Friday, May 29, 2026

 నేటి మంచిమాట 
ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి అది కింద పడకుండా ఉండాలి అంటే గాలి కావాలి. కానీ ఇవి రెండు ఎవరికి కనిపించవు. నువ్వు కూడా అంతే నీ విలువ  అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. 

నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి కానీ నిజం మాత్రం నిన్ను ఎప్పుడు రక్షిస్తూనే ఉంటుంది.

ఈ ప్రపంచంలోకి మనల్ని ఓ ఇద్దరు తీసుకువస్తారు ఓ నలుగురు మోసుకెళతారు. భూమ్మీదకి వచ్చేవరకు ఆ ఇద్దరు ఎవరో తెలియదు, ప్రాణం పోయాక ఆ నలుగురు ఎవరో తెలియదు. మన పుట్టుక మరణాలే ఎలా జరుగుతాయో తెలియదు అలాంటిది జీవితం ఇలానే జరగాలి అనుకుంటే ఎలా? 

చావు రానంతవరకే ఆస్తుల కోసం ఆరాటం పరువు కోసం పోరాటం. చావు వచ్చిన తర్వాత మొయ్యటానికి చేతులు పూడ్చటానికి గోతులు చెప్పుకోటానికి నీతులు తిట్టుకోవటానికి బూతులు తప్ప ఇంకా ఏమి మిగలవు.

శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏

No comments:

Post a Comment