నిజాయితీ గా ఉన్న స్త్రీ శాపం పెడితే కచ్చితంగా ఫలిస్తుంది || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ND9kyXV6ESI
Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ సొసైటీలో కారణం లేకుండా విడాకులు తీసుకుంటున్న ఆడవాళ్ళు ఉన్నారు అలాగే ఇప్పటికీ తల్లి మాట వింటూ భార్యకి విడాకులు ఇస్తున్న మగవాళ్ళు కూడా ఉన్నారన్నమాట అందరి మగవాళ్ళు శ్రీరామచంద్రుడులా ఉంటారు అంటే ఎలాగ శ్రీదేవు గారు కొంతమంది భార్యని వదిలించుకోవడానికి కూడా చూస్తున్నారు అని చెప్పి మీరు నన్ను క్వశ్చన్ వేస్తున్నారు కామెంట్స్ లో ఇది నిజమే అని చెప్పి సాద్విమనలు ఉంటారు ఈరోజుకి అమాయకురాళ్లు ఉంటారు మెతకతనం ఆడవాళ్ళు ఉంటారు అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది.
(00:40) మరి సాక్షాత్తు ఆ శ్రీరాముడే భార్యని అగ్ని ప్రవేశం చేయించాడు. అనుమానించాడు అడవులకు పంపాడు అని మీరు అంటున్నారు మనమఎంత మానవ మాత్రులం అని దులిపేసుకుంటూ పోతున్నారు. ఈ సమాజంలో రకానికి ఒక మనిషి రకానికి ఒక బాధ మరి ఎవరి బాధని ఎలా వర్ణించాలి అందరి బాధలు ఒక్కలా ఉండవు కదా మరి నేను చేసే వీడియో అందరికీ సమానంగా మీకు మంచి మెసేజ్ ఇస్తుందా అది మీకు మీది లైఫ్ కి ఎలా ఉపయోగపడుతుంది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే ఒక్క చిన్న మాట రకరకాల చాల బాధలుఉన్నా మనం ఎన్ని అవస్థలు పడుతున్నా
(01:30) లైఫ్ కి కొన్ని సంజాశీలు ఉంటాయి అలాగే కొన్ని సమాధానాలు ఉంటాయి కొన్ని ధర్మాలు ఉంటాయి మన సంప్రదాయాలు ఉంటాయి వాటిల్ని విడవకుండా మనం ముందుకు తీసుకెలిగితే ఎవరి లైఫ్ లో ఎటువంటి సమస్య అయినా చక్కబడద్దని చెప్పి నా ఉద్దేశం అందుకే నా వీడియోలు దయచేసి అపార్థం చేసుకోకుండా మనిషికి ఒక రకమైన సమస్యని వ్యక్తం చేయకుండా నేను చేసే వీడియోలోనే మనకి ధర్మం మీద సమస్య ఎలా చక్కబడగలదో ఎలా సర్దుకోగలం సమస్యని ఎందుకు పెద్దది చేసుకోవాలి ఎందుకు మనం సర్దుకోకూడదు మనం ఎందుకు అర్థం చేసుకోకూడదు జీవితాన్ని నరకం చేసుకోకూడదు అని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచించండి. అర్థం చేసుకొని
(02:17) సర్దుకొని ముందుకు వెళ్తే ఎటువంటి సమస్య అయినా చిన్నది అయిపోద్దని నా ఉద్దేశం రోజులు ఎంతగానో మారని మనం ఎంతగానో అప్డేట్ అయ్యాం ముందుకు వెళ్తున్నాం ప్రతి ఒక్క స్త్రీ విజ్ఞానంతో పెద్ద చదువులు చదువుకుంటున్నారు పెద్ద జాబులు చేస్తున్నారు అయినా కూడా మనలోని చిన్న లోపాలే మన జీవితాన్ని నాశనం చేస్తున్నాయని మీకు తెలియట్లేదు.
