యండమూరి వీరేంద్రనాధ్...
టెన్నీస్ కోర్ట్ లో బంతుల౦దించే బోయ్ గా కెరియర్ ప్రారంభించిన స్విట్జర్లాండ్ కి చెందిన ఫెడరర్ ఇరవై గ్రాండ్‌స్లాం టైటిళ్ళు, 8 వి౦బుల్డన్, 6 ఆస్రేలియన్ టైటిల్స్ గెలిచి, 237 వారాల పాటు ప్రపంచ నెంబర్ వన్ గా రికార్డు సృష్టించాడు. ఆటల పట్ల పిల్లల్లో ఆసక్తి పెంపొందించడానికి చాలా ఆస్తి డొనేషన్ ఇచ్చాడు. అంగవైకల్యం ఉన్న పిల్లల కోసం ఎన్నో మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాడు. యూనిసెఫ్ అంబాసిడర్ గా నియమించ బడ్డాడు.
ముందు వెన్నునొప్పి, ఆ పై మోనో-న్యూక్లియోసిస్ వ్యాధి అతడిని వెంటాడి వేటాడింది. దాని తీవ్రత ఎవరికీ తెలీదు. ఎవరు ఊహించని విధంగా ఒక మ్యాచ్ చివర్లో అతడు ‘అకస్మాత్తుగా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ సందర్భంగా అతడు ప్లే-గ్రౌ౦డ్ లో ఇచ్చిన చివరి స్పీచ్ వింటూ ప్రేక్షకులంతా దుఖం ఆపుకోలేకపోయారు. ఎదుటి ఆటగాడు రాఫెల్ నాదల్ కూడా ఆ ఉపన్యాసం వి౦టూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు.
“ప్రపంచంలోకెల్లా అత్యద్భుతమైన దేశం స్విట్జర్లాండ్ లో నాకు జన్మనిచ్చినందుకు భగవంతుడికి నేను కృతజ్ఞత చెప్పుకోలేదు. నేను అలసటగా, డిప్రెసెడ్ గా ఉన్నడప్పుడు, నాకు ప్రోత్సాహం ఇచ్చి ఉత్సాహపరిచే ఒక గొప్ప భార్యని నాకే ఎందుకు ఇచ్చావని భగవంతుడిని ఎప్పుడూ ప్రశ్నించలేదు. అయిదేళ్ల పాటు ప్రపంచపు నెంబర్ వన్ స్థానంలో నన్నే ఎందుకు నిలబెట్టావనీ, ఇన్ని మిలియన్ డాలర్ల ఆస్తి నాకే ఎందుకు ఇచ్చావనీ అడగలేదు. ఇప్పుడు ఈ వ్యాధి నాకే ఎందుకు ఇచ్చావని ఎలా అడగ్గలను?”
నిజమే కదా మంచి జరిగితే అది మన గొప్ప... ఏదైనా చెడు జరిగితే మాత్రం దేవుడు... విధి... దురదృష్టం... మంచివాళ్ళకే కష్టాలు... లాంటి మెట్ట వేదాంతం...
100% మన కృషి... పట్టుదల... నిరంతర శ్రమ... అన్నింటికీ మించి క్రమశిక్షణ... వ్యక్తిత్వం... సమాజం పట్ల భాద్యత తోటి మనుషులపట్ల... జీవుల పట్ల... ప్రకృతి పట్ల ప్రేమ.... కాలానికి అనుగుణంగా జ్ఞాన సముపార్జన (knowledge updating) ఇవన్నీ కలిస్తేనే ఒక వ్యక్తి విజయతీరాలకు చేరుకొనేది పై వాటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా మన విజయం అసంపూర్తి గానే ఉంటుంది...
మీరు పై వాటి నన్నింటినే కాక ఇంకా మీకు తెలిసిన అనేక మంచి విషయాలను నిరంతరం మీ జీవన గమనంలో ఆకలింపు చేసుకొని... అనుసరించి... సంపూర్ణ విజయం సాధించాలని మనసా వాచా కోరుకుంటూ చదివినందుకు ధన్యవాదములు...
Good morning...
💐💐💐💐💐💐
🙏🙏🙏🙏🙏🙏
❤️❤️❤️❤️❤️❤️
No comments:
Post a Comment