పెళ్ళికి ముందు, తర్వాత. తస్మాత్...జాగ్రత్త! Be careful before marriage & after marriage
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=trVhk-qO6j8
Transcript:
(00:00) వీడియో టైటిల్ చూశారు కదండ కాకపోతే ఈ వీడియోలో అమ్మాయిల ఫేవర్ గా ఎక్కువ చెప్పడం జరుగుతుందండి. అట్లానే మగపిల్లలని తక్కువ చేయడం అని కూడా కాదు వాళ్ళ గురించి కూడాను చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. సో నేరుగా విషయానికి వచ్చినట్లయితే ఈ పెళ్లి చూపుల్లో అమ్మాయిని అబ్బాయి చూడటం అబ్బాయిని అమ్మాయి చూడటం మ్యారేజ్ బ్యూరో ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని అమ్మాయిల్ని అబ్బాయిల్ని నిర్ణయం చేసుకోవడం లేదా వీళ్ళద్దరూ తల్లిదండ్రులకు తెలుసో తెలియకో ముందే ప్రేమించేసుకోవడం అలాగే Facebookఇగ లో పరిచయాలు మెల్లమెల్లగా ప్రేమగా మారటం ఇలా పెళ్లిలు జరిగి పోతున్నాయండి
(00:46) వాస్తవానికి ఒక్కళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకునే టైం ఉండదు కొన్నిసార్లు అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులు కూడాను టైం ఇవ్వటం లేదండి అలాగా ఎవరంటే ఏమిటో ఎవరికీ తెలియటం లేదు అటు పెద్దలు ఇటు పెద్దల గురించి కూడాను ఈ పిల్లలకు కూడా తెలియటం లేదు. కానీ ఒక్కటి మటుకు నిజం అండి అదేంటంటే ఎవ్వరు ఇంకోలా ఉండరు పుట్టరు పెరగరు ఆలోచించరు కూడా అసలు సృష్టిలో అలా జరగనే జరగదు జరుగుతుంది అని అనుకోవడం అంత అమాయకత్వము అజ్ఞానం కూడాను మరొకటి ఉండదండి.
(01:20) ఇప్పుడు మామూలుగా ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆడపిల్లలు మోపిల్లలు కూడాను సరిసమానంగా చదువుకుంటున్నారు కదా సో చదువులు క్యాంపస్ సెలెక్షన్లు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలు దాటి చివరికి జాబ్ తెచ్చుకునేటప్పటికీ అమ్మాయిలకి అబ్బాయిలకి 30 ఏళ్ళు ఈజీగా వచ్చేస్తున్నాయి ఇది మనందరికీ తెలిసిన విషయమే సో ఈ ప్రయాణంలో వాళ్ళకి అసలు జీవితం అంటే ఏమిటో తెలియకుండా పోతున్నది.
(01:47) పెళ్లి అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి కూడాను వాళ్ళకి తీరుబాటు ఉండటంలేదు. ఇక పిల్లల పెంపకము దాని మీద వాళ్ళకి ఎక్కడ అవగాహన ఉంటుంది చెప్పండి కదా పెళ్లి కాానే ఒకటి రెండు సంవత్సరాల్లో పిల్లల్ని కనేస్తున్నారు కదా అలా పెళ్ళీళ్లు చేసేసుకొని రకరకాలుగా మానసిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కోకొల్లలండి ఆ మాటకవస్తే వేలల్లో ఉన్నారున్నమాట అసలు ఈ అవగాహన రాహిత్యం లేకుండా ఉండాలి అంటే ఏమేమి ముందు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నదే ఈ వీడియోలోని విషయం అండి కాకపోతే ఈ విషయాన్ని ఒక్క నిమిషం పక్కన పెడతాను ఒకప్పుడు పెళ్లి అనేది వేడుక సందడి ఆచారాల ఆడంబరాల కలయక అన్నమాట నిజంగా చెప్పాలి
(02:27) అంటే అదొక సుదీర్ఘ జీవన ప్రయాణానికి ప్రేమాయాణానికి మొట్టమొదటి అడగండి కానీ ఇప్పుడు మ్యారేజ్ ఒక ఆ ఈవెంట్ అయిపోయింది. ఈ ఆడంబరం అంబరాన్ని దాటుతున్నది. విపరీతమైన ఖర్చు చేసేస్తున్నారు పోటీపడి మరి చేస్తున్నారు. చాలా సందర్భాల్లో పెళ్లిఅయిన తర్వాత అబ్బాయి చెప్పినవి అమ్మాయి చెప్పినవన్నీ కూడాను అబద్ధాలే అని తేలిపోతున్నాయండి ఆ క్షణం నుంచి ఈ నమ్మక ద్రోహానికి తరలేస్తున్నది.
