*_"నీతి సూత్రాలు "నిజాయితీగా ఎలా బతకాలో నేర్పిస్తాయి.! "సామెతలు" మనలో ఆలోచనలు జోడిస్తాయి.! "మంచిమాటలు" మనఃశాంతిని ప్రసాదిస్తాయి.!!_*
*_మన మనసు కోతి లాంటిది ఎప్పుడూ ఎలా ఉంటుందో తెలియదు. అందుకే బుద్ధికి మంచి మాటలు చెబుతూ ఉంటే మనసు చంచలత్వం వీడి నిలకడగా ఉంటుంది._*
*_నిలకడ లేని మనసు మనిషిని అదోగతి పాలు చేస్తుంది. మనసు బట్టే మనిషి ఉంటాడు._*
*_మనసుతో ఎలా ఆలోచిస్తే నీప్రవర్తన అలా ఉంటుంది. నీ ప్రవర్తన బట్టే నీ జీవితం ఉంటుంది. అందుకే నీ శరీరం అనే వాహనానికి డ్రైవర్ మనసే..._*
*_కత్తితో కూరగాయలు తరగవచ్చు, అదే కత్తితో తల తీయవచ్చు. కత్తి ఒక్కటే కానీ రెండు రకాలుగా వాడవచ్చు._*
*_అదేవిధంగా... మనస్సుతో సద్విచారాలు వింటూ మనసుతో మంచి ఆలోచనలు చేస్తే, మంచి జరుగుతుంది. దుష్ట ఆలోచనలు మనసుతో చేస్తే దుష్ట బుద్ధి కలుగుతుంది. ఫలితంగా దుష్ట పనులు చేస్తావు..._*
*_నీవు ఎలా మారాలన్నా మనసే కారణం. మంచోడిగా మారాలన్న, ముంచేవాడిగా మారాలన్నా, చివరికి రాక్షసుడిగా మారాలన్న మనసే కారణం... అందుకే మనసుతో జాగ్రత్తగా ఉండు..._*
*_ఏది చేయాలన్నా మనిషీ మనసే కారణం. అందుకే మనసుకు శిక్షణ నిచ్చే విధానంలోనే మనిషి యొక్క మనసు ఉపయోగపడుతుంది._*
*_ప్రపంచంలోనే అతి వేగంగా క్షణాల్లో వెళ్లేది మనిషి మనసు ఒక్కటే... మనం ఉన్నచోట సంకల్పిస్తే చాలు క్షణాల్లోనే ఎక్కడ వెళ్లాలి అంటే అక్కడికి వెళ్తుంది మనిషి మనసు..._*
*_హైదరాబాదు ట్యాంక్ బండ్ చూడాలంటే క్షణాల్లో మన ముందు ఆవిష్కరిస్తుంది._*
*_తిరుమల క్షేత్రాన్ని చూడాలంటే వెంటనే మన ముందు తిరుమల క్షేత్రం కదలాడుతుంటుంది. అంతటి శక్తిశాలి మనసు._*
*_అలాంటి మనసును జయించాలంటే ఎలా.?_*
*_శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇలా చెప్తాడు. మనుసును నిలుపుట ఎవరి తరం కాదు కాని, అభ్యాస వైరాగ్యంతో మనుసును జయించవచ్చు అని తెలియజేసాడు._*
*_అందుకే... రోజు ప్రామాణికంగా మంచి మాటలు వింటూ, అభ్యాసం చేస్తూ... బుద్ధితో సద్విచారాలు చదువుతూ, ఆధ్యాత్మిక జ్ఞానం గ్రహిస్తావుంటే... మనస్సు నిలకడగా ఉంటుంది..._*
*_మనసు నిలకడగా ఉంటే... మనిషి నిలకడగా ఉంటాడు, ఆలోచన విధానం సంస్కారవంతంగా ఉంటుంది.☝️_*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌹🌹 🪷🙇♂️🪷 🌹🌹🌹
No comments:
Post a Comment