ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందా అన్న ప్రశ్నకు సమాధానం... రమణ మహర్షి వ్యాఖ్య
Author Name:ajju-baipalli
Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli
Youtube Video URL:https://www.youtube.com/watch?v=r5rhkOLGua0
Transcript:
(00:02) ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందా అన్న ప్రశ్న గురించి రమణ మహర్షి ఏమన్నాడు చిట్టి కృష్ణమూర్తి ఏమన్నాడు ఓషో ఏమన్నాడు నా యొక్క అనుభవం ఏమిటి అన్న ఒక సమాధానాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా ప్రతి మనిషి కలియుగంలో 100 సంవత్సరాలు ఆ మనిషి యొక్క ఆయుర్దాయి ఈ 100 సంవత్సరాల్లో కచ్చితంగా ప్రతి మనిషికి కొన్ని ప్రశ్నలు అనేవి ఎదురవుతాయి నేను ఎవరు అసలు నేను ఎవరిని అని ఒక ప్రశ్న ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందిలే అన్న ఒక సందిగ్ద స్థితి ఇలాంటి ప్రతి
(00:50) మనిషి జీవితంలో ఖచ్చితంగా ఏదో ఏదో ఒక సందర్భంలో కొంతమందికి 16 ఏళ్ల వయసులో రావచ్చు ఆదిశంకరాచార్యుల వారికి వచ్చినట్టు ఐదేళ్ల వయసులో రావచ్చు రమణ మహర్షికి వచ్చినట్టు 16 ఏళ్ల వయసులో రావచ్చు 27 సంవత్సరాల వయసులో వచ్చిన జెడ్ కృష్ణమూర్తి ఉన్నాడు 30 సంవత్సరాల వయసులో వచ్చిన ఓషో ఉన్నాడు 35 సంవత్సరాల వయసులో వచ్చిన గౌతమ బుద్ధుడు ఉన్నాడు.
(01:12) ఎవరికీ ఏ వయసులో వస్తుందో చెప్పలేమండి కానీ కచ్చితంగా ఆ ప్రశ్న అయితే ఎదురుపడుతుంది. అలాంటి ప్రశ్నకి ఈరోజు జిడ్డు కృష్ణమూర్తి ఏమన్నాడు ఓషో ఏమన్నాడు రమణ మహర్షి ఏమన్నాడు అనే విషయం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందా అన్న మాట సాధారణంగా మన నోటి నుండి ఎప్పుడు వస్తుంది మనం ఏదైనా ఒకటి అనుకుంటాం.
(01:44) అది కాకుండా వేరొకటి ఏదైనా అయింది అనుకోండి ఒక నిరాశ ఒక నిస్పృహ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నేను కచ్చితంగా ఆర్మీలోకి వెళ్లి ఈ దేశానికి సేవలు చేయాలి అని అనుకున్నాడు. చాలా కష్టపడ్డాడు శారీరకంగా మానసికంగా అన్నిటి పరంగా 100% ఎఫర్ట్ పెట్టాడు. కానీ ఎక్కడో ఏదో జరిగింది సెలెక్ట్ అవ్వలేదు వేరొక ఏదో ఒక దారిలో వెళ్ళాల్సి వచ్చింది.
(02:21) వెంటనే వాడు ఒక మాట అంటాడు మనం అనుకుంటాం గానీ ఇన్నెన్నో అనుకుంటాం కానీ ఏది రాసి పెట్టిఉంటే అదే జరుగుతుంది అన్న ఎందుకంటే నాకు ఇలాంటి మాట అన్నవాళ్ళు కొంతమంది తెలుసు సురేష్ అని గాని విజ్జు అని గాని వీళ్ళందరూ కూడా ఆర్మీకి వెళ్లి దేశానికి సేవలు చేయాలనుకున్నారు. నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఎంతో ప్రయత్నించారు. కానీ చివరాకరికి వేరొక సైడ్ వెళ్ళాల్సి వచ్చింది.
(02:54) సో అది ప్రకృతి అలాగ లాగబడిందా లేకపోతే వీళ్ళు అటువైపు వెళ్ళారా అనేది ఏమో తెలియదు కానీ సాధారణంగా అలాంటి సందర్భాల్లో మాత్రం ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది అంటుంటారు. అలాగే ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేయాలనుకున్నారు అనుకోండి రక రకాల సంబంధాలు చూస్తారు ఎన్నో రకాల సంబంధాలు చూస్తారు. వెళ్ళిన ప్రతి సంబంధం ఓకే ఈ సంబంధం సెట్ అయితే బాగుండును అన్న ఒక సమాధానం ప్రతి ఒక్కరిలో వస్తుంది కానీ అది అవ్వకపోవచ్చు చివరాకరి ఒక మాట అంటారు గంతక తగ్గ బొంత అని వీడికి ఎక్కడో ఒకడు ఎక్కడో ఒకరు బ్రహ్మదేవుడు రాసే ఉంటారు వీడికి
(03:40) ఎక్కడ రాసి పెట్టి ఉందో అక్కడే అవుతుంది అంటారు. అంటే మనం అనుకున్నది ఎప్పుడైతే జరగలేదో అక్కడ ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది అన్న ఒక దృష్టికోణం వస్తుంది అన్న ఒక క్లారిటీ వస్తుంది నిజానికి అది క్లారిటీా ఇంకొకటా అన్న విషయం మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందా అన్న ప్రశ్నకు రమణ మహర్షి ఏమన్నాడో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
(04:10) సాధారణంగా రమణ మహర్షి విధి అంటే రాసిపెట్టి ఏది రాసి పెట్టి ఉన్నదో మరియు మానవ ప్రయత్నం గురించి చాలా స్పష్టమైన లోతైన వివరణ అనేది వచ్చిన భక్తులక ఇచ్చారండి వచ్చిన భక్తులు కొన్ని ప్రశ్నలు అడిగేవాళ్ళు డెస్టినీ అంటే విధి అంటారు కదా ఏది రాసి పెట్టి ఉన్నదో అని దాని గురించి మానవ ప్రయత్నం గురించి జ్యోతిష్యం గురించి చాలా ప్రశ్నలు ఒక రోజుకి కొన్ని లక్షల్లో వచ్చేవాళ్ళు అండి మొదట్లో అయితే కొన్ని వేల మంది వచ్చేవాళ్ళు జనం రమణ మహర్షి దగ్గరికి ఆ తర్వాత కొన్ని లక్షల్లో వచ్చేవాళ్ళు రమణ మహర్షి ఇంకొక ఐదు 10 సంవత్సరాల్లో చనిపోతారు అనగా అంటే దాదాపు 1951
(04:48) చనిపోయిన చనిపోయిన సంవత్సరం రమణ మహర్షి అంటే దాదాపు 1940 నుండి 1951 మధ్యలో రోజు కనీసం లక్షల్లో వచ్చేవాళ్ళు జనం కొంతమంది చూసి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది కూర్చొని ప్రశ్నలు అడిగేవాళ్ళు భగవాన్ ఇది ఎందుకు ఇలా అయింది ఇదేంటి అదేంటి ఏంటి అసలు నేను ఎవరు అసలు ఏదైనా రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందా మానవ ప్రయత్నం అవసరం లేదా ఇలా రకరకాల ప్రశ్నలు అనేవాళ్ళు నిజమై నిజంగా అది కరెక్టే కదండీ ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది అన్నప్పుడు మానవ ప్రయత్నం ఎందుకు చెప్పండి అనే ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి దానికి కూడా ఈరోజు సమాధానం చెప్పుకునే ప్రయత్నం
(05:30) చేద్దాం. అయితే ఒక రమణ మహర్షిని ఒక వ్యక్తి అడుగుతాడు ప్రతి వ్యక్తికి ఈ జన్మలో జరగాల్సినవి ప్రారబ్ధ కర్మ అంటారండి అంటే ఈ జన్మలో జరగాల్సిన వాటిని ప్రారబ్ధ కర్మ అంటారు. ప్రతి వ్యక్తికి ఈ జన్మంలో జరగాల్సినవి ముందే నిర్ణయించబడి ఉంటాయి అయితే ఉంటాయి కదా అయితే అది నిజమా కాదా అనే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి అనే ఒక ప్రశ్నని ఒక భక్తుడు రమణ మహర్షి ముందు పెడతాడు.
(06:05) అంటే ఒక వ్యక్తి యొక్క పుట్టుక మరణం జీవితంలో ఎదురయ్యే ముఖ్యమైన సంఘటనలు కచ్చితంగా రాసిపెట్టి ఉంటాయి వాటిని ఎవరూ మార్చలేరు అనే ఒక ప్రశ్నని ఒక భక్తుడు రమణ మహర్షి ముందు పెడతాడు. అంటే అన్ని రాసి పెట్టి ఉన్నప్పుడు నేను ఎందుకు ప్రయత్నించాలి అని చాలా మంది అడుగుతుంటారు సాధారణంగా దానికి రమణలో నీవు ప్రయత్నం చేస్తున్నావ అంటే ఆ ప్రయత్నం చేయడం కూడా రాసిపెట్టి ఉన్నదే అని చెప్పేవాళ్ళు.
(06:35) అంటే మనం చేసే ప్రయత్నం కూడా దైవ ప్రణాళికలో ఒక భాగమే సాధారణంగా రమణ మహర్షి కర్మను నమ్ముతారండి. ఇది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే 1896 లో అరుణాచలాన్ని అరుణాచలం చేరుకున్నప్పుడు రమణ మహర్షి ఇంటిని వదిలి అరుణాచలం చేరుకున్నప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు తల్లి అలగమ్మ చిన్నన్న అందరూ ప్రతి దగ్గర రమణ మహర్షి కోసం వెతకడమే వెతికి వెతికి వెతికి చివరాకరికి అరుణాచలంలో ఉన్నాడని తెలిసి వచ్చిన తర్వాత తల్లి వెళ్లి కూర్చొని కొడుకు ముందు కూర్చొని ఏడుస్తుంటే పక్కనున్న శేసాద్రి స్వామి పలనే స్వామి అయ్యా
(07:20) తల్లి వచ్చి రెండు రోజులు అయింది విపరీతంగా ఏడుస్తుంది కనీసం మీకు కనీసం కంటి నుండి ఒక కన్నీటి దారక ఆరట్లేదే తల్లిని చూసి అంత దారుణంగా ఏడుస్తుంది ఆ తల్లి కనీసం ఒక కంటి నుండి కన్నీటి చుక్కక ఆరట్లేదే పోనీ కనీసం మాట్లాడట్లేదు మీరు మాట్లాడడం మీకు ఇష్టం లేదు సరే కనీసం ఏదో ఒకటి రాసేయలే పంపించండి ఏదో ఒకటి చెప్పాలి కదా సమాధానం అవునన్నా కాదన్నా తొమ్మిది నెలలు మీ శరీరాన్ని మోసింది మిమ్మల్ని కనకపోవచ్చు కానీ మీ శరీర మీ శరీర పుట్టుక ఒక కారణం కదా మీ తల్లి మీరు వేరు మీ శరీరం వేరు అన్న స్పృహ మీకు ఉంది కానీ ఆ తల్లికి ఇంకా లేదే కాబట్టి
(07:57) మీరు సమాధానం కచ్చితంగా చెప్పి తీరాలి. అన్నప్పుడు ఆయన ఒక మాట రాస్తారండి ఒక ఉత్తరం మీద ఒక మాట రాసి పంపిస్తారు బయటికి ఏంటి కర్త వారి వారి ప్రారబ్ధ కర్మలను అనుసరించి వారి వారి జీవితాలు నిర్ణయించబడును అని రాస్తారు. అంటే ఇక్కడ భగవాన్ రమణ మహర్షి ప్రారబ్ధ కర్మ అన్న పదాన్ని ఉపయోగించారు. ఆ స్థాయి జ్ఞాని ఒక పదాన్ని ఉపయోగించారు అంటే ఊరికిని గుడ్డిగా ఉపయోగించారు కదండీ ఏదో ఒకటి ఉంటుంది దాన్ని మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి ఆయనకి దానికి సమాధానం చెప్పరు దానికి వ్యాఖ్యానం చేస్తూ కూర్చోరు మనకు మనమే దాన్ని అర్థం చేసుకొని దాని మీద
(08:35) వ్యాఖ్యానాలు చేసుకోవాలి అది కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను అగైన్ మళ్ళీ చెప్తున్న చాలాసార్లు నేను చెప్పాను కర్మ అంటే ఏంటి దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయిని అది మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను కర్మ అంటే నువ్వు చేసే పని అందులో మూడు రకాలు ఉంటాయి సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మ మూడు ఉంటాయి అంటే ఒకటి ప్రెసెంట్ టెన్స్ కి సంబంధించింది ఒకటి పాస్ట్ టెన్స్ కి సంబంధించింది ఒకటి ఫ్యూచర్ కి సంబంధించింది అంటే ఒకటి గతానికి ఒకటి వర్తమానానికి ఒకటి భవిష్యత్తుకి సంబంధించిన కర్మలు సంచిత కర్మ అంటే అంటే ఇది గతానికి
(09:11) సంబంధించిందండి పాస్ట్ అంటే కిందటి జన్మలో నువ్వు ఏదో చేశవు దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు వస్తుంది అది అంటే కిందటి జన్మలో నువ్వు ఏదో ఒక పని చేసావు దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు ఈ జన్మలో అనుభవిస్తే అది సంచిత కర్మ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా చిన్న చిన్న అంటే మీన్ క్యాన్సర్ హాస్పిటల్ కి వెళ్ళండి చిన్న చిన్న పిల్లలు ఉంటారు టూ ఇయర్స్ వన్ అండ్ హఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ పిల్లలు ఉంటారు.
(09:35) వాళ్ళకి క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా వాళ్ళు ఏం తిని ఉంటారండి కైనా గుట్క మందు ఇలాంటివి ఏమ అలవాటు ఉండవు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పిల్లలకి ఏమఉంటాయి చెప్పండి అయినా సరే వాళ్ళకి క్యాన్సర్స్ వస్తాయి స్ట్రోక్స్ వస్తాయి ఎందుకు అంటే అది కర్మగా తీసుకుంటాం మనం మనకు అర్థం కాదు కాబట్టి ఎందుకు వచ్చిందో తెలియదు కదా ఆ పిల్లడు ఏం తిన్నాడు ఏం జీవితం అనుభవించాడని అలా వచ్చిందని మాట్లాడుకుంటాం దానికి మనం సంచిత కర్మ అని పెడతాం మనకు అర్థం కాదు కాబట్టి బట్టి ఓన్లీ ఏదో ఒకటి పెట్టాంగగా సో సంచితి కర్మ అది.