(02:59) అపార్థాలు చోటు తీసుకుంటున్నాయి. ఒకళ్ళని ఒకళ్ళు నమ్మలేని పరిస్థితి వస్తున్నది. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత చాలా మంది ఆడపిల్లల విషయంలో ఒకటి జరుగుతున్నదండి అదేంటంటే పెళ్లి చేసుకొని అత్తగారి ఇంట్లో అడుగు పెట్టేటప్పటికీ వాస్తవాలు దాచబడ్డాయి అంతకుముందు చెప్పిన వాస్తవాలు వక్రీకరించబడ్డాయి మోసం జరిగింది అన్న భావనకి వస్తున్నారండి ఆడపిల్లలు ఆడపిల్లలు తల్లిదండ్రులు కూడా ఒక రెండు నెలల తర్వాత విషయం అర్థమయిన తర్వాత అమ్మాయి అత్తగారు నేను నిల తీసింది అనుకోండి అది ఏంటండి మీరే లీడు తీసుకున్నారు కదా మీరు చెప్పినవన్నీ ఇప్పుడు సరైనవి కావు అని తేలిపోయాయి కదా
(03:44) అబ్బాయికి సరైన ఉద్యోగం లేదు అదేదో శాలరీ ఎంత అంటే ఏదో చెప్పారు చివరికి అది కూడా లేదు కార్లలోన్లు ఇల్లులోన్లు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని అలవాట్ల గురించి అసలు మీరు చెప్పనే చెప్పలేదండి అబ్బాయి గురించి ఇదేమిటండి అని నిలదీస్తే అత్తగారు సర్దుకు పోమా నేను ఉన్నాను కదా నీకెందుకు అని ఒక ఫాల్స్ భరోసా ఇస్తున్నదండి అంటే ఇక్కడ [గొంతు సవరించుకోవడం] మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కన్న తల్లే అట్లాగే తండ్రే పిల్లవాడిని కంట్రోల్ చేయకుండా పెంచినప్పుడు పెళ్లిఅయిన తర్వాత వీళ్ళ మాట అబ్బాయి వింటాడన్న గ్యారెంటీ ఏమిటి చెప్పండి అంటే నాకు ఈ మధ్య చాలా ఫోన్లు కూడా వస్తున్నాయి
(04:25) ఆడపిల్లలు కూడాను అనేక విషయాలు చెప్పి బాధపడుతున్నారు. అందువల్ల నేను ఈ వీడియో చేయాల్సి వస్తుందండి. తీరా ఓ రెండు నెలల తర్వాత అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ విషయాలన్నీ చెప్పింది అనుకోండి తల్లిదండ్రులు కూడా ఒక విధమైన భయానికి గురయి అదే మాట అంటున్నారు సర్దుకు పో అమ్మా అని చెప్పేసి ఎంతకాలం ఈ అమ్మాయి సర్దుకు పోవాలి అయితే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉందండి ఈ అమ్మాయి అత్తగారి తరపు నుంచి మామగారి తరపు నుంచి ఇప్పుడు అందరూ ఇద్దరు పిల్లలనే కంటున్నారుగా ఒక కొడుకు ఒక కూతురు లేకోతే ఇద్దరు పిల్లలు మోపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వీళ్ళ భయం ఏంటంటే
(05:01) ఇప్పుడు కోడలి పక్షం వహించేసి పిల్లవాడిని దబాయించడం ప్రారంభించారు అనుకోండి తప్పు పట్టడం ప్రారంభించారు అనుకోండి వాడు అసలు రేపు పొద్దున ఈ తల్లిదండ్రుల మాట వినకపోతే ఎలాగా ఎందుకంటే వీళ్ళకి కూడాను 10 ఏళ్ళ తర్వాత వయసు పైబడిన తర్వాత వీళ్ళు వృద్ధులు అయిపోతారు కదా అయిపోయిన తర్వాత వాళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి మంచంలో పెడితే చూసుకోవాలి ఇవన్నీ ఈ ఈ కొడుకు చూసుకోవడేమో అన్న ఒక భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని దాచేసి చివరికి పెళ్లి అయిన తర్వాత సరిదుకు పోమా అంటున్నారండి జరుగుతున్నది ఇవన్నీ కూడా జరుగుతున్నాయి.