(02:40) రోజులు ఎంత మారినా కూడానండి భార్యలు భర్తలు చంపుతున్నా కూడా నీచమైన రోజులైనా కూడా దిగజారిపోతున్న రోజులైనా కూడా ఈ కాలంలో కూడా సీతాదేవి లాంటి సాద్విమనులు ఉన్నారు వారి కోసమే ఈ వీడియో ఇంతకీ సమస్య ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు శ్రీదేవి గారు అని మీరు నన్ను అడగొచ్చు తల్లి ప్రమేయంతో భర్తలో భార్యలకి విడాకులు ఇచ్చి వదిలించుకుందాం అని చూస్తున్నారు.
(03:06) మరి ఇది ఎంత పెద్ద పొరపాటు ఇంకా ఇటువంటి వారు ఉన్నారు ఖచ్చితంగా కావాలంటే మీ బంధువుల్లోనో మీకు తెలిసిన వారిలోనో మీ చుట్టుపక్కన వాళ్ళలోనో మీరు గమనించండి. గంగిగోవి లాంటి గృహిణిని చాలా ఇబ్బందులు పెడుతున్నారు పని మనుషులుగా వాడుకుంటున్నారు చాకిరి చేయించుకుంటున్నారు నోరు ఎత్తితే నాలుగు దెబ్బలు వేస్తున్నారు. పరువు కోసం పడిచచ్చే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పే ఉద్దేశమే ఈ వీడియో అన్నమాట.
(03:35) ఇక్కడ ఒక ఆమె జీవితంలో ఒక సంఘటన ఎలా జరిగింది అసల ఆమె జీవితం ఏంటి అత్తగారి ప్రమేయం ఏంటి ఆమె లైఫ్ లో భర్త ఎటువంటివాడు ఎలాగా మారటం జరిగింది అన్నది తెలుసుకుందాం మనం చేసిన వీడియోలో కొంతమంది ఆడవాళ్ళు బాధపడుతున్నారు ఆ కామెంట్ నా దృష్టికి వచ్చింది అనమాట వాళ్ళు ఏమంటున్నారంటే తలపగురితో డైవర్స్ తీసుకుంటున్న ఆడవాళ్ళు అన్న వీడియోలో ఒక కామెంట్ వచ్చింది ఆ సిస్టర్ బాగా బాధపడుతూ ఏమని చెప్పిందంటే మేము అన్ని పనులు చేస్తున్నాము జాబ్ చేస్తున్నాము అత్తమామలు చూసుకుంటున్నాము ఇంటి బాధ్యతలు వంట ఓర్పు అన్ని సక్రమంగా మా బాధ్యతలు మేము నిర్వర్తిస్తున్నాము
(04:14) అయినా కూడా మాకు ఎందుకు మంచి జీవితం లేదు మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు మమ్మల్ని ఎందుకు టార్చర్ పెడుతున్నారు మేము పని మనుషుల్లాగా ఎందుకు బతకవలసి వస్తుంది భర్త ఇంట్లో మాకు విలువ ఎందుకు ఇవ్వట్లేదు అలాగే భర్త తరపున వాళ్ళ నుంచి కూడా ఎటువంటి సానుభూతి లేదని చెప్పి బాధపడటం జరుగుంది జరుగుతుంది అయితే నిజంగా ఈ కామెంట్ కి అర్థం ఉందా నిజంగా ఇటువంటివి జరుగుతున్నాయా అని చెప్పి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
(04:45) రమేష్ అనే ఒక వ్యక్తి తన తల్లితో పాటు తన భార్య ఇద్దరు పిల్లలతో కుటుంబ జీవితం సాగిస్తున్నాడు. తన భార్య కూడా ఉద్యోగానికి వెళ్తూ ఉంటుంది గృహిణిగా తన బాధ్యతలు ఎన్నో చేస్తూ ఉంటుంది. అలాగే అత్తమామలను కూడా దైవం లాగా సేవలు చేస్తూనే అడ్జస్ట్ అవుతూ సౌమ్యంగా భర్త చెప్పిన మాట వింటూ ఉంటుంది. ఏనాడు భర్తకి ఎదురు కూడా చెప్పదన్నమాట. కానీ ఇక్కడ భర్త ఎప్పుడూ తన్ని అర్థం చేసుకోకుండా తిడుతూ కొడుతూనే ఉంటాడు.
