8-10 -2024 - మంగళవారము - శుభమస్తు.
🌹గుడ్ మార్నింగ్ 🌹జీవించటం అంటేనే పరిమిత భావన. నేను అనే పరిమిత భావనలో - నాకు భిన్నముగా అనేకము వున్నాయి అనే భేద భావనలో అవసరాల కొరకు తప్పనిసరిగా ప్రయత్నిస్తూ, అనుభవిస్తూ జీవించటమే జీవితం..........
ఇది మొత్తం శరీరానికి సంబంధించినది......
ఇలా జీవిస్తూనే శరీరాన్ని నడిపే లోపలి మనసును గమనిస్తే - పరిమిత - భేద భావాలు ఉంటాయికాని-అది ఆలసట లేని, అత్యంత వేగవంతమైన, పరిమితులు, పరిధులు లేని శరీరాన్ని మించిన మహా శక్తిలా తెలుస్తుంది.............................
ఇది మనో స్థితి................................
ఒక పని పూర్తి అయ్యి - ఒక అనుభవం పూర్తి అయ్యి - రెండవ దానిలోకి ప్రవేశించేలోపు - కాసేపు ఏ ఆలోచన లేకుండా తృప్తిగా,హాయిగా, నిశ్చలముగా ఉన్న అంతరంగ స్థితిని గమనించ గలిగితే..........................
లేదా ఏమి చేయలేక నిస్సహాయముగా, ఏ ఆలోచనా లేక అంతరంగములో ఆగిపోయిన స్థితిని గమనించ గలిగితే.......
లేక ఒక్కసారిగా భయానికి లోనై నిశ్చేష్టులై ఉండిపోయిన అంతరంగ స్థితిని గమనించ గలిగితే............................................
ఒక ఖాళీ - ఒక సూన్యత - ఒక నిశబ్దం - ఒక అనంతం అక్కడ దర్శనమవుతుంది......
ఆ నిశ్చల, నిశ్శబ్ద, అనంతములోనే మనసు, శరీరం కదులుతన్నట్టు తెలుస్తుంది.
దీనికి నిరంతర గమనిక కావాలి...........
అది దొరకనది కాదు..............................
మనము ప్రయత్నించని మన శాస్విత నిజ స్వరూపము.................
ఇదే స్వీయ అంతరంగ ఆత్మజ్ఞాన ఆధ్యాత్మిక చదువు. జీవిస్తూ గమనించండి చాలు.......
🌹god bless you 🌹
No comments:
Post a Comment