అమ్మ నాన్నల త్యాగం వెనుక ఉన్న పచ్చి నిజం! 😱 Emotional Blackmail vs Love? | PRATIKULA VEDAM
Author Name:PRATIKULA VEDAM
Youtube Channel Url:https://www.youtube.com/@pratikulavedam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZKRRBowqfT8
Transcript:
(00:00) ఒకవేళ నా జీవితానికి సంబంధించిన ప్రతి నిర్ణయం నాకు నేనే తీసుకునిఉంంటే బహుశా నా బ్రతుకు ఈ పాటికి ఇంతకంటే ఎంతో ఆనందంగా ఎగసైటింగ్ గా ఉండదేమో ఇలా నీకు అప్పుడప్పుడైనా అనిపిస్తూఉంటది. కదా మరి ఆ నిర్ణయాలు నిన్ను తీసుకొనివ్వకుండా చేసింది ఎవరు? నీ గొంతు నువ్వే కోసుకుంటూ లోపల నరకం అనుభవిస్తున్న సరే నలుగురి ముందు మంచోడు అనిపించుకోవడం కోసం ఎందుకు అంతలా నటిస్తున్నావో తెలుసా? బికాజ్ నిన్ను ఉచ్చులో ఇరుక్కునేలా చేసిందే నీ శత్రువు కాదు నువ్వు దేవుళ్లుగా పూజించే నీ సొంత మనుషులు అదే నీ అమ్మ నాన్నలు ప్రపంచంలోనే అత్యంత విజయవంతంగా తరతరాలుగా ఎలాంటి ప్రశ్నలు
(00:45) అడగకుండా సాగిపోతున్న అద్భుతమైన వ్యాపారం ఒకటి ఉంది. ఆ వ్యాపారం పేరు కుటుంబం. ఆ వ్యాపారంలో పెట్టుబడి పేరు త్యాగం. అండ్ ఆ వ్యాపారంలో వాళ్ళక వచ్చే లాభం పేరు నీ జీవితకాలపు విధేయత. ఎస్ కాసేపు ఈ సెంటిమెంట్లు ఎమోషన్లు అనే ముసుగుల్ని పక్కకు తీసేసి ఇప్పుడు కొన్ని పచ్చి నిజాలు మాట్లాడుకుందాం. నువ్వు పుట్టకముందు స్పేస్ లో ఎక్కడో ఉండి నీ అమ్మ నాన్నలకు అప్లికేషన్ పెట్టుకున్నావా ప్లీజ్ అమ్మ ప్లీజ్ నాన్న నాకోసం భూమిమీద ఒక సీటు ఖాళీ ఉంచి నన్ను కనండి మీరు చిరిగిపోయిన పాత బట్టలు వేసుకొని మీ సంతోషాలన్నీ చంపుకొని నన్ను పెంచితే నేను
(01:19) పెద్దయ్యాక మీ కష్టాలన్నీ వడ్డీతో సహా తీరుస్తాను అని అగ్రీమెంట్ ఏమైనా రాసిచ్చావా? లేదు కదా సృష్టిలో ప్రతి జీవి కుక్క, నక్క, పిల్లి, పంది ఇలా అన్ని తమ పిల్లలకి ఆహారం తెచ్చి పెడతాయి. అది ప్రతి ప్రాణిలో ఉండే బేసిక్ బయోలాజికల్ ఇన్స్టింట్ కానీ దానికి త్యాగం అనే బోర్డు ఒకటి తగిలించి జీవితకాలం వడ్డీ వసూలు చేసే ఏకైక జంతువు మనిషి మాత్రమే.