(05:17) అందుకు కారణం తల్లి అని కూడా చెప్పుకోవచ్చు. ఎంతసేపు రమేష్ తల్లి భార్యా భర్తలని విడదిద్దామని వారిద్దరి మధ్యన గొడవలు పెడదామని వాళ్ళని దూరం చేద్దామని ఆమెని వదిలించుకుందామని రమేష్ భార్యకి విడాకులు ఇమ్మని ఎప్పుడు సతాయిస్తూ ఉంటుంది. రేయ్ రమేష్ ఎందుకురా దాంతో నీకు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు పని చేయదు వంట సరిగ్గా చేయదు నీకు చేదోడు వాదోడుగా ఉండదు.
(05:48) అలాంటి భార్య నీకు ఎందుకురా నా మాటిని విడాకలు ఇచ్చేసేయ్ వదిలేసేయ్ అని చెప్తూనే ఉంటుంది. నీకు బంగారు లాంటి సంబంధం చూశనురా వాళ్ళు ఐదు కోట్లు కట్నం ఇస్తా అన్నారు కారు ఇస్తా అన్నారు మనం ఉండడానికి ఒక ఇల్లి ఇస్తా అన్నారు. ఏం లేదురా అమ్మాయికి చిన్న లోపమే రెండో పెళ్లి అంట ఒక బిడ్డ కూడా ఉందంట అని చెప్పి ఆమె రోజు రమేష్ గొర్రని ఈ విధంగా ఖరాబ్ చేస్తారన్నమాట అయితే ఒక రోజున రమేష్ భార్య సుజాతకి విపరీతమైన ఫీవర్ ఆమె ఆఫీస్ కి కూడా వెళ్ళట్లేదు తనతో పాటు ఇద్దరు పిల్లలకు కూడా విపరీతమైన జ్వరం వచ్చి మంచం మీదే పడి ఉండి తను లేవలేని పరిస్థితుల్లో ఉన్న పిల్లలు రాత్రులు నిద్రపోకుండా
(06:33) ఏడుస్తూ ఉంటే వాళ్ళని బుజ్జగించి వాళ్ళకి సేవలు చేస్తూ రాత్రంతా నిద్ర లేక విపరీతంగా నీరసం అయిపోద్దిఅన్నమాట మర్నాడు ఉదయం లేచి తన పనులు యదావిధంగా చేసుకోలేదు తను కనీసం టీ పెట్టుకోలేని పరిస్థితుల్లో కూడా ఉండదున్నమాట తను పడుకొనే ఉంటది ముసుకు తన్నుకొని ఇంతలో రమేష్ తల్లి పార్వతమ్మ ఇంకా సతాయించడం మొదలెడద్ది అరేయ్ లేవరా రమేష్ ఏంట్రా మాకు ఈ కర్మ కనీసం ఉదయాన్నే కాఫీ పి కూడా నా మొఖన్ని పోయిదా ఏంట్రా నీ పెల్లం ఏంట్రా ఇది ఇంకా పడుకోనే ఉంది ఉదయం ఏడ అయింది ఆడదాని లక్షణాలు ఉన్నాయరా అసలు నీ పెల్లానికి ఇల్లు లేపరా ఇల్లు లేపు అని చెప్పి అదే
(07:15) గొడవ మళ్ళీ ఆవిడ మొదలు పెడతారు. ఇంతలో రమేషు సుజాతని సుజాత టైం ఎంతయింది ఏంటి ఇంకా లేగవు నాకు కాఫీ పెట్టివ్వు మా అమ్మకి కాఫీ ఇవ్వలేదంట ఇంకా నేను ఆఫీస్ కి ఎప్పుడు వెళ్ళను టిఫిన్ ఎప్పుడు చేస్తావ్ అని చెప్పి సతాయిస్తూ ఉంటాడు. అప్పుడు సుజాత ఏమండీ ఈరోజు నాకు చాలా జ్వరంగా ఉందండి నేను ఆఫీస కి కూడా వెళ్ళట్లేదు మీకు కూడా నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయలేను ఈరోజుకి మీరు బయటే ఎక్కడనా బోన్ చేయండి అని ఆమె అంటుందన్నమాట దానికి రమేష్ తల్లి విపరీతంగా కోప్పడిపోయి అరేయ్ ఈరోజు నిన్ను కాఫీ పెట్టుకోమంది బయటే భోజనం చేయమంది రేపు నిన్నే వండుకోమంటదిరా ఇలాంటి
(07:57) పెల్ల నీకు అవసరమా వెంటనే వదిలేసేయ్ విడాకులు ఇచ్చేసేయ అని చెప్పి ఇంకా రెచ్చిపోతది అన్నమాట ఇంట్లో పెద్ద గొడవ అవుతది సుజాత ఏడుస్తూ ఉంటుంది రమేష్ ఏం చేస్తాడు వెంటనే షర్ట్ వేసుకొని బయటికి బయలుదేరతాడు అది ఎక్కడికా అని చెప్పి ఆలోచిస్తే మనం లాయర్ ఇంటికి వెళ్తాడు లాయర్ ఇంటికి వెళ్లి డోర్ కొడతాడు కొట్టగానే లాయర్ గారి అబ్బాయి వస్తాడు చిన్నబాబు బాబు లాయర్ గారు ఉన్నారా అని రమేష్ అడుగుతాడు.
