Xx3. I. 2-5. 210922-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
దానవుడు..
మానవుడు
దేవుడు
➖➖➖✍️
*మానవునకు రోగం కలిగించేది పాపం.
పాపం చెయ్యకూడదు అని తెలిసినా చేస్తాడు మనిషి పాపం.
*మానవునకు భోగం కలిగించేది పుణ్యం.
పుణ్యం చేస్తే మంచిది అని తెలిసినా, పుణ్యం చెయ్యడానికి యిచ్చగించదు మనసు.
*మానవుని భవిష్యత్తు నిర్ణయించేది కర్మ.
నీ స్వకీయ కర్మను అంకిత భావంతో చేసుకో మంటాడు పరమాత్మ. అలా చేసుకుంటే - నీకు మోక్షం కూడా యిస్తానన్నాడు భగవద్గీత 18-46 శ్లోకం లో.
అయినా మనసు యిచ్చ గించదు.
*మానవునకు లాభం కలిగించేది సేవ.
సర్వ ప్రాణులకు చేసిన సేవ మాధవ సేవే ఔతుంది -అని, పదే పదే చెప్పాడు పరమాత్మ కానీ, అంతా నాకే కావాలంటాడు మనిషి.
*మానవునకు సంపాదన నిలిపేది పొదుపు.
బిందువు + బిందువు కలిస్తేనే సింధువు అయ్యింది అని తెలుసు మనిషికి! కానీ కొంచెం +కొంచెం కూడ బెడితే కొండంత అవుతుంది అని తెలిసినా - ఒకేసారి కొండంత అయిపోవాలంటాడు మనిషి.
ఇటుక +ఇటుక పేరిస్తేనే ఇల్లు ఔతుంది. ఓకే రోజు ఇల్లు పూర్తైపోవాలంటాడు మనిషి.
విత్తనం పెట్టి, నీరు + ఎరువు వేసి కొన్ని సంవత్సరాలు పెంచితే, చెట్టు ను జాగ్రత్తగా కాపాడితే - బ్రతికి నన్నాళ్ళు ఫలాలు యిస్తుందని తెలిసినా, ఓర్పు వుండదు మనిషికి.
*మానవుని విలువ పెంచేది దానం.
మనకున్న దాంట్లో, మనకన్నా లేని వాళ్లకు దానం చెయ్యాలి. నీవుఒక చేత్తో దానం చేస్తే - నీకు పది చేతుల్తో సహాయం చేస్తాడు దేవుడు.
దానం చెయ్యాలి! మానాన్న నాచేతికిచ్చి, నాచేత్తో దానం చేయించేవాడు.
అంటే, నాకు దానగుణం నేర్పాడన్న మాట.
దయగల హృదయమే భగవన్నిలయము
*మానవునకు నష్టం కలిగించేది హింస.
’అహింసా పరమోధర్మహః’- అని శాస్త్రం చెప్పినా, మనిషి హింస మానడు. [బోయవాడు కొల్లేరు (నీటి సరస్సు)లో పట్టిన పక్షుల్ని మావూర్లో అమ్మడానికి వచ్చే వాడట. మొత్తం పక్షుల గుట్టను క్రిందికి దింపించి - కట్లు (హరిః ఓమ్, హరిః ఓమ్.) విప్పించే వాడట మాతాత. బేరమాడి, కాళ్ళు + రెక్కలు బాగా వున్న పక్షుల్ని మొత్తంగా కొని పక్షుల్ని వదిలేసే వాడట మాతాత. అది అహింస కు పరాకాష్ట].
తన తొడ నుండి మాంసం కోసి బోయ వాడికి (తాను పట్టుకున్న పావురాయి కి బదులు) యిచ్చిన శిబి చక్రవర్తి ఈ దేశంలో పుట్టిన వాడే గదా! మాతాతకు శిబిచక్రవర్తి ఆదర్శం.
*మానవునకు అశాంతి కలిగించేది ఆశ.
ఉన్నదానితో సంతృప్తి పడటం నేర్చుకోవాలి. ఆశకు మితం ఏముంది?
*మానవునకు శాంతి కలిగించేది తృప్తి.
తినుటకు జీవించువాడు బద్ధుడు, జీవించుటకు తినువాడు ముక్తుడు. _Eat to live, do not live to eat_
*మానవునకు దుఃఖం కలిగించేది కామం.
_Desire is the root cause of all evils. It is an insatiable demand._ కోర్కెలు తీరేవి కావు. కోర్కెల్ని తీర్చలేము.
*మానవుని పతనం చేసేది అహంకారం.
’అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహా’ లను వదిలేస్తే మోక్షం యిస్తానన్నాడు పరమాత్మ భగవద్గీత లో.
*మానవునకు అందరిని దగ్గర చేసేది ప్రేమ.
_Serve, Love, Give, Purify, Meditate, Realise._
*మానవునకు అందరినీ దూరం చేసేది అసూయ.
కేవలం అసూయతో దుర్యోధనుడు వంశవినాశనానికి కారకు డౌతాడు.
*మానవుని స్థితిని సూచించేది గుణం.
అన్నింటికీ మూలకారణం గుణమే. మంచి గుణం తయారు చేసుకోవాలి. చెడుగుణాల్ని వదిలి మంచి గుణాల్ని పోగు జేసుకోవాలి. అప్పుడు మనలో దైవత్వం చేరుతుంది.
*మానవుని దైవంగా మార్చేది "దయ!"
*మానవుని ఆత్మస్థితి తెలిపేది వాక్కు.
తియ్యగా మాట్లాడటం నేర్చుకోవాలి. ‘అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్’ - అని భగవద్గీత చెప్పింది.
మాగురువు గారి భార్య మాటలలో… "ప్రభావతి మాట వందనంగా ఉంటుంది అనేది" ( 'ప్రభావతి' -నాభార్య పేరు). అందుకే, నాభార్య గృహిణి గా వుంటూనే : ‘యోగిని, బ్రహ్మజ్ఞాని’ కూడా అయ్యింది.
*మానవునకు విజయం చేకూర్చేది "ధర్మం".
*మానవుని గొప్పవాడిగా చేసేది "తత్వజ్ఞానం".
*మానవునకు ముక్తి నిఇచ్చేది "సత్యం".
*మానవుని అన్ని రకాలుగా సంస్కరించేది "ధ్యానం".
హరిః ఓమ్. హరిః ఓమ్. హరిః ఓమ్.
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment