చిన్న సమస్యకే వణికిపోతే గెలవడం ఎలా బాస్ | Stop Giving Up Start Living | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2csyKAwkIM4
Transcript:
(00:03) బలమైన సంకల్పం ఉంటే సృష్టి మొత్తం మీకు దాసోహం అంటుంది. వినడానికి చాలా బాగుంది కదా కానీ అసలు విషయం ఏంటంటే మీ దగ్గర ఆ సంకల్పం లేదు. మనలో చాలా మందికి ఒక జబ్బు ఉంది. ఏదైనా కొత్త పని మొదలు పెట్టగానే విపరీతమైన ఊపు కనిపిస్తుంది. కానీ చిన్న కష్టం ఎదురవ్వగానే ఆ ఊపు అంతా తుస్సుమంటుంది. పట్టుదల అన్న పదం మన డిక్షనరీలోనే ఉండదు.
(00:30) మీకు తెలుసా ఈ రోజుల్లో మనుషులు చాలా ఈజీగా కుట్ చేస్తున్నారు. జిమ్ కి వెళ్దాం అనుకుంటారు. రెండు రోజులు వెళ్ళాక ఒలు నొప్పులు రాగానే రేపు వెళ్దాంలే అని పడుకుంటారు. ఒక బిజినెస్ ఐడియా వస్తుంది. మొదటి అడుగులోనే ఎవరో ఏదో అన్నారని చెప్పేసి వెనక్కి తగ్గుతారు. నిజం ఏంటంటే నీకు ఒక గోల్ ఉంది. కానీ దాన్ని రీచ్ అయ్యే దమ్మిడి సంకల్పం లేదు.
(00:52) నీ మైండ్ ఒక గ్యాంబ్లర్ లాంటిది. ఏదైనా వెంటనే వచ్చేయాలి. కష్టం లేకుండా దొరికిపోవాలి. ప్రాబ్లం బయట లేదు మీ లోపలే ఉంది. మీకు మీరు ఇచ్చుకునే మాటని మీరే నిలబెట్టుకోలేకపోతున్నారు. అదే అసలైన దరిద్రం ఈ సమస్య ఎందుకు వస్తుంది ఎందుకంటే నీకు నీ మీద నమ్మకం లేదు కాబట్టి ఆత్మవిశ్వాసం లేని మనిషి ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటాడు.
(01:16) వాడు గెలిచినా అది యక్సిడెంటల్ గా గెలిపోతుంది తప్ప అది అచీవ్మెంట్ అవ్వదు. మనం ఒక కంఫర్ట్ జోన్ లో బ్రతుకుతున్నాం. ఏ చిన్న అసౌకర్యం కలిగినా తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనం సంకల్ప శక్తి తుప్పు పట్టిపోయింది. అంటే విల్ పవర్ మన బాడీకి ఇచ్చే ట్రైనింగ్ లో వందల వంతు కూడా మైండ్ కి ఇవ్వటం లేదు. నువ్వు ఒక పనిని మధ్యలోనే వదిలేస్తున్నావ అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు ఆ పని మీద ప్రేమ లేదు పోనీ నీ మీద నీకు గౌరవం అస్సలు లేదు.
(01:51) పట్టుదల లేకపోవడం అనేది ఒక బలహీనత కాదు అది ఒక మానసిక వైకల్యం రేపు చూద్దాంలే అనుకునే ప్రతి క్షణం నువ్వు నీ సక్సెస్ ని వేరేవాడికి గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నావ్. ఒక చిన్న రియాలిటీ చెక్ నువ్వు పట్టుదల లేక వదిలేసిన ప్రతి పనిని ఇంకొకడు పట్టుబట్టి పూర్తి చేస్తున్నాడు. అందుకే వాడు అక్కడ ఉన్నాడు నువ్వేమో ఇక్కడ కూర్చొని ఈ వీడియో చూస్తున్నావ్. మరి దీనికి సొల్యూషన్ ఏంటి పరమహంస యోగానంద్ గారు ఒక మాట చెప్పారు డైనమిక్ విల్ కేవలం కోరిక ఉంటే సరిపోదు దానికి దైవశక్తిని నీ ఆత్మ శక్తిని జోడించాలి.