(01:45) వేల సంవత్సరాల క్రితం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి బ్రతుకుతున్న సమాజంలో మనుషులు అసలు పిల్లల్ని ఎందుకు కనివారో తెలుసా? వ్యవసాయం చేయడానికి చేతులు కావాలి శారీరక శ్రమ చేయడానికి పనివాళ్ళు కావాలి ముసలితనంలో తమను చూసుకోవడానికి ఒక సెక్యూరిటీ కావాలి అంటే పిల్లలు పుట్టడం అనేది అప్పట్లో ఒక ఎకనామిక్ నీడ్ మరి ఇప్పుడు కాలం అయితే మారింది కానీ ఆ ప్రాథమిక స్వార్థం మారలేదు నిన్నటిదాకా పొలంలో పని చేయడానికి పిల్లలు కావాలి మరి ఈరోజు సొసైటీలో స్టేటస్ చూపించుకోవడానికి పిల్లలు కావాలి పక్కింటి వాడి ముందు కాళ్ళ ఎగరేయడానికి పిల్లలు కావాలి. రూపం అయితే
(02:16) మారింది కానీ నా అవసరం కోసమే నిన్ను కన్నాను అనే ట్రూత్ మాత్రం మారలేదు. ఒక మిడిల్ క్లాస్ తండ్రి తన కూతురి పెళ్లికి తన జీవిత కాలం సంపాదన అప్పులు చేసి మరి 50 లక్షలు ఖర్చు పెడతాడు. సొసైటీ అంతా ఆహా ఓహో కూతురి మీద ఎంత ప్రేమ తన జీవితాన్ని త్యాగం చేసేసాడు అని చప్పట్లు కొడతది. కానీ అందులో ఉన్న నిజం ఏంటో తెలుసా? ఆ తండ్రికి నిజంగా కూతురి సంతోషమే ముఖ్యమైతే ఆ 50 లక్షలు కూతురి అకౌంట్ లో వేసి నీకు నచ్చినట్టు బ్రతుకమ్మ బిజినెస్ చేసుకోని ఇవ్వచ్చు కదా ఇవ్వడు ఆ 50 లక్షలు ఖర్చు పెట్టింది కూతురు కోసం కాదు నేను ఎంత గ్రాండ్ గా పెళ్లి చేశానో చూసారా అని
(02:56) సొసైటీలో తన స్టేటస్ ని పెంచుకోవడానికి ఆ తర్వాత కూతురికి ఆ మొగుడితో ప్రాబ్లం వచ్చి నాన్న వాడు నన్ను కొడుతున్నాడు నేను వచ్చేస్తాను అంటే ఈ తల్లి తండ్రి ఏమంటారు నీ పెళ్లికి మేము 50 లక్షలు అప్పు చేసాము ఇప్పుడు నువ్వు తిరి తిరిగి వస్తే మా పరువు ఏం కావాలి ఎలాగోలా అక్కడే అడ్జస్ట్ అయిపో అంటారు.
(03:15) ఆ 50 లక్షల త్యాగం ఏమైంది కూతురి గొంతు కోయడానికి వాడిన కత్తిలా మారింది. దీన్నా నువ్వు మీ అమ్మ నాన్న చేసిన ప్రేమ త్యాగం అంటున్నావ్ చిన్నప్పటి నుండి నీకు శ్రవణ కుమారుడు కథ చెప్తారు. తల్లిదండ్రులని కావడిలో మోసిన ఒక బ్లైండ్ ఫాలోవర్ శ్రవణ కుమారుడు అని నీకు ఆదర్శంగా చూపిస్తారు. తండ్రి మాటకు కట్టుబడి అడవులకు వెళ్ళిపోయిన రాముణని చూపిస్తారు.
