ఆవిడ ఫోన్ మాట్లాడుతోంది!!
అవతల వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో ఏమో!! ఆవిడ కలవరం, ముఖ కవళికలు కూడా సీరియస్ గా ఉన్నాయి..
😢!!!
అవునా ? ఇప్పుడెలా ?
అయ్యో! అర్జంట్ గా పంపిస్తా
"...."
పర్లేదు నెక్స్ట్ మంత్ 15 లోగా ఇచ్చేయి...ఆ మాత్రం ఆగలేనా ?
"....."
నేను చెప్పినది గుర్తు పెట్టుకో..తొందర పడాకు.. తొందరపడి ఇబ్బంది పడకు, ఇబ్బంది పెట్టాకు !
ఇప్పుడే పంపిస్తున్నా ఆయన దగ్గర.. నీకు ఇంకో గంటలో అందుతాయి
"......"
సరే! అలాగే!! కష్టాల్లో ఉన్నప్పుడేగా సర్దుకోవాలి!
ఈ సీన్ కట్ చేస్తే..
ఫోన్ కట్ చేసి నా వైపు చూసింది ! నా కర్ధమైంది నా నెత్తిన ఏదో పడబోతోంది అని!
మీరు త్వరగా రెడీ అయి రాండి పని ఉంది అని ఇంకో మాటకు అవకాశం లేకుండా హడావుడిగా బెడ్ రూమ్ లోకి వెళ్లి పోయింది!
నేను ఎవరికి ఏమి కష్టమో ఏమో! పోనీలే అని త్వరగా రెడీ అయి బయటకు వస్తే రెండు సంచులు పట్టుకొని రెడీగా ఉంది!!
రెండు సంచుల్లో చీరలు జాకెట్లు.."దారిలో వెళుతూ జాజి *ఆమె ఆస్థాన టైలర్* ఇవి చేర్చండి.. ఆ అమ్మాయి దగ్గర పనిచేసే అమ్మాయి రావడం లేదట..ఇప్పుడు ఇస్తేనే నెక్స్ట్ మంత్ కి ఇస్తుందట..హడావిడిగా కుడితే మళ్ళీ ఆమెకీ ఇబ్బంది, నాకూ ఇబ్బంది..
అందుకని మీరు అడ్వాన్స్ 2000 ఇచ్చేయండి..మొన్న నాకు ఇవ్వాల్సిన దాంట్లో జమ వేసుకోండి..విషయం అర్ధమైంది కదా ?
ఇక చచ్చు ప్రశ్నలు మొదలు పెట్టండి!
అసలు నేనెక్కడ నీకు 2000 బాకీ ఉన్నానే !
సరే! కూర్చోండి ఎలా బాకీనో చెప్తా
వద్దులే! నేనే ఇస్తా 😢
లేని బాకీ నిజం అని ఒప్పించే ప్రోగ్రాం అవసరమా నాకు ?
ఆ విధంగా ఈరోజు అరుగుకు విశ్రాంతి ఇచ్చి వీధిన పడ్డా
విధి ఆడిన వింత నాటకంలో నా జోబికి బొక్క
సొమ్మొకరిదీ! సోకొకరిదీ
😢
Jagarlamudi sankar
No comments:
Post a Comment