(02:23) మరి అది ఎలా వస్తుంది నువ్వు చేసే ప్రతి చిన్న పనిలోనూ నీ సంకల్పాన్ని వాడాలి. రేపు ఉదయం 5 గంటలకి లేవాలని అలారం పెట్టుకున్నావా నిద్ర లేవగానే నీ మైండ్ 100 కారణాలు చెప్తుంది. ఇంకా చీకటిగానే ఉంది చలిగా ఉంది. అందులోన నిన్న లేట్ గా పడుకున్నావు కదా అని ఇప్పుడు నువ్వు నీ మైండ్ కి చెప్పాలి షట్ అప్ నేను చెప్పేది నువ్వు వినాలి అని చిన్న చిన్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయడం అలవాటు చేసుకో ఓ బుక్ చదవాలనుకుంటే ఆ రోజుకి అనుకున్న పేజీలు పూర్తి చేసే వరకు నిద్రపోకు ఆ చిన్న గెలుపు నీకు ఇచ్చే కిక్కు మామూలుగా ఉండదు. నీ సంకల్ప శక్తి ఒక మజిల్ లాంటిది.
(03:01) దాన్ని ఎంత వాడితే అంత స్ట్రాంగ్ అవుతుంది. నీ లోపల ఉన్న దైవత్వాన్ని నీ సంకల్పంతో టచ్ చెయ్. అప్పుడు చూడు అసాధ్యం అనే పదం నీ డిక్షనరీ లో నుంచి ఎలా మాయమవుతుందో లైఫ్ అంటే ఒక యుద్ధం ఇక్కడ ఎవరు నీకు పూల బాట వేయరు నువ్వే నీ కత్తికి పదును పట్టుకోవాలి ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా జేబులో పెట్టుకొని యుద్ధానికి బయలుదేరాలి.
(03:24) ఒక్కొక్కసారి యుద్ధం చేసేటప్పుడు నువ్వు అభిమానించే వాళ్ళు నువ్వు ఇష్టపడే వాళ్ళు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళతో కూడా యుద్ధం చేయాలి. ఎందుకంటే నువ్వు గెలవాలి కాబట్టి సంకల్పం ఉన్నోడికి ప్రపంచం దారిస్తుంది. లేనోడిని తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. నీ సంకల్పం ఎంత బలంగా ఉండాలంటే నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ విధి కూడా భయపడాలి.
(03:47) వీడు ఎలాగైనా సాధిస్తాడు. వీడిని ఆపడం మన వల్ల కాదు అని సృష్టే సరెండర్ అవ్వాలి. అదే యోగానంద్ గారు చెప్పిన అసలైన సత్యం. గుర్తుపెట్టుకో కంఫర్ట్ జోన్ అనేది ఒక అందమైన జైలు. అక్కడ తిండి దొరుకుతుంది కానీ గౌరవం దొరకదు. నీ సంకల్పాన్ని పెంచుకో నువ్వు అనుకున్నది సాధించే వరకు నిద్రపోవద్దు. నీకు నువ్వు ఇచ్చుకున్న మాటని గౌరవించు అప్పుడు నీ జీవితం ఒక సినిమా అవుతుంది.
(04:15) ఆ సినిమాలో నువ్వే హీరో అందులోనూ నీ సినిమా ప్ాన్ ఇండియా సినిమా అవుతుంది. ఒక విషయం ఈ వీడియో చూసి అవును కదా అని తల ఊపేసి మళ్ళీ నిద్రపోతే నీకంటే పెద్ద ఫెయిల్యూర్ ఇంకొకడు ఉండడు. ఇప్పుడే మొదలు పెట్టు ఒక చిన్న పని నువ్వు వాయిదా వేస్తున్న ఒక చిన్న పనిని ఇప్పుడే పూర్తి చెయ్ చూద్దాం నీలో ఆ సంకల్పం ఉందో లేదో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకు ఉపయోగపడే ఇంకొక రెండు వీడియోస్ ని పిన్ చేసి పెట్టాను వాటిని కూడా చూడండి
(04:52) ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్
No comments:
Post a Comment