☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
23. జనాయ ఊర్ణం వరివః కృధి
లోకులకు శ్రేష్ఠమైన బలాన్ని ప్రసాదించు(సామవేదం)
సాధారణంగా ధార్మిక, ఆధ్యాత్మిక జీవనంలో శారీరకబలాన్ని విస్మరించినట్లుగా చాలామంది భావిస్తారు. కానీ పరిపూర్ణమైన బలాన్ని నిర్వచించి, దానిని సాధించేందుకు కావలసిన సాధనల్ని అందించారు వేదర్షులు.
స్వస్థత కలిగిన, పుష్టి కలిగిన శారీరక ద్రఢిమ, మానసికబలం - రెండూ చాలా అవసరం. అయితే బలం సవ్యంగా, సక్రమంగా, ధర్మం కోసం, లోకక్షేమం కోసం,సత్యసాక్షాత్కారం కోసం వినియోగింపబడాలి. అదే శ్రేష్ఠమైన బలం. ఒక సాధన ఒక వాటి యొక్క శ్రేష్ఠత్వం అవి ఉండడంలో ఉండదు. వాటిని
(-'నిగ్రహం', 'ఏకాగ్రత' అనే రెండు లక్షణాలే మనస్సుకి శక్తిమంతమైన పునాదులు. అధర్మాచరణ చేసే 'సాహసం', ధర్మాచరణను నిర్లక్ష్యం చేసే'సహనం' - ఈ రెండూ మనలను దుర్బలుల్ని చేస్తాయి.)
వినియోగించుకొనే విధానంలో, ప్రయోజనంలో ఉంటుంది.
కాబట్టి సత్ ప్రయోజన సాధకమైన 'శ్రేష్ఠమైన బలా'న్ని ప్రసాదించమని పరమేశ్వరుని ప్రార్థించాలి.
బలం ఉన్నంతకాలం ఇంద్రియ భోగాలను సాధించడానికి, కుక్షింభరత్వ, వినోదాల కోసం వినియోగించి, బలం సన్నగిల్లాక ధర్మసాధనలు సాగించవచ్చని అనుకోవడం కేవలం భ్రమ. సన్నగిల్లాక ఆ బలం దేనికీ ఉపకరించదు కాబట్టి పటిష్టమైన శ్రేష్ఠబల సాధన కోసం యుక్తాహార విహారాలతో కూడిన యోగశాస్త్రాన్ని, ఆయుర్వేద విధానాన్నీ, సంప్రదాయ సిద్ధమైన ఆయురారోగ్యకరమైన ఉత్తమ జీవన సరళినీ ఏర్పాటు చేశారు మన ఋషులు.
'నాయమాత్మా బలహీనేన లభ్యః' (బలహీనునకు ఆత్మసాక్షాత్కారం లభించదు)
అని వేదవచనం. జీవించి ఉన్నంతకాలం 'శ్రేష్ఠమైన బలం' తోనే బ్రతకాలి - అని వేద శుభాకాంక్ష. లోకులంతా అలా బలవంతులై ఉన్నప్పుడు - ఇక లోక క్షేమానికి
కొదవేముంటుంది!
బలం ఎందుకు? మనలను బాధించేవాటినుండి మనలను రక్షించుకునేందుకు,లౌకిక పారమార్థిక ప్రయోజనాలను సాధించేందుకు.
కానీ ఆ బలాన్ని పొందేందుకు కావలసిన సాధనల్ని మనం దూరం చేసుకుంటున్నాం. నేటితరానికి సుఖభ్రాంతి, లాలస - ఉన్నాయేమో కానీ, తగిన బలం, పుష్టి లేకుండా పోతున్నాయి. దానికి కారణం తగిన వ్యాయమం, యోగం, ధ్యానం వంటి శారీరక మానసిక శిక్షణలు లుప్తం కావడమే.
