ఇరుగు పొరుగు వారిని ఎందుకు ఇంట్లోకి రానివ్వకూడదో మీకు తెలుసా...?//motivational video@Samaha-creation
Author Name:samaha-creations
Youtube Channel Url:https://www.youtube.com/@Samaha-creation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=TSIxRrF7kLQ
Transcript:
(00:00) ఇరుగు పొరుగు వారిని ఇంట్లోకి ఎందుకు రానివ్వకూడదో మీకు తెలుసా వస్తే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? జాగ్రత్తగా ఇది వినండి. గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లోకి కూడా కొందరు వ్యక్తులు పిలవకుండానే అడగకుండానే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తున్నారా? అది చూసి మీరు పర్వాలేదులే మనవాళ్లే కదా ఏముంది అని తేలిగ్గా తీసుకుంటున్నారా? మీకు తెలుసా ఇదే మనవాళ్ళు మెల్లమెల్లగా మీ ప్రశాంతతను స్వేచ్ఛను మొత్తం మీ ఇంటిపై మీకున్న నియంత్రణను మీ నుండి లాగేసుకుంటారు.
(00:35) ఫ్రెండ్స్ పొరుగు వారితో అలానే బంధువులతో ఎప్పుడూ మంచి సంబంధాలు కలిగి ఉండాలని సమాజంలో ఒక మాట బాగా ప్రచారంలో ఉంది. ఒక మంచి వ్యక్తిగా అనిపించుకోనే తాపత్రయంలో ప్రజలు తమ ఇంటి తలుపులను ప్రతి ఒక్కరి కోసం తెరిచే ఉంచుతున్నారు. కానీ ఇదే అమాయకత్వం వారు నాశనం కావడానికి పెద్ద కారణం అవుతుంది. వారు ఎప్పుడూ గ్రహించలేరు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా ఒక భయంకరమైన సత్యాన్ని మీరు వినాలి.
(01:05) అవసరానికి మించి అమాయకంగా ఉండటం మనిషి నాశనం కావడానికి అత్యంత సులభమైన మార్గం. ఈరోజు మీరు వినబోయే మాటలు తీయగా ఉండవు ఇవి కఠినంగా చేదుగా ఉంటాయి. ఇది [గురకలు] తన సొంత ఇంట్లోనే మెల్లమెల్లగా బలహీన పడుతున్న ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. విని అర్థం చేసుకోండి. ఈరోజు ఏడు ప్రమాదకరమైన కారణాలను వాటి పరిష్కారాలను తెలుసుకుందాం.
(01:32) వీటిని అర్థం చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడూ ఎవ్వరిని ఆలోచించకుండా మీ ఇంట్లోకి రానివ్వరు. ఎందుకంటే ఇది కేవలం వచ్చి వెళ్లే విషయం కాదు. ఇది మీ గౌరవం మీ మానసిక ప్రశాంతత అలానే మీ కుటుంబ భద్రతకు సంబంధించిన ప్రశ్న. బహుశా ప్రస్తుతం మీరు కూడా అదే తప్పు చేస్తూ ఉండొచ్చు. దీనివల్ల కలిగే భార్య నష్టం మీకు ఇప్పుడు కాదు చాలా కాలం తర్వాత తెలుస్తుంది.
(01:56) కాబట్టి ఇది విని అర్థం చేసుకోండి. ఎందుకంటే మొదట్లో మీకు చిన్నదిగా అనిపించిందే చివరికి వచ్చేసరికి మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. సరే ఇప్పుడు మీ ఇంటికి ఒక భారం మార్చే మొదటి కారణం దాన్ని పరిష్కారంతో ప్రారంభిద్దాం. మొదటిది మీ స్వేచ్ఛ అలానే మీ సొంత సమయం పూర్తిగా అంతమైపోతాయి. అవును రోజంతా అలసిపోయిన తర్వాత మీరు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మీకు ఏం కావాలి? శాంతి ప్రశాంతత అలానే కాస్త స్వేచ్ఛ అని అనుకుంటారు కానీ ప్రపంచం ముందు ధరించిన అబద్ధపు ముసుకులన్నీ తీసి పక్కన పడేసి ఎవరిని సంతోష పెట్టాల్సిన అవసరం లేకుండా ఎవరి చూపులకు భయపడకుండా ఉండగలిగే ఏకైక ప్రదేశం ఇల్లు కానీ కొందరు
(02:43) వ్యక్తులు సమయం చూడకుండా చెప్పకుండా ఇంటికి రావడం మొదలు పెట్టగానే ఆ ప్రశాంతత కనుమరుగ అయిపోతుంది. మొదట్లో మీకు పర్వాలేదులే మనవాళ్లే కదా అని అనిపిస్తుంది. కానీ ఇదే మెల్లగా ఒక అలవాటుగా మారుతుంది. ఆ తర్వాత ఒకరోజు వస్తుంది అప్పుడు మీరు మీ సొంత ఇంట్లో హాయిగా ఉండలేరు. తలుపు దగ్గర ఏ చిన్న శబ్దం వినిపించిన ఉలిక్కి పడతారు.
