Thursday, May 7, 2026

దేవుడు vs కామం: The Science of Desire and Spirituality | Telugu Buddha Podcast

దేవుడు vs కామం: The Science of Desire and Spirituality | Telugu Buddha Podcast

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=lH5DX2FHLnw



Transcript:
(00:01) ఒక వ్యక్తిని మంచివాడనో స్పిరిచువలిస్ట్ అనో క్రమశిక్షణ గలవాడనో ముద్ర వేయడం మనకు అలవాటే కానీ నిజానికి మనిషి అంటే ఒక అనంతమైన అయోమయం ఒక సంక్లిష్టమైన వ్యవస్థ ఒకవైపు దేవుడి కోసం పరితపించే బుర్ర ఉన్నా మరోవైపు కామ కోరికలతో రగిలిపోయే శరీరం ఈ రెండు ఒకే మనిషిలో నిరంతరం సహజీవనం చేస్తూ ఉంటాయి.
(00:29) ఇవి వేరు వేరు వ్యవస్థలు కావు ఒకే ప్రాణిలో నడిచే రెండు వేరు వేరు ప్రోగ్రాములు మాత్రమే మనం ఈ రెండింటి మధ్య ఒక పెద్ద గోడను కట్టేసి కామం అంటే చెడ్డదని దేవుడు అంటే పవిత్రమని ఒక డ్రామాను సృష్టించుకున్నాం. ఏం అందరూ మనుషులే కదా అసలు జంతువులకు లేని ఈ డ్రామా మనుషులకఎందుకు అని గౌతమ బుద్ధుడు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం మనిషి దుఃఖానికి కారణం తృష్ణ అంటే డిజైర్ బుద్ధుడు కామాన్ని పాపం అని అనలేదు చెప్పలేదు కూడా బట్ అది ఒక మంట వంటిది అని అన్నారు.
(01:06) ఒక మంట ఇంటిని తగలబెట్టగలదు లేదా మనం తినే తిండిని వండగలదు. ఇక్కడ సమస్య మంటలో లేదు దానిని మనం ఎలా వాడుతున్నాం అనే దానిపై ఉంది. బుద్ధుడు మిడిల్ పాత్ గురించి చెబుతూ ఇటు కోరికల వెనుక పరుగెత్తడం అటు కోరికలను బలవంతంగా అణచివేయడం రెండూ నిరర్థకం అని తేల్చి చెప్పారు. కామాన్ని అణచివేసే కొద్దీ అది అగ్ని పర్వతంలా మారుతుంది. అందుకే దాన్ని కేవలం గమనించడం ద్వారా మాత్రమే దాని నుండి ముక్తి పొందగలం.
(01:35) అంటే కామాన్ని జయించడం అంటే దాన్ని చంపడం కాదు దాన్ని క్లారిటీతో నువ్వు చంపాలి అని మన బ్రెయిన్ లోని లింబిక్ సిస్టం కామాన్ని మనుగడ కోరికలను కంట్రోల్ చేస్తుంది. ఇది అత్యంత పురాతనమైన మెదడు భాగం మరోవైపు ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ మనకి లాజిక్ స్పిరిచువల్ కాంటెంప్లేషన్ మొరాలిటీని ఇస్తుంది. అంటే మన శరీరంలోనే పాతకాలం నాటి బుర్ర మరియు దేవుడు అనే పీల్చుకోబడే దానిని పక్కపక్కనే నివసిస్తున్నారు.
(02:06) చెప్పాలంటే డోపామిన్ అనే కెమికల్ మనకి కోరికలను కలిగిస్తుంది. ఇది లేకపోతే మనిషికి తిండి తినాలన్న పని చేయాలన్న అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి కామం అనేది మన బ్రెయిన్ పనితీరులో ఒక భాగం. దీన్ని పాపం అనడం అంటే మన బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్ ని మనం తిట్టుకోవడమే. అవేర్నెస్ పెరిగినప్పుడు మెదడులోని ఈ భాగాలు ఈక్వల్ గా పనిచేస్తాయి.
(02:30) అప్పుడే మనలో ఒక క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవిలో ప్రవహించే ఒక నదిని ఊహించుకోండి. ఆ నది ప్రవాహం చాలా ఉదృతంగా ఉంది. ఆ ఉదృతే కామం. ఇప్పుడు ఆ నదికి అడ్డంగా ఒక గోడ కడితే నీరు నిలిచిపోయి చుట్టుపక్కల గ్రామాలపైకి ఉప్పెనలా వస్తుంది. అదే ఆ ప్రవాహాన్ని గమనించి ఒక కాలువ తవ్వితే ఆ నీటితో పొలాలను పండించవచ్చు లేదా విద్యుత్తును తయారు చేయవచ్చు. ఇక్కడ నది ప్రవాహం తప్పు కాదు.
(02:58) అలానే ఒప్పు కాదు అది కేవలం ఎనర్జీ మాత్రమే ఆ ఎనర్జీని నువ్వు ఎలా మళ్ళంచావు అనేదే ముఖ్యం. దేవుడు అనే కాన్సెప్ట్ ఆ నదికి గట్టు లాంటిది. గట్టు ప్రవాహాన్ని ఆపదు దానికి ఒక దిశనిస్తుంది. గట్టు లేని నది ఊరిని ముంచేస్తుంది. ప్రవాహం లేని గట్టు వ్యర్థమే. సో మనిషిలోని చీకటిని తుడిచివేయడం కాదు దాన్ని అర్థం చేసుకోవడమే అసలైన పరిష్కారం.
(03:24) నీలోని చీకటి నీకు తెలిసినప్పుడు అది నీకు హాని చేయదు. కానీ దాన్ని నువ్వు పట్టించుకోనట్లు నటిస్తే అది నీకు తెలియకుండానే నిన్ను శాసిస్తుంది. దేవుడు అంటే నీలోని అవేర్నెస్ కామం అంటే నీలోని రా ఎనర్జీ ఎరుక లేని శక్తి ప్రమాదకరం శక్తి లేని ఎరుక నిరుపయోగం ఈ రెండూ కలిసినప్పుడే జీవితంలో బ్యాలెన్స్ వస్తుంది. మన జీవితంలో మనం తీసుకునే చాలా నిర్ణయాలు మన కోరికల ప్రభావంతోనే ఉంటాయి.
(03:50) కానీ మనం వాటిని ప్రేమ అని లాజిక్ అని రకరకాల పేర్లతో జస్టిఫై చేసుకుంటాం. అబద్ధంలో బ్రతకడం మన మెదడుకు చాలా ఇష్టం ఎందుకంటే నిజం చాలా చేదుగా ఉంటుంది గనుక సో మనలో దేవుడు ఉంటాడు కామం కూడా ఉంటుంది. ఇది ఎవరిని ఎంచుకోవాలి అనే పోరాటం కాదు ఎవరిని అర్థం చేసుకోవాలి అనే అన్వేషణ తనను తాను అర్థం చేసుకున్నవాడు స్వేచ్ఛను పొందుతాడు. అర్థం చేసుకోలేని వాడు జీవితాంతం తనతో తనే యుద్ధం చేసుకుంటాడు.
(04:20) ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉన్నాయి. కానీ నువ్వే వాటికి ఒక ఆనకట్ట వేసి మరీ దాచేస్తున్నావు అదే నీకున్న మూర్ఖపు తెలివి అంటే

No comments:

Post a Comment