6- 10 - 2024 - ఆదివారము..శుభదినము..
🌹గుడ్ మార్నింగ్ 🌹జీవించటం యాంత్రిక ప్రక్రియ. శరీరము అనే యంత్రము ఒకే రకమైన వాటిని రోజు చేస్తూ ఉంటుంది. అయితే ఈ శరీర యంత్రాన్ని కదిలించే మనసు లోపల వుంది. రెండూ కలిసి రోజు జస్ట్ రొటీన్ పనులే చేస్తుంటాయి. అవే అవసరాలనో - కోరికలనో పరుగులు.... ఇంతే జీవితం. యాంత్రికం...............
ఒక ఫ్యానులా, మిక్సిలా, కారులా, టీవిలా - ఇలా చేసినవే చేస్తూ,అవే కోరుకుంటూ, వాటి కొరకే ప్రయత్నిస్తూ, వాటినే అనుభవిస్తూ, అదే సుఖదుఖాలకు లోనవుతూ, అదే జనన మరణాలలో నిరంతరం తిరుగుతూ - మొత్తం యాంత్రికం..........................
ఒక నియంత్రణలో అలాగే జీవిస్తూ వుండే సృష్టి చేసిన యంత్రం మనం...........
ఈ యాంత్రికత నుండి సత్యాన్ని తెలుసుకోవటమే - ఆధ్యాత్మికము, ఆత్మజ్ఞానము అనే చదువు...........
ఈ నేను అనే శరీర యంత్రముతో కలిసి సాగుతూ..............................
ఈ యంత్ర కదలికలకు మూలమైన శక్తిని పట్టుకో................................
అది ఈ యంత్రములోనే వుండి దీనిని నడుపుతున్నది. ఆ శక్తిని పట్టుకోగలిగితే పరిమితత్వం - నసింపు కలిగిన యంత్రాన్ని నేను కాదని.............................
శాశ్వితమైన, నసింపులేని, అనంత, సర్వవ్యాపక, సజీవ చైతన్యాన్ని అని అనుభవమవుతుంది.................
ఇది సృష్టి ఆట - యంత్రముగా జనన మరణాలలో, సుఖదుఃఖములలో తిరుగుతూ ఉంటావో.....................
ఏకత్వ శాస్వితత్వాన్ని పొందుతావో....
నీ ఇష్టం. 🌹god bless you 🌹
No comments:
Post a Comment