Tuesday, November 19, 2024

 శ్రీమద్రామాయణము.

(247 వ ఎపిసోడ్),

"""" అప్రాప్తస్య  ప్రాప్త్యాశా కామః""(1),
1.లేనిదానికై అర్రులుచాచుట కామమనబడును.

"" ప్రాప్తపర్యాశా లోభః (2),
2.లభించిన దానితో తృప్తిపడక ఆశపడటం లోభము.

రామాయణం అరణ్యకాండలో "ఖరుడు" అను రాక్షసునితో యుధ్దం చేస్తు అతని దుష్కర్మలను అతనికే  గుర్తుచేస్తు అతనిలో గల కామ,లోభములను వాటివల్ల కలిగే నష్టాలను విడమర్చి ఇలా శ్రీరాములవారు ఖరునితో చెప్పుతున్నారు.

"" లోభాత్ పాపాని కుర్వాణః కామాద్వా యో న బుద్యతే,
భ్రష్టః పశ్యతి తస్యాంతం బ్రాహ్మణీ కరాదివ""(29-05),

ముల్లోకాలకు అధిపతియైనను మృత్యవును తప్పించుకొనలేడు.ఇక సామాన్యడవైన నీ వంటి అల్పుని విషయము వేరుగ చెప్పనేల? యని పేర్కొంటు,

కామము వలనగానీ, లోభము వలనగానీ దుష్క్రుత్యములకు పాల్పడినవారు సర్వైశ్వర్యములను కోల్పోయి ఎలా నాశనమవతారంటే, వడగండ్లను తిన్న నలికండ్లపాము వలే మరణిస్తారు.వర్షం పడ్డప్పుడు పడే వడగండ్లను నలికండ్ల పాము ఆశపడి తిని వెంటనే మరణిస్తుంది
 ఇక్కడ బ్రాహ్మణీ అనగా రక్తపుచ్చిక  లేదా నలికండ్లపాము.కరకము అనగా వర్షాకాలములో పైనుండి పడే వడగండ్లు.తెలియక చేసినా ఆ వడగండ్లను తిను ఆ నలికండ్లపాము ఎలా చనిపోతుందో అలాగే లేనిదానికి అర్రులు చాచినా పేరాసకు పోయినా మనిషికి వినాశనము తప్పదు.

"" అవశ్యం లభతే జంతుః ఫలం పాపస్య కర్మణః,
ఘోరం పర్యాగతే కాలే ద్రుమాః పుష్పమివార్తవమ్"",(29-08),

ఋతువులనబట్టి చెట్లు పూలు పండ్లను ప్రసాదించినట్లు ప్రాణులు తమ తమ పాపకర్మలకు దుష్పలితములను తగిన సమయము రాగానే తప్పక అనుభవించెదరని ఖరునకు రాముడు హితబోధ చేస్తాడు.

 కనుక పశ్చాత్తాపం తో అటువంటి వినాశనాలనుండి  నుండి ముందుగనే బయటపడమని రామాయణములో  శ్రీరాముడు ఖరును హెచ్చరించి విధానము మనందరికి కూడ వర్తిస్తుందని తెలుసుకొని ప్రవర్తించాలి.

జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.

No comments:

Post a Comment