శ్రీ నాన్నగారి నిరంతర జ్ఞాన గంగ-
1. కోరిన కోరిక వల్ల శాంతి వస్తుంటే ట్యాంక్ ఫుల్(tank full) గా లేదని అర్థం. బయట నుంచి అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులు ఉన్నా ట్యాంక్ ఫుల్(tank full) గా ఉంటే ఏమీ అనిపించదు భగవంతుడు ఉద్దేశం మనల్ని అక్కడికి తీసుకువెళ్లడానికే.
2. నదులు వెళ్ళి సముద్రంలో కలిసిన అది పొంగి పోదు.ఒకవేళ నదులకు కోపం వచ్చికలవక పోయినా దానికి నష్టం లేదు. కలిసినా కలవకపోయినా సముద్రం ఫుల్ గా ఉంటుంది; జ్ఞాని స్థితి అది. మురుగునార్ కవిత్వంలో చెప్పింది మనం మాటల్లో చెపుతున్నాం.
3. భగవాన్: ఏ సబ్జెక్ట్ అయినా సరే నేర్చుకున్నది మర్చిపోవటం తప్పదు; అది ట్రూత్ కాదు కాబట్టి.నాకు ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. ఏదైతే నేర్చుకుందాం అనుకుంటున్నామో అలా ఉండటానికి ప్రయత్నం చేస్తే అప్పుడు పర్ఫెక్షన్ (perfection)వస్తుంది. మైండ్ కి deviation ఉండదు.
4. పదిమంది కలిసి బాధ అనుభవించడం దాన్ని సమిష్టి ప్రారబ్ధం అంటారు. ఏదీ మన చేతుల్లో లేదు.
5. ఇది మనకి ఉపయోగపడుతుంది, ఇది మనకు ఉపయోగపడదు, ఇది మనకి మంచి చేస్తుంది, ఇది మనకి మంచి చేయదు, ఇది మనకి పనికి వస్తుంది, ఇది పనికి రాదు అని విభజించుకునే శక్తి మనకు ఈశ్వరుడు ఇస్తే వస్తుంది లేకపోతే రాదు.
6. కృష్ణుడితో దుర్యోధనుడు “తెలిసి వుండి తప్పులు చేస్తున్నాను” అని అంటే, కృష్ణుడు అంటాడు , “అది వాసనల వేగం”. ఒక పుచ్చకాయ ఒక్క శరీరం అంతా poison చేసేసింది. అంటే ఒక వాసన కూడా మనసుని పాడు చేస్తుంది.
7. భగవాన్ :నీకు 90 వాసనలున్నా అది నీవు కాదు. నీవు కాని గొడవ ఎందుకు ఆలోచించడం. ఒక వాసన ఉన్నా వంద వాసనలున్నా కోటి వాసనలున్నా అది నీవు కాదు; ఎందుకు నీ మొఖం అటు తిప్పటం. నువ్వు ఏదైతే అవునో అది నువ్వు అవుతావు; కానీ నీవు కానిది నువ్వు అవ్వవు.
8. వాసనను నువ్వు అనేది, నీవే దాన్ని పెంచేది, పోషించేది నువ్వే, మళ్ళీ తొలగించుకోవాలి అనుకునేది నువ్వే.God ని తిట్టేది నువ్వే.
No comments:
Post a Comment