష్టవక్రుడు చెప్తున్న ఈ యొక్క పద్ధతి ఈ ఆత్మజ్ఞానం యొక్క వైఖరి అల్టిమేట్ కి సంబంధించింది ఇది తర్కించే వాళ్ళ కోసమో లేకపోతే సిద్ధాంతంలో ఇరుక్కున్న వాళ్ళ కోసం కానే కాదు అట్లాంటి వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.
(12:27) తక్షణ విముక్తి పొందాలని నిర్ణయించుకో ఇక ఈ క్షణం నువ్వు ఏ ఏ విషయాలని నీ మనసులో మోస్తున్నావో ఆ అన్నిటిని ఈ క్షణమే వదిలేయ్ అదంతా అసత్యం దానివల్ల నీకు ఏ ఉపయోగం లేదు అని తెలుసుకోవడం వల్ల నీకు తక్షణ ముక్తి తక్షణ మోక్షం అనేది అనుభవంలోకి వస్తుంది. అది ఎలా తెలుస్తుంది ఎలాగైతే ఒక ఖాళీ గది తెలుస్తుందో మొట్టమొదటిసారి నీ ఖాళీ మనసు తెలుస్తుంది అక్కడి నుంచి సాక్షి భావన ఎస్టాబ్లిష్ అవుతుంది ఇవంతా సహజంగా జరిగేవే సో నిందించాలి అంటే నువ్వు పక్కవాళ్ళని తక్కువ చేసేటట్టు చేయాలి.
(13:03) అందుకే తిడతాం మనం నీవు నీ జాతి నిలమని అదే ప్రశంసించాలంటే పక్కవాళ్ళని ఎక్కువ చేయాలి స్టేజ్ మీద ఎక్కినప్పుడు రకరకాల వ్యక్తులు పక్కవాళ్ళని పొగుడుతూ ఉంటారు. సో నీ జీవితంలో నీకు జ్ఞానం అనేది ఆవిర్భావం జరిగితే ఒక చిన్న భాషాపరమైన ఒక మార్పు ఖచ్చితంగా జరుగుతది అదేమిటంటే విశేషణాలు వాడడం మానిస్తాం. ఇది చాలా అద్భుతమైంది లేకపోతే చాలా నిరంతరం విశేషణాల యొక్క మాయలో పడవు విషయాన్ని విషయంగా చూస్తావు విషయాన్ని విషయంగా చెప్తావు ఎందుకంటే ఇక్కడ నువ్వు సాధించేది లేదు కోల్పోయేది లేదు ఎవరి ప్రశంస నీకు అక్కర్లేదు ఎవరిని నువ్వు నిందించడం అవసరం లేదు.
(13:45) సో సర్వములో లీనమైనప్పుడు సర్వరసములో లీనమైనప్పుడు సర్వాంతర్యామిలో నీవు ఒక భాగమని తెలుసుకున్నప్పుడు తప్ప నీ నుంచి నా అనే భావన పోదు నా అనే భావన పోకుండా పర అనే భావన పోదు సో స్వ అండ్ పర అనేవి రెండు ఎగ్జిస్ట్ అయినాయి అంటే నువ్వు అబద్ధపు నేనులో రమిస్తున్నావని పర పడిపోయిన తర్వాత ఈ అబద్ధపు స్వ అబద్ధపు నేను పడిపోయి నిజమైన నేను మిగులుతది అట్లాంటి నేను గురించి రమణ మహర్షి విచార చేయమని నేనుఎవరు అంటే పర గురించి ఆలోచించని వాడిని నిందించని వాడిని స్తుతించని వాడిని ఏది కోరుకొని వాడిని ఏది ఉంటే అది అనుభవించేవాడిని కర్త లేకుండా పని
