Tuesday, November 5, 2024

 *మహాభారతంలోని పాత్రలను అర్థం చేసుకోండి చాలు,* 
*జీవితంలో ఎలా ప్రవర్తించకూడదో తెలుస్తుంది!*

 *మహాభారతం అంటే కేవలం అన్నదమ్ముల యుద్ధం కాదు.*
*మహాభారతాన్ని అర్థం చేసుకుంటే ఎలాంటి వ్యక్తి అయినా……*
 *జీవితాంతం కష్టసుఖాలను దాటుకుంటూ ముందుకు వెళ్లి పోగలరు.*

*::మహాభారతం నుంచి జీవిత పాఠాలు::*

*మహాభారతం... హిందువులకు అద్భుతమైన ఇతిహాసం.*
*ప్రపంచంలో ఉన్నదంతా మహాభారతంలో ఉందని,*
*మహాభారతంలో లేనిదేది ప్రపంచంలో లేదని అంటారు.*

*ధర్మం,*
*న్యాయం,*
*మోసం,*
*స్నేహం,*
*వెన్నుపోటు...* 
*ఇలా ఎన్ని రకాల లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలకు తగ్గ మనుషులు మహాభారతంలో కనిపిస్తూనే ఉంటారు.*

*ఒక జీవితం నేర్పే పాఠాన్ని మహాభారత గ్రంథం నేర్పిస్తుందని చెబుతారు.*

*ఎవరైతే మహాభారతాన్ని ఔపోసన పడతారో,*
*అందులోని ప్రతి పాత్రని అర్థం చేసుకుంటారో...* 
*వారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకునే శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటలను పొందుతారని పండితులు చెబుతారు.*

*శకుని - చెడు స్నేహం*

*జీవితంలో చెడు స్నేహం అంతానికి దారితీస్తుందని శకుని వల్ల అర్థమవుతుంది.*
 *శకుని కౌరవులతో స్నేహం చేసి వారి నాశనానికి కారణం అయ్యాడు.*
*శకునితో స్నేహం చేయకపోతే కౌరవులు అంత దారుణమైన స్థితిలో మరణించే వారు కాదేమో.*
*శకునిలాంటి స్నేహితుడు ఉండడం చాలా ప్రమాదకరం.*

*కర్ణుడు - అతి మంచితనం*
*అతి మంచితనం, జాలి, దయా వంటివి..*
*మీ జీవితాన్నే కాల్చేస్తాయని చెప్పడానికి కర్ణుడే ఉదాహరణ.*
*కర్ణుడు తన అతి మంచితనంతో, దానధర్మాలతో, తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.* 
*చివరికి చెడు వైపు నిలబడి ప్రాణాలనే పోగొట్టుకున్నాడు.*
*జీవితంలో మీరు గెలిచి నిలవాలంటే మంచివారితోనే స్నేహం చేయాలి.* 
*అనవసరమైన వ్యక్తులకు, అనవసరమైన పరిస్థితుల్లో దానధర్మాలు చేయడం మంచి పద్ధతి కాదు.*

*గాంధారి - పిల్లల పెంపకం*
*పిల్లలను క్రమశిక్షణలో* *పెంచకపోవడం అనేది తల్లిదండ్రుల తప్పేనని మహాభారతం చెబుతోంది.*
*గాంధారి 100 మంది పిల్లలకు తల్లయింది.*
*కానీ 100 మందిలో ఒక్కరిని కూడా సవ్యమైన మార్గంలో నడిపించలేకపోయింది.*
*రాజ్యాన్ని బిడ్డలకు సమంగా పంచే విషయంలోనూ గొడవలు జరిగాయి.*
*వారి క్రమశిక్షణ దారి తప్పింది.*
*పిల్లలను కాచుకొని కూర్చోలేక గాంధారి వారిని పట్టించుకోవడమే మానేసింది.*
*చివరికి దుర్యోధనుడు బాటలో కౌరవులంతా నడిచి చెడు వ్యక్తులుగా మారారు.*
*శకునిలాంటి చెడు స్నేహితులతో కలిసి నాశనమయ్యారు.*