(03:06) మీరు వేసుకునే బట్టల గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. అలానే మీరు మీ కుటుంబంతో మనసు విప్పి మాట్లాడలేరు. ఎందుకంటే ఎవరైనా వచ్చేస్తారేమో అన్న భయం మీ మెదటలో నిరంతరం ఉంటుంది. అయితే వినండి ఏ ప్రదేశంలో మనసుకి శాంతి లభించదో ఆ ప్రదేశం నరకంతో సమానం. ఒక్కసారి ఆలోచించండి మీరు అత్యంత సురక్షితంగా అలానే స్వేచ్ఛగా ఉండాల్సిన మీ సొంత ఇల్లే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మొదలెడితే అది కేవలం చిన్న సమస్య కాదు అది పెద్ద హెచ్చరిక.
(03:41) మెల్లమెల్లగా మీరు ఇతరుల సంతోషం కోసం మీ స్వేచ్ఛని భరిస్తూ ఉంటారు. అలానే మీకు ఆ విషయం తెలియదు కూడా అయితే దీని పరిష్కారం గురించి మాట్లాడుకుంటే గోడలు లేని ఈ జైలు నుండి బయట పడడం సాధ్యమేనా మీకంటూ ఒక పరిధిని ఏర్పాటు చేసుకోవడమే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మొదటి నియమం. ఎవరైనా సమయం సందర్భం లేకుండా ఇంటికి వస్తే ప్రతిసారి వారిని లోపలికి పిలవడం మీ బాధ్యత కాదు.
(04:07) తలుపు దగ్గరే ఆపి తక్కువ మాటల్లో మాట్లాడి ప్రేమగా పంపించేయడం అనే పద్ధతి గొడవలు లేకుండా మీ పరిధిని నిర్ణయిస్తుంది. దూరం పాటించడం అనేది మర్యాద లేకపోవడం కాదు అది మీ తెలివితేటలు రెండవ కారణం మీ సంపాదన మీ పరిస్థితి అలానే మీ డబ్బు గురించిన అసలు నిజం ప్రపంచానికి తెలుస్తుంది. దీన్ని ఇలా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి మీ ఇంట్లో కూర్చున్నప్పుడు వారు కేవలం మాటలు కలపడం కాదు.
(04:35) వారు మీ ఇల్లు ఎలా ఉంది సామాన్లు ఎలా ఉన్నాయి ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారు అని గమనిస్తున్నారు. వారి కలు నిశబ్దంగా ఉన్న వారి మెదడు ప్రతి వస్తువును లెక్కగడుతుంది. అవును మీ డబ్బును అలానే మీ సంపాదనను రహస్యంగా ఉంచడమే అతి పెద్ద రక్షణ. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని లోతుగా చదివిన వెంటనే వారు మిమ్మల్ని అదే కోణంలో అంచనా వేయడం మొదలెడతారు.
(05:00) మీరు వారికంటే మెరుగ్గా ఉంటే వారిలో అసూయ. మీరు బలహీనంగా ఉంటే వారు మీకు గౌరవాన్ని ఇవ్వడం మానేస్తారు. ఇక్కడే సమాజంలో నిశశబ్దంగా నడిచే రాజకీయం ఉంటుంది. ముఖం మీద తీపి చిరునవ్వు ఉన్న వెనుక మీతో పోలికలు పెట్టుకోవడం మొదలెడతారు. అయితే దీనికి పరిష్కారం ఏంటి అంటే వినండి ప్రతి నిజం ప్రతి వ్యక్తికి చెప్పాల్సిన అవసరం అనేది లేదు. ప్రతి వస్తువును అందరికీ చూపించాల్సిన అవసరం అంతకన్నా లేదు.