(14:26) చేసేవాడిని నిష్కర్మ కర్మ చేసేవాడిని ఒక సామరస్యంలో ఉండేవాడిని అనంతంలో నేను ఒక భాగమని తెలుసుకునేవాడిని ఒకసారి నేను ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ కి వెళ్ళాను అక్కడ రిటైర్ అయిన వ్యక్తి నాకు మిత్రుడు అతని స్నేహితులంతా రకరకాల వ్యక్తులు ఆ ఇతన్ని పొగుడుతున్నారు. సో ఆ తర్వాత భోజన సమయంలో నేను అతన్ని కలిశాను కలిస్తే అతన్ని అడిగాను నేను సార్ మీరు చాలా గొప్పవాళ్ళు అనుకుంటాను ఇలా అందరూ మిమ్మల్ని పగులుతున్నారు అంటే అతను ఒక మాట చెప్పాడు ఏవేవి నేను కానో అవన్నీ ఈరోజు చెప్పారు అందుకని నిశశబ్దంగా స్తబ్దంగా ఉండిపోయానున్నాడు మా బుచ్చారెడ్డి గారి
(15:07) జీవితంలో కూడా నేను స్వయంగా చూసిన ఒక సంఘటన ఉంది ఆయన గురువు గారు ఉన్నారు బిరుదురాజు రామరాజు గారుని సో ఒకసారి ఆ బిర్దిరాజు రామరాజు గారు ఆ నన్ను చూడాలంటే అంటే బుచ్చరెడ్డి గారు నన్ను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సో వాళ్ళద్దరి మధ్యన వయసు వ్యత్యాసం చాలా తక్కువ కానీ బృదిరాజు రామరాజు గారిని బుచ్చరెడ్డి గారు గురువుగా భావిస్తారు.
(15:28) అన్ని రకాల గురువుగాను భావిస్తారు. సో ఇద్దరి మధ్యన ఒక గమ్మత్తైన వాత్సల్యం ప్రేమ అసలు వాళ్ళు కలిస్తే అసలు వయసు అనేది మీకు కనబడదు నేను ప్రత్యక్షంగా చూశను కాబట్టి చెప్తున్నాను. ఆ ఇంటి సమీపంలోకి వెళ్ళగానే బుచ్చారెడ్డి గారు మౌనం అయపోయారు కాళ్ళు కడుక్కున్నారు బ్రదరాజు రామరాజు గారు పుస్తకంలో ఏదో రాసుకుంటున్నారు కుర్చిలో కూర్చొని ఇతను బోర్లా సాష్టంగా పడ్డాడు సాష్టంగా పడ్డ వ్యక్తి వయసు 82 సంవత్సరాలు ఆ అక్కడ కుర్చిలో కూర్చున్న వ్యక్తి వయసు 86 87 సంవత్సరాలు జస్ట్ నాలుగైదు సంవత్సరాల గ్యాప్ అంతే దాదాపు 60 సంవత్సరాల పరిచయం ఇద్దరు కలిసి
(16:03) అనంతంగా పని చేశారు సో బుచ్చారెడ్డి గారిని అడిగాను నేను మీరు బృదిరాజు రామరాజు గారు గారిని గారికి ఏమవుతారు అంటే నేను శిష్యుడిని కాదు భక్తుడిని కాదు అంతే వాసిని అన్నాడు జస్ట్ ఊరికి అట్లా పక్కన ఉంటాను అంతే నా స్వభావంలో నేను ఉన్నాను ఆయన స్వభావంలో ఆయన ఉన్నాడు. నిజమైన గురువు ఎవరు అంటే నీ స్వభావంలో నిన్ను ఉండనిచ్చేవాడు తనకు సంబంధించిన ఏది నీ మీద రుద్దనివాడు.
(16:25) సో ఒకరోజు బిర్దురాజు రామరాజు గారు ఆ మరణిస్తే ఆ సంస్మరణ సభ జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన శిష్యులు ప్రశిష్యులు చాలా మంది ఉన్నారు పిహెచ్డి స్కాలర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ గైడ్ గా వ్యవహరించారు. సో అందులో బుచ్చారెడ్డి గారికి ఒక ప్రముఖ స్థానం ఉంది. అక్కడన్న అందరికీ తెలుసు నేను వెళ్ళిన తర్వాత సార్తో ఆ ముందు వరుసలో సార్ పేరు రాసి ఒక చైర్ రిజర్వ్డ్ గా ఉంచారు.