(10:12) అలా కాకుండా ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో నువ్వు ఏదో ఒక పని చేశవ్. దాని రిజల్ట్ ఇప్పుడు అనుభవిస్తావ్ అంటే వెళ్తుండగా నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా నీకు ఏదో ఒక ఫాస్ట్ ఫుడ్ ఐటం కనిపించింది. నూరు ఊరింది తినేసావ్ కడుపు నిండా తినేసావ్ స్టమక్ అప్సెట్ అయింది టూ డేస్ బాధపడ్డావ్ టాబ్లెట్లు వేసుకున్నావ్ జాబ్ కి వెళ్ళలేదు టూ డేస్ శాలరీ పోయింది.
(10:39) ఇంత బాధ ఎందుకు కలిగింది ఆ పాస్ట్ ఫుడ్ తినడం వల్ల దాని ద్వారా వచ్చిన స్టమక్ పెయిన్ వల్ల అంటే ఈ జన్మలో నువ్వు చేశవు ఈ జన్మలో చేసిన కర్మ ఈ జన్మలోనే వస్తుంది. అంటే ఈ శరీరంతో చేసిన కర్మ ఈ శరీరంతోనే వస్తుంది. ఇది ప్రారబ్ధ కర్మ మరి ఆగామి కర్మ అంటే వచ్చే జన్మలో నేను ఒక గొప్ప కుటుంబంలో పుట్టాలి ఈ జన్మలో డబ్బు ఉన్న కుటుంబంలో పుట్టలేదు పేరు ప్రతిష్టలు ఉన్న కుటుంబంలో పుట్టలేదు కీర్తి ప్రతిష్టలు ఉన్న కుటుంబంలో పుట్టలేదు కాబట్టి నేను వచ్చే జన్మలో ఖచ్చితంగా ఒక ఉన్నత కుటుంబంలో పుట్టాలి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాలి అని ఒక ఉద్దేశంతో నువ్వు ఏదైనా ఒక కర్మలు చేశావు
(11:19) ఒక రక్తదానమో ఒక అన్నదానమో చేశావ్ అది ఆగామి కర్మ కిందకి వస్తుంది. ఇక్కడ రమణ మహర్షి ఏమ యూస్ చేశారంటే ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో ఈ శరీరంతో నేను ఒక ఎక్స్పీరియన్స్ నేను పొందాను ఏంటది చనిపోతున్నాను అన్న నాకు అనిపించిన తర్వాత నేను టెర్రస్ పైకి వెళ్లి నేను పడుకున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే నేను చనిపోవట్లేదు ఈ శరీరం చనిపోతుంది ఈ మనసు చనిపోతుంది నేను సాక్షిని మాత్రమే అన్న విషయం ఆయనకు అర్థమయింది.
(11:49) తద్వారా నేను సరిగ్గా తల్లితో ఎలా ఉండాలో అలా ఉండలేకపోయాను అది ప్రారబ్ధ కర్మ కదా ఈ శరీరంతో చేసిన కర్మ కదా దానికి తగ్గ ఫలితం నేను అనుభవించాలి అందుకే ఆయన అన్నారు కర్త వారి వారి ప్రారబ్ధ కర్మలను అనుసరించి వారి వారి జీవితాన్ని నిర్ణయించబడును అని వీటన్నిటికీ కూడా ఒకవేళ ప్రారబ్ధ కర్మ అయినా ఏ కర్మయినా దాన్నికీ మూలం ఏమవుతుందంటే అహంకారం అవుతుందండి.
(12:17) నేను చేస్తున్నాను నువ్వు గతంలో అయినా వర్తమానంలో అయినా భవిష్యత్తులో అయినా ఏ పనైనా నేను చేస్తున్నాను అంటే ఈ శరీరం చేస్తున్నాను అన్న అహంకారం ఉన్నంతవరకే ఈ డెస్టినీ ఈ విధి ఈ రాసి పెట్టి ఉన్నది జరుగుతుంది. ఒక్కసారి ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు అన్న భావన ఒక్కసారి పెట్టుకొని ఏ కర్మ అయినా నువ్వు చెయ్ ఈ శరీరం నేను కాదు, ఈ మనసు నేను కాదు.
(12:44) తద్వారా నాకు పాప పుణ్యాలు ఏవి అంటుకోవు. సుఖ దుఃఖాలు ఏమి అంటుకోవు. నాకు తల్లిదండ్రులు లేరు నాకు అసలు జన్మ అనేదే లేదు జన్మ లేనప్పుడు తల్లిదండ్రులు లేనప్పుడు సుఖ దుఃఖాలు లేనప్పుడు పాప పుణ్యాలు లేనప్పుడు రాసి పెట్టి ఉండడం ఏంటండి దృష్టికోణం మార్చుకోవాలి తప్ప నేను చేస్తున్నాను ఈ శరీరం ఈ మనసు నేను అనే ఒక భావనతో నువ్వు చేస్తున్నప్పుడు అహంకారం ఉంటుంది.
(13:11) అహంకారం ఉన్నప్పుడే ఈ డెస్టినీ రాసి పెట్టి ఉండడం ఇలాంటి ప్రశ్నలు అనేవి తలెత్తుతాయి. మనం మన అహంకారాన్ని వదిలిపెట్టి అంటే ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు ఈ శరీరం నేను ఈ మనసు నేను అన్న భావనని పక్కన పెట్టి ఆత్మ విచారణ చేసుకో సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకో నేను అనే భావన అసలు ఎక్కడ పుడుతుంది అది మళ్ళీ ఎక్కడ మళ్ళీ లయమైపోతుంది నిద్రలో నేను అనే భావన లేదే సాక్షిగా చూస్తున్నానే అనే ప్రయత్నాన్ని ఆ యొక్క స్థితిని నువ్వు గమనించి మెలుకువులో కూడా నువ్వు దాన్ని అనుభవించగలిగి తే రాసి పెట్టు ఉండడం ప్రయత్నం ఇవన్నీ పక్కకు పడిపోతాయండి ఇదే రమణ మహర్షి చెప్పారు.
(13:54) ఒకసారి ఒక భక్తుడు అయితే రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు. భగవాన్ అన్ని రాసి పెట్టి ఉంటే ప్రయత్నం ఎందుకు అని అడిగినప్పుడు రమణలో ఒక చక్కటి ఉదాహరణ ఇస్తారండి ఏంటది అంటే [గురకలు] నాయనా ఒక రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు నువ్వు నీ సామాన్లు తల మీద మోసుకెళ్తావ్ అంటే ట్రైన్ ఎక్కనంత వరకు సామాన్లు తలపై మోసుకెళ్తావ్ ఎక్కువ బరువు అయితే తక్కువ బరువు అయితే భుజం మీద పెట్టుకుంటావ్ ఇంకా తక్కువ బరువు అయితే చేతిలో పట్టుకుంటావ్ కానీ మొత్తానికి మోస్తుంటావు కదా సరే ట్రైన్ వచ్చినంత వరకు వెయిట్ చేసావ్ ట్రైన్ రాగానే ఏం చేసావ్ ఆ లగేజ్ ని కూడా
(14:30) తీసుకెళ్లి ఆ బరువును కూడా తీసుకెళ్లి ట్రైన్ లోకి వెళ్ళాం. ట్రైన్ లోకి వెళ్ళినవాడు ఏ లగేజ్ అయినా సరే నెత్తి మీద గాని భుజం మీద గాని పెట్టుకోవడం మనం చూస్తామా చూడం ట్రైన్ లో ఉన్న గొల్లానుకో ట్రైన్ పైన ఉన్న ఆ లగేజ్ కౌంటర్ మీద పెట్టడానికి ప్రయత్నిస్తాం ఎందుకు మనతో పాటు ఆ లగేజ్ ని కూడా ట్రైన్ మోస్తుంది అన్న ఒక భావన స్పష్టత మనలో ఉంది.