మనం మనవారు పెద్ద ధనికులై సుఖపడిపోవాలనే లక్ష్యం ఏర్పరుస్తున్నాం.
("శ్రోత్రియః అకామహతః, ద్రఢిష్టః, బలిష్టః" అని ఉపనిషదర్శనం. వైదిక
సదాచార సంపన్నత, ఎటుపడితే అటు కోరిక సాగని నిగ్రహశక్తి, శారీరక మానసిక దృఢత్వమూ, బలమూ బ్రహ్మవిద్యకు అవసరమని ఆర్షవచనం.)
అందుకోసం పసితనం నుండీ ఏ వ్యాయామమూ, శిక్షణా లేకుండా తీరికలేని, "బిజీ స్టడీ"లలో ముంచెత్తి నిస్తేజుల్ని చేస్తున్నాం.
వేదజీవనంలో నుండీ జపం, ధ్యానం, ప్రాణాయామం వంటివి నిత్య
జీవనవిధానాలు. వీటితో శరీరపుష్టి, పుష్టి కలిగిన మేధస్సు సంప్రాప్తమై అధ్యయన, ఆలోచనలకు తగ్గ వికాసం ఏర్పడేది.
కాసింత వేడినీ, కొంతపాటి చలిని కూడా సహింపలేనంత అసహన దుర్బలతరాలు తయారవుతున్నాయి.
'నిగ్రహం', 'ఏకాగ్రత' అనే రెండు లక్షణాలే మనస్సుకి శక్తిమంతమైన పునాదులు. వాటిని కల్పించగలుగుతున్న నైతిక, ధార్మిక అధ్యయనం, బోధన మృగ్యం చేస్తున్నాం. దానితో మనోబలం చాలా భాగం అంతరించిపోతోంది.పిరికితనం, చేతకానితనం 'సహనం'గా చెలామణి అవుతున్నాయి. పెద్దల యెడ అగౌరవం, పాపం చేయడానికి వెనుదీయకపోవడం 'సాహసాలు'గా పరిగణింపబడుతున్నాయి. అధర్మాచరణ చేసే 'సాహసం', ధర్మాచరణను నిర్లక్ష్యం చేసే 'సహనం' - ఈ రెండూ మనలను దుర్బలుల్ని చేస్తాయి.
చెక్కుచెదరని దీక్ష కలిగిన మనోనిశ్చయం యోగ వ్యాయామాది శిక్షణలతో కూడా శరీరదారుఢ్యం - ధార్మికతకు ఉపయోగించవలసిన ఆ శ్రేష్ఠబలం' మనకు కావాలి.అందుకు మనం ప్రయత్నించాలి. ఆ ప్రయత్నానికి దైవం సహకరించాలి.
ఇక్కడ దైవాన్ని ప్రార్థించడంలో మనం ఒక ఉపకరణాన్నే (సాధనను) అడుగుతున్నామని గమనించాలి. ఈ సాధనను ఆయన ఇస్తే, దానితో ధర్మాన్ని సాధించడం మన కర్తవ్యం. మన బలాన్ని కూడా భగవత్ ప్రసాదంగా భావించగలిగే
భక్తిభావం, వినయ స్వభావం, నిరహంకారం... ఈ ప్రార్థనలో ద్యోతకమవుతున్నాయి.
"శ్రోత్రియః అకామహతః, దధిష్టః, బలిష్టః" అని ఉపనిషదర్శనం. వైదిక సదాచార సంపన్నత, ఎటుపడితే అటు కోరిక సాగని నిగ్రహశక్తి, శారీరక మానసిక దృఢత్వమూ,బలమూ బ్రహ్మవిద్యకు అవసరమని ఆర్షవచనం.
ఆ శ్రేష్ఠబలాన్ని ప్రస్తుత మన భారతీయులకు ప్రదర్శించి, మనలను ధర్మవీరులుగా మలచేందుకు ఆ పరమేశ్వరుని ప్రార్థిద్దాం.
No comments:
Post a Comment