(05:35) ఇలా చాలామంది అమ్మాయిలు కష్టపడి చదువుకొని జాబ్ చేస్తూ పెళ్లయిన తర్వాత దిక్కు లేని దిక్కు తోచని స్థితిలో ఉన్నారండి ఇంకో విషయం నా దృష్టికి వచ్చింది అదేంటంటే పెళ్లి చూపుల తర్వాత నిశ్చితార్థం రోజున అంటే నిశ్చితార్థం అయిపోయిన తర్వాత అమ్మాయి అబ్బాయిని అడిగింది సరదాగా అడిగింది ఎందుకంటే అప్పుడంతా వాతావరణం కోలహాలంగా ఉంటుంది కదా అటు వాళ్ళు ఇటు వాళ్ళు వచ్చి శుభలేఖలు చదివా అక్షింతలు వేయటం కూడా జరుగుతుంది కదా అంటే ఒక నిశ్చితమైన అర్థాన్ని ప్రపంచానికి తెలియపరచడం జరుగుతుంది.
(06:11) అందుకనే దాన్ని నిశ్చితార్థం అంటారుఅన్నమాట. ఆ టైంలో అమ్మాయి కొంచెం తేలిక చూసుకొని అబ్బాయితో ఒకసారి మీ Facebook అకౌంట్ చూపెట్టండి అలాగేఇగ అకౌంట్ కూడా చూపెట్టండి. అంటే ఓపెన్ చేసి చూపెడతారా అని అడిగిందండి అడిగితే అబ్బాయి ఏం మాట్లాడలేదు రెండు మూడు సార్లు అడిగేటప్పటికి చిరాకు పడ్డాడు చిరాగపడి సారీ ఇవన్నీ నా పర్సనల్ ఇవ నేను వాడకూడదు అన్నాడండి అంటే ఆ అమ్మాయి అంది అదేంటి మనం భార్యా భర్తలుగా డిక్లేర్ అయిపోయాం కదా అసలు ఇంతకుముందే అడుగుదాం అనుకున్నాను బాగుండదని అడగలేదు అంతే ఎందుకంటే మమ్మగారు మీ నాన్నగారి సంస్కారం చూసిన తర్వాత ఏముందిలే అని అనుకున్నాను మరి నువ్వు ఎలా
(06:55) నేను చెప్పనేది నా పర్సనల్ అంటే ఎలాగా అని కొంచెం హతావసురాలై మౌనంగా ఉండిపోయిందండి అంటే కొంచెం భయం కూడా పట్టింది అమ్మాయికి ఆ క్షణం నుంచి ఏమైందంటే ఆ రోజు తర్వాత చివరికి ఆ ముహూర్తం పెట్టుకున్నాక కూడా ఎందుకంటే ముహూర్తాలు పెట్టేసుకుంటారు కదా ఆ డేట్ కి ముందు వరకు కూడా అబ్బాయి మాట్లాడలేదండి ఫోన్ కూడా ఎత్తలేదు అప్పుడు అమ్మాయికి అర్థమయింది.
(07:18) ఓహో నేను గనుక మ్యారేజ్ చేసుకుంటే ఏదో బ్రహ్మాండం బద్దల అయ్యేటట్టు ఉంది. కాబట్టి అమ్మ నన్ను కూర్చోబెట్టి వివరించి ఇవన్నీ చెప్పిందట ఆ విధంగా ఆ పెళ్లి ఆగిపోయింది. ఇంకో చోట ఏం జరిగిందంటే అమ్మాయి అబ్బాయి యొక్క సివిల్ స్కోర్ చూసి అతాసరాలు అయిపోయిందండి ఆయనక వచ్చిన పాయింట్స్ ఎలా ఉన్నాయి అంటే చాలా లోగా ఉన్నాయి అన్నమాట ఇల్లుంది కారు ఉంది వాటి మీద లోన్లు కూడా ఉన్నాయి.
(07:46) అమ్మాయికి డౌట్ వచ్చేసింది. రేపు నా పెళ్లి అయితే నా శాలరీ అంతా కూడా ఈ లోన్లలోకి హారతి గారిపూర్వం అయిపోతుంది కదా అని ఒక ఇంటెలిజెంట్ డెసిషన్ తీసేసుకుని తల్లిదండ్రులకి చెప్పి వీట అబ్బాయి కూడాను చెప్పేసిందండి కొన్ని కారణాల వల్ల నేను పెళ్లి చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి వాళ్ళు ఎంతో ప్రయత్నించారు అమ్మాయిని ఎందుకు ఎందుకని చెప్పలేదండి సో ఆ సంబంధం కూడాను అలా విగిపోయింది.