(14:57) నన్ను ఎలా మోస్తుందో ఈ ట్రైన్ నేను తెచ్చిన లగేజ్ ని కూడా మోస్తుంది. అది కింద పెడితే మోస్తుంది. నా తల మీద ఉంచాల్సిన అవసరం లేదు అన్న విషయం నీకు స్పష్టంగా తెలుసు అంటే ఒక రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు నువ్వు నీ సామానులు నీ తల మీద మోసుకెళ్తావా లేకపోతే రైలు పెట్టి ఆ పైన పెడితే సుఖంగా అది మోసుకెళ్తుంది అని చెప్పి సుఖంగా కూర్చుంటావా అంటే రైలు ఎలాగో వెళ్లాల్సిన చోటుకి వెళ్తుంది.
(15:20) సో దానితో నీకు పని లేదు కాబట్టి ఆ సామాను కింద పెట్టేస్తావ్ అలాగే ఈ ప్రపంచం అనే రైలులో భగవంతుడు అన్ని నడిపిస్తున్నాడు. ప్రకృతి అన్ని నడిపిస్తుంది సూర్యుని నువ్వు నడిపిస్తున్నావా ఈ టైం కి నువ్వు ఉదయించు ఈ టైం కి నువ్వు అస్తమించు అని నువ్వు చెప్తున్నావా ఈ టైం కి ఎండవే ఈ టైం కి వర్షం పడు ఈ టైం కి నువ్వు మంచుపడు ఈ టైం కి చలిగా నువ్వు ప్రకృతిలో ఎంటర్ గా అని నువ్వు చెప్పావా ప్రకృతిని నువ్వు నిర్ణయించలేవు మిత్రమా అది నువ్వు అనుకున్నా అనుకోకపోయినా జరుగుతుంది.
(15:54) నీవు నీ అహంకారం అనే బరువును తలమీద మోసుకోకుండా భగవంతునిపై భారం వేసి ప్రశాంతంగా కూర్చో ఇది భక్తి మార్గానికి కోర్ పాయింట్ అండి ఎక్స్ట్రీమ్ అంటారు. అంటే నాదేమీ కాదు సమస్తము ఆ భగవంతుడిదే ఆ పరమాత్మదే నాదంటూ ఏమీ లేదు నేను కేవలం సాక్షి సాక్షిగా ఉన్నవాడిని మాత్రమే ఏమైనా జరగని నేను ఈ ప్రయత్నం చేశానండి రమణ మహర్షిలా ఒక రోజంతా కూర్చున్నా రమణ మహర్షి 12 సంవత్సరాలు కూర్చున్నాడు కాకపోతే నేను మార్నింగ్ 6క్స్ ఓ క్లాక్ కూర్చుంటే ఈవినింగ్ 5 ఓ క్లాక్ వరకు అదే రమణలా కూర్చున్నాను.
(16:32) ఆయన 12 సంవత్సరాలు కూర్చున్నాడు నేను ఒక 10 15 గంటలు కూర్చున్నాను. నీకు ఖచ్చితంగా సాక్షి బాను కలుగుతుంది. నువ్వు ఏదో అనుకుంటున్నావ్ నేను లేకపోతే ఈ ప్రపంచం ఆగిపోతుందేమో స్తంభించిపోతుందేమో ఏమి కాదు మిత్రమా నిజానికి మానవ ప్రయత్నం ఏమీ లేకుండా ఒక రోజు ప్రశాంతంగా ఉంటే ప్రకృతి ఎంత బాగుపడుతుందో కరోనా లో ఏం కరోనా మహమ్మారిలో ఎవ్వరు బైక్లు తీయకపోవడం వల్ల పొల్యూషన్ చేయకపోవడం వల్ల ఓజోన్ పొర ఎంత బాగా డెవలప్ అయింది అంతకుముందు ఎంత నాశనమై ఉండేది ఎంత డెవలప్మెంట్ కనబడింది ఓజన్ పొరలో మానవ ప్రయత్నం లేకుండా మనిషి కేవలం సాక్షిగా అలా కూర్చుని వాడిన వాడు సాక్షిగా చూస్తే ఈ ప్రపంచం
(17:10) చాలా బాగుపడుతుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న పర్సన్స్ అందరూ ఎన్లైట్మెంట్ అయితే ఇంకా అంతకన్నా ఏం కావాలి ప్రకృతికి కావాల్సింది అదే కదా భగవంతుడికి కావాల్సింది అదే కదా దాన్ని ఎందుకు నువ్వు పట్టుకోలేకపోతున్నావ్ ఏదో చేయాలి ఏదో చేయాలి అని ప్రకృతిని నాశనం చేస్తున్నావ్ నీ యొక్క ఆలోచన ద్వారను కూడా నువ్వు నాశనం చేసుకుంటున్నావ్ నీ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నావ్ సాక్షిగా ఉండలేవా రమణ మహర్షి దృష్టిలో విధిని మార్చడం కాదండి విధిని స్వీకరించాలి అహంకారాన్ని వదులుకోవడం ముఖ్యము అని చెప్పాడు అంటే ఏది రాసి పెట్టి ఉంటే అది జరుగుతుందా అంటే రమణ
(17:47) మహర్షి దృష్టిలో ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే రాసి పెట్టున్నది ఏదో జరుగుతుంది అంటే సింపుల్ గా ఒక మాట అంటారండి రమణ మహర్షి ఏది నిర్ణయించబడి ఉందో అది జరుగుతుంది. ఏదైనా ఒక పని నువ్వు చేయాలి అన్నప్పుడు అని నిర్ణయించబడిన ఉంటే అంటే ఏదైనా ఒక పని నువ్వు చేయాలని నిర్ణయించబడి ఉంటే నువ్వు ఎంత ప్రయత్నించినా అంటే నేను ఈ పని చేయను అని అనుకున్నా సరే అది బలవంతంగా అయినా నీ చేత చేయించబడుతుంది ప్రకృతి అంటే నేను నీ పని చేయనంటే నువ్వు అంటావు కానీ ప్రకృతి ఇది నువ్వు చేయాలని నిర్ణయించబడి ఉంటే బలవంతంగా అయినా సరే అది నీ చేత చేయించబడుతుంది. ఒకవేళ ప్రకృతి
(18:32) లేదా భగవంతుడు ఈ పని వాడు చేయకూడదు అని అని ఉంటే రాసి ఉంటే నువ్వు ఎంత ప్రయత్నించినా ఆ పని కాదు ఇదే రమణ మహర్షి చెప్పింది కాబట్టి బాధపడతావు ఎందుకు మిత్రమా చేసి ప్రయత్నం చేసి సాక్షిగా ఉండు ఒకవేళ ప్రయత్నం చేస్తే సాక్షిగా చెయి ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు అన్న సాక్షి భావనతో వచ్చాయి తద్వారా నీకు బాధ అనేది ఉండదు నువ్వు అనుకున్నది జరగకపోతే బాధ అనేది ఉండదు బాధ ఎప్పుడు వస్తుంది మనం ఏదో ఒకటి అనుకొని ఎక్స్పెక్టేషన్ చేసుకొని ఆ పనిని చేస్తాం అది అది జరగదు తద్వారా నీకు బాధ వస్తుంది.
