"మంచితనం"🔴నిన్ను చుట్టేసే త్రాచు పాము లాంటిది 🐍 | Psychology of False Goodness | PRATIKULA VEDAM
Author Name:PRATIKULA VEDAM
Youtube Channel Url:https://www.youtube.com/@pratikulavedam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2TbtbvbBhJc
Transcript:
(00:00) నేను చాలా మంచోడిని ఎవరిని నేను ఒప్పించను. నాకంటూ పెద్దగా స్వార్థం అంటూ కూడా ఏమీ లేదు. ఎవరు ఏం చెప్తే అది వింటాను అని నీకు నువ్వే ఒక సర్టిఫికేట్ ఇచ్చుకొని దాన్ని ఒక గోల్డ్ మెడల్ లాగా మెడలో వేసుకొని తిరుగుతున్నావు కదా నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా వీడు బంగారం అండి ఎవ్వరికీ ఎదురు చెప్పడు అని నీ ఈగోని తృప్తి పరుస్తూ ఉంటారు.
(00:25) కానీ ఆ మంచితనం వెనక ఉన్న అసలైన నిజాన్ని ఎప్పుడైనా బట్ట బయలు చేసే ప్రయత్నం చేశవా నిన్ను మంచోడు అని ఎందుకు అంటున్నారంటే నీకు ఏదో అద్భుతమైన క్యారెక్టర్ ఉందనో నీలో కరుణ పొంగి పొర్లిపోతుందనో కాదు. వాళ్ళ ఆధిపత్యానికి నువ్వు ఎప్పుడూ ఒక ప్రమాదం కాదు కాబట్టి నీకు సొంతంగా ఆలోచించే ధైర్యం లేదు కాబట్టి నిన్ను సులభంగా కంట్రోల్ చేయొచ్చు కాబట్టి ఇన్ని కాబట్టీలు ఉన్నాయి కాబట్టే వాళ్ళ దృష్టిలో నువ్వు మంచివాడివి.
(00:53) పళ్ళు లేని ఒక పాము నేను ఎవ్వరిని కాటు వేయను నేను అహింసావాదిని అని చెప్పుకుంటే అది మంచితనం కాదు చేతకనితనం నీ మంచితనం కూడా అలాంటిదే అది నువ్వు సాధించిన గుర్తింపు కాదు అసలు ఈ జబ్బు నీకు ఎప్పుడు మొదలైందో ఒక్కసారి వెనక్కి వెళ్లి చూద్దాం చిన్నప్పుడు ఎప్పుడో ఎవరో వచ్చి అబ్బా వీడు ఎంత సైలెంట్ గా ఉంటాడో ఎంత అణగి మెనుగు ఉంటాడో అనే బిస్కెట్ వేశారు నీకు ఆ ఒక్క దరిద్రపు కాంప్లిమెంట్ కి నువ్వు పడిపోయావు ఇక ఆ క్షణం నుండి ఆ ముద్రని కాపాడుకోవడం కోసం నిన్ను నువ్వు ప్రతి రోజు బలించుకోవడం స్టార్ట్ చేశవు.
(01:28) సైకాలజీలో పామ్ లోన్స్ డాగ్ ఎక్స్పెరిమెంట్ వినే ఉంటాం. బెల్ కొట్టగానే కుక్కలకి లాలాజం వస్తది. ఎందుకంటే బెల్ కొట్టగానే ఆహారం వస్తుంది అని దానికి తెలుసు. నీ పరిస్థితి కూడా అంతే నువ్వు కాంప్రమైజ్ అయిన ప్రతిసారి నీకొక రివార్డు దొరికింది. అది ఒక చిరునవ్వు కావచ్చు, ఒక ప్రశంస కావచ్చు, ఇంట్లో దొరికే ఒక కృత్రిమ శాంతి కావచ్చు.
(01:49) చిన్నప్పుడు అనుకో నిన్ను పెంచిన వాళ్ళ మీద నువ్వు డిపెండెంట్ గా ఉన్నావు కాబట్టి బ్రతకడానికి ఆ మాత్రం భయం నీకు అవసరమై ఉండొచ్చు. అందులో తప్పేమ లేదు కానీ 30 40 ఏళ్ళు వచ్చాక స్వయంగా బ్రతకగలిగే శక్తి వచ్చాక కూడా ఇంకా అదే సర్వైవల్ మెకానిజం ని పట్టుకొని ఇదే నా క్యారెక్టర్ అని భ్రమపడుతున్నావ్ చూసావా అక్కడ ఉంది నీ అసలైన రోగం.
