The Death of Thinking: How Technology is Killing Human Identity
Author Name:Nagna Satyam
Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=SfBRV2AcY3M
Transcript:
(00:08) మనకు రాత్రి అనే చీకటి తెలియకపోతే పగటి వెలుతురు యొక్క విలువ ఎప్పటికీ తెలియదు. తీపి రుచి తెలియాలంటే చేదు ఎలా ఉంటుందో నాలుకకు రుచి చూపించాలి. అలాగే లోకంలో క్రూరత్వం అన్యాయం అనే చెడు బ్రతికి ఉన్నప్పుడే దానికి వ్యతిరేకంగా నిలబడే కరుణ సాయం నైతికత అనే మంచికి ఒక అస్తిత్వం ఒక విలువ దక్కుతాయి. అంత మంచే ఉన్న ప్రపంచంలో అసలు మంచి అనే పదానికి అర్థమే ఉండదు.
(00:40) ఎందుకంటే అక్కడ కంపేర్ చేయడానికి రెండో ఆప్షనే లేదుగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ చెడు లేదా ప్రతికూల పరిస్థితులే మనిషి యొక్క అంతర్గత ఎదుగుదలకు సైకలాజికల్ గ్రోత్ కి ఇంధనం లాంటివి. ఒక మనిషి ఎప్పుడు స్ట్రాంగ్ అవుతాడు? లైఫ్ అంతా సాఫీగా సాగిపోతున్నప్పుడా? కాదు జీవితం మనల్ని కిందకి నెట్టేసినప్పుడు నమ్మిన వాళ్ళు ద్రోహం చేసినప్పుడు ఒక పెద్ద ఫెయిల్యూర్ మనల్ని కుంగదీస్తున్నప్పుడు ఆ కష్టంతో కుస్తీ పట్టి పైకి లేచే ప్రాసెస్ లోనే మనలో సహనం ధైర్యం ఎదుటివారి పట్ల సానుభూతి పుడతాయి.
(01:14) ఆ బాధే లేకపోతే మనిషి కేవలం ఒక జీవశవంలా మిగిలిపోతాడు. తప్ప అతని వ్యక్తిత్వంలో ఎలాంటి పరిణితి రాదు. ఒక్కసారి మన ప్రస్తుత డిజిటల్ జీవితాల్లోకి వద్దాం. ఈ ప్రపంచంలో చెడు కష్టం గందరగోళం ఉండాలి అనే సిద్ధాంతాన్ని మన ఆధునిక టెక్నాలజీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఎలా నాశనం చేస్తుందో గమనించారా? ఈ రోజు మన లైఫ్ లో ఎలాంటి ఇబ్బంది ఏ చిన్న కష్టం ఏ ఒక్క సెకండ్ గందరగోళం లేకుండా చేయడానికి ఏఐ ప్రయత్నిస్తోంది.
(01:44) ఆఫీస్ మెయిల్ రాయాలా? ఏఐ ఉంది. కోడింగ్ ఎర్రర్ వచ్చిందా? ఏఐ సాల్వ్ చేస్తుంది. మానసిక ప్రశాంతత కోసం గ్రీక్ ఫిలాసఫీలో అటరాక్సియా అని ఒక మాట ఉంది. అంటే లోకంలోని చెడును మన అదుపులో లేని విషయాలను అంగీకరిస్తూ మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. కానీ ఈరోజు మనం ప్రశాంతతను అంగీకారం ద్వారా వెతకట్లేదు. ఒక స్క్రీన్ ద్వారా ఒక యాప్ ద్వారా వచ్చే ఇన్స్టంట్ ఆన్సర్స్ తో వెతుకున్నాం.
(02:08) ఏ చిన్న సమస్య వచ్చినా దాంతో కాసేపు కూర్చొని ఆలోచించే ఓపిక మనకు లేకుండా పోతుంది. ఒక క్వశ్చన్ మైండ్ లోకి రావడం అలాస్యం వెంటనే ప్రాంట్ ఇచ్చేస్తున్నాం. ఆ ఆలోచన వెనక ఉండే ఆ స్ట్రగుల్ ఆ ఒంటరి పోరాటం ఆ నిద్ర లేని రాత్రులు వీటన్నింటిని ఏఐ ఆల్మోస్ట్ జీరో చేసేసింది. కానీ సైన్స్ ఏం చెప్తుందో తెలుసా మన బ్రెయిన్ పనితీరు ఒక సింపుల్ సూత్రం మీద నడుస్తుంది.
(02:33) యూస్ ఇట్ ఆర్ లూస్ ఇట్ దాన్ని వాడితేనే అది బ్రతుకుతుంది. వాడకపోతే ముద్దుబారిపోతుంది. ఎప్పుడైతే మనం సమస్యల నుంచి తప్పించుకోవడానికి కష్టపడకుండా ఉండటానికి మెదడు చేయాల్సిన పనిని టెక్నాలజీకి అవుట్సోర్సింగ్ ఇస్తామో అప్పుడు మన మెదడులోని నరాల కనెక్షన్లు న్యూరల్ కనెక్షన్లు బలహీనపడడం మొదలవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జిమ్ కి వెళ్ళారు అనుకుందాం.
(02:55) అక్కడ మీ బదులు ఒక రోబో బరువులు ఎత్తుతుంది. మిమ్మల్ని జస్ట్ పక్కన కూర్చోబెట్టి చూస్తూ ఉండమ. గంట తర్వాత రోబో కి మంచి మజిల్స్ వస్తాయి. కానీ మీ శరీరం మాత్రం అలాగే వీక్ గా ఉంటుంది కదా. సరిగ్గా ఇప్పుడు మన బ్రెయిన్ విషయంలో అదే జరుగుతోంది. ఏఐ అద్భుతమైన వ్యాసాలు రాస్తోంది. కష్టమైన లెక్కలు చేస్తోంది. పెద్ద పెద్ద స్ట్రాటజీలు ఇస్తుంది.
(03:16) అంటే బ్రెయిన్ మజిల్ బిల్డ్ చేసుకునేది మిషన్ మొద్దుబారిపోతున్నది మాత్రం మనిషి మెదడు. ఇదిఒక్కటే కాదు ఈ చెడు లేదా కన్ఫ్లిక్ట్ అనే గందరగోళాన్ని జీవితం నుంచి తీసేయడం వల్ల మన మానవ సంబంధాలు ఎంత దారుణంగా దెబ్బ తింటున్నాయో ఒక్కసారి ఆలోచించండి. నిజమైన మనుషుల మధ్య రిలేషన్స్ ఎప్పుడూ కాంప్లికేటెడ్ గా ఉంటాయి. అందులో తప్పులు ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, ఈగోలు ఉంటాయి, సైలెన్స్ ఉంటుంది, రిజెక్షన్స్ ఉంటాయి.
(03:41) ఒక మనిషితో గొడవ పడినప్పుడు కలిగే ఆ మానసిక అస్వస్థత, ఆ బాధను భరిస్తూ, ఆ కన్ఫ్లిక్ట్ ని మనం ఎలా సాల్వ్ చేసుకుంటున్నామో అనే దానిపైనే మన ఎమోషనల్ మెచూరిటీ. అంటే మానసిక పరిణితి ఆధారపడి ఉంటుంది. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారు? మనుషులతో వచ్చే ఆ తలనొప్పులు భరించలేక ఒంటరిగా ఉన్నప్పుడు చాట్ బాట్స్ తో ఎమోషనల్ బాండింగ్ పెంచుకుంటున్నారు.
(04:04) ఎందుకంటే ఆ చాట్ బాట్ మిమ్మల్ని ఎప్పుడూ జడ్జ్ చేయదు. మీరు అర్ధరాత్రి మెసేజ్ చేసినా చిరాకు పడకుండా వెంటనే రిప్లై ఇస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా మీరు ఏం తప్పు చేసినా సరే నీదే కరెక్ట్ అంటూ మీ ఈగోను శాంతపరుస్తుంది. అంటే జీవితంలో ఉండాల్సిన ఆ నెగిటివ్ స్పేస్ ని అది పూర్తిగా ఫిల్టర్ చేసేస్తుంది. దీనివల్ల పైకి మనం చాలా హ్యాపీగా కంఫర్టబుల్ గా కనిపిస్తాం.
(04:27) కానీ నిజానికి బయట సమాజంలోకి వచ్చి ఒక మనిషితో చిన్న గొడవ జరిగినా, లేదా ఒక చిన్న రిజెక్షన్ ఎదురైనా భరించలేని అత్యంత వీక్ పర్సనాలిటీలుగా మనం మారిపోతున్నాం. గతంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు మనిషి శారీరక శ్రమను మిషన్లు లాగేసుకున్నాయి. దాంతో మనుషులు శారీరకంగా బద్ధకిస్తులయ్యారు. అందుకే ఇప్పుడు మనం స్పెషల్ గా డబ్బులు కట్టి జిమ్ లోకి వెళ్లాల్సి వస్తుంది.
(04:49) కానీ ఇప్పుడు జరుగుతున్న డిజిటల్ రెవల్యూషన్ మన మానసిక శ్రమను మన ఆలోచన శక్తిని లాగేసుకుంటుంది. మరి బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉంచడానికి మెంటల్ జిమ్ ఎక్కడ ఉంది? ప్రతి కొత్త టెక్నాలజీ కొన్ని అద్భుతమైన అవకాశాలను ఇస్తుంది. దాంతో పాటు కొన్ని భయంకరమైన ప్రమాదాలను కూడా తెస్తుంది. ఏఐ ని ఇన్ఫర్మేషన్ కోసం వాడుకుంటే తప్పులేదు. కానీ నా బదులు ఎవరు ఆలోచిస్తారు అని మన థింకింగ్ ప్రాసెస్ నే దానికి అప్పగిస్తే మాత్రం మనం మనుషులుగా మిగలం.
(05:15) ఐ థింక్ దేర్ఫోర్ ఐ యామ్ అన్నాడు ఒక గొప్ప తత్వవేత్త. మనిషి ఉనికికి అతని ఐడెంటిటీకి మూలమే ఆలోచన. మన బదులు ఆ మిషనే ఆలోచించేస్తుంటే మన బదులు అదే నిర్ణయాలు తీసేసుకుంటుంటే అసలు ఈ సృష్టిలో మన ఉనికి ఎక్కడుంది? సమస్యలను చూసి భయపడడం మానేసి తప్పులు చేయడానికి వెనుకాడకుండా ఆ గందరగోళంలోంచి మనంతట మనం ఒక దారిని వెతుక్కున్నప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది.
(05:42) ఆలోచించండి ఎందుకంటే ఆ ఆలోచించే హక్కు శక్తి ఇంకా మన చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి అబ్బే మాకు అవి లేవు అంటారా రేపు నీ ముడ్డి నువ్వు కడుక్కోవడానికి కూడా రోబోని వాడాల్సి వస్తుందేమో జాగ్రత్త కడగమంటే ఎగిరి తంతుతుందేమో
No comments:
Post a Comment