(19:06) అదర్వైస్ నీకు బాధ ఎక్కడ ఉంది ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది పరమాత్మ ఒకటి అనుకున్నాడు అదే జరుగుతుంది ప్రకృతి ఒకటి నిర్ణయించబడి ఉంది అదే జరుగుతుంది ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడండి అట్లా కాదు సూర్యుడు పడమరను ఉదయించాలి అని నువ్వు అనుకున్నావ్ అది జరగలేదు ఇప్పుడు నీకు బాధ వస్తుంది అదే సూర్యుడు ఎటు పక్క ఉదయించిన ఎటు పక్క అస్తమించిన నేను స్వీకరిస్తాను అన్న భావన నీలో ఉంటే బాధ ఎక్కడ ఉంటుంది మిత్రమా ప్రకృతిని నువ్వు అంగీకరించు ఒక మనిషిని అంగీకరించు ఒక మనిషి ఇలాగే ఉండాలని ఎందుకు అనుకుంటున్నావ్ 25 సంవత్సరాలు బయట పెరిగిన
(19:43) ఒక అమ్మాయి నీ దగ్గరికి రాగానే నువ్వు ఇట్లానే నా నేను చెప్పినట్టే వినాలి నేను చెప్పినట్టే చేయాలి అన్న భావన ఎందుకు పెడుతున్నావ్ ఆ అమ్మాయికి స్వేచ్ఛ లేదా ఆ అమ్మాయికి కొన్ని ఆలోచనలు లేవా ఆ అమ్మాయికి కొన్ని కోరికలు ఉండవా ఆ అమ్మాయికి నచ్చినట్టు బ్రతకని నిజమైన [గురకలు] స్వేచ్ఛను ఎప్పుడూ హరించకూడదు మిత్రమా అది చాలా చాలా ప్రమాదం ఒక పాము యొక్క తలపైన అడుగు పెట్టి కాసేపు అనగద్రొక్కి ఉంచావు అది ఎప్పుడైతే కాలు తీస్తావో అది నీ యొక్క దాని తలపై నుండి అది నీ యొక్క కాలు మీద కాటు వేయడానికి సిద్ధంగా ఉంటుంది అది చాలా ప్రమాదం ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని ఆలోచనని నువ్వు
(20:22) అనిగి దొక్కి ఉంచడం చాలా చాలా ప్రమాదం అది భవిష్యత్తులో ఎంతటి ప్రమాదానికైనా దారి తీయొచ్చు ఒక భార్యను గాని ఒక తల్లిని గాని ఎందుకు అట్లా ట్రీట్ చేస్తావ్ నేను చెప్పిందే ఇంట్లో జరగాలి. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అనుభవించని వాళ్ళ శరీరానికి వచ్చే నొప్పిని నువ్వు స్వీకరిస్తున్నావా కేవలం నాలుగు డబ్బులు పెట్టి హాస్పిటల్లో జాయిన్ చేస్తావు తప్ప వాళ్ళ శరీరానికి వచ్చిన నొప్పిని నువ్వు అనుభవించగలవా లేదు ఎవరి శరీరం వచ్చిన నొప్పిని గాని ఎవరి మనసుకు కలిగే బాధను గాని వాళ్ళే అనుభవించాలి.
(20:51) ఇది ప్రతి మనిషికి తెలిసిన నగ్న సత్యం కానీ ఏ మనిషి కూడా ఒప్పుకోడు బంధాల దృష్టిలో పడి బంధాల చిక్కుల్లో పడి కాదు ఇది నా కుటుంబం నేనేదో చేసేయాలి నేనేదో చేయాలి అన్న ఒక భావనతో గందరగోళానికి పడిపోతాడు. ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది కదా ప్రకృతి నిర్ణయించబడి ఉంది కదా భగవంతుడు నిర్ణయించబడి ఉన్నాడు కదా మధ్యలో నేను సాక్షిగా ఉంటే సరిపోదా అన్న ఒక కంక్లూజన్ కి డిక్లరేషన్ కి మనిషి రావడం లేదు తద్వారా మనిషికి బాధ వస్తుంది.
(21:24) సో ఫైనల్ గా రమణుల దృష్టిలో ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుందా? అన్న ప్రశ్నకి సమాధానం ఏంటి? మానవ ప్రయత్నం అవసరం లేదా? అన్న ప్రశ్నకి సమాధానం ఏంటి? అంటే అవసరం లేదు. నువ్వు సాక్షిగా ఉండు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ఎగ్జిస్టెన్స్ అనేది ఒకటి ఉంది ఆధ్యాత్మికత ఈ సృష్టి మొత్తం ఒక డిజైన్ తో రన్ అవుతుంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని కోట్ల సంవత్సరాలుగా చూస్తున్నాం సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు పడమరణే అస్తమిస్తున్నాడు వసంతకాలం రాగానే ప్రకృతి చిగుర్లు పొందుతుంది.
(21:57) వర్షాకాలం రాగానే వర్షాలు పొందుతుంది. ఈ ప్రకృతి ఒక డిజైన్ తో నడుస్తుంది. దాన్ని నువ్వు ఏమాత్రం మార్చలేవు మిత్రమా దాన్ని అంగీకరించు దాన్ని స్వీకరించు ప్రకృతిని ఎలా స్వీకరిస్తున్నావ్ ఎదుటి వ్యక్తిని కూడా అలా స్వీకరించు వాడేదో తప్పు చేస్తున్నాడు నేనేదో కరెక్షన్ చేయాలి తప్పు నీ మైండ్ లో ఉన్నాయి ఆ మనిషిలో లేవు మిత్రమా అది గుర్తించు ప్రకృతిని ఎలా స్వీకరిస్తున్నావ్ మనిషిని కూడా అలా స్వీకరించు చాలు ఇదే రమణ మహర్షి చెప్పింది మరి ఇదే ప్రశ్నకి ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందా అన్న ప్రశ్నకి జిడ్డు కృష్ణమూర్తి ఏమన్నాడు ఓషో
(22:32) ఏమన్నాడు అన్న సమాధానం కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మన మోడరన్ గురువైనటువంటి జిడ్డు కృష్ణమూర్తి ఏమన్నారు ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుందా అన్న ప్రశ్నకు ఆయన ఏమన్నారు అంటే అది చాలా చాలా తప్పు ఏది రాసి పెట్టుంటే అది జరగడం అనేది నీ యొక్క చేతకానితనానికి నిలువెత్తు నిదర్శనం నువ్వు నీ యొక్క ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఉండాలి అని అన్నాడు అంటే రమణ మహర్షికి కంప్లీట్ ఆపోజిట్ జిడ్డు కృష్ణమూర్తి ఆయన ఏమన్నారంటే ఒక మనిషి తన యొక్క భయం భద్రత కోసం సృష్టించుకున్న ఊహలే ఈ యొక్క విధి అంటే డెస్టినీ అంటారు కదా ఏది రాసి
(23:18) పెట్టి ఉంటే అదే జరుగుతుంది అన్నది ఒక మనిషి యొక్క భయం నుంచి వాడి యొక్క సేఫ్టీ నుంచి సృష్టించుకున్న ఒక ఊహలు ఒక ఇమాజినేషన్స్ అని అన్నాడు. అంటే సాధారణంగా జీవితం ముందే నిర్ణయించబడి ఉన్నదని మనిషి యొక్క నమ్మకం ఆ నమ్మకం మనిషిని బద్ధకస్తుడిగా చేస్తుంది బాధ్యత రహితంగా చేస్తుందని జిడ్డు కృష్ణమూర్తి చెప్తాడండి చెప్పి ఒక మాట అంటాడు ఛాయిస్ మనం ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మనకు ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలి.
