Wednesday, October 23, 2024

 *ఉన్నత దృష్టిని అలవరచుకుంటూ శాశ్వతమైన దానితో సంబంధాన్ని కలిగి ఉండటమే శ్రేయస్కరం.*

*మనం బలహీనంగా ఉంటే, బలవంతులమయ్యేందుకు ప్రయత్నించాలి. 

*నిరాశా నిస్పృహలతో, క్రుంగుబాటుతో ఉంటే ఆనందాన్ని తెచ్చుకొనేందుకు ప్రయత్నించాలి.*

*మన మనస్సు వ్యాకులత అనే చీకటితో కప్పబడి పోయి ఉంటే వెలుతురుకై ఎదురుచూడాలి.*

*శారీరక రుగ్మతలు కలిగి ఉంటే ఆరోగ్యంగా, పవిత్రంగా అయ్యేందుకు కృషి చేయాలి.*

*అధైర్యంతో ఉంటే ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నించాలి.*

*లౌకికత్వం నుండి పారమార్ధికత వైపుకి పయనించాలి.*

*ఈ విధంగా నిమ్నస్థాయి వాటి నుండి బయటపడి ఉన్నత స్థాయి వాటిని చేరుకునే ప్రయత్నం జీవితంలో నిరంతరం సాగుతూ ఉండాలి.*.                                    అలాగే,
ప్రార్థన అనేది మాత్ర లాంటిది కాదు, కాస్త అసౌకర్యంగా ఉన్నపుడు మాత్రమే వేసుకోవడానికి! 

ప్రార్థన నిత్యమూ చేయాలి. దానిని జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. 

చిత్తశుద్ధితో, ఆర్తితో ఏక మనస్కులై దైవమును ప్రార్థన చేస్తుండాలి. 

అపుడే మనం చేసే ప్రార్థన దైవమును చేరుటకు అవకాశం ఉంది. 

ప్రార్థన దైవమును చేరితేనే దానికి తగ్గ ఫలితములు రావడం జరుగుతుంది.

మనం నాటే విత్తనం మొక్కగా మారి, చెట్టుగా పెరిగి పువ్వులు, కాయలుగా మారి తదుపరి ఫలములను ఇచ్చుటకు కొంత సమయం తీసుకున్నట్లే మనం చేసే ప్రార్థన కూడా సరైన ఫలితమును ఇచ్చుటకు  కొంత సమయం తీసుకుంటుంది. 

ఈ లోపు మొక్కని ఏ విధముగా అయితే కంచె వేసి, నీరు పోసి కాపాడుకుంటున్నామో ఆవిధముగా దైవముపై విశ్వాసమును కాపాడుకోవాలి. 

అపుడే అనుగ్రహమనెడి ఫలములను పొందుటకు అవకాశం లభించును.        

No comments:

Post a Comment