Saturday, November 9, 2024

 *కొంటెగాడ్ని కట్టుకో...!! 🥀 🦋*

*ముద్దూ ముచ్చట్లు తెలియని*
*"ఏదో, వెంగళప్పని కాదు..*

*ఎక్కడ మీటాలో..*
*ఏ రాగాన్ని ఏ విధంగా శృతిపర్చాలో*
*తెలిసిన కొంటెవాడ్ని రసజ్ఞత యందు..*
*చక్కని కళాభినివేశం ఉన్నవాడ్నీ*
*కట్టుకో  "నీ భర్తగా.."*

*అంతరార్థం:*
*వాడు చెప్పాడని వీడు చెప్పాడని*
*ఆస్తిపాస్తులున్నాయనీ కాదు..*

*నీ అంతరంగానికి అభిరుచులకు*
*అన్నివిధాలా సరైన వాడినే యోగ్యుడినే ఎంచుకో..*

*కలకాలం నీతో అన్యోన్యప్రదంగా*
*విలసిల్లే భాగ్యస్వామిగా.. జీవన సహచరునిగా..*

*కొంగుకేసి చుట్టుకో.. "కోటి వన్నెలున్న దాన.."*

*బావా అని పిలుస్తావో మామా అని పిలుస్తావో*
*శ్రీవారూ అంటావో లేక "ఒరేయ్ మై డియర్ పతిదేవా"*
*అంటూ సంభోదిస్తావో నీ ఇష్టం.*

*ఎలా పిలిచినా ఏ విధంగా పలుకరించినా..*
*తగు ప్రేమాభిమానాలతో పట్టూవిడుపులతో*
*రసరమ్యమైన నీ వన్నెచిన్నెలతో ఒక్కింత*
*చాకచక్యంగా శృంగార భరితంగా సర్వేసర్వత్రా*
*నీ భర్త నీకు "తోడూనీడై.."* *నిలిచేలాగున మలుచుకో..*

*తియ్యని నీ ఆడతనంతో*
*జాణతనంతో..*

*అందమంతా ఇచ్చుకో..*

*కళ్ళకు కాటుకే పెట్టుకుంటావో*
*కాళ్ళకు పారాణే దిద్దుకుంటావో*

*విరిసే నగవులను విరవని..*
*నలిగే పెదవులను నలగని..*
*తనువంతా నఖదంతక్షతాల జ్ఞాపకాలతో నిండని..*

*మల్లెలు బరిచిన "శయ్యని.."*
*చిరుచెమటల స్వేదబిందువులతో తడిచిపోని..*

*ముత్యాల సరులు దాగున్న నీ తనువులోని*
*అణువణువును "అందంగా"* *అనురాగభరితంగా*
*యథేచ్ఛవై - సమర్పించుకో  "ఓ రసగంగవై.."*

*అందినంత పుచ్చుకో "వాలుకళ్ల పిల్లదాన.."*

*వాయువు సైతం జొరబడని తీరుగ*
*నీ ప్రాణేశుని నీ బహుబంధపు* *డోలాయ గీతిలో వోలలాడించి, తియ్యని తహతహల తాకిళ్ళ*
*నడుమ నీ క్రీగంటి నయనాల పదనిసల నడుమ,*
*నీ ప్రియసఖుడి హృత్సీమలో* *నెలకొనెడి ప్రతీ భావాన్నీ*
*అనురాగ ఝరిని, నీ తలపుగా నీ శ్వాసగా మార్చుకో..*

*తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు*
*సిగ్గుల్లో జారిపోవాలీ "చీకట్లు.."*

*జవ్వాది అలదిన తనువుతో*
*కలువలవంటి నయనాలతో*
*గోరింట పూసిన పదములతో*
*తాంబూలం పండిన పెదవులతో*

*బిగికూడిన కుచముల నర్తనలతో..*
*రారమ్మని కవ్వించే నడుమొంపులతో..*

*మల్లెవై, మధురిమవై, మయూరవై*
*సుస్వర రసఝరీ నయనాల కోమలాంగివై..*

*తనుమరచి నిన్ను నీవే మరచి*
*మనసైన మగనితో సంగమించే వేళ..*

*నలిగే కౌగిళ్లు ముడివీడక నీ చిరుసిగ్గుల*
*నగవుల్లో కనుమరుగై పోవాలీ, నిశికాలమంతా..*

*ఎరుపెక్కిన నీ కనులు అరుణోదయ*
*కాంతులతో తళుక్కుమనే వరకూ..*
*సూర్యచంద్రాదులు ఈ జగతిన విలసిల్లే వరకూ..*

*అనునిత్యం నవ వసంతమై..*
*నిత్యశోభనమై వర్ధిలాలి మీ దాంపత్యం..*

*కమ్మని కౌగిళ్లలో ప్రతీరాత్రి ఓ మధురజ్ఞాపకమై*
*రసకిరణమై నిలిచిపోవాలి మీ సుమధుర జీవనం...!!! 🦋*

No comments:

Post a Comment