(23:58) అంటే ఒక షాప్ లోకి వెళ్ళావు ఒక షర్ట్ తీసుకున్నావ్ అక్కడ చాలా ఉన్నాయి. అక్కడ నువ్వు ఎంపిక చేసుకో అక్కడ నీకు స్వేచ్ఛ ఉండాలి మనిషికి స్వేచ్ఛ ఉండాలి మిత్రమా కానీ ఆ ఛాయిస్ అనేది ఉండడం వల్ల కూడా మనిషికి బాధ కలుగుతుంది అసలు ఛాయిస్ఏ లేదన్న విషయం స్పష్టంగా తెలుసుకో ఛాయిస్ ఉండడం వల్ల మనిషి బాధపడుతున్నాడుఅని తెలుసుకో ఛాయిస్ ఒకవేళ ఉన్నప్పుడు స్వేచ్ఛ అనేది కచ్చితంగా ఉండాలి మిత్రమా నిజానికి ఈ భూమి మీద ఛాయిస్ లేకపోతే మనిషి కచ్చితంగా ఆనందంగా ఉంటాడని జిడ్డు కృష్ణమూర్తి చెప్పాడు అది ఆయన యొక్క అవగాహన ఆయనకు అర్థమైన అవగాహన ఉండ ఆయన చెప్పాడు దీన్ని మీకు మీరు క్రాస్
(24:35) చెక్ చేసుకోండి నిజంగా ఛాయిస్ ఉండడం వల్ల మనిషి బాధపడుతున్నాడా డెవలప్ అవుతున్నాడా ఛాయిస్ ఉండడం వల్ల మనిషికి స్వేచ్ఛ అనేది అవసరమా అవసరం లేదా 100 రకాల బట్టలు ఉన్నాయి ఒక షాప్ షాపింగ్ కి వెళ్ళావు 100 రకాల బట్టలు ఉన్నాయి తర్జన భర్జన పడిపోతున్నావ్ అయ్య బాబు ఇప్పుడు ఏం కొనాలి ఏది వేసుకోవాలి నాకు ఏది బాగా సూట్ అవుతుంది నా నేను ఏ డ్రెస్ వేసుకుంటే నా శరీరానికి కంఫర్ట్ ఉంటుంది.
(24:59) నేను ఏ డ్రెస్ వేసుకుంటే నన్ను నలుగురు చక్కగా చూస్తారు నలుగురికి నేను బాగా కనిపిస్తాను అన్న ప్రశ్నలు 100 ఉంటాయి ఇలాంటివి వాటన్నిటిని బేరీజు వేసుకొని ఒక డ్రెస్ తీసుకుంటావ్ మళ్ళీ అది బాగా సూట్ అవ్వకపోతే మళ్ళీ బాధపడతావ్ అంటే ఛాయిస్ అనేది నిన్ను బాధపడుతుంది ఒకవేళ ఆ ఛాయిసెస్ అనేవి ఉన్నప్పుడు స్వేచ్ఛ అనేది ఖచ్చితంగా ఉండాలి సాధారణంగా మనిషికి ఛాయిస్ అనేది ఉండకూడదు ఖచ్చితంగా బాధ పెడుతుంది ఒకవేళ ఉంటే ఖచ్చితంగా అక్కడ మనిషికి స్వేచ్ఛ అనేది ఉండాలి అని జిడ్డు కృష్ణమూర్తి చెప్పాడు అంటే మన మనసు గత అనుభవాలు అనేది మోసుకుంటూ వస్తుంది. గత
(25:36) అనుభవాల్లో ఉండడం వల్ల వాటిని తెలుసుకోవడం వల్ల నువ్వు ఏం పొందావు మన మనసు పాత పద్ధతిలో ఆలోచిస్తున్నంత వరకు మనకు డెస్టినీ అని ప్రయత్నం అని ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే రెండు అహంకారం నుంచే పుడతాయి మిత్రమా ఇది ఇది చూసుకోండి ఎందుకంటే రమణ మహర్షి ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది భగవంతుడు అనేవాడు లేకపోతే ప్రకృతి అనేది ఒకటి నిర్ణయించబడి ఉన్నది సాక్షిగా ఉండు అని అన్నాడు కానీ జిడ్డు కృష్ణమూర్తి దాన్ని ఒప్పుకోలేదు తిరస్కరించాడు కానీ చివరాకరికి ఒక మాట అన్నాడు చూసారా డెస్టినీ అయినా ప్రయత్నం అయినా ఏది రాసి పెట్టి ఉంటే అది జరగకపోవడమైనా ఏవైనా సరే
(26:19) నీ అహంకారం నుంచి పుడతాయి మిత్రమా అన్నాడు. అంటే ఈ శరీరం నేను ఈ మనసు నేను అనుకున్నప్పుడే అవి ఉంటాయి అవి అనుకున్నప్పుడు అవి నీ శరీరం ఈ మనసు నేను కాదు అనుకున్నప్పుడు అవి ఉండవు అని చెప్పాడు చివరాకరికి రమణుల యొక్క స్థితినే ఆయన పొందారు. నువ్వు ఏ సిద్ధాంతమైనా తీసుకో మిత్రమా అది నీ శరీరం నీ శరీరం యొక్క కంఫర్ట్ కోసం నీ శరీరం యొక్క సుఖాని కోసం నీ మనసు యొక్క సుఖం కోసం ఒక సిద్ధాంతం వచ్చింది తప్ప శరీరం లేనప్పుడు సిద్ధాంతాలు ఎందుకు ఉంటాయి మిత్రమా ఈ శరీరం నువ్వు కాదని తెలుసుకో ఈ మనసు నువ్వు కాదని తెలుసుకో తెలుసుకోలేవా ఇన్ని సంవత్సరాలు అనుభవిస్తున్నావ్
(26:55) ఇంత అనుభవం వచ్చింది ఏం తెలుసుకున్నావ్ ఇన్ని సంవత్సరాలుగా మెలుకవలో ఉన్నప్పుడు కష్టాలు అనుభవిస్తున్నావ్ సుఖాలు వస్తున్నాయి కానీ నిద్రలో అవేమీ లేవే కొత్త కొత్త ప్రపంచం వస్తుంది నిద్రలో కలల రూపంలో ఆ కలలు కూడా ఒకానొక టైంలో పోయి గాఢ నిద్రలోకి తురి అవస్థలోకి వెళ్ళిపోయి అన్ని మరిచిపోయి ఒక శవంలా పడి ఉన్నావే అక్కడ ఒక సాక్షి భావం అనుభవిస్తున్నావు కదా దాన్ని నిద్రలో నుంచి మెలుకువలో కూడా అనుభవించలేకపోతున్నావు ఎందుకు ఏది అడ్డువస్తుంది చూడు మనం సాధారణంగా డెస్టినీని నమ్ముతాం కదా విధిని నమ్ముతాం కదా విధిని నమ్మడం ద్వారా సమస్య ఎప్పుడు పరిష్కారం కాదు కాదు అని
(27:34) చెప్పాడు జెడ్డి కృష్ణమూర్తి అంటే డెస్టినీ నమ్మావు సరేలే నాకు ఏ ఉద్యోగం రావాలని రాసి పెట్టిఉంటే అదే వస్తుంది నేను ఏ ప్రయత్నం చేయను అని ఉన్నావు. దాని [గురకలు] వల్ల ఆ ఉద్యోగము నీకు రాదు ఆ యొక్క డబ్బులు నీకు రావు దాని వల్ల పొందాల్సిన గౌరవము ఇవేమీ రావు అని చెప్తున్నాడు అంతే కదండీ నిజమే అంటే మన యొక్క ఆలోచన విధానం పరిమితులు అసలు ఏంటి ఎప్పుడైతే ఒక వ్యక్తి పూర్తిగా గమనిస్తాడో అబ్జర్వ్ చేస్తాడో అప్పుడు [గురకలు] మనం గత జన్మలు అనుకోండి ఉత్తరోత్తర జన్మలు అనుకోండి వాటి నుంచి విముక్తి అనేది పొందుతాం అదే నిజమైన నిజమైన స్వేచ్ఛ అని
