Tuesday, November 5, 2024

 🔔 *సత్సంగం* 🔔

చిరిగి పోయిన సంచిలో బంగారం పెడితే ఆ సంచి చిరిగి వున్నా, సంచి కి విలువ ఉంటుంది.

సంచి నుండి బంగారాన్ని వేరు చేస్తే, ఆ సంచికి విలువ లేదు.

అలానే ...
మన శరీరమనే నవరంధ్రాల చిరిగిన సంచిలో, ఆత్మ అనే భగవంతుడు ఉన్న వరకే ఈ శరీరానికి విలువ..!

శరీరంలోని ఆత్మ బైటికి వెళ్ళాక, ఈ శరీరాన్ని ముట్టటానికి కూడా అయినవాళ్ళు ఆలోచిస్తారు, దగ్గరకు కూడా రావడానికి భయపడతారు.

దీనివల్ల మనకు అర్థం అయ్యేది ఏమిటి...అంటే  బంగారానికి విలువ ఉంది కానీ, సంచికి కాదు అని!

అలాగే మన లోపల ఉన్న చైతన్య స్వరూపుడైన భగవంతుడికి/(ఆత్మకు) విలువ వుంది కానీ, మన శరీరానికి కాదు అని తెలుసుకోవాలి..!

శవం - శివం - అంటే..
శరీరంలో జీవం ఉంటే శివం,         శరీరం నుండి జీవి వెళ్లిపోతే శవం..!

ఈ శరీరంలో జీవం వున్నప్పుడే, నలుగురికి ఉపయోగపడాలి..!

నిరంతరం ధ్యాన సాధన చేయాలి... చేతనైన దాంట్లో నలుగురికి సహాయం, చేస్తూ ఉండాలి, అదికూడా నిస్వార్థంగా, పరోపకారం చేయకపోయినా అపకారం మాత్రం కచ్చితంగా చేయకూడదు.                    ఇదే ఆద్యాత్మిక మార్గానికి తొలి అడుగు..!```

           
🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻

No comments:

Post a Comment