*_ధైర్యమంటే ఎవరో నీకు తోడు ఉన్నారని అనుకోవడం కాదు ఎవరు లేకున్నా నాకు నేను ఉన్నానని చెప్పుకోవడమే అసలైన ధైర్యం.._*
*_నేడు అవసరం, అవకాశం మాత్రమే సమాజములో రాజ్యమేలుతుంది. అవసరం ఒకరిదైతే, అవకాశం మరొకరిది. అవసరం, అవకాశం ఎంతటి నీచానికైనా దిగజారిస్తుంది._*
*_డబ్బు ముందు నీతి, నియమాలు,మంచి,చెడులు సంస్కారం కళ్ళు మూసుకుంటుంది. మడి కట్టుగా కూర్చుంటే, తడిబట్టే అన్నట్టు మారిపోయింది నేటి లోకం తీరు.._*
*_నేటి బంధాలన్నీ ఆర్థిక సంబంధాలే.. డబ్బుంటే చాలు.. ఎక్కడ లేని ప్రేమను చూపుతారు, లేని బంధాలన్నీ కలుపుకుంటారు._*
*_అదే డబ్బు పోగొట్టుకున్నావ్ అనుకో... ముఖం చాటేస్తారు. అది బంధమైనా.. బంధుత్వాలైనా.._*
*_అన్ని ఉన్నప్పుడు తెలియదు అది నిజమైన ప్రేమో, ఫెవికిక్ ప్రేమో అనేది. తెరపడితే కానీ,జ్ఞానోదయం కలగదు._*
*_నిజం చెప్పాలంటే డబ్బు ముందు అందరు స్వార్థపరులే.. డబ్బుకు లోకం దాసోహం ఏ మహానుభావుడు చెప్పాడో కానీ అది అక్షరాల నిజం._*
*_డబ్బును చూసి పొందే ప్రేమలు, బంధాలు శాశ్వతంగా నిలబడవు. నిన్ను నిన్నుగా ప్రేమించే వారే నీ వారు..._*
*_అలా కాని పక్షంలో ఒంటరిగా బ్రతకడం నేర్చుకో.. ఒంటరిగా బ్రతకడం మొదలుపెట్టినప్పుడే నీ వారెవరో.. నీ బలం ఏంటో నీకు తెలుస్తుంది. ఎవరికీ వారు వారిలా జీవించడానికి ఆత్మ శక్తిని కలిగి యుండాలి.... ఆత్మ శక్తి, ఆత్మ స్టైర్యం సరైన సాధన ద్వారా సాధ్యం...
No comments:
Post a Comment