*ధృతరాష్ట్రుడు - పిల్లలపై అతి ప్రేమ*

*బిడ్డల మీద ప్రేమ ఉండడం మంచిదే, కానీ అతి ప్రేమ వారి నాశనానికే దారితీస్తుంది.*
*ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడు మహాభారతంలో నిరూపించాడు.*
*అతడికి ఉన్న అతి ప్రేమ బిడ్డలను చెడ్డవారిగా మార్చింది.*
*కొడుకుల వినాశనానికి ధృతరాష్ట్రుడు పరోక్షంగా కారణమయ్యాడు.*
 *చిన్నప్పటి నుంచే వారిని ఒక క్రమశిక్షణలో పెట్టి ఉంటే వారు పెద్దయ్యేసరికి ఎన్నో కొన్ని* *విలువలను నేర్చుకుని ఉండేవారు.*
*కానీ దృతరాష్ట్రుడి అతి ప్రేమ, అతి నమ్మకం కౌరవుల నాశనానికి కారణమైంది.*

*అర్జునుడు - నిత్య విద్యార్థి*
*జీవితంలో ఎప్పుడూ నిత్య విద్యార్థిగానే ఉండాలని అర్జునుడు చెప్పాడు.*
*అర్జునుడు తన జీవితాంతం ఏదో ఒక విద్యను నేర్చుకుంటూనే ఉన్నాడు.*
*విద్యను నేర్చుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడలేదు.*
*ఎవరి దగ్గర ఎలాంటి అస్త్రాలు* *ఉన్నాయో తెలుసుకొని, వారి దగ్గరే శిష్యరికం చేసి ఆ ఆయుధాలను పొందాడు.*
*చివరికి మహాభారతంలో గొప్ప యోధుడిగా పేరు తెచ్చుకున్నాడు.*

*అభిమన్యుడు - అర్ధ జ్ఞానం*
*ఏ విషయం గురించి అయినా పూర్తిగా తెలుసుకోవడం* *ముఖ్యమని అభిమన్యుడు నిరూపించాడు.*
*పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే అభిమన్యుడికి తెలుసు,*
*కానీ ఆ పద్మ వ్యూహంలోంచి బయటికి రావడం తెలియక వీరమరణం పొందాడు.*
*అర్ధ జ్ఞానంతో అతి నమ్మకంతో పద్మవ్యూహంలోకి వెళ్లడం,*
*అభిమన్యుడు చేసిన తప్పు.*
*అర్ధ జ్ఞానంతో ఏ పనీ చేయడం మంచి పద్ధతి కాదు.*

*ద్రౌపది - స్త్రీని గౌరవించడం*
*మహిళలను ఎంతో గౌరవించాలని, వారి కోపం, అవమానం, శాపం రాజ్యాలనే నాశనం చేస్తాయని మహాభారతంలోని ద్రౌపది పాత్ర చెబుతోంది.*
*ఆమెకు జరిగిన అవమానం, కౌరవ సామ్రాజ్యం మట్టిపాలయ్యేలా చేసింది.*
 *స్త్రీలు దేవతలతో సమానం.*
*వారిని అవమానించే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.*
 *స్త్రీలను ఇతరుల ముందు అవమానించడం,*
*వారి చేత కన్నీరు పెట్టించడం ఎదుటివారికే ప్రమాదకరం.*

*ఇలా చెప్పుకుంటూ పోతే మహాభారతంలో ఒక్కో పాత్ర ఒక్కో జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది.*
*మహాభారతాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి జీవితంలో కచ్చితంగా విజయుడై తీరుతాడు.*
*శుభం. శుభం.*
*మీ జీవితం మీ పిల్లలు జీవితాలు మంచి పద్దతి లో సాగాలని కోరుకుంటూ..*

No comments:

Post a Comment