Sunday, October 20, 2024

 *జన్మ జన్మల నుండి ఆచరిస్తూ వస్తున్న దుష్కర్మల ఫలితాన్ని నశింప జేసుకొనుటకు నిరంతరం భగవన్నామ స్మరణ చేయుట తప్ప అన్య మార్గం లేదు.* 

*నూనెలో వేయించబడిన విత్తనాలు ఏ విధముగా అయితే మొలకెత్తే గుణమును కోల్పోతాయో ఆ విధముగా భగవన్నామ స్మరణ చేయుట వలన ఆయా కర్మలు ఫలితాన్నిచ్చే శక్తిని కోల్పోతాయి.*

*కనుకనే కలియుగంలో భగవన్నామ స్మరణకు అంతటి ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది.*

*చంచలమైన మనస్సు కలిగిన మానవుని జన్మకు సార్థకతను  చేకూర్చే సులువైన సాధన ఏదైనా ఉందంటే అది కేవలం భగవన్నామ స్మరణయే. 

No comments:

Post a Comment