*_గొంతు పెంచి మాట్లాడడం ఎవరైనా చేయగలరు, అది పెద్ద విషయం కాదు.!_*
*_గొంతు పెంచడం కాదు, మాట విలువను పెంచుకోవడం నేర్చుకోవాలి.!_*
*_నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది అంటారు కావున... మన నోటిని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి._*
*_కోపం అగ్గిపుల్ల లాంటిది, చటక్కున అంటుకుంటుంది. ఆరిపోయేంత వరకు ఆగితే పరవాలేదు, అలా కాకుండా అది ఆరిపోకముందే విసిరేస్తేనే ప్రమాదం. అది మిగిలిన వాటిని కూడా కాలుస్తుంది._*
*_అలానే వచ్చిన కోపం చల్లారేవరకు ఎవరితో మాట్లాడకండి, మౌనం వహించండి._*
*_మౌనంగా ఉండడం నేర్చుకోండి, మాట్లాడే ముందు ఆవేశపడకుండా నిలకడగా మాట్లాడటం నేర్చుకోండి._*
*_ఈ స్థితిని పొందాలి అంటే మౌనం పాటించడం నేర్చుకోవాలి. ధ్యానం సాధన చేయడం మంచిది._*
*_ధ్యాన సాధన ద్వారానే మానసిక ప్రశాంతతను పొందగలుగుతాము. తద్వారా భగవదైక్యం వైపు అడుగులు పడతాయి._*
*_కర్మ అంటే సాధారణంగా మనం చేసే పని అని అనుకుంటాం. కానీ నిజానికి మన ఆలోచనలే మన అసలైన కర్మలు._*
*_ఎందుకంటే మన ఆలోచనలు ఎలా ఉంటే వాటి ప్రకారమే కర్మ చేస్తుంటాం. కర్మ ప్రకారం ఫలితం._*
*_కనుక ముందు ఆలోచనలను మంచివిగా ఉండేలా చూసుకోవాలి._*
*_మనం ఇతరుల మంచిని కోరుకున్నపుడు మన మంచి ఆలోచనల వలన ఏదో ఒక విధముగా మనకు మేలే జరుగుతుంది._*
*_అలా కాకుండా ఇతరులకు చెడు జరగాలని కోరుకుంటే ఆ దుష్పలితాన్ని ఇతరుల కంటే ముందు మనమే అనుభవింపక తప్పదు._*
*_మనం అనుభవించేదంతా మన ఆలోచనల ఫలితమే.!_*
*_కనుక మనసులో మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. తద్వారా మంచి కర్మలు జరిగి మంచి ఫలితాలు వస్తాయి._*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌹🌹 🪷🙇♂️🪷 🌹🌹🌹
No comments:
Post a Comment