(03:34) కానీ సత్యం కోసం కన్న తండ్రిని ఎదిరించిన ప్రహ్లాదుడు గురించే ఎప్పుడైనా లోతుగా ఆలోచించావా నువ్వు నాకు జన్మని ఇచ్చి ఉండొచ్చేమో గానీ నువ్వు చెప్పేది సత్యం కాదు అని తన తండ్రి హిరణ్య కసిపుడి అహంకారాన్ని మొక్కలు చేశాడు ప్రహ్లాదుడు ఆ లాజిక్ ని నీకు ఎవరైనా నేర్పించారా నిజమైన ఆధ్యాత్మికత ఒకటే చెప్తుంది ట్రూత్ కి బంధుత్వాలు ఉండవు ఒక స్టేట్మెంట్ తప్పైతే అది దేవుడు చెప్పిన తప్పే నీ కన్న తల్లిదండ్రులు చెప్పిన తప్పే నీకు ఈ నిజాలు ఎవడు చెప్పడు ఎందుకంటే నీకు ఈ లాజిక్లన్నీ నేర్పిస్తే వాళ్ళ ఆట సాగదుగా అసలు ఇదంతా కాదు నిన్ను వాళ్ళు ఎందుకు
(04:10) కన్నారో ఎప్పుడైనా హానెస్ట్ గా ఆలోచించావా మనిషి జీవితంలో అతి పెద్ద భయం ఏంటో తెలుసా నా బతుకి అర్థం లేదు అని తెలుసుకోవడం నీ పేరెంట్స్ కి పాతికేళ్ళ వచ్చేసరికి ఒక విషయం అర్థమైంది. వాళ్ళ జీవితంలో ట్రూత్ లేదు వాళ్ళకంటూ బ్రతకడం రాదు ఇండివిడ్యువల్ ఐడెంటిటీ లేదు ఇండిపెండెంట్ థాట్ అసలే లేదు ఒక లోతైన శూన్యత వాళ్ళని కమ్మేసింది.
(04:34) ఒక మనిషి తనని తానే ప్రేమించుకోలేనప్పుడు వాడు ఇంకొకడిని ప్రేమిస్తున్నాడు అంటే నువ్వు ఎలా నమ్మేస్తున్నావ్ అది కూడా నిస్వార్థంగా సో తమలో నా శూన్యత నుండి పారిపోవడానికి వాళ్ళు ఎంచుకున్న మొట్టమొదటి డిస్ట్రాక్షన్ నువ్వు నిన్ను కనడం ఒక లవ్ స్టోరీ కాదు అదొక ఎగ్జిస్టెన్షియల్ అవుట్సోర్సింగ్ నేను ఎలాగో నా జీవితంలో పీకింది ఏమీ లేదు నాకంటూ ఒక గమ్యం లేదు కనీసం నా పిల్లాడినైనా ఒక ప్రాజెక్ట్ లాగా డెవలప్ చేస్తే నా బతుకు ఒక వాల్యూ వస్తది.
(05:00) నేను ఫెయిల్ అయిన నా కలలన్నీ వీడి ద్వారా సాధించుకుంటాను. నువ్వు వాళ్ళ కొడుకువి కాదు కూతురివి కాదు వాళ్ళ బ్రతుకులో జీవం ఇంకా మిగిలే ఉంది అని వాళ్ళని వాళ్ళు నమ్మించుకోవడానికి నువ్వుఒక కారణం అంతే అందుకే నువ్వు ఒక చిన్న తప్పు చేసినా లేదా వాళ్ళ మాట వినకపోయినా వాళ్ళు విప్పరేతంగా రియాక్ట్ అవుతారు.
(05:20) నువ్వు ఫెయిల్ అయితే చుట్టాలు తిడతారని కాదు వాళ్ళ జీవిత కాలపు ప్రాజెక్ట్ అయినా నువ్వు ఫెయిల్ అయిపోతే మళ్ళీ వాళ్ళ జీవితం ఆ పాత శూన్యతలోకి పడిపోతుందేమో అని భయం. దీన్ని ప్రేమ అనరు దీన్ని ఇన్సెక్యూరిటీ అంటారు. నీకు అసలు నిజమైన త్యాగం అంటే ఏంటో తెలుసా నేను నీకు వంద రూపాయలు ఇచ్చే మర్చిపోవడం త్యాగం కానీ నేను నా కడుపు మార్చుకొని నీకు ఆ 100 ఇచ్చాను కాబట్టి ఇప్పటి నుండి నువ్వు ఏ బట్టలు వేసుకోవాలో నేనే చెప్తాను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో నేనే చెప్తాను నీ జీవితం మీద నాకే మొత్తం హక్కు ఉంది అంటే దాన్ని త్యాగం అనరు దాన్ని పెట్టుబడి అంటారు. మన ఇళ్లల్లో
(05:54) జరుగుతున్నది ఈ వ్యాపారమే ఇక్కడ లవ్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా ఓనర్షిప్ పాతకాలంలో బానిసలని కంట్రోల్ చేయడానికి ఇనప గులుసులు వాడేవారు అది చాలా క్రూరంగా ఉండటమే కాకుండా మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా ఎక్కువ అయితే మన పేరెంట్స్ అలా కాదు చాలా అప్డేట్ అయ్యారు. ఈ అప్డేటెడ్ మోడల్ చాలా ఎలిగెంట్ గా కూడా ఉంటది. అండ్ ఆ మోడల్ పేరే గిల్ట్ అపరాధ భావం వాళ్ళు రాత్రి పగలు కష్టపడి పాత బట్టలు వేసుకొని వాళ్ళ కోరికలు చంపుకొని నిన్ను పెంచుతారు.