(05:29) మీ ఇల్లు మీ జీవితం అలానే మీ ఆర్థిక విషయాలను కొద్దిమంది నమ్మకస్తుల వద్దే ఉంచడం నిజమైన విజ్ఞానం తక్కువ ఆడంబరం చేసే వ్యక్తి శక్తిని ప్రజలు తక్కువ అంచనా వేస్తారు. దాని ద్వారా అతను మరింత సురక్షితంగా ఉంటారు. మూడవ కారణం మీ భార్యా భర్తల సంబంధంలో ఇంటి విషయాల్లో జోక్యం మొదలవుతుంది. ఫ్రెండ్స్ ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి జీవితానికి సంబంధించింది.
(05:54) ఒక వ్యక్తి పదే పదే ఇంటికి వచ్చినప్పుడు అతను కేవలం సోఫాలో కూర్చుని అతిథిలా మిగిలిపోడు. అతను మీ ఇంటిని పరీక్షించేవాడిగా ఆ తర్వాత మీ విషయాల్లో మాట్లాడే వాళ్ళుగా మారుతారు. మొదట్లో కేవలం వింటాడు ఆ తర్వాత అడగకుండానే సలహాలు ఇవ్వడం మొదలెడతారు. మీ పిల్లల్ని ఎలా పెంచాలి భార్యా భర్తలు ఎలా ఉండాలి డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలని చెప్పడం మొదలెడతారు.
(06:16) ఇది వినడానికి సాధారణంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఇల్లు విచ్చిన్నం అవుతుంది. అవును ఎందుకంటే ఎక్కడ అడగకుండా సలహాలు ఇవ్వబడతాయో అక్కడ నిర్ణయాలు తీసుకునే శక్తి బలహీన పడుతుంది. మెల్లమెల్లగా వీరు మీ కుటుంబంలోని వేరు వేరు వ్యక్తుల చెవులో విషం పోస్తారు. ఒకరి ముందు మరొకరిని చెడుగా చూపిస్తారు. ఒకరోజు మీ సొంత మనుషులే మీకు దూరమవుతున్నారని అనిపిస్తుంది.
(06:40) కానీ అప్పటికీ ఆలస్యం అయిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు దీని పరిష్కారం ఏంటి అంటే మీ ఇంటి విషయాన్ని బయట వ్యక్తుల ముందు బయట పెట్టడం అనేది అతి పెద్ద తప్పు. ఎవరైనా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే వెంటనే వారిని స్పష్టమైన మాటలతో అడ్డుకోండి. ఇంటి నాలుగు గోడల మధ్య ఉండాల్సిన విషయాలను బయట పెట్టడం అంటే మీ ఇంటి పునాదులను మీరే తవ్వుకోవడం అవును ఇక నాలుగవ కారణం వీపు వెనక మీపై అపనిందలు అలానే అబద్ధపు కథలు వ్యాపిస్తాయి.
(07:12) ఈ ప్రపంచం ఎప్పుడూ కూడా నిజాన్ని చూడదండి. ఇది మసాలా కథలను సృష్టిస్తుంది. బయటి వారికి మీ ఇంటి లోపల చూసే అవకాశం దొరికినప్పుడు వారు మీ జీవితాన్ని తమ కుటిల ఆలోచనలకు అనుగుణంగా మార్చి ప్రచారం చేస్తారు. ఇంట్లో ఏదైనా చిన్న గొడవ జరిగితే చాలు అది బయట ప్రతిరోజు జరిగే పోరాటంలా మారిపోతుంది. ఇంటికి ఎవరైనా సరే బంధువు వస్తే దానిపై కూడా అనుమానపు కథలు అల్లుతారు.
(07:40) ఇవన్నీ నేరుగా మీ మొహం మీద చెప్పరు. మీ వెనక సమాజం ప్రచారం చేస్తారు. కాబట్టి మనిషి తన మనసు దేనినైతే చూడాలనుకుంటుందో దాన్నే చూస్తాడు. మనసు ముందే నల్లగా ఉంటే అతనికి ప్రతి చోటా చెడే కనిపిస్తుంది. సమాజంలో మీ గౌరవం పోతే మీరు ప్రతి ఇంటికి వెళ్లి సంజాయిషి ఇచ్చుకుంటారా? లేదు కదా అందుకే మీ అమాయకత్వం మీరు ఏళ్ల తరబడి సంపాదించుకున్న గౌరవాన్ని మట్టిలో కలిపేస్తుంది.
