Saturday, November 9, 2024

 *నాలుగు వెళ్ళు నోట్లోకి వెళ్ళాలి అన్న*
*నాలుగు గంటలు మనం* *ప్రశాంతం గా పడుకోవాలి అన్న*
*నచ్చిన మనిషి మన పక్కన ఉండాలి అన్న*
*మన దగ్గర ఉండాల్సింది డబ్బు* 

*పది మందిలో మన గౌరవాన్ని నిలబెట్టేది డబ్బే*

*ఐనా వాళ్ళ ముందు నిస్సహాయుకుడిగా నిలబెట్టేది కూడా డబ్బే*

*కట్నం డబ్బులు తేని భార్యని బానిసగా చూస్తాడు భర్త*

*ఎక్కువ డబ్బులు సంపాదించలేని భర్తని లోకువగా చూస్తుంది బార్య*

*డబ్బులు కూడబెట్టడం చేతకాని తండ్రి ని అసమార్థులుగా చూస్తారు బిడ్డలు*

*సంపాదించడం చేతకాని బిడ్డలని చేతకాని వాళ్ళకింద చూస్తాడు తండ్రి*

*డబ్బుల కోసం ఒక ఆడది ఒళ్ళు అమ్ముకోవడానికి సిద్దపడుతుంది*

*అదే డబ్బుల కోసం ఒక మగవాడు కుటుంబన్ని, ఐనవాళ్ళని వదిలి రాష్టాలు దేశాలు దాటి వెళ్తాడు*

*ఆస్తి పంపకాలలో తేడా ఉంది అని తోడబుట్టిన వారితో సంవత్సరాలు మాట్లాడుకొని అన్నదమ్ములు*

*పంపకాలలో అమ్మ బంగారం ఇవ్వలేదని పుట్టింటి గడప తొక్కనని శపథం చేసే అక్కాచెల్లెళ్ళు*

*అందుకే డబ్బుని గౌరవించండి*
*పోయేటప్పుడు ఏం పట్టుకొని పోకపోయిన*
*మనం పోయాక మన శవాన్ని తీయడానికి కూడా డబ్బే కావాలి*

*డబ్బుకి లోకం దాసోహం*
*పైసా మే పరమాత్మ అని ఊరికే అనలేదు మరి..*

No comments:

Post a Comment