(06:21) ఇదంతా చూసిన నువ్వు అమాయకంగా అనుకుంటావు అబ్బా మా అమ్మ నాన్నలు నాకోసం ఎంత బాధపడ్డారు అని అవునా కానీ ఆ కష్టం నీకోసం కాదు వాళ్ళ ఫ్యూచర్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం సపోజ్ నీ లైఫ్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చే సగం నాలెడ్జ్ సలహాలను పక్కన పెట్టి నువ్వు చేయాలనుకున్న దాని గురించి నీకు నువ్వే రీసెర్చ్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకున్నావ అనుకో అప్పుడు వాళ్ళ నుండి వచ్చే డైలాగ్ ఏంటి మేము మా జీవితాల్ని ఇంత త్యాగం చేసుకొని నిన్ను పెంచితే నువ్వు మాకు ఇచ్చే బహుమతి ఇదా అని అవునా స వయసు పెరిగినంత మాత్రాన
(06:56) జ్ఞానం రాదు. కానీ మన ఇళ్లల్లో నేను నీకంటే ముందు పుట్టాను కాబట్టి నేను నీకంటే ఎక్కువ తెలివైన వాడిని అనే ఒక పిచ్చి ఇల్యూజన్ తో ఉంటారు. నువ్వు ఎప్పుడైతే లాజికల్ గా ఒక క్వశ్చన్ అడుగుతావో వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. కాబట్టి వెంటనే వాళ్ళు తమ దగ్గర ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రాన్ని బయటకి తీస్తారు. అదేంటో తెలుసా మేము నీకోసం అన్ని వదిలేసి ఇన్ని త్యాగాలు చేస్తే నువ్వు మమ్మల్నే ఎదురు ప్రశ్నిస్తావా అని లాజిక్ తో గెలవలేనప్పుడు ఎమోషన్ తో కొట్టడం అంటే ఇదే మరి ఈ డైలాగ్ పడగానే నీ లాజికల్ బ్రెయిన్ కూడా ఒక్కసారిగా షట్ డౌన్ అయిపోయి నువ్వు
(07:28) వెంటనే వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి సారీ అమ్మ సారీ నాన్న నా బ్రతుకు నాది కాదు నా బ్రతుకు మొత్తం మీదే అని నీ బ్రతుకు యొక్క కీస్ ని వాళ్ళ చేతిలో పెట్టేస్తాం అసలు వాళ్ళకి ఏం కావాలి నువ్వు స్వతంత్రంగా ఎగిరితే వాళ్ళకి ఇష్టం లేదు నీ కలల కోసం నువ్వు బ్రతికితే ఇష్టం లేదు నీకు నచ్చిన చోట నువ్వు ఆనందంగా ఉన్నా వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకి కావలసింది కొడుకు కాదు కూతురు కాదు వాళ్ళ పరువుని కాపాడే ఒక అంబాసిడర్ కావాలి.