(08:28) ఆ బాబు ఏం చెప్తాడంటే కూర్చోండి మా నాన్నగారు వస్తారు అని అంటాడు ఇంతకీ రాడు ఒక 20 నిమిషాలు టైం అవుద్ది అయినా కూడా రాడు మళ్ళీ ఆ బాబు వస్తాడు బాబు మీ నాన్నగారు ఏరి చాలా టైం అయింది నాకు ఆఫీస్ టైం అవుతుంది అని రమేష్ అంటాడు ఇంతలో ఆ అబ్బాయి ఏమంటాడంటే చిన్న కుర్రోడు మా నాన్నగారు బట్టలు ఉతుకుతున్నారు అని అంటాడు. బట్ల బట్టలు ఉతుకడం ఏంటి మీ నాన్నగారు బట్టలు ఉతకడం ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోతూ గట్టిగా మాట్లాడతాడు అవునండి మా అమ్మ ఉతకమంటది మా నాన్న ఉతుకుతాడు బట్టలు ఉతుకుతున్నారు అని మాట్లాడి ఆ బాబు వెళ్ళిపోతాడు.
(09:04) తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కి లాయర్ గారు వస్తాడు. లాయర్ గారు వచ్చి ఆ ఎవరు బాబు నువ్వు ఏంటి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు నీ కేస్ ఏంటి దేనికి వచ్చావు అని అడుగుతారు. అడిగితే రమేష్ అదంతా కాదు గనీ లాయర్ గారు మీరు ఇప్పటివరకు బట్టలు ఉతికారా అని చెప్పి అడుగుతాడు. అవును ఉతికాను ఇందులో తప్పేముంది అంత ఆశ్చర్యపోతున్నావ ఏంటి అని లాయర్ అంటాడు అంటే ఆ ఏం కాదు మీరు బట్టలు ఉతకడం ఏంటి అని మళ్ళీ క్వశ్చన్ వేస్తాడు.
(09:31) నా భార్యకి ఆరోగ్యం బాగోలేనప్పుడు నేనే అన్ని పనులు చేస్తాను. ఇందాక బట్టలు ఉతికాను నిన్న ఇల్లు తడి బట్ట పెట్టాను అలాగే బాగోన్నప్పుడు నేనే వంట చేస్తాను ఆమెకి ఆరోగ్యం బాగోలేదు అని చెప్తాడన్నమాట ఇందులో తప్పేముందయ్యా ఒకరికొకరు సహకరించుకోవాలి కదా భార్య భర్తకి సహాయం చేయాలి భర్త భార్యకి సహాయం చేయాలి భార్య భర్తలకి పిల్లల సహాయం చేయాలి అని లాయర్ మాట్లాడుతూ ఉంటాడు.