(08:11) అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలంటే అది ఏంటంటే [గొంతు సవరించుకోవడం] ఈ టూ మచ్ జనరేషన్ గ్యాప్ వల్ల తల్లిదండ్రులకు ఈ టెక్నాలజీ మీద అలాగే యప్స్ మీద అవగాహన ఉండటంలేదు ఎందుకంటే 60 ఏళ్ళు దాటిపోతున్నారు కదా తల్లిదండ్రులు అవగాహన ఏర్పరుచుకునే వయసు కూడా కాదన్నమాట సో తల్లిదండ్రులు ఎంత ధార్మిక సంపన్నులైనా లేటెస్ట్ ట్రెండ్స్ మీద గనుక అవగాహన లేకపోతే వాళ్ళు అమాయకుల కింద లెక్క అప్పుడు ఏం జరుగుతున్నది అంటే ఈ బాధ్యత అంతా పిల్లల మీద పడుతున్నది.
(08:44) ఈ డీటెయిల్స్ అన్నీ కూడాను వెరిఫై చేసుకోవడంలో అంటే ఈ మొబైల్స్ వల్ల యప్స్ వల్ల టెక్నాలజీ వల్ల అసలు జరుగుతున్న [గొంతు సవరించుకోవడం] పెద్ద ప్రమాదం ఏంటంటే నేను చాలా వీడియోలో కూడా చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నానండి. ఏ వయసులో ఏవి తెలవకూడదో ఏవి అనవసరమో అవన్నీ తెలిసిపోతున్నాయండి. అడిగినా ప్రశ్నించిన ఈ అబ్బాయి అమ్మాయిల మధ్య ఈగోస్ అడ్డు వస్తున్నాయండి అంటే ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఎక్కడ రహస్యం ఉంటుందో అక్కడ ఆల్రెడీ తప్పు జరిగి ఉంటుందండి దాన్ని ప్రశ్నించే కొద్ది ఇటు అబ్బాయి గాని అమ్మాయి గాని అబద్ధాలు ఆడటం మొదలు పెడతారు.
(09:29) అలా వీళ్ళద్దరూ కూడాను కొద్ది రోజుల తర్వాత విలువల్ని కోల్పోవడం జరుగుతున్నదండి పిల్లల విషయంలో ఇదే జరుగుతున్నది ఇదే జరుగుతున్నది. అయితే ఇంకొక చిన్న విషయం నాకు ఎందుకో గుర్తుకొస్తున్నది ఈ వీడియోతో పాటు మీరు ఇంకొక వీడియో కూడా చూడాల్సి ఉంటుంది అది నేను జనవరి 2023 లో చేశాను. దాదాపు 30 నిమిషాల 43 సెకండ్లు ఉందండి ఆ వీడియో టైటిల్ ఏంటంటే అమ్మాయి పెళ్లి చేస్తున్నారా అయితే తప్పకుండా వినండి.
(09:57) ఆర్ యు పెర్ఫామింగ్ డాటర్స్ మ్యారేజ్ లిజన్ ఇదండి టైటిల్ నేను డిస్క్రిప్షన్ లో కూడా నేను ఇస్తానండి ఇబ్బంది ఏమ లేదు సో ఈ వీడియోని మీరు తప్పకుండా చూడండి సో అసలు విషయానికి వస్తే కాబట్టి అరేంజ్డ్ మ్యారేజెస్ లో పిల్లలు తల్లిదండ్రులు కూర్చొని నిర్మొహమాటంగా తెలుసుకోవలసినవి అడగవలసినవి నిర్ధారించుకోవలసినవి అంటే ప్రూఫ్ తో సహా ఒక అవగాహనకి రావాలండి చర్చించుకొని అవసరమైతే లిస్ట్ రాసుకొని అవన్నీ అడగాల్సిందే అమ్మాయిల తల్లిదండ్రులైనా అబ్బాయిల తల్లిదండ్రులయినా కూడా అవసరమైతే చెప్పాను కదా దాని ప్రూఫ్స్ కూడా తీసుకోవాలి.
