*🕉️🙏జై శ్రీ కృష్ణ 🕉️🙏*
*🕉️🙏మీ ఇంటికి ఎవరైనా కొత్త స్నేహితుడు వస్తే,*
*“రండి, దయచేసి కూర్చోండి"*
*అని కుర్చీ వేసి మర్యాద చేస్తారు.🕉️🙏*
*🕉️🙏కానీ, పాత స్నేహితుడే గనుక వస్తే ఎంతో ప్రేమతో హృదయపూర్వకంగా,*
*“రారా, కూర్చోరా" అని ఆహ్వానిస్తారు.🕉️🙏*
*🕉️🙏ఎందుకంటే పాత స్నేహితునితో మీకు సన్నిహిత సంబంధం ఉంటుంది.*
*త్యాగరాజుకు రామునితో అట్టి సంబంధం ఉండటంచేతనే,*
*“రార మా ఇంటి దాకా.." అని ఎంతో స్నేహంగా, స్వేచ్ఛగా, పవిత్రంగా, ఆర్తితో పిలిచాడు.🕉️🙏*
*🕉️🙏మీరు కూడా దైవాన్ని మీ పాత స్నేహితునిగా భావించి దైవంతో స్వేచ్ఛగా మెలగాలి.*
*ఎన్నో జన్మలనుండి భగవంతుడు మీ వెంటనే వస్తున్నాడని విశ్వసించాలి.*
*అదే నిజమైన భక్తుని లక్షణం!🕉️🙏*
*🕉️🙏మీరు భగవంతుడంటే భయం,* *భయంగా ఉంటే ప్రయోజనం లేదు.*
*పరిపూర్ణమైన స్వేచ్ఛతో ఉండాలి.*
*ప్రేమచేత, స్వేచ్ఛచేతనే దైవాన్ని* *పొందడానికి వీలవుతుంది.🕉️🙏*
*🕉️🙏మీలో దైవభీతి ఉన్నంతవరకు దైవం లభ్యం కాడు.*
*పాపభీతి ఉండాలి గాని దైవభీతి* *ఉండకూడదు.*
*దైవప్రీతి ఉండాలి.*
*దైవాన్ని పరిపూర్ణంగా ప్రేమించాలి.*
*అప్పుడే దైవం లభ్యమవుతాడు."🕉️🙏*
*🕉️🙏జై శ్రీరామ్ 🕉️🙏*
No comments:
Post a Comment