(10:03) మాట్లాడుతూ ఉండగానే ఇంతలో రమేష్ కి ఒక ఆలోచన వస్తది ఇదంతా తన బుర్రలో తిరుగుతూ ఉంటుందన్నమాట ఇంతకీ నీ కేస ఏంటి చెప్పు అని లాయర్ అంటాడు ఆ కేసఏంటి ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇప్పుడే వస్తావా ఎందుకు వచ్చావయ్యా లేదు లేదు చిన్న పని ఉంది ఇంటికి వెళ్లి వస్తాను అని పరుగులు తీస్తూ పరిగెడతాడు పరిగెట్టి నేరుగా ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్లి వెంటనే సుజాతను పిలిచి సుజాత కుక్కర్ ఎక్కడుంది అని అడుగుతాడు అడగ అడగగానే ఏవండీ మీరేంటి ఇప్పుడేగా కోపంతో వెళ్ళారు అప్పుడే ఏంటి ఇలా వచ్చారు అని అంటది.
(10:39) లేదు నాకు జ్ఞానోదయం అయింది అని చెప్పి అంటాడు. కుక్కర్లో నేను రైస్ పెట్టేస్తాను నువ్వు వంటే ఏం చేయొద్దు నేను కూరలు బయట నుంచి తెస్తాను ఈ పూటకి నువ్వు ఒంట్లో బాగుంటే మళ్ళీ నువ్వు ప్రిపేర్ చేయొద్దులే అని చెప్పి సానుకూలతగా మాట్లాడుతాడు అన్నమాట. ఇంతలో రమేష్ తల్లి పార్వతమ్మ ఏరా నీకు బుద్ధి లేదా దానితో మాటలే ఏంటి అసలు నువ్వు బియ్యం కడుగుతున్నావ్ ఏంట్రా అని చెప్పి గట్టిగా కేకలేస్తుంది.
(11:00) నువ్వు ఊరుకోవే అమ్మ నీకు అసలు బుద్ధి ఉందా భార్య భర్తలు ఇద్దరికీ సర్దుబాటు చేయాలి కానీ గొడవలు పెద్దవి చేస్తున్నావు మమ్మల్ని ఇద్దరిని విడదీయాలని చూస్తున్నావు అది కాదే అమ్మ మేమిద్దరం విడిపోతే పిల్లల్ని ఎవరు చూస్తారు పెళ్లి లేదు పెడాగులు లేదు నాకు ఉన్న పెళ్లి చాలు అని చెప్పి వాళ్ళ అమ్మని మందలిస్తాడు అన్నమాట అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే అక్కడ రమేష్ ఆలోచించింది ఏమిటి అంటే ఎంత హెల్త్ బాగోకపోయినా నా భార్య ఏరోజు నాకు కనీసం టీ పెట్టివ్వండి కాఫీ పెట్టివ్వండి మంచి నీళ్లు ఇవ్వండి అని కూడా అడగలేదు మరి నేను ఎంత అదృష్టవంతుడిని ఈరోజు ఎంతో విపరీతమైన
(11:37) జ్వరం ఉండడం వలన వంట చేయలేకపోయానని చెప్పింది దానికి తప్పేంటి చిన్న చిన్న కారణాలకి నేను విడాకులు ఎందుకు ఇవ్వాలి అసలు మేము ఎందుకు సర్దుకోకూడదు అని ఆలోచిస్తాడు అన్నమాట అంతేకాకుండా పెద్దవాళ్ళు పిల్లల జీవితాన్ని చక్కబెట్టాలి గాని చిన్న సమస్యని పెద్దది చేసి దాన్ని భూతద్దంలో చూసి ఇంకా ఇద్దరు భార్యా భర్తల మధ్య ఈయన మూడో వ్యక్తి జోక్యం కలగజేసుకుని సమస్యలను పెద్దవి చేయకూడదు అని చెప్పి బుద్ధి తెచ్చుకుంటాడు అన్నమాట భార్య విలువ తెలుసుకొని గుట్టుగా సంసారం చేయాలి అని చెప్పి కోపం తగ్గించుకొని మంచి మనసుతో సర్దుపాటుతో ఓర్పుతో ముందుకు వెళ్తూ ఉంటాడు అన్నమాట
(12:16) రమేష్ కూరలు తీసుకురాగానే అన్నం పెట్టుకుంటుంటే కంచంలో ఇంతలో సుజాత వచ్చి ఏవండీ నేను ఉన్నాను కదా ఎందుకండీ మీకు శ్రమ నేను వంట చేయలేకపోయాను గానీ కంచంలో అన్నం కూడా పెట్టనని చెప్పానా నా చేతితోనే వడ్డిస్తానండి అని చెప్పి అన్నం వడ్డిస్తూ ఇంతకీ ఏమైందండి మీలో ఎందుకు ఇంతలా మార్పు వచ్చింది అని అడుగుతుందన్నమాట ఇదంతా నాకు వచ్చిన జ్ఞానోదయం సుజాత నాలో జ్ఞానోదయం అయింది.