(02:12) నువ్వు ఒక మనిషిగా బ్రతకడం ఎప్పుడో మానేసావ్. ఏ చదువు చదవాలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఎలా బ్రతకాలో ఇవన్నీ నీ ప్రమేయం లేకుండానే సమాజం నీ మెథడ్లోకి ఇన్స్టాల్ చేసిన కోడ్ నువ్వు ఈరోజు గుడ్ బాయ్ లాగా బ్రతకడం నీ ఛాయిస్ అనుకుంటున్నావా కాదు అది కేవలం నీ ప్రోగ్రామింగ్ నీకు ఇప్పుడు రెండు కథలు చెప్తా నువ్వు చిన్నప్పటి నుండి ఎన్నో సార్లు విన్న కథలే కానీ ఈసారి కొంచెం వేరేగా చూద్దాం కథని జస్ట్ వినేవాడిగా కాదు దాన్ని నీ పక్కన పెట్టుకొని అబ్సర్వ్ చేసేవాడిగా విను మన దేశంలో త్యాగం అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు భీష్ముడు.
(02:48) మహాభారతంలో అందరికంటే పవర్ఫుల్ గా ఉండగలిగినవాడు. హస్తినాపుర సింహాసనానికి సరైన వారసుడి లక్షణాలు ఉన్నవాడు. కానీ తండ్రి కోసం దాన్ని వదిలేసుకున్నాడు. సమాజం ఆయన మహా త్యాగమూర్తి అంటుంది. కానీ ఆ ప్యాకేజింగ్ వెనుకున్న లాజిక్ ఏంటో తెలుసా నీకు భీష్ముడు తన జీవితాన్ని ఎందుకు బలి చేసుకున్నాడు? ధర్మం కోసమా కాదు తండ్రి శంతునుడి కామం కోసం ముసలి వయసులో ఉండి కూడా ఇంకో పెళ్లి చేసుకోవాలన్న స్వార్థం కోసం ఆ ఒక్క కారణం కోసం కొడుకు తన సొంత జీవితాన్ని తన స్వేచ్ఛను ఆత్మహుతి చేసుకున్నాడు కానీ ఆ మంచితనం వల్ల జరిగింది ఏంటి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టిన వాళ్ళంతా చేతకాని వాళ్ళు
(03:26) ధర్మం గాడి తప్పింది. నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్న సరే ఆ మహానుభావుడు నోరు మెదపలేకపోయాడు. ఎందుకంటే ధర్మం కంటే న్యాయం కంటే ఒక మనిషిగా తన బాధ్యత కంటే నేను ఒక ఆదర్శ పుత్రుడిని నేను మాట తప్పని వాడిని అన్న తన ఈగోయే ఎక్కువైపోయింది. ఆ మంచివాడు అన్న ఒక్క ఇమేజ్ ని కాపాడుకోవడం కోసం లక్షల మంది ప్రాణాలు పోవడానికి కారణమైన కురుక్షేత్రాన్ని కళ్ళకు అప్పగించి చూశాడు.
(03:55) ఇప్పుడు చెప్పు అది త్యాగమా లేక మంచివాడు అని తనకున్న ఇమేజ్ ని కాపాడుకోవడానికి చేసిన గుడ్డి విధేయత ఇతరుల అహంకారాన్ని సంతృప్తి పరచడం కోసం నువ్వు చేసే ప్రతి త్యాగం భవిష్యత్తులో ఒక మహా విద్వంసానికే దారితీస్తుంది అనడానికి భీష్ముడే అతి పెద్ద ఉదాహరణ ఇప్పుడు ఇంకో కథ ఏకల్యుడు గురువు నేర్పించకపోయినా తానే సొంతంగా ప్రాక్టీస్ చేసుకొని అర్జునుడి కంటే గొప్ప ధనుర్ధరుగా మారాడన్నమాట గురువు ద్రోణాచార్యుడు అడిగాడని ఏ మాత్రం ఆలోచించకుండా తన బొటన వేలని కోసి ఇచ్చేసాడు.
(04:24) దీన్ని మన సిస్టం ఎలా వాడుకుంటుందో తెలుసా చూసారా ఏకలవ్యుడు భక్తి గురువు మీద ఎంత ప్రేమ ఎంతటి త్యాగం అని పిల్లలకి నూరిపోస్తుంది. కానీ ఇందులో దాగున్న సబ్ టెక్స్ట్ ఏంటో ఎప్పుడైనా ఆలోచించావా ద్రోణాచార్యుడు ఆ బొటనవేలు ఎందుకు అడిగాడు ఏకలవ్యుడికి ముక్తిని ఇవ్వడానిక కాదు తన సొంత శిష్యుడైన అర్జునుడు మాత్రమే ప్రపంచంలో బెస్ట్ గా ఉండాలి అన్న తన సొంత స్వార్థం కోసం ఏకలవ్యుడి టాలెంట్ ని మొగ్గలోనే తుంచేసాడు.