(16:54) సో అప్పుడు సార్ అన్నాడు నా పక్కనే కూర్చు అన్నాడు సార్ అది ఎవరిదో రిజర్వ్డ్ సీట్ అంటే ఈ భూమ్మీదనే ఎవరికీ రిజర్వేషన్ లేదు మా సారే పోయారు మళ్ళీ రిజర్వ్డ్ సీట్ ఏమిటి అన్నాడు ఆయన సో సరే ముచ్చారెడ్డి వైఖరి నాకు తెలుసుద్ది నీ ఖాతరి చేయడు వర్తమానంలో ఉంటాడు అని నేను పక్కన కూర్చోబోతుండగా ఆర్గనైజర్స్ వచ్చి ఇది రిజర్వ్డ్ సీటు ఎవరో వైస్ ఛాన్సెస్ కోసం వేసింది మీరు దయచేసి వెనక కూర్చుని అంటే అప్పుడు బుచ్చారెడ్డి టక్కున లేచి నిలబడి అయితే నేను వెనకే కూర్చుంటాను ఇద్దరం పదా వెనక్కి వెళ్దాం అన్నాడు చివరి సీట్ మనమంతా హాల్ లో ఉన్నాం ముందు ఏమిటి వెనక
(17:27) ఏమిటి అన్నాడు అంతలో ఆర్గనైజర్స్ ఆర్గనైజర్స్ కాస్త బెంబెలు ఎత్తిపోయి బుచ్చరెడ్డి గారికి రిక్వెస్ట్ చేశారు ఇంకో సీట్ నా కోసం వేశారు. ఆ తర్వాత ఇద్దరు పక్క పక్కన కూర్చుందాం నేను అనుకున్నాను బుచ్చరెడ్డి గారు ఎమోషనల్ అవుతారేమో ఆ ఆ తర్వాత బుచ్చరెడ్డి గారు చాలా బాధలో ఉంటారు ఏదో అనుకున్నాను నేను అనుకున్న తర్వాత సభ స్టార్ట్ అయింది.
(17:46) ఆ సభ స్టార్ట్ అయిన తర్వాత రకరకాల వ్యక్తులు ఆ బిర్దిరాజు రామరాజు గారిని చాలా పొగిడారు. ఆ ఆ తర్వాత ఎవరో పిలిచారు బుచ్చా రెడ్డి గారు మాట్లాడుతారు బుచ్చా రెడ్డి గారికి బృదిరాజు రామరాజు గారికి ఉన్న సాన్నిహిత్యం మనకు తెలుసు ఆయన మాటలు విందాం నేను అనుకున్నాను అట్లీస్ట్ ఒక హాఫ్ న్ అవర్ అన్నా వన్ అవర్ అన్నా ఎందుకంటే 60 50 60 ఏళ్ల పరిచయం ఇద్దరు కలిసి ఎన్నో పుస్తకాలు ఆ పరిష్కరించారు ఎన్నెన్నో జానపద సాహిత్యాల మీద ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాల మీద ప్రయోగాలు చేశారు మాట్లాడుకున్నారు వాళ్ళ జర్నీ అనేది ఆ మనం మాటలో వర్ణించలేం ఆ తర్వాత తర్వాత బుచ్చరెడ్డి గారు వేదిక
(18:21) మీద ఎక్కి ఒకటే మాట అన్నారు ఈ క్షణం నా గొంతు గాద్గిదం అవుతున్నది నా గొంతు పూడికిపోయింది నాకు మాట్లాడాలన్న ఆసక్తి లేదు మీరంతా వచ్చారు సంతోషం గురువుగారికి నమస్కారం అని చెప్పి దిద్దికి నా దగ్గరికి వచ్చి ఇలా గుసగుసలాడారు అన్నమాట వెళ్ళిపోదాం పదా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళిపోదాం నువ్వు రా అని ఆ బయటికి వెళ్ళగానే బృదిరాజు రామరాజు గారి కూతురు అక్కడ ఉంది ఆమె కూడా ఒక ప్రొఫెసర్ ఆమెను అడిగారు భోజనాలు ఎక్కడ సార్ ఇప్పుడు ఇంకా 11:30ర అవుతుంది భోజనాలు రెడీగా ఉన్నాయి బట్ 1:00 గంటకు భోజనాలు అవునా