(12:44) ఎడ్ల బండి ప్రయాణం ముందుకు వెళ్ళాలంటే రెండేడ్లు సమానంగా అంటే జోడెడ్లు సమానంగా ఆ బరువుని కాయాలి ఆ బండిని ఈడ్చుకెళ్ళాలి గానీ అటోకలు ఇటొకలు లాగుతూ ఉంటే ఆ ప్రయాణం ఎలా సాగుద్ది అదే సుజాత నాలో మార్పు అని చెప్పి చిన్నగా చక్కగా చిరునవ్వు నవ్వుతూ తన చేసిన పని మనసులోనే దాచుకుంటూ భార్యకి సమాధానం ఇస్తాడన్నమాట ఇది స్టోరీ కాదండి అందరి జీవితం లో జరుగుతున్న పచ్చి నిజం మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది మనందరి జీవితంలో జరుగుతున్న ఈ చిన్న చిన్న సమస్యల్ని మనం ఎలా సర్దుకోవాలి మనం ఓర్పుతో ఎలా ప్రవర్తించాలి పెద్దవాళ్ళ మాటల్ని పక్కన పెట్టాలా పెద్దవాళ్ళని ఇంట్లో నుంచి
(13:30) పంపించేయాలా భర్త మాటలు వింటూ భారాన్ని మోయాలా భర్తని భరించాలా లేదా భర్తని అర్థం చేసుకోవాలా మనం భర్తకి అర్థమయ్యేటట్టు ప్రవర్తించ చాల అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. మరి ఈ స్టోరీ ఎలా ఉందో మీ అందరి అభిప్రాయాలని ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో ఉంచండి. ఇక్కడ ప్రతి భర్త తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే 100కి 60 శాతం మంది భర్తలు ఇలాగే ఉన్నారండి ఇదివరకు రోజుల్లో ఎక్కువ మంది ఉండేవారు ఇప్పుడు చాలా తగ్గారని చెప్పొచ్చు.
(14:03) భార్య అసహనానికి గురవుతే ఏమవుతుంది? కాపురం ఏమవుతుంది? మీ జీవితం ఏమవుతుంది? కనీసం మీకు మంచి నీళ్లు కూడా ఇచ్చే ఆడవాళ్ళ ఇంటిలో ఉండరు అన్న విషయం మీరు గ్రహించాలి అంటే ఇప్పుడున్న ఆడవాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారు వాళ్లే విడాకులు కోరుకుంటున్నారు పేటరేగిపోతున్నారు భర్తని గౌరవం లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నారు ఇంకా కొడుతున్నారు తిడుతున్నారు అన్న రీజన్లు మీరు చెప్పొచ్చు కానీ గంగి గోవు లాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారని మీరు మర్చిపోవద్దు.
(14:33) ఆడవాళ్ళు అసహనానికి గురవుతే భూదేవి ఉగ్రరూపం దాల్చితే ఎలా భూమి కంపించిపోతుందో మన పరిస్థితి కూడా అలా అవుతుంది మీ ఇల్లు కూడా అలా అవుతుందని మీరు గ్రహించాలి. చాలామంది ఆడవాలు చాలా సాఫ్ట్ గా ఉంటారు ఓపికగా ఉంటారు ఓర్పుగా ఉంటారు గంగి గోవులా ఉంటారు చాలా నిదానంగా ఉంటారు సౌమ్యులు అన్నమాట వీళ్ళు అటువంటి ఆడవాళ్ళని దయచేసి మీరు చెడగొట్టుకోకండి.