(04:49) ఇది ప్యూర్ పక్కా ఎక్స్ప్లాయిటేషన్ పచ్చి మోసం కానీ సమాజం దాన్ని ఏమని పిలిచింది భక్తి విధేయత మంచితనం ఎందుకంటే సిస్టం కి ప్రశ్నలు అడిగేవాడు వద్దు నా వేలు నేను ఎందుకు కోసుకోవాలి దేనికోసం కోసుకోవాలి అని అడిగేవాడు ఈ సిస్టం కి ఒక ముళ్ళు లాంటివాడు అందుకే నిన్ను చిన్నప్పటి నుంచే ఏకలేవి బిడ్డల ప్రోగ్రాం్ చేస్తారు. వాళ్ళ ఎజెండా కోసం నీ రెక్కలు నువ్వే నరికేసుకుంటే నీకు మంచి పిల్లోడు అని బిరుదిచ్చి ఒక దండేసి పక్కన కూర్చోబెడతారు. అది వాళ్ళ గేమ్ ప్లాన్.
(05:16) సో ఇక్కడ తేడా ఏంటంటే భీష్ముడిని ఏకలవుడిని కనీసం ఒక పుస్తకంలో రాసుకున్నారు గుడ్లు కట్టి మొక్కుతున్నారు. కానీ నువ్వు నువ్వు చేసే ఈ చిల్లర త్యాగానికి ఈ పనికి మాలిన మంచితనానికి రేపు నీకు మిగిలేది ఏంటి? ఒక కొంగుబాటు నిన్ను నువ్వే అసహించుకునే ఒక ఫ్రస్ట్రేషన్ మాత్రమే. ఇప్పుడు అసలైన లాజిక్ లోకి వెళ్దాం.
(05:37) నువ్వు ఎప్పుడు ఒక డైలాగ్ కొడుతుంటావు కదా మా అమ్మ నాన్నల కోసం ఫ్యామిలీ పరువు కోసం నా ఇష్టాన్ని వదిలేసుకున్నాను అని నేను వాళ్ళ కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను అని ఈ స్టేట్మెంట్ ని ఇప్పుడు ఒక టేబుల్ మీద పెట్టి సర్జరీ చేద్దాం. నువ్వు నీ ఆత్మను చంపుకొని వాళ్ళకి నీ జీవితాన్ని అర్పించేశావు. మరి ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు పరమానందంగా ఉండాలి కదా మావాడు మాకోసం ఇంత చేశాడు అని మీ ఇంట్లో ఒక స్వర్గం లాంటి వాతావరణం ఉండాలి కదా ఉందా మరి వాళ్ళు కంప్లీట్ గా సాటిస్ఫై అయ్యారా లేదు వాళ్ళు ఇంకా ఏదో ఒక దానికి కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. నువ్వు 90% వాళ్ళు
(06:09) చెప్పినట్టు విన్నా మిగిలిన 10 శాతం గురించి నిన్ను తిడుతూనే ఉన్నారు పక్కింటి వాడితో నిన్ను పోల్చుతూనే ఉన్నారు. నువ్వు నెత్తురు ధార పోసినా సరే ఆ అంచనాల రాక్షసికి ఎన్నటికీ ఆకలి తిరదు. సరే అది వదిలేద్దాం మరి నువ్వు వాళ్ళు గీసిన గీతను దాటకుండా పూర్తి విధేయత చూపిస్తున్నావు కాబట్టి కనీసం మీ ఇంట్లో వాళ్ళ దృష్టిలో నీకు విపరయతమైన గౌరవం ఉండాలి కదా ఇంట్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్న నీ మాటకు ఒక వాల్యూ ఉండాలి కదా ఉందా లేదు ఇంట్లో నీ మాట ఎవ్వరూ వినరు.
(06:40) వీడికి సొంత బుర్ర లేదు మన చేతిలో కీలు బొమ్మ అని నిన్ను ఒక డోర్ మెట్ లాగా వాడుకుంటున్నారు. ఎవరైతే ఇంట్లో ఎదురు తిరిగి వాళ్ళ మొఖం మీద చెప్పాల్సింది చెప్పి తన దారి తాను చూసుకుంటాడో వాళ్ళంటేనే భయం వాళ్ళకే గౌరవిస్తారు నీకెవ్వడు ఎవ్వడు సరే ఇది కూడా వదిలేద్దాం మరి ఫైనల్ గా నువ్వు ఇన్ని వదులుకున్నావు కాబట్టి కనీసం నీ లోపల నీ అంతరాత్మలో ఒక ప్రశాంతత ఉండాలి కదా రాత్రి పడుకోగానే నిమ్మళంగా నిద్రపట్టాలి కదా పడుతుందా లేదు నీ లోపల ఒక భయంకరమైన ఫ్రస్ట్రేషన్ ఉంది.