(28:15) చెప్పాడు అదే నిజమైన మార్పు అని చెప్పాడు జెడ్డి కృష్ణమూర్తి ఎక్కువగా ఆలోచించి తర్జన బర్జన పొందాల్సిన విషయాలుఏమి ఇవి కాదండి సాక్షిగా చూడు ఒక్కరోజు సాక్షిగా చూడు ఏం జరుగుతుంది ఈరోజు నేను ఆఫీస్ కి ఏమి వెళ్ళడం లేదు ఈరోజు నేను ఇంటికి వెళ్ళడం లేదు జస్ట్ కూర్చుంటాను అని చెప్పి ఒక చెరువు దగ్గర గాని ఒక సముద్రం ఒడ్డున గాని నిలబడి కూర్చొని జస్ట్ అలా చూడు ఆ ప్రకృతిని చూడు ఆ సముద్రంలో అలలను చూడు సముద్రం కింద నుంచి బయటకి వస్తున్నట్టు కనిపిస్తున్న ఆ సూర్యుని చూస్తూ అలా ఉండు ఏమి చేయకు మిత్రమా నువ్వు అనుకుంటున్నావు ఈ భూమి మీద పనులన్నీ ఆగిపోతాయని ఏమీ ఆగవు సూర్యుడు
(28:56) అలానే ఉదయిస్తాడు అలానే అస్తమిస్తాడు ఆకాశంలో అలానే చంద్రుడు వస్తాడు అలానే నక్షత్రాలు వస్తాయి అలానే నక్షత్రాలు మెరుస్తాయి అలానే వర్షం పడుతుంది అలానే ఎండ ఎక్కుతుంది అలానే చలి కాస్తుంది నీ ప్రయత్నం ఏమాత్రం లేదు మిత్రమా నువ్వు అనుకుంటున్నావ్ సృష్టి ఆగిపోతుంది అని నీ ప్రయత్నం లేకపోతే నో ఈ సృష్టి స్పష్టంగా దానికి నియమ నిబద్ధలు క్లియర్ క్లిష్టల్ గా ఉన్నాయి.
(29:21) నీ యొక్క ప్రమేయం లేకపోయినా అవి ఖచ్చితంగా రన్ అవుతాయి. మరి ఓషో దృష్టిలో డెస్టినీ గురించి ఓషో ఏమన్నా అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి రమణ మహర్షి గురించి చెప్పుకున్నాం. జిడ్డు కృష్ణమూర్తి గురించి చెప్పుకున్నాం. మరి ఓషో ఏమన్నాడో కూడా తెలుసుకోవాలి కదా సో ఓషో దృష్టిలో ఈ డెస్టినీ ఈ దైవం ఇవన్నీ కూడా అర్థరహితమైనవి అంటే బోగస్ అని చెప్పాడు అంటే ఆయన కనీసం ఈరోజు నమ్మేవాడు కాదండి ఎందుకు నమ్మలేదు అంటే ఆయన ఆయన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే తనను తాను తెలుసుకోడో వేరొక దాని మీద డిపెండ్ అవ్వడం మొదలు
(29:58) పెడతాడు డిపెండ్ అవ్వడం మీన్స్ ఇంకొకటి ఏదో ఉంది నన్ను నడిపిస్తుంది అని నమ్ముతాడు నీవు ఎవరో నువ్వు తెలుసుకున్నాక నీకు ఎందుకు ఏం అర్థం అవుతుంది అంటే అంతటా నేనే ఉన్నాను కదా ఇప్పుడు నాలో ఈ శరీరం నడవడానికి ఏ శక్తి కారణం అవుతుందో ఎదుటివాడి యొక్క శరీరం నడవడానికి కూడా అదే శక్తి కారణం అవుతుంది కాకపోతే వాడు ఏదో బిర్యానీ తినడం వల్ల వాడికి ఆ శక్తి వచ్చింది నేను ఒక పెరుగు అన్నం తినడం వల్ల నాకు ఆ శక్తి వచ్చింది పదార్థాలు వేరు కావచ్చు కానీ శక్తి ఒక్కటే మిత్రమా ఆ శక్తిని వాళ్ళు గుర్తిస్తారు కాబట్టి ఆ శక్తిని వాళ్ళు ఆ స్థితి చూస్తారు కాబట్టి
(30:35) వాళ్ళకి భగవంతుడు అనేవాడు ఇంకొకడు లేడు అని అంటారు అంతే తప్ప భగవంతుడు అనేవాడు లేడు అన్నది వాళ్ళఏదో నార్మల్ గా అనరు ఆ స్థితిని అర్థం చేసుకొని అంటారు. సో ఓషో ఏది ఏదైనా రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందా అన్న ప్రశ్నకు చాలా దారుణంగా సమాధానం చెప్పేవాడు మనం విధి అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మడం అంటే నీవు బానిసవని ఒప్పుకోవడమే అంటే నువ్వు ఎవరినో భగవంతుడు ఉన్నాడని అంటున్నావ్ అప్పుడు నీ యొక్క సమర్థతను నువ్వు నమ్మడం లేదు ఆ భగవంతుడు చేస్తాడులే అంటే నీకు సమర్థత లేదు నేను చేతకాని వాడిని నేను ఒక బానిసని నువ్వు నువ్వు ఒప్పుకున్నట్టు మిత్రమా నువ్వు బానిసవు కాదు భగవంతుడు
(31:20) వేరు నువ్వు వేరు కాదు ప్రకృతి వేరు నువ్వు వేరు కాదన్న విషయం తెలుసుకోవడం నీ యొక్క ముఖ్యం కానీ నేను వేరు ప్రకృతి వేరు నేను వేరు భగవంతుడు వేరు అన్నావు ఎప్పుడో నువ్వు అప్పుడు బానిసవైపోతావు అది చాలా చాలా చాలా చాలా ప్రమాదం అని చెప్తున్నాడు ఓసో విధిని నమ్మితే జీవితంలో ఎటువంటి ఉత్సాహం ఉండదు ఎందుకంటే జరగాల్సింది జరుగుతుంది అనే నిరాశవాదం మనిషిని చంపేస్తుంది అన్నాడు ఓషో నేను చెప్తున్న ఓషో గురించి రమణ మహర్షి గురించి జిడ్డు కృష్ణమూర్తి గురించి విని ఒక కంక్లూజన్ కి రాకండి జస్ట్ సాక్షిగా చూడండి ఎందుకంటే కంక్లూజన్ కి వచ్చావా
(31:59) డిక్లరేషన్ కి వచ్చావా విన్న వెంటనే జడ్జిమెంట్లు వస్తాయి అది ప్రమాదం అలా ఎప్పుడు చేయకండి జస్ట్ సాక్షిగా చూడండి ముగ్గురి యొక్క సమాధానం అదే ఉంటుందండి ఎందుకంటే సాధారణంగా మనకు డెస్టినీ అనేది ఉంటది కదా డెస్టినీకి బదులుగా ఓసో ఎప్పుడు కూడా పొటెన్షియాలిటీ అని ఒకటి వర్డ్ యూస్ చేశాడు డెస్టినీ ప్లేస్ లో పొటెన్షియల్ అని ఒక వర్డ్ అంటే సాధ్యత నాకు ఇంత సాధ్యమవుతుంది అన్నది ఇప్పుడు ఉదాహరణకి ఒక విత్తనం అనేది పువ్వుగా మారడం అనేది దాని యొక్క స్వభావం అంతే కదండీ దాన్ని నువ్వు ఏమి మార్చలేవు ఒక విత్తనం అనేది ఒక పువ్వుగా మారడానికి నువ్వు ఇంజక్షన్
(32:36) కొట్టాల్సిన అవసరం లేదు లేకపోతే నువ్వు ఒక కెమికల్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు దానికి అందాల్సిన నీరు భూమిలో నుంచి అందితే దానికి అందాల్సిన సూర్యుడు దానికి అందితే దానికి తగలాల్సిన గాలి దానికి తగిలితే ఒక విత్తనం అనేది పువ్వుగా కచ్చితంగా మారుతుంది దాని యొక్క స్వభావం అది కానీ అదే ఆ పువ్వు ఒక బుద్దుడిగా మారదు కదా మారదు కదా ఒక కచ్చితమైన క్రూరమైన వ్యక్తిగా మారుతుందా మారదు కదా అంటే ఒక వ్యక్తి అతని ఎంపిక పరిసరాలు ప్రయత్నం పై అతని యొక్క స్థితి అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు.