(08:09) కాబట్టి ఇప్పుడు దీని పరిష్కారం ఏంటి అంటే జాగ్రత్తగా వినండి మీ జీవితాన్ని ఎంతగా మీ వరకు ఉంచుకుంటారో మీ జీవితం కూడా అంతే సురక్షితంగా ఉంటుంది. అందరినీ ఇంట్లోకి రానివ్వడం అంటే మీపై అబద్ధపు కథలు అల్లడానికి వారికి హక్కు ఇవ్వడమే మీ ఇంట్లోకి అడుగు పెట్టని వారికి బయట చెప్పడానికి ఎలాంటి విషయం దొరకదు. ఐదవ కారణం మీ అత్యంత విలువైన సమయం అలానే మీ పనులు పూర్తిగా నాశనం అవుతాయి.
(08:37) ప్రపంచంలో అత్యంత విలువైనది ఏది అనే ప్రశ్న నేను అడిగితే మీరు వెంటనే డబ్బు అంటారు. కానీ డబ్బు కంటే విలువైనది ఏంటో తెలుసా అదే సమయం. డబ్బు పోతే మళ్ళీ సంపాదించొచ్చు కానీ సమయం తిరిగి రాదు. ఎవరైనా అనవసరంగా మీ ఇంటికి వచ్చి గంటల కొద్ది వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారంటే వారు కేవలం మీ సమయాన్ని తీసుకోవడం లేదు. వారు మీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు.
(09:04) మీ పని ఆగిపోతుంది మీ ఏకాగ్రత దెబ్బ తింటుంది. దీనితో పాటు మీ జీవనశైలి కూడా చల్లా చెదురవుతుంది. మీరు భోజనం చేస్తున్నారు ఎవరో వచ్చారు మీకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎవరో వచ్చారు మీరు ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నారు. మళ్ళీ ఎవరో వచ్చారు మెల్లగా మీరు మీ సొంత సమయానికి యజమానిగా ఉండలేరు. ఈరోజు ఇతరుల ఇష్టానుసారం నడుస్తుంది.
(09:29) కాబట్టి ఇప్పుడు దీని పరిష్కారం ఏంటి అంటే వినండి సమయాన్ని గౌరవించని వాడు కాలం మట్టిలో కలిపేస్తుంది. ఈ సమయపు దొంగతనాన్ని ఆపడానికి మీరు ఖాళీగా లేరని మీ ప్రవర్తనతో లేదా మాటలతో స్పష్టంగా చెప్పండి. మీరు మీ పనిలో నిమగ్నమై ఉన్నారని తెలిస్తే వారు రావడం తగ్గిస్తారు. మీ సమయాన్ని గౌరవించని వ్యక్తి మిమ్మల్ని కూడా గౌరవించారు. ఇక ఆరవది మీ పిల్లల మనసుపై అలానే వారి భవిష్యత్తుపై చెడు ప్రభావం పడుతుంది.
(09:58) ఫ్రెండ్స్ ఇది ముఖ్యమైనది పిల్లలు ఎప్పుడూ మీ మాటల ద్వారా నేర్చుకోరు. వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తులను చూసి పెరుగుతారు. వారు వినడం కంటే చూసి అనుకరించడం ఎక్కువ. రకరకాల వ్యక్తులు మీ ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడు మీ పిల్లలు ఏం చూస్తున్నారు వారి మాటలు వారి ప్రవర్తన వారి ఆలోచనలు ఒక వ్యక్తి ఎప్పుడూ ఇతరులను దూషిస్తూ అబద్ధాలు చెబుతూ ఉంటే పిల్లలు కూడా దాన్నే సరైందని నమ్ముతారు.