(18:57) అయితే నేను బయట తినేస్తాను నాకు ఇప్పుడు ఆకలి వేస్తుంది అన్నాడు లేదు సార్ మీరు బయట తింటే ఎట్లా అని ఆ భోజన హాల్లోకి తీసుకెళ్తే పెద్ద హాలు షడ్రషోపేతమైన భోజనాలు అక్కడ వండి పెట్టారు వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు వస్తే పెడదామని అప్పుడు బుచ్చరెడ్డి గారు అన్నారు మేమిద్దరం తింటాం మాకు భోజనం వడ్డించండి. నేను ఆశ్చర్యపోతున్నాను అసలు అంటే అసలు ఒక వ్యక్తి మరణిస్తే ఏ బాధ లేదు ఆ తర్వాత భోజనాలు వడ్డించారు ఎంత శ్రద్ధగా తిన్నాడు నేను అడిగాను సార్ మీ వైఖరి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఎవరెవరైతే స్టేజ్ మీద
(19:30) పోగొడుతున్నారో వాళ్ళంతా నాకు తెలుసు ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఏదనా చెబుతారు. ఒకవేళ అతనే ఉంటే వీళ్ళ నోరు పెగలను కూడా పెగలదు అతని ముందు నిలబడే స్థాయి గాని లేకపోతే ఏది పడితే అది మాట్లాడే ఔచిత్యం గాని వీళ్ళకు అలాంటిది ఏమ ఉండదు జస్ట్ దే ఆర్ యూజంగ్ ద టైం అండ్ స్పేస్ అండ్ స్టేజ్ వాటితో మనకేమీ సో బుచ్చరెడ్డి గారికి బిర్దురాజ రాము గారికి ఉన్న సంబంధం నాకు తెలుసు నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి అప్పుడు బుచ్చరెడ్డి గారు ఒక మాట అన్నారు నేను మనస్ఫూర్తిగా తింటే రామరాజు గారికి ఆనందం సో ఆయన ఆనందపడిన పనే నేను చేస్తున్నా నువ్వు కూడా మనస్పూర్తిగా తిను
(20:08) నువ్వు మనస్పూర్తిగా తింటే నాకు ఆనందం సో ప్రతి పదార్థం రుచి చూద్దాం. ఒక వన్ అవర్ తిందాం ఆ తర్వాత బిర్దిరాజు గారికి ఒకసారి చివరిసారి నమస్కారం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను అన్నాను మీకుేమనా బాధ ఉందంటే ఏ బాధ లేదు. ఒక వ్యక్తిని నువ్వు వేరే అనుకుంటే బాధ నేను బిర్దిరాజ రామరాజు గారిని ఎప్పుడు వేరే అనుకునలేదు నాలో భాగమైన ఆయన శారీరకంగా మరణించవచ్చు బట్ నాలో ఆయన ఎప్పుడు సజీవంగా ఉన్నారు నేను ఉన్నంతవరకు సజీవంగా ఉంటారు నేను మరణించిన తర్వాత కూడా ఆయన సజీవంగా ఉంటారు ఆయన గుర్తించే వాళ్ళు ఈ భూమి మీద ఎప్పుడు గుర్తిస్తారు అలాగే
(20:41) నన్ను గుర్తించే వాళ్ళు ఎప్పుడు గుర్తిస్తూ ఉంటారు ఇక్కడ ఏది మరణించడం లేదు ఏదో ఒకటి సజీవంగా ఉంటుంది సో యోగికి శ్రేయోభిలాషులు ఉండరు ప్రముఖ స్నేహితులు అంటూ ఎవరు ఉండరు యోగికి అందరూ ఒకటే ఈరోజు పరిచయమైన వ్యక్తి ఎంతో 20 ఏళ్లుగా పరిచయమైన వ్యక్తి అంతే ఎందుకంటే జ్ఞాపకాల దుంతర లేదు తను దేన్ని కాలంలో నిలబెట్టి చూడడు ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది అర్థం కాని వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు.