(33:12) జంతువులకు ప్రకృతి ఒక మార్గాన్ని నిర్ణయిస్తుందండి. కానీ మనిషికి ఆ పరిమితులు అనేవి ఉండవు. మనిషి తన సొంత మార్గాన్ని నిర్మించుకోగలడు అందుకే మనిషి తన జీవితానికి తానే పూర్తి బాధ్యత వహించాలి. ఇది నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. జీవితం అంటే ఏంటి అంటే ఎప్పుడూ కూడా ఒకరిని బ్లేమ్ చేయకుండా నీ యొక్క జీవితానికి నువ్వే పరిపూర్ణమైన బాధ్యత ఎప్పుడైతే పొందుతావో ఇంకొకరిని క్లెయిమ్ చేయవో పరచింతన చేయకుండా బ్రతుకుతావో అప్పుడు నీకు నిరంతర ముక్తి అనేది లభిస్తుంది అని నేను చెప్పాను ఆల్రెడీ అది [గురకలు] యొక్క అది ఊసో యొక్క మాటల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
(33:50) సో ఫైనల్ గా ఏది రాసి పెట్టు ఉంటే అది జరుగుతుందా అన్న ప్రశ్నకు రమణ మహర్షి యొక్క సమాధానం ఏంటి జిడ్డు కృష్ణమూర్తి యొక్క సమాధానం ఏంటి? ఓసో యొక్క సమాధానం ఏంటి అనేది క్లుప్తంగా చెప్పేస్తాను జస్ట్ సింపుల్ గా వినండి. రమణ మహర్షి యొక్క సమాధానం ఏది రాసి పెట్టు ఉంటే అది జరుగుతుందా అన్న ప్రశ్నకు విధిని అంగీకరించు డెస్టినీని అంగీకరించు ఈ శరీరం నీ మనసు నేను కాదు అనే భావనని తెలుసుకొని ప్రకృతిని భగవంతుని యొక్క నిర్ణయాన్ని డెస్టినీని అంగీకరించు అహంకారాన్ని వదిలేసి భగవంతునిపై భారం వేయి ఆత్మ విచారణ చేసుకో అన్న సమాధానం రమణ మహర్షి ఇచ్చాడు.
(34:34) జిడ్డు కృష్ణమూర్తి విధి అనే నమ్మకాన్ని తిరస్కరించాడు. డెస్టినీ అనేది లేదు మనసు అనేది కండిషనింగ్ నుంచి విముక్తి పొందడమే స్వేచ్ఛ. నాకి నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి అన్న భావనని తెంచుకొని బయటికి రావడమే స్వేచ్ఛ అదే మనిషి యొక్క ముక్తి అది నీ చేతుల్లో ఉంది అని జెడ్డు కృష్ణమూర్తి చెప్పాడు ఓసో డెస్టినీని బానిసత్వంగా భావించాడండి ప్రతి మనిషి తన జీవితాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛ బాధ్యత కలిగిన వాడై ఉండాలి అన్నాడు.
(35:05) అంటే ముగ్గురు యొక్క సమాధానాలు వేరువేరుగా ఉన్నాయి. మరి అనొచ్చు ముగ్గురు యొక్క స్థితి ఒకటే అంటారు కదండీ మీరు అని నేను అదే చెప్తున్నానండి స్థితి ఒక్కటే ముగ్గురు యొక్క స్థితి ఒక్కటే మాట తేడా అయి ఉండొచ్చు కానీ ఆ మాటలో ఉన్న స్థితి కూడా మీకు అర్థం చేసుకుంటే శరీరాన్ని ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు అన్న విషయం తెలుసుకొని వాళ్ళ ఈ మాట మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఒకటండి ఒక కాయిన్ కి రెండు రెండు స్వభావాలు ఉంటాయి ఏంటి ఒకటి బొమ్మ ఒకటి బొరుసు ఉంటుంది.
(35:35) ఈ కాయిన్ కి బొమ్మ బరుసు అనే రెండు స్వభావాలు స్వరూపాలు ఉన్నాయి కాబట్టి నేను రెండు కాయిన్లు అంటాను అంటే పిచ్చి అంటారు వాళ్ళని కాయిన్ ఒకటే దాని యొక్క స్వభావాలు స్వరూపాలు రెండుగా కనిపించొచ్చేమో నీకు కాయిన్ మాత్రం ఒకటే సముద్రంలో ఒక అల వస్తుంది అల వేరు సముద్రం వేరు అనుకుంటే మూర్ఖత్వం సముద్రము అలా ఒక్కటే కానీ వేరుగా అది కనిపిస్తుంది అంతే దట్స్ ఏ జస్ట్ ఇల్యూజనేషన్ బ్రమ అది కానీ ఒక్కటే అన్న విషయం గమనించాలి అట్లాగే వీళ్ళ ముగ్గురు కూడా ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదన్న స్థితిని కలిగి ఉన్నవాళ్ళు ఆ స్థితిని ఆ స్థితి నుండి ఒక మాట మాట్లాడే
(36:10) ప్రయత్నం చేస్తారు వాళ్ళకి అర్థమైన అవగాహన అంతే సరేనా సో ఈ ముగ్గురు బోధనల సారాంశం ఒకటే విధి పేరుతో ప్రయత్నాన్ని వదిలేయడం సరికాదు భగవంతునిపై భారం వేయడమైనా చెప్పిన రమణ మహర్షి అయినా అహంకారం నుంచి విముక్తి పొందడమని చెప్పిన కృష్ణమూర్తి అయినా బాధ్యతతో జీవించని చెప్పిన ఓషో అయినా అంతిమంగా మనిషి అనేవాడు తన అంతరాత్మతో ప్రయాణించ చాలనే చెప్పారు ముగ్గురు కూడా ఇదే తెలుసుకో ఇలాగే నడువు సరేనా సో అరుణాచల శివ ప్రతి ఒక్కరికి అర్థమయిందని భావిస్తున్నాను.
(36:45) చిట్లు మీ అజ్జు బైపల్లి
No comments:
Post a Comment