(14:59) అంత నిదానంగా ఉన్న వాళ్ళని మనం బాధ పెడితే సాక్షాత్తు ఆ ఆదిశక్తి ఆగ్రహానికి గురైనట్టు మీ భార్య ఆగ్రహానికి శాపాలకి గురవ్వాల్సి వస్తది. స్త్రీ శాపం చాలా ప్రమాదకరం. ఇప్పటికీ బాధ్యతలు చేపట్టే ఆడవాళ్ళు ఉన్నారు భర్తని గౌరవించే ఆడవాళ్ళు ఉన్నారు అత్తమామలని స్వీకరించే ఆడవాళ్ళు ఉన్నారు ఇల్లు చక్కదిద్దుకునే ఆడవాళ్ళు ఉన్నారు ఇంటా బయట గౌరవాలు సంపాదించుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారని మీరు మర్చిపోవద్దు.
(15:27) ఉదయం లేవగానే ఇంటి పనులు వంట వార్పు వాళ్ళ ఉద్యోగాలు ఇంట్లో గృహిణిగా వాళ్ళ పాత్రలు పిల్లల బాధ్యతలు డైపర్లు మార్చటాలు నిద్రలేని రాత్రులు ఇంకా పెద్దవాళ్ళకి సేవలు ఇంకా మిమ్మల్ని సుఖపెట్టడం ఇవన్నీ మీరు మర్చిపోవద్దు ఇవన్నిటితో కలిపి ఆమె ఆరోగ్యం ఎంతో ముఖ్యమని మీరు తెలుసుకోవాలి. మీరు పెట్టే టార్చర్లకి మీ దగ్గర తీసుకుంటున్న ప్రతి మాటకే వాళ్ళు బాధపడుతూ నువ్వు తిన్నావా అని కూడా అడగలేదు అన్న బాధ మనసులో పెట్టుకుంటూ ఉంటారు అంటే ఆడవాళ్ళు పెద్దగా దేనికి ఆశపడరండి చిన్న చిన్న ఆనందాలు ఉంటే వాళ్ళకి చాలు భర్త కలిసి భోం చేయాలని నువ్వు భోజనం చేశవా అని అడగాలని
(16:12) ఒక చీర వంద రూపాయల చీర అన్నా కొనివ్వాలన్న ఆలోచనతో ఉన్న ఆడవాళ్ళు కూడా ఉన్నారని మీరు గ్రహించాలి మీరు సక్కిదిగా లేకపోవడం వల్లనే భార్య ఎన్నో ఆలోచనలు చేస్తూ టెన్షన్స్ పెట్టుకుంటూ అనారోగ్యానికి పాలవుతూ ఆమె ఆరోగ్యాన్ని కూడా చూసుకోకుండా తిండి తినకుండా అనారోగ్యానికి పాలవుతున్న ఆడవాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్తున్న ఆడవాళ్ళు బీపీలు షుగర్లో ఎన్నడు నొప్పులు తలనొప్పులు ఎన్నో కారణాలు రక్తహీనతలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయ అంటే కేవలం కుటుంబ పరిస్థితులు భర్త ప్రేమ దొరకకు వస్తున్నాయని నేను గట్టిగా చెప్పగలను అన్నమాట మరి ఈ వీడియో గురించి మీరు
(16:48) ఏమనుకుంటున్నారు కచ్చితంగా మనందరి లైఫ్ ఇలాగే ఉంటుందా ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే మాట అండి గంగి గోవి లాంటి ఆడవాళ్ళను రెచ్చకొట్టకండి దూరం చేసుకోకండి మీరు ఎంత మచ్చికి చేసుకుంటే అంత దగ్గర అవుతుందని మీరు గ్రహించండి. నిజాయితీగా ఉన్న స్త్రీలు శాపం పెడితే ఖచ్చితంగా ఫలిస్తుందని మర్చిపోకండి. మరి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.
(17:18) మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి ఇటువంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి మరి ఉంటానండి
No comments:
Post a Comment