(21:15) సో జీవన్ ముక్తుడు అంటే అష్టవక్రుడు ప్రకారం వస్త్రరహితుడు లేకపోతే సమాజం నుంచి పారిపోయేవాడు సంసారం నుంచి పారిపోయేవాడు కాదు జస్ట్ వాసన రహితుడు అంతే నాది నీది అన్న భావన కూడా వాసనే నీవు కాకుండా అన్యంగా ఏదో ఉంది అనుకోవడం కూడా అతి పెద్ద వాసన అదే మన మనిషిని బాధించేది ఒక జ్ఞాని సోకటిస్ లాగా ఉండాలి. తన భార్య ఎంత ఇబ్బంది పెడుతుందా తన ఊర్లో వాళ్ళే తన శత్రువులు ఉన్నా అక్కడే ఉన్నాడు అక్కడే జీవించాడు అక్కడే హాయిగా ఉన్నాడు.
(21:48) తను ఆరు బయట కూర్చున్నప్పుడు ఎవరో బంధువులు కలవడానికి వస్తే సోక్రటీస్ భార్య జంతేపే తన నెత్తిన నీళ్లు కొట్టిందంట అంతకుముందే చాలా గట్టిగా అరుస్తూ అరుస్తూ ఉన్నది అప్పుడు సోక్రటీస్ అన్నాడంట ఇంతకుముందే ఉరుములు పిడుగులు వచ్చాయి ఇప్పుడే వర్షం పడింది అన్నాడంట నీలో ఎవరి పట్ల ఏ వైకరి లేని స్థితికి వస్తే తప్ప అష్టావడు అర్థమయ్యే అవకాశం లేదు నీ మనసులో ఒక్కరి పట్ల అయినా సరే నిందా భావన ఉందా ఏహ్య భావన ఉందా జుగుప్స ఉందా ఈర్ష ఉందా అష్టవక్రుడు మీకు ఎప్పటికీ అర్థం కాడు అది జస్ట్ పాండిత్యం అవుతది.