(10:40) ఒకటండి పెళ్లికి ముందు అందరూ వినయంగా ఉంటారు ప్రేమగా ఉంటారు మంచిగా కనబడతారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మొహమాటానికి పోకూడదు. కదా అంత్యనిష్టూర అంటే ఆదినిష్టూరమే మేలు అంటారు కదా ఇటువంటి సామెతలు ఊరికే రాలేదండి అంటే దాపరికాలు లేని సంబంధాలని వెతుక్కోవలసిందే తప్పదండి తప్పదు అయితే చివరిగా చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్లలకి ఇ జనరల్ గా మగపిల్లలకి ఇది ఈ విధంగా వెరిఫై చేసుకోవడం అనేది చాలా ముఖ్యము అలాగే ఇది సంయమనానికి
(11:25) సంబంధించిందండి ఓపిక పట్టాలి ఎవరైనా కూడా అట్లాగే ఇంకొక విషయం అదేంటంటే నిగ్రహానికి సంబంధించింది ఒక విధంగా చెప్పాలంటే ఇది లిట్మస్ టెస్ట్ అండి అగ్ని పరీక్ష అనుకోండి అగ్ని పరీక్ష అనుకోండి అంటే పెళ్లి అయిన తర్వాత చెప్తున్నా నేను పెళ్లి అయిన తర్వాత చెప్తున్నా పెళ్లికి ముందు ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఒకవేళ పెళ్లి అయినా కూడా ఇటువంటి అగ్ని పరీక్షకు గురి కావలసిందే అది ఏంటంటే [గొంతు సవరించుకోవడం] మూడు సంవత్సరాల వరకు పిల్లల్ని కనడాన్ని పోస్ట్పోన్ చేయండి దయచేసి దయచేసి [నవ్వు] దయచేసి చెప్తున్నాను ఇటు అబ్బాయిలు అనుకోవాల్సిందే అమ్మాయిలు
(12:04) అనుకోవాల్సిందే ఈ లోపల ఏం జరుగుతుందంటే ఈ మూడేళ్లలో చాలా విషయాల మీద అవగాహన వస్తుందండి మనస్తత్వాలు కూడా నువ్వు తేటతలం అయతాయి వాస్తవాలు ఏమన్నా ఉంటే అవి బయట పడతాయండి ఈ నువ్వురు కప్పిన నిజాల మీద ఈ నివురు అనే బూడిదం ఉంది చూసారా అది ఎగిరిపోతుంది అది ఎగిరిపోతుంది అన్నమాట అప్పుడు సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని ధైర్యంగా పరిష్కరించుకోవచ్చు అసలు చాలా చోట్ల సమస్యలు జటిలం అవ్వడానికి కారణం ఏంటంటే ఈ పిల్లలు ఉండటమేనండి ఒకటి ఒకటిన్నర రెండేళ్ళ పిల్లలు ఉంటున్నారు.
(12:40) ఈ పిల్లల కోసమని మనసు చంపుకొని కాంప్రమైజ్ అయిపోయి ఈ ఒక్కొక్కసారి విడాకుల దాకా కూడా వెళ్ళిపోతున్నాయండి ఏం చేయాలో అర్థం కాక అయితే ఇంకొకటండి లీగల్ పర్సన్ గా నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను మొహమాటంలు లేకుండా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి అట్లా ఉన్నాయి కాబట్టి పెళ్లి చేసుకున్న తర్వాత ఏ స్థిరాస్తి కొన్నా కూడాను ఫ్లాట్ కావచ్చు ప్లాట్ కావచ్చు ఇద్దరి మీద రిజిస్ట్రేషన్ ఉండేటట్టు చూసుకోండి.
(13:08) ఈఎంఐ లో కూడాను చరి సగం కట్టుకోవడానికి ముందే ఒక నిర్ణయాన్ని తీసుకోండి ఎందుకంటే [గొంతు సవరించుకోవడం] జాబ్స్ ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్స్ ఎప్పుడు పోతాయో ఆ మల్టీనేషనల్ కంపెనీ అధినేతకు కూడా తెలియదండి ఎందుకంటే వాళ్ళకి ప్రాజెక్ట్స్ రాకపోతే నిర్దాషంగా తీసేస్తారు ఒ మూడు నెలలు నోటీస్ ఇస్తారు అంతే కదా ఇప్పుడున్న ఈ గ్లోబల్ పొలిటికల్ అన్సర్టైనిటీ లో ఇవన్నీ కూడాను మామూలేనండి ఏరోజు మంది కాదు ఉద్యోగం చేసిన రోజే మన రోజు సిస్టం మీద కూర్చున్నప్పుడే మన రోజు ముందు ముందు ఏం జరుగుతుందో కూడా తెలియదండి.
