🔔 *ధర్మ సూక్ష్మం* 🔔
*🙏కన్యాదాన ఫలం విశిష్టత ఏమిటి?🙏*_
మహాసంసార చక్రంలో పశుపక్ష్యాదులుగా ఎన్నో జన్మలెత్తాక అదృష్టం కొద్దీ మానవజన్మ కలుగుతుంది. అప్పటినుంచి తెలిసికాని, తెలియక కాని చేసిన మహాపాతకాలు, ఉపపాతకాలు ఇలాగే ఇతర అనేక విధాలైన పాతకమలు త్వరగా పోవడానికీ. తన వంశంలో తన వెనుక 10 తరాల్లోను, తన తరువాత 10 తరముల వారిలోనూ నరకములో ఉన్ననూ ఉండబోయే వారందరినీ కూడ రక్షించి శాశ్వతమైన పుణ్యలోకములు పొందేటట్లు చేయడానికే. గంగా నదిలోని అణురేణువులను రాశిగా సప్తఋషి మండలం గరకును, నువ్వులను రాశిగా సూర్యమండలం వరకును, ఎద్దు వెంట్రుకలను రాశిగా నక్షపు మండలం వరకును, మినుములను రాశిగా ధృవమండలం వరకును పోసి వానిని దేవతా మానం ప్రకారం వేయి సంవత్సరాలు గడిచిన పిదప రాశిలో ఒక్కొక్కటి చొప్పున తీస్తూ ఆ రాశులన్నీ పూర్తిగా తరిగే వరకు తనకు బ్రహ్మలోకనివాసము సంప్రా ప్తించుటకు, మరియు అగ్నిష్టోమ, అశ్వమేధ యజ్ఞపుణ్య ఫలాలకు 3రెట్లు లభించుటకు, అంతేకాక ఈ జ్మలో రాజభోగాలనుభవించి అనంతరం విష్ణుసాయుజ్యం పొందటానికీ సర్వాలం కారాలతో కూడిన కన్యను దానం చేయాలి.
🔔🙏🔔🙏🔔
No comments:
Post a Comment