(07:56) వాళ్ళ అధారిటీని గుడ్డిగా ఒప్పుకునే ఒక బానిస కావాలి. ఒక కుక్కకి బిస్కెట్ వేస్తే తోకొబ్బుతూ ఎలా వస్తదో నువ్వు కూడా వాళ్ళు పెట్టిన ప్రతి ముద్దకి ప్రతిఫలంగా జీవితకాలం నీ జీవితం గురించి వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయానికి తోకోపాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి నేను ఇదంతా చెప్తున్నది నీ కన్నవాళ్ళని విలన్స్ లో చూడమని కాదు ఎందుకంటే వాళ్ళు కూడా ఈ సొసైటీ అనే సిస్టం లో వాళ్ళకే తెలియకుండా ట్రైన్ అయిన వాళ్లే వాళ్ళ బుర్రలో ఒక కరప్ట్ అయిపోయిన సాఫ్ట్వేర్ రన్ అవుతుంది.
(08:26) తర తరాలుగా పాగుతున్న జబ్బు అది ఒక జబ్బు పడిన మనిషిని చూసి జాలి పడతాం కానీ కోప్పడిపోం కదా నీ పేరెంట్స్ నీకు తిండి పెట్టారు చదువు చెప్పించారు డబ్బులు ఖర్చు పెట్టారు కచ్చితంగా దానికి నువ్వు రుణపడి ఉన్నావు కాబట్టి వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళని రోడ్డు మీద పడేయకుండా డబ్బులు ఇవ్వు వాళ్ళ మెడికల్ కేర్ చూసుకో వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకో దట్ ఇస్ బేసిక్ హ్యూమన్ డీసెన్సీ అది నీ ధర్మం కానీ నీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయాలను నీ అస్తిత్వాన్ని నీ స్వేచ్ఛను వాళ్ళ అహంకారాన్ని తృప్తి పరచడం కోసం వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టకు నీ జీవితంలో నువ్వు
(08:58) తీసుకుంటున్న ప్రతి డెసిషన్ ని ఒక్కసారి గమనించు ఆ డెసిషన్స్ నీకు నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టంతో తీసుకున్నావా లేదా నీకు ఇష్టం లేకపోయినా మా అమ్మ నాన్నలు నాకోసం ఎంతో త్యాగం చేశారు వాళ్ళు చేసిన త్యాగానికి ప్రతిఫలంగా నేను ఏదో ఒకటి చేయాలి అని తీసుకున్నావా ఆలోచించు నువ్వు ఎప్పుడైతే వాళ్ళ మాట కాదని నీ సొంత నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేస్తావో వాళ్ళు విపరీతంగా హర్ట్ అవుతారు ఏడుస్తారు అరుస్తారు నువ్వు మారిపోయావు నువ్వు ద్రోహివి అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు.
(09:29) పక్కింటి వాళ్ళని చుట్టాలని పిలిచి పంచాయితీ పెడతారు. అండ్ ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్ వాళ్ళని అలాగే కొద్ది రోజులు ఏడవనివ్వు. ఎందుకంటే ఒక డ్రగ్ ఎడిక్ట్ కి డ్రగ్ ఇవ్వడం ఆపిస్తే ఎలా గిలగిల కొట్టుకుంటాడో ఒక ఇన్వెస్టర్ తన ఇన్వెస్ట్మెంట్ లాస్ అయినప్పుడు ఎలా ఏడుస్తాడో వాళ్ళు కూడా అలాగే ఏడుస్తారు. దశాబ్దాలుగా నువ్వు వాళ్ళకి ఇస్తున్న విధేయత అనే డ్రగ్ ఆగిపోగానే వాళ్ళ అహంకారం గిల్లా గిల్లా కొట్టుకుంటది.
(09:52) ఆ ఏడుపు నీ మీద ప్రేమతో వస్తున్న ఏడుపు కాదు వాళ్ళ కంట్రోల్ పోతుందని వాళ్ళ అహంకారం చచ్చిపోతున్నందుకు వస్తున్న ఏడుపు ఆ ఏడుపును గాని చూసి నువ్వు వెనక్కి తగ్గితే నువ్వు జీవితకాలం ఆత్మ లేని శవంలో బ్రతకాల్సిందే చివరగా ఒకవేళ నీ అమ్మ నాన్న నిజంగా ఈ టైపు కాకపోతే వాళ్లే నీకున్న అతి పెద్ద ఆస్తి ఇప్పుడు ఆలోచించు నీ జీవితం ఎవరిది
No comments:
Post a Comment