(10:26) మరింత ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే ఆ బయటి వ్యక్తులు మీ పిల్లలను వారి పిల్లలతో పోల్చడం మావాడు చదువులో ఇంత చురుగ్గా ఉన్నాడు మీ వాడేంటి ఇంత వెనకపడ్డాడు ఇలాంటి మాటలు చిన్నవిగా అనిపించినా పిల్లల మనసులో లోతైన గాయాలు చేస్తాయి. కాబట్టి దీని పరిష్కారం పిల్లల చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం తల్లిదండ్రులుగా మీ ప్రథమ కర్తవ్యం.
(10:53) ప్రతి ఒక్కరికి మీ పిల్లల దగ్గర కూర్చునే హక్కు లేదు. ఎవరు ఇంట్లోకి రావాలో ఎవరు రాకూడదో మీరు ఖచ్చితంగా నిర్ణయించాలి. మీ చిన్న అమాయకత్వం మీ పిల్లల భవిష్యత్తును పాడు చేస్తుంది. ఇక ఏడవ కారణం స్వచ్ఛమైన మీ ఇంట్లో చెడు శక్తి అలానే భద్రత ముప్పు ఏర్పడుతుంది. అవును ప్రతి మనిషి తనతో పాటు కేవలం శరీరాన్ని మాత్రమే తీసుకురాడు. తన క్రూరమైన ఆలోచనలో అలానే తన దృష్టిని కూడా తెస్తాడు.
(11:20) మీ ఇంటికి వచ్చే వ్యక్తి లోలోపల మీపై అసూయ పడుతుంటే అతని చెడు ఆలోచనలు ఇంటి వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. కొందరు వ్యక్తులు వెళ్ళిన తర్వాత ఇంట్లో గొడవలు జరగడం లేదా మనసు బరువుగా అనిపించడం మీరు గమనించారా? అయితే అదంతా యాదృశ్చికం ఏమీ కాదు. వారు వదిలి వెళ్ళిన చెడు దృష్టి ప్రభావమే ఇదంతా. దీనితో పాటు భద్రతకు కూడా ముప్పు అనేది ఉంటుంది.
(11:44) ఇంటి రహస్య సమాచారం ఎప్పుడూ బయట వ్యక్తుల వద్ద లీక్ కాదు. పదే పదే మీ ఇంటికి వచ్చే వారి ద్వారానే బయట వెళ్తుంది. ఏ వస్తువు ఎక్కడుంది మీరు ఎప్పుడు ఇంట్లో ఉంటారు ఎప్పుడు ఉండరు అన్న విషయాలన్నీ వారు గమనిస్తారు. ఆ వ్యక్తి చెడ్డవాడు కాకపోయినా అతని నోటి నుండి వచ్చిన సమాచారం ప్రమాదకరమైన వ్యక్తులకు చేరుస్తుంది. మీ ఆ చిన్న అజాగ్రత్త మిమ్మల్ని రోడ్డున పడేస్తుంది.
(12:09) కాబట్టి ఫ్రెండ్స్ దుష్టులు అలానే అసూయ పడే వ్యక్తుల నుండి పూర్తిగా దూరం పాటించడమే మీ ఏకైక రక్షణ మీ ఇంటిని ఒక బహిరంగ ఉద్యానవనంలో కాకుండా ఒక సురక్షితమైన కోటలా మార్చుకోండి. ప్రపంచం మీకు ఎంత గౌరవం ఇస్తుందంటే మీరు మిమ్మల్ని ఎంత గౌరవించుకుంటారో అంత మాత్రమే పరిమితులు. పరిమితులు లేని మంచితనం మీ బలహీనత. అవును ఎవరైతే తనకంటూ ఒక పరిధిని నిర్మించుకోరో ఈ క్రూరమైన ప్రపంచం వారి కోసం ఒక పరిధిని నిర్ణయిస్తుంది.
(12:41) అప్పుడు ఆ వ్యక్తి కన్నీరు మున్నీరుగా వినిపించాల్సి వస్తుంది. కాబట్టి ఈ క్షణం నుండైనా మీ జీవితంలో ఒక కఠినమైన నియమాన్ని ఏర్పాటు చేసుకోండి. అలానే ఈ సందేశం ఈ వీడియో మీకు నచ్చింది అంటే కచ్చితంగా ఈ రోజు నుంచి నేను మారుతాను అని నాకు తప్పకుండా కామెంట్ లో షేర్ చేసుకోండి. అలానే వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.
(13:04) ఇది నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరి కొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఫస్ట్ గా మన ఛానల్ ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్.
No comments:
Post a Comment