(22:22) ఒక మామూలు సినిమాను మెచ్చుకున్నట్టు లేదా ఒక పుస్తకాన్ని మెచ్చుకున్నట్టు ఒక హీరోని అభిమానించినట్టు అష్టవక్రుడిని అభిమానిస్తారు అంత దూరం నుంచి అష్టవక్రుడు మీలోకి చొరబడాలంటే బుచ్చ రెడ్డి గారి యొక్క అండర్స్టాండింగ్ కావాలి. అంతా నీదే అనుకో లేదా ఏది నీది కాదనుకో పర అనేది పడిపోతే స్వా కూడా పడిపోతుందని తెలుసుకో నీ చుట్టూ ఉన్నవేవి నీవి కాదని తెలుసుకో అన్నిటిని సమగ్రంగా ఉపయోగించుకో నీవు నిమిత్తమాత్రుడువని తెలుసుకో అంతకుమించి వేరే జ్ఞానం అక్కర్లేదు ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను ఒక ఊర్లో ఒక రాజు ఒక భోగి కూడా ఉన్నాడు వాళ్ళద్దరికీ పరిచయమైంది
(23:06) రాజు అన్నాడు ఆ భోగి రాజు ఆ రాజు అన్నాడు నేను భోగిని అని అనుభవిస్తున్నాను నాకు అన్ని కష్టాలు కన్నీళ్లు ఉన్నాయి నువ్వు యోగివి కదా నాకు ఆత్మజ్ఞానం బోధించు అన్నాడు ప్రతిరోజు ఇద్దరు కలుసుకునేవాళ్ళు ఒకానొక సమయంలో ఇద్దరు మరణించారు మరణించిన తర్వాత రాజుకి స్వర్గ ప్రాప్తి లభించిందట ఎవరైతే యోగి ఉన్నారో అతన్ని నరకానికి పంపించారట ఎందుకు ఇట్లా జరిగింది అన్నప్పుడు అక్కడన్న దేవుడు ఎవరో ఒక అశరీర వాడి ఇట్లా చెప్పిందట యోగి సమక్షంలో నువ్వు నిరంతరం యోగి తత్వాన్ని అనుభవించినావు కానీ అతను నీ సమక్షంలో నిరంతరం నీ భోగాన్ని అనుభవించే ప్రయత్నమే చేశాడు.
(23:45) సో నువ్వు చూడడానికి రాజువు భోగివి కానీ మనసులో నువ్వు యోగివే అతను చూడడానికి యోగి కానీ మనసులో అతను భోగి సో మనసులో భోగం పోవాలి మనసులో వాసన పోవాలి మనసులో తారతమ్యాలు పోవాలి మనసులో వ్యత్యాసాలు పోవాలి అది పోయినంతవరకు నువ్వు ఎన్ని సాధనలు చేసినా వృధా అందుకే నా దగ్గరికి ఎవరైనా వస్తే ఒకటే మాట చెప్తాను నీలో పోలిక ఉన్నంతవరకు నువ్వు ఎన్ని ధ్యానాలు చేసినా వృధా ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి ద్వంద్వం ఉన్నంతవరకు జీవితం యొక్క మూలము గాని సహజమైన ఆనందం గాని సహజమైనటువంటి ఏవి గాని ప్రశాంతత గాని నీ జీవితంలోకి చురబడే అవకాశం లేదు.
(24:26) సో ఇక్కడి నుంచే మీలో ఉన్న ఆ యోగి తత్వానికి సహజ యోగి తత్వానికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా అది అప్రయత్నంగా మీ జీవితంలోకి రావాలని ఎలాగైతే అప్రయత్నంగా సూర్యకాంతి ఒక పూల చెట్టు మీద పడుతుందో అట్లా అప్రయత్నంగా జ్ఞానం మనలో జొరపడాలంటే దానికి అడ్డు వచ్చే వాటిని జస్ట్ పక్కకు జరపాలి. సో నిందించే స్వభావం పోవాలి స్తుతించే స్వభావం పోవాలి ఎవరనా మెచ్చుకుంటే ఆనంద పడే స్వభావం పోవాలి సహజ ఆనందంలో ఉండు నీ ఆనందము సాపేక్షం కానియకు ఎంటర్ ఇంటు ద రల్ ఆఫ్ అన్కండిషనాలిటీ ఇది మంతని నది ఒడ్డున కూర్చొని ఏకాంతంలో
(25:11) మాట్లాడుతున్న మాటలు నదిలో నేను తడిసే మేను కరిగి ముద్దయింది ఈమాను పారేయ ఏరు అటు పొరలి ఇటు మరలి అటు పొరలి ఇటు మరలి ఎటు దొరలి తరలి తరలి తరలి పోతుంది సెలయేరు పారేయరు జీవితమే నదిర జీవితమే మధిర మధుర స్వప్నాలగనిరా కలలు గనడమే దీని పనిరా కలలు గనడమే మనసు పనిరా
(25:57) అన్ని కలలు పోవాలి క్రీస్త
No comments:
Post a Comment