*పరోపకారానికి మించిన దాన ధర్మం లేదు*
పరోపకారానికి సమానమైన దానధర్మం ఏదీ లేదని మనం గ్రహించాలి. ఎవరైనా, ఏదైనా మంచి పని చేయడానికి మరొకరికి సహాయం చేస్తే, మనం గొప్ప దానాన్ని చేసినట్లే.అలాగే ఇతరుల బాధలను తీర్చడంలో మనం దోహదపడితే గొప్ప దానధర్మం చేసినట్టే.అందుకే మన పూర్వీకులు దీనికి అంత ప్రాధాన్యతను ఇచ్చారు.
*పరోపాకృతిశూన్యస్య*
*థింగ్మనుష్యస్య జీవితం*
వేదాల్లో చెప్పబడింది. ఇతరులకు సహాయం చేయని మనిషి జీవితం వృధా! ఈ వాక్యం అంత ఖచ్చితంగా ఎందుకు చెప్పబడింది? జీవించి ఉన్నా లేదా చనిపోయిన తర్వాత ఇతరులకు సహాయం చేయని వ్యక్తి వల్ల ఈ మానవ సమాజానికి ప్రయోజనం ఏమిటి? మనల్ని నమ్ముకున్న వారికే మనం ద్రోహం చేస్తుంటాం. అలాంటి మనిషి కంటే ఈ భూమ్మీద ఉన్న వృక్షాలు, మూగ జీవాలు, నదులు, పర్వతాలు ఇత్యాది భగవత్ ప్రేరేపిత సృష్టి, జ్ఞానం ఉన్న మనవునికంటే మహోన్నతమైనవి.తమవంతు సహాయం తమకు శత్రువైనా నిరంతరం చేస్తూనే ఉంటాయి.
-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*
🙏 శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష/SriRaam raksha sarva jagath raksha🪷🪷🪷👏
దేహం దేశం దేవుడు
ఆరోగ్యం మన చేతిలోనే
ఆకలిని చంపొద్దు - ఆయసంగా తినొద్దు
👏 ధన్యవాదాలు
No comments:
Post a Comment