(07:11) ఎవ్వరూ చూడనప్పుడు కన్నీళ్లు వస్తుంటాయి. వారం మొత్తం గాడిదలాగా పనిచేసి వీకెండ్ రాగానే మందు తాగి పడిపోయో ఇంకేదో వ్యసనంతో ఆ రిగ్రెట్ ని మర్చిపోవాలన్న తాపత్రయం అరే ఈ రోజుల్లో 30 ఏళ్ల యువకుడికి జీవితం మీద విరక్త పడుతుంది. మరేంటైతే నీ వాళ్ళు ఆనందంగా లేరు నీకు ఇంట్లో గౌరవం దక్కలేదు నీకు లోపల మనశశాంతి లేదు. మరి దేనికోసం చేస్తున్నావ్ ఈ నాటకం ఈ మంచితనం అనే ముసుగును నువ్వు ఎందుకు వదలలేకపోతున్నావో దాని వెనకతఉన్న సైకలాజికల్ ఫాక్ట్ ఏంటో చెప్తా విను మనిషికే దేనిని చూసిన అంత పెద్ద భయం వేదు కానీ తన సొంత స్వేచ్ఛను చూస్తే మాత్రం విపరేతమనే భయం ఎందుకంటే
(07:48) నీకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తే నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల నువ్వు ఓడిపోవచ్చు రోడ్డుని పడొచ్చు అప్పుడు ఆ ఫెయిల్యూర్ కినూటికినూ శాతం నువ్వే బాధ్యత వహించాలి అండ్ ఆ భారం మోసే ధైర్యం నీకు లేదు. అందుకే నువ్వు నీ జీవితం తాలుకు స్టీరింగ్ మిల్ని వాళ్ళ చేతికి ఇచ్చేసావు. రేపు నీ లైఫ్ నాశనం అయిపోతే నా జీవితం ఇలా అవ్వడానికి మీరే కారణం అని వాళ్ళ వైపు వేళ్ళు చూపించుకోవడానికి నీకుొక సాకు కావాలి.
(08:12) ఫెయిల్యూర్ కి ఒక ఇన్సూరెన్స్ పాలసీ కావాలి అండ్ ఆ ఇన్సూరెన్స్ పాలసీ పేరే నువ్వు చూపిస్తున్న ఈ విధేయత నువ్వు త్యాగమూర్తివ ఏమి కాదు జీవితం అనే కురుక్షేత్రంలో యుద్ధం చేయలేక రిస్క్ తీసుకోలేక ఆయుధాలు కింద పడేసి శత్రువు పాదాల మీద పడిపోయిన పిరికివాడివి. సో ఇంత విన్నాక కూడా నీలో ఏ చలనము లేకపోతే ఇంకా లేదు లేదు నా సిచువేషన్ వేరు అని గాని నీ ఈగో డిఫెన్స్ లోకి వెళ్తుందంటే నీతో నేను ఆర్గ్యూ చేయను.
(08:40) కానీ నువ్వు ఒక పని చెయ్ నీ చుట్టూ చూడు నీతో పని చేస్తున్న నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఇంట్లో వాళ్ళు చెప్పారని ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు మనసు చంపుకొని ఆఫీస్ లో కూర్చున్నాడు. నీ అక్క ఉంది కదా కులం పేరుతో తెచ్చిన సంబంధం చేసుకొని ప్రతిరోజు ఒక్క మాట కూడా మాట్లాడకుండా భర్తతో బ్రతుకుతుంది. మీ నాన్న ఉన్నారు కదా తాత చెప్పాడని ఊర్లో ఉన్న పొలం వదిలేసి టౌన్ కి వచ్చి అన్ని పోగొట్టుకొని కూర్చున్నాడు.
(09:02) వీళ్ళ కళ్ళల్లోకి ఒక్కసారైనా సూటుగా చూసావా ఆ కళ్ళలో నువ్వు చదవగలిగే ఒకే ఒక మాట కనిపిస్తది. ఆ మాటే ఒకవేళ ఏంటి ఒకవేళ ఒకవేళ నేను అప్పుడు వేరే నిర్ణయం తీసుకుని ఉండుంటే అనే ఆలోచన. నెక్స్ట్ పాడ్కాస్ట్ లో ఈ ఒకవేళతో బ్రతుకుతున్న రియల్ మనుషుల గురించి మాట్లాడతా వాళ్ళు చేసిన మిస్టేక్స్ గురించి కాదు వాళ్ళు ఆ మిస్టేక్స్ చేయడానికి సిస్టం ఎలా డిజైన్ చేయబడిందో దాని గురించి అంతవరకు
No comments:
Post a Comment