(13:45) కాబట్టి నేను ఏమంటానఅంటే పిల్లల్ని మూడేళ్ల వరకు కనకుండా నిజాయితిగా ప్రేమను పంచుకోండి భావాలు మార్చుకోండి చిన్న చిన్న సర్దుబాట్లు ఉంటే అత్తమామలతో గాని లేకపోతే ఆడబడుతులతో గాని సర్దుబాటు చేసుకోండి కూర్చొని చర్చించుకోండి. ఈ మూడు సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ అనుకోండి. చెప్పాను కదా అగ్ని పరీక్షలు అట్మస్ టెస్ట్ అని ఈ విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి ఇటు ఆడపిల్లలు గాని మాపిల్లలు గాని ఎందుకంటే ఒకప్పుడు వివాహ వ్యవస్థ ధార్మికత మీద ఆధారపడి ఉందండి ఇప్పుడు దాపరికాలను వెలుగ తీయడానికి దాస్టికాలను తట్టుకోవడానికి అలాగే వెరసి లౌక్యానికి పెద్ద పీఠ వేయటం మీద
(14:23) ఆధారపడిందండి కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఎందుకంటే భావి భారత పౌరులని నిర్మించడానికి భారతదేశంలో వివాహ వ్యవస్థ చాలా ప్రధాన పాత్ర వహిస్తున్నదండి ఎప్పటి నుంచో ఆ వివాహం అనే బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ముందు జాగ్రత్తలు తీసుకొని చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా వస్తే సర్దుకునే ప్రయత్నం చేసి ఒక అవగాహన వచ్చి పెద్దల్ని కూడా గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలండి.
(15:01) ఇదంతా కూడా మన విజ్ఞత మీదనే ఆధారపడి ఉంది. ఈ మధ్య రెండు మూడు వీడియోలు పెళ్ళళ్ల మీద చేసేటప్పటికి నాకు ఫోన్లు బాగా వస్తున్నాయండి. ఆడ పిల్లల నుంచి వస్తున్నాయి ఆడ పిల్లలకు తల్లిదండ్రుల నుంచి కూడా వస్తున్నాయి. ఇవన్నీ విన్న తర్వాత సరే కొన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్పకూడదు అని ఆలోచించి చేస్తున్న వీడియో రండి అయితే. సో ఇంతేనండి వీడియోలో ఉన్న సంగతి చాలా మంది నా ఫోన్ నెంబర్ కూడా అడుగుతున్నారు.
(15:24) కొన్ని వీడియోలో చెప్పాను నేను మళ్ళీ చెప్తానండి. నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ్ అండి ఇంటి పేరు పోరూరి. YouTube లోకి వెళ్లిఎంఏ ఆర్ యుటి హెచ్ ఐ స్పేస్ ఇచ్చికే ఐ ఆర్ ఏఎన్ అని టైప్ చేస్తే పి ఓ ఆర్ యు ఆర్ ఐ అని నా ఇంటి పేరు వస్తుందండి అదే నా YouTube ఛానల్ లైక్ బటన్ ని ప్రెస్ చేయమని నేను అడగనండి. షేర్ చేయమని కూడాను అడగను ఎందుకంటే నా వీడియో నచ్చితే మీరు ఆటోమేటిక్ గా చేస్తారు లేకపోతే ఆలోచించి పోస్ట్పోన్ చేస్తారు.
(15:55) అయితే నా సవినయమైన విన్నపం ఏంటంటే నండి కామెంట్ బాక్స్ లో మటకు మంచి మెసేజ్ని పెట్టండి. మంచి మెసేజ్ ని పెట్టండి. ఈ మెసేజ్ ఎలా ఉండాలి అంటే నన్ను ఇబ్బంది పెట్టినా పర్వాలేదు నన్ను విమర్శించినా పర్వాలేదు మీరు హాయిగా స్వతంత్రించవచ్చు. చెప్పాను కదా సబ్స్క్రైబ్ మటుకు చేయండి చేయటం వల్ల ఏంటంటే ఇటువంటి వీడియోలని మీరు ఎక్కువ మీకు పంచొచ్చు మీకు కూడా విషయం తెలుస్తూ ఉంటుంది.
(16:26) షేర్ చేయాలనిపిస్తే మటకు మొహమాట లేకుండా చేయండి ఎందుకంటే మీలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా సో ఉంటానండి నమస్